Karthika Deepam 2 January 20th: దాస్ తాయత్తు కనిపెట్టిన కార్తీక్.. జ్యోత్స్నకి ముచ్చెమటలు.. షాక్‌లో పారిజాతం

Photo Courtesy: JioHotstar

బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం అవసరమైన టెస్టులు చేయాలని జ్యోత్స్నతో చెబుతుంది డాక్టర్ హారిక. బ్లడ్ శాంపిల్స్ ఇస్తే ఎక్కడ నిజం బయటపడుతుందోనని జ్యోత్స్న వణికిపోతుంది. శాంపిల్స్ ఇప్పుడే ఇవ్వాలా? రేపైనా ఇవ్వొచ్చా అని రకరకాలుగా తప్పించుకోవాలని చూస్తుంది. దాంతో నువ్వు అసలు సుమిత్ర గారి కూతురివేనా? అని మండిపడుతుంది డాక్టర్. నేను మీతో మాట్లాడాలని డాక్టర్‌తో జ్యోత్స్న అడగ్గా.. కార్తీక్‌ను బయటకు వెళ్లిపోమని చెబుతుంది డాక్టర్. కాసేపటి తర్వాత డాక్టర్ బయటకు వచ్చి జ్యోత్స్నకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం ఇష్టం లేనట్లుగా ఉందని అనడంతో నేను మాట్లాడతానని కార్తీక్ చెబుతాడు. బ్లడ్ శాంపిల్స్ ఇస్తావా? లేకపోతే తాతను పిలవమంటావా? అని కార్తీక్ బెదిరించడంతో జ్యోత్స్న శాంపిల్స్ ఇస్తుంది.

ఇంట్లో పరిస్థితిని చూసి గురువుగారిని పిలిపిస్తాడు శివన్నారాయణ. మా మేడం గారి జాతకం ఎలా ఉందని కార్తీక్ అడగ్గా.. ఆమె సాలెగూడులో నుంచి బయటపడే రోజులు దగ్గరపడ్డాయని చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతంలు వణికిపోతారు. నువ్వు సొంత గూటికి చేరుకుంటావని.. కానీ బిడ్డ జాగ్రత్త అని దీపని హెచ్చరిస్తాడు గురువుగారు. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 20వ తేదీ 572వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 572 January 20th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

గురువు గారు చెప్పిన మాటలు, డాక్టర్‌కి ఇచ్చిన శాంపిల్స్‌ గురించి వణికిపోతుంటారు జ్యోత్స్న, పారిజాతంలు. ఇంతలో కార్తీక్ వచ్చి అసలు నిజం తెలుసుకోవడానికి వచ్చాను అని చెబుతాడు. దీనికి ఆసుపత్రి వాతావరణం పడదు.. సూదిగుచ్చి బ్లడ్ తీస్తుంటేనే వణికిపోయింది. రేపు ఆపరేషన్ చేసేటప్పుడు ఇంకెంత భయపడుతుందోనని చెబుతుంది పారిజాతం. అయినా బోన్‌మ్యారో ఇవ్వాల్సింది పెద్ద మేడం గారు కాదు.. కన్నకూతురు అని కార్తీక్ చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఎవరైనా కన్నతల్లిని కాపాడుకునే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తారు. కానీ ఈవిడ మాత్రం దీని నుంచి ఎలా తప్పించుకోవాలా? అని చూస్తోందని మండిపడతాడు.

అదంతా సరేకానీ దాస్ మావయ్య ఏమయ్యాడు? ఎన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేసినా తీయడం లేదని కార్తీక్ అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతలో దాస్ తాయత్తు తీసి చూపించడంతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. ఇది మా దాస్ గాడిది, నీ దగ్గరకి ఎలా వచ్చింది? అని ప్రశ్నిస్తుంది పారు. మొక్కలకు నీరు పోస్తుంటే గార్డెన్‌లో దొరికింది... తాయత్తు తెగిపోయిందా? లేక ఎవరైనా తెంపేశారా? రాత్రి నుంచి ఆ మనిషి ఇంటికి కూడా వెళ్లలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదు.. ఏమైందో ఏమీ అర్ధం కావడం లేదని అంటాడు కార్తీక్. నీ మాటలు వింటుంటే నాకు కూడా భయంగానే ఉందని కంగారుపడుతుంది పారిజాతం. దాస్ బాబాయ్ ఫోన్ సైలెంట్‌లో పెట్టి ఉంటాడని చెబుతుంది జ్యోత్స్న.

దాస్ మావయ్య కనిపించడం లేదని పోలీస్ కంప్లయంట్ ఇస్తానని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పోలీస కంప్లయంట్ అవసరం లేదని.. వాడికి ఏదో అయ్యిందని బాధ పడాల్సిన అవసరం లేదు, వాడికి నచ్చినప్పుడు వస్తాడు, నచ్చినప్పుడు పోతాడని పారు చెబుతుంది. ఒక్కరోజు ఆగుతాను.. దాస్ మావయ్య కనిపించకపోతే పోలీస్ కంప్లయంట్ ఇస్తానని చెబుతాడు కార్తీక్. దాస్ ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకోలేవని మనసులో అనుకుంటాడు కార్తీక్. అయితే పారిజాతానికి మాత్రం జ్యోత్స్న మీద అనుమానం వస్తుంది.

గురువుగారు చెప్పిన మాటలు కొన్ని ఆనందాన్ని ఇస్తే... కొన్ని బాధ పెట్టాయని కార్తీక్‌తో అంటుంది. బిడ్డ జాగ్రత్త అని ఇంటి దగ్గర అమ్మ కూడా చెబుతోందని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న శాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి వంద ప్రయత్నాలు చేసింది.. తాత పేరు చెప్పడంతో భయపడి శాంపిల్స్ ఇచ్చిందని చెబుతాడు కార్తీక్. రిపోర్ట్స్ వస్తే తన బండారం బయటపడుతుందని జ్యోత్స్న దేనికైనా తెగిస్తుంది, అమ్మనే లేకుండా చేయొచ్చని దీప అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అలాంటి అవకాశం జ్యోత్స్నకి ఇవ్వొద్దని... అమ్మకి నిజం చెబుదామని దీప చెప్పడంతో కార్తీక్ వద్దు అంటాడు. ఇంతలో సుమిత్ర వచ్చిన మీరు నా దగ్గర ఇంకా ఏ నిజం దాచారని అడగటంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.

మా అమ్మకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నానని కార్తీక్ కావర్ చేస్తాడు. కాంచన నాకు మంచి స్నేహితురాలు అని చెబుతుంది. నా కూతురు గురించి చాలా భయంగా ఉంది. ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పటికీ నేను ధైర్యంగా, చాలా మొండిగా ఉండేదానిని. కానీ నేను ఇంటికి తిరిగొచ్చేసిన తర్వాత మీరంతా నా మీద చూపించిన ప్రేమకు కరిగిపోయాను. మీరంతా నా కోసం, నాతో ఉన్నారని చాలా సంతోషంగా అనిపించింది. కానీ నాకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత నాకున్న సంతోషాలన్నీ భయాలుగా మారిపోయానని అంటుంది సుమిత్ర. మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్లిపోతున్నట్లుగా అనిపిస్తోందని సుమిత్ర చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.

నా కూతురు జ్యోత్స్న అంటే నాకు చాలా ఇష్టం... నేను దానిని ప్రేమించినంతగా, అది నన్ను ప్రేమించదని నాకు తెలుసు. అది నన్ను ఎలా అనుకున్నా సరే నేను నా కూతురిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అది రెండ్రోజులు ఇంట్లో లేకపోతే ప్రశాంతంగా ఉండలేను... నా కూతురికి పెళ్లి చేయాలి, నీలాంటి మంచి వ్యక్తిని నా కూతురికి భర్తగా చేయాలి అప్పటిదాకా నేను బతికి ఉంటానా అని సుమిత్ర అడగటంతో కార్తీక్, దీపలు ఎమోషనల్ అవుతారు. మీ కూతురు బతికి ఉండగా.. మీకేం కాదు... తన ప్రాణాల్ని అడ్డుపెట్టి అయినా మీ ప్రాణాల్ని కాపాడుతుందని దీప చెబుతుంది. ఆ మాటలతో సుమిత్ర సంతోషిస్తుంది.

గురువుగారు చెప్పిన మాటలతో శివన్నారాయణ, దశరథలు బాధపడుతుంటారు. ఒకప్పుడు మీ అమ్మ ఈ ఇంట్లో దీపం పెట్టేది.. కానీ ఇప్పుడు ఆ దీపం ఆరిపోయింది. మళ్లీ ఆ చీకటిని నా కోడలు పొగొట్టింది. ఇప్పుడు మరోసారి ఆ దీపం రెపరెపలాడుతోంది. కొన్ని నమ్మకాలు నీటి మీద రాతలైతే.. కొన్ని మాటలు చెక్కిన శిలాశాసనాలు లాంటివి. సుమిత్ర ముఖంలో నవ్వు లేదు, తనకు ఏం కాదన్న ధైర్యం కూడా నాకు లేదు. వచ్చిన సమస్య మన దగ్గర పరిష్కారం కంటే పెద్దది, కానీ నా లోపల ఉన్న భయం నాకున్న ధైర్యం కంటే పెద్దదని వెక్కి వెక్కి ఏడుస్తాడు శివన్నారాయణ. ఇదంతా చూసిన కార్తీక్ బాధపడతాడు.

సుమిత్ర అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది దీప. ఇంతలో కార్తీక్ వచ్చి అందరూ ధైర్యంగా ఉన్నట్లుగా ఉన్నా.. లోలోపల భయంతో ఉన్నారన అంటాడు. ముందు అత్త నవ్వడం ఈ ఇంట్లో వాళ్లంతా చూడాలని చెప్పి సుమిత్ర ఫోన్‌కి ఒక మెసేజ్ పెడతాడు. అది చూసినప్పటి నుంచి సుమిత్ర పకపకా నవ్వుతుంది. దాంతో జ్యోత్స్న, దశరథలు ఏం జరిగిందని అడుగుతారు. దాంతో ఆ ఫోన్ చూసిన వారంతా నవ్వుతారు. మీరంతా ఎందుకు నవ్వుతున్నారు? అని దీప ఫోన్ తీసుకుని చూస్తుంది. అందులో చిన్న పాప ఫోటో ఉండటంతో అది ఎవరు అని అడుగుతుంది దీప. ఆ ఫోటో మీ ఆయనదే అని ఆ ఫోటో వెనుకున్న రహస్యం నీకు తెలియదా అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. ఈ ఫోటో గురించి ఎవ్వరికీ ఏం చెప్పొద్దని మా అందరి దగ్గర మాట తీసుకున్నాడని అంటుంది జ్యోత్స్న. అయితే నీకు నిజం చెప్పాల్సిందేనని అంటుంది సుమిత్ర. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X