Karthika Deepam 2 January 22nd: కార్తీక్‌పై జ్యోత్న్న, పారు కుట్ర... రౌడీల నుంచి తప్పించుకున్న దాస్

Photo Courtesy: JioHotstar

సుమిత్ర చూపించిన పాప ఫోటో‌లో ఉన్నది ఎవరు? దాని గురించి చెప్పమని దీప అడగ్గా.. అందులో ఉన్నది కార్తీక్ అని చిన్నప్పుడు వాడిని అమ్మాయిలా రెడీ చేసి కాంచన మురిసిపోయేదని చెప్పింది సుమిత్ర. ఓ సారి ఇలాగే అమ్మాయిగా ఉన్న కార్తీక్‌ని మన బంధువుల్లో ఒకరు పెళ్లి చేసుకుంటానని అనడంతో వాడికి కోపం వచ్చి ఓ గుద్దుగుద్ధాడని చెప్పడంతో అంతా నవ్వేస్తారు. దాస్ కనిపించకపోవడంతో నీ మీదే అనుమానంగా ఉందని పారిజాతం చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. నిజం బయటపడితే పిల్లల్ని మార్చినందుకు నిన్ను, నిజం తెలిసినా చెప్పనందుకు నీ కొడుకుని, నాటకాలు ఆడినందుకు నన్ను... అందరినీ తాత బతనివ్వడని హెచ్చరిస్తుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారిజాతం వణికిపోతుంది.

జ్యోత్స్న శాంపిల్స్.. అత్త శాంపిల్స్‌తో మ్యాచ్ కాకపోతే అసలు నిజం తెలుస్తుందని దీపతో కార్తీక్ అంటుండగా కాంచన వచ్చి ఏ నిజం అని అడుగుతుంది. దాంతో కార్తీక్ ఏదో చెప్పి కవర్ చేస్తాడు. సుమిత్ర డిన్నర్ చేసి టాబ్లెట్స్ వేసుకోకపోవడంతో జ్యోత్స్నపై శివన్నారాయణ మండిపడతాడు. సుమిత్ర బాగోగులు చూసుకోవాలంటే కాంచన ఇక్కడే ఉండాలని దశరథ చెప్పడంతో శివన్నారాయణ నేరుగా కార్తీక్‌కి ఫోన్ చేసి రేపు అమ్మను తీసుకుని రమ్మని చెబుతాడు. అయితే పుట్టింటికి వెళ్లడం తనకు ఇష్టం లేదని కాంచన అనడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 22వ తేదీ 574వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 574 January 22nd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేస్తూ పారిజాతం ముఖాన్ని చూసి చిరాకు పడతాడు శివన్నారాయణ. ఇంతలో కార్తీక్, దీప, శౌర్యలు అక్కడికి వస్తారు. మీరు ముగ్గురే వచ్చారు మీ అమ్మ ఎక్కడ? అని పెద్దాయన అడగ్గా.. అమ్మకి ధైర్యం సరిపోవడం లేదు, ఇక్కడికి రాలేనని చెప్పిందని అంటాడు కార్తీక్. జ్యోత్స్న కూడా ఇంతే తనకు కూడా ధైర్యం సరిపోవడం లేదని, గదిలో నుంచి బయటకు రావడం లేదని అంటుంది పారిజాతం. నేను రప్పిస్తానని కార్తీక్ వెళ్లడంతో పారు షాక్ అవుతుంది. ఈరోజు ఇంట్లో మనకి విందు భోజనం ఏర్పాటు చేయమని దీపతో చెబుతాడు దశరథ. వదిన నా గురించి ఎంత బాధపడుతుందో ఏంటోనని సుమిత్ర ఏడుస్తుంది. అది చూసి దశరథ, శివన్నారాయణలు కూడా బాధపడతారు.

ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నారని జ్యోత్స్నని అడుగుతాడు కార్తీక్. చిన్న పని ఉంది.. బయటకు వెళ్లాలని చెబుతుంది జ్యోత్స్న.. యజమానులు బయటకు వెళ్లేటప్పుడు డ్రైవర్లు ఎదురు మాట్లాడకూడదని మండిపడుతుంది పారిజాతం. కార్తీక్‌తో గొడవ పడుతుండగా దాస్ మేటర్ గురించి పారు నోరు జారడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మిమ్మల్ని బయటకు పంపిస్తానని కార్తీక్ అంటాడు. మన టైం బాగోకపోతే రహస్యాలు బయటపడిపోతాయి.. అప్పుడే ఎవరు ఎలాంటివారు తెలుస్తుందని చెబుతాడు. జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుండగా సుమిత్ర వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. మనసు బాగకపోతే నేనే తన స్నేహితురాలిని కలవమని చెప్పానని అంటుంది పారు. ఈరోజు మనింట్లో విందు భోజనం ఏర్పాటు చేస్తున్నాం.. అందరం సరదాగా ఉందామని చెబుతుంది సుమిత్ర.

ఏదో ఒక క్షణంలో నేను చనిపోతానేమోనని భయంగా ఉంది.. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, అదే నాకు ఆఖరి క్షణం అనిపిస్తుంది. నేను కన్నుమూసే చివరి క్షణంలో నా కూతురు నా పక్కనే ఉండాలని సుమిత్ర చెప్పడంతో దీప కంటతడి పెడుతుంది. నీ కూతురు నీ కళ్లముందే ఉంటుందని కార్తీక్ అంటాడు. త్వరలో రాబోతున్న నా మెడికల్ రిపోర్ట్స్‌కి బావ ముందుగానే చేస్తున్న సెలబ్రేషన్స్‌లా ఉందని జ్యోత్స్న చెబుతుంది. ఆ కార్తీక్‌గాడిని ఏదో ఒకటి చేసి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలా చేస్తానని చెబుతుంది పారు. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో? డాక్టర్ ఎవరికి ఫోన్ చేస్తుందో అర్ధం కావడం లేదు? అని అంటుంది జ్యోత్స్న. అన్ని అనర్ధాలకు కారణంగా ఆ కార్తీక్‌గాడే... ముందువాడిని బయటకు పంపేసి వస్తాను, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని అంటుంది పారిజాతం. ఏంటీ ఆలోచించేది? ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ బయటకు వచ్చాయంటే మన జాతకం బయటపడినట్లే అనుకుంటుంది జ్యోత్స్న

కార్తీక్‌ను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపాలని ప్లాన్ చేస్తుంది పారు. జ్యోత్స్నకు ఏదో చెప్పాలని కార్తీక్ అనుకుంటూ ఉండగా.. ఆమె పక్కనే సుమిత్ర ఉండటంతో ఏం చేయాలో అర్ధం కాదు. ఇంతలో పారిజాతం వచ్చి.. ఏం చూస్తున్నావని అడుగుతుంది. వంటగదిలో నుంచి మసాలా వాసనలు వస్తుంటే మా ఆవిడ ఏం కూర వండుతుందా అని ఆలోచిస్తున్నానని అంటాడు కార్తీక్. ఇప్పుడే ఏడుస్తూ వెళ్లింది, ఇక వంటే ఏం చేస్తుందని ప్రశ్నిస్తుంది పారిజాతం. సుమిత్ర చావు గురించి మాట్లాడగానే దీప ఎందుకు అంతలా ఏడ్చిందని అడుగుతుంది పారిజాతం. పేగు బందం కదా? ఆ మాత్రం ప్రేమ ఉంటుందని అంటాడు కార్తీక్. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్నది పేగు బంధం కదా.. మరి ఆవిడ గారు ఎందుకు కన్నీరు కార్చలేదని ప్రశ్నిస్తాడు కార్తీక్. జ్యోత్స్నది నిజమైన ప్రేమ తల్లిని ఎలా కాపాడాలో తనకు తెలుసని అంటుంది పారిజాతం. ఈ మాటలన్నీ విన్న దశరథ .. నువ్వు ఇలాగే ఉండు, మీ అత్తని నవ్వించు, ప్రేమించు, రక్షించు అంటాడు.

బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆడదానికి చావుతో సమానం. ఒక చావును దాటొచ్చిన ఆడదానిని ఆమె జన్మనిచ్చిన బిడ్డే కాపాడుతుందని అంటాడు కార్తీక్. ఏం జరిగినా అత్తా, నువ్వు కలిసే ఉంటారు అని చెబుతాడు. ఇదంతా విన్న పారిజాతం.. దశరథ కూతురే సుమిత్రను కాపాడుతుంది కానీ ఈ నిజం చెప్పే నా కొడుకు ఎక్కడ ఉన్నాడోనని బాధపడుతుంది. టిఫిన్ చేసేందుకు దాస్ కట్లు విప్పుతారు రౌడీలు. టిఫిన్ చేస్తుండగా ఫోన్ కనిపించడంతో వెంటనే కార్తీక్‌కి ఫోన్ చేస్తాడు దాస్. కానీ ఇంతలోనే రౌడీలు రావడంతో ఫోన్‌ని జేబులో పెట్టుకుంటాడు దాస్. ఇంతలో ఫోన్ కనిపించకపోవడంతో ఆ రౌడీ అటు ఇటు తిరిగి దాస్ జేబులో నుంచి ఫోన్ లాక్కుని కార్తీక్ ఫోన్ చేస్తుండగా కట్ చేస్తాడు. ఇంతలో రౌడీ ముఖం మీద టిఫిన్ కొట్టి.. అక్కడి నుంచి తప్పించుకుంటాడు దాస్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X