Karthika Deepam 2 January 23rd: దాస్‌ని చూసిన పారిజాతం.. సీసీటీవీ ఫుటేజ్‌తో జ్యోత్స్న‌ను పట్టుకున్న కార్తీక్

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే తన ఇంటికి కార్తీక్, దీప, శౌర్యలు మాత్రమే రావడం... తన కూతురు కాంచన కనిపించకపోవడంతో శివన్నారాయణ బాధపడతారు. అమ్మ ఎందుకు రాలేదని పెద్దాయన అడగ్గా... ఇక్కడికి రావడానికి అమ్మకి ధైర్యం సరిపోవడం లేదని చెబుతాడు కార్తీక్. నా వల్ల వదిన ఎంతో బాధపడుతోందని సుమిత్ర కంటతడి పెడుతుంది. ఇంట్లో నుంచి జ్యోత్స్న బయటకు వెళ్లబోతుండగా కావ్య అడ్డుపడతాడు. నా పరిస్ధితి అంతంత మాత్రంగా ఉంది.. ఎప్పుడు కన్నుమూస్తానా తెలియడం లేదు. ఈ టైంలో నువ్వు నా పక్కనే ఉండమని సుమిత్ర అడగటంతో జ్యోత్స్న సరేనని అంటుంది.

సుమిత్ర పరిస్ధితి చూసి దీప కంటతడి పెడుతుండటంతో పారిజాతానికి అనుమానం వస్తుంది. మీ ఆవిడ, నువ్వు బాగా నటిస్తున్నారని కార్తీక్‌పై సెటైర్లు వేస్తుంది. నేను నటించినా? మా ఆవిడ ఏడిచినా అంతా అత్త కోసమేనని కార్తీక్ కౌంటరిస్తాడు. అది చూసిన దశరథ తన మేనల్లుడిని మెచ్చుకుంటాడు. జ్యోత్స్న చెరలో ఉన్న దాస్‌ టిఫన్ చేస్తుండగా పక్కనే ఫోన్ కనిపించడంతో కార్తీక్‌కి ఫోన్ చేస్తాడు. ఇది గమనించిన రౌడీలు దాస్ దగ్గర ఫోన్ లాక్కుంటారు. అయితే దాస్ చాకచక్యంగా తప్పించుకుని కార్తీక్ దగ్గరకి పరిగెత్తుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 23వ తేదీ 575వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 575 January 23rd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

కాంచన పూజ చేసి తాళిబొట్టుని కళ్లకు అద్దుకుంటూ ఉండగా శ్రీధర్ వస్తాడు. భార్య విషయంలో తప్పు చేస్తే ఎలా కడుక్కోవాలో ఏ శాస్త్రంలో చెప్పలేదని అంటాడు. ఎందుకంటే ఆడదానికి జరిగిన అన్యాయం... పాపం కిందకి లెక్కరాదని శాస్త్రాలు రాసినవాడు కూడా వదిలేశాడని అంటుంది కాంచన. కొందరినీ ఊపిరి బతికించలేదు, కొందరినీ చావు చంపలేదు.. మనసు శిలగా మారినవారికి ఏ బాధ ఉండదని బాధపడతాడు శ్రీధర్. ఇంతలో దీపం ఆరిపోగా.. శ్రీధర్ నూనె పోసి దీపం వెలిగిస్తాడు. నువ్వు రెడీ అయితే మా అత్తగారింటికి బయల్దేరదామని చెబుతాడు శ్రీధర్. నేను రాను అని కార్తీక్‌తో చెప్పానని కాంచన అంటుంది.

నిన్ను తీసుకురమ్మని మా బావగారు చెప్పారు.. నువ్వు దూరంగా ఉంటే ఇలాగే ఒంటరిగా బాధపడాలి. అదే దగ్గరిగా ఉంటే కనీసం ధైర్యం చెప్పొచ్చు అని చెబుతాడు శ్రీధర్. కొన్నిసార్లు మాటలతో ధైర్యాన్ని చెప్పాల్సిన అవసరం లేదు.. మనిషి పక్కనే ఉంటే చాలు ధైర్యంగా ఉండొచ్చని చెబుతాడు. నువ్వు వస్తావనే నమ్మకంతోనే మీ అన్నయ్య నన్ను పంపించాడు. నువ్వు రాకపోతే అక్కడ నీకోసం చాలామంది బాధపడతారని అంటాడు శ్రీధర్. నువ్వొచ్చి సంతోషపెడతావో? రాకుండా బాధపెడతావో? నీ ఇష్టం అని అంటాడు.

కార్తీక్‌కి తాటిబెల్లంతో చేసిన పరమాన్నం అంటే చాలా ఇష్టమని కిచెన్‌లో సుమిత్ర చెబుతుండగా.. తల్లి ఆరోగ్యం గురించి తలచుకుని దీప కంటతడి పెడుతుంది. నువ్వు చెకప్‌కి వెళ్తున్నావా అని సుమిత్ర అడగ్గా.. నేను టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. నన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి నా భర్త ఉన్నాడని అంటుంది దీప. నువ్వు అదృష్టవంతురాలివి అని చెబుతుంది సుమిత్ర. నేను కొద్దిరోజులు మీ ఇంట్లోనే ఉండొచ్చా అని దీప అడుగుతుంది. మీకు దగ్గరుండి అన్ని చూసుకోవడానికి అని అంటుంది. అంతగా నాకు ఏమైనా చూసుకోవడానికి నా కూతురు ఉంది కదా? అని చెబుతుంది సుమిత్ర. ఇంతలో శౌర్య వచ్చి దీపని చూసి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది.

అమ్మమ్మ ఏమైనా అందా? అని ప్రశ్నిస్తుంది. మీ అమ్మను నేను ఏమీ అనలేదని సుమిత్ర చెప్పగా.. ఎవరూ ఏమీ అనకుండా ఊరికే ఎవరైనా ఏడుస్తారా అని ప్రశ్నిస్తుంది. ఉల్లిపాయలు కోస్తున్నాను కదా అందుకే ఏడుస్తున్నాని అంటుంది దీప. కూతురంటే నీలాగే ఉండాలి.. తల్లికి కష్టమొచ్చినా, కన్నీళ్లు వచ్చినా తోడుగా ధైర్యంగా నిలబడాలని చెబుతుంది సుమిత్ర. అందుకే నేను మీకు తోడుగా ఉండాలని అనుకుంటున్నానని అంటుంది దీప. నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు.. కానీ నాకు నా కూతురు ఉంది కదా? నా సంగతి అది చూసుకుంటుందిలే అని చెబుతుంది సుమిత్ర. జ్యోత్స్న మనసెంటో తెలిస్తే దానిని దగ్గరికి కూడా రానివ్వవు.. ఈ నిజం బయటపడే రోజు దగ్గరిలోనే ఉందని అనుకుంటుంది దీప. నీకు సర్‌ప్రైజ్ అని శౌర్య చెప్పగా.. ఏంటీ అని అడుగుతుంది సుమిత్ర. నానమ్మ, తాతయ్య వచ్చారని చెప్పడంతో సుమిత్ర సంతోషిస్తుంది.

కాంచనను చూడగాను సుమిత్ర సంతోషిస్తుంది. నువ్వు ఎందుకు రాను అన్నావని ప్రశ్నిస్తుంది సుమిత్ర. నువ్వు నాకు వదినవి మాత్రమే కాదు.. మంచి స్నేహితురాలివి, ఆ దేవుడి దయ వల్ల నీతో మంచి జ్ఞాపకాలు కూడా ఉన్నాయని చెబుతుంది కాంచన. నిన్ను తలచుకున్న ప్రతిసారి మీ పెళ్లి జరిగిన రోజులు, నీతో మంచి సాయంత్రాలు గడిపిన రోజులు గుర్తొస్తాయని అంటుంది. ఇప్పుడు నిన్ను చూడాలంటేనే ధైర్యం సరిపోవడం లేదని అంటుంది. నేను చనిపోతానని భయపడుతున్నావా అని సుమిత్ర అనగా.. కాంచన షాక్ అవుతుంది. వదిన కోసం అమ్మవారి కుంకుమ తీసుకొచ్చాను.. కానీ అమ్మవారు మీ అమ్మమ్మకి కన్నకూతురు రూపంలో ఇంతకంటే పెద్ద రక్షే ఇచ్చారు, మా అందరికంటే నీదే పెద్ద బాధ్యత అని జ్యోత్స్నకి చెబుతుంది కాంచన. కన్నకూతురిదే పెద్ద బాధ్యత అని కార్తీక్ అనడంతో జ్యోత్స్న, పారులు వణికిపోతారు.

సుమిత్రకు రక్ష కట్టి నీకు ఏం కాదని కాంచన అంటుంది. జ్యోత్స్న శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయని కాంచన అడగ్గా.. త్వరలోనే వచ్చేస్తాయని చెబుతాడు దశరథ. ఒకటికి రెండుసార్లు చెక్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వాలి కదా? అని కార్తీక్ అంటాడు. డాక్టర్ గారు వచ్చి... జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ప్రిపేర్ అవ్వమని చెబుతారని కదా చెప్పేది అని శ్రీధర్ అంటాడు. ఇంతలో దాస్ తప్పించుకున్నట్లు రౌడీలు చెబుతారు. ఆ వెంటనే గేట్ దగ్గర పడిపోతున్న తండ్రిని చూసి త్వరగా రమ్మని చెబుతుంది. ఇంతలో కొడుకుని చూసిన దాస్.... కంగారుగా పరిగెత్తుతూ దీపని గుద్దుకోవడంతో పెద్దాయన సీరియస్ అవుతాడు. దాస్ వచ్చాడు.. కిందపడిపోయాడని చెప్పడంతో అందరూ కంగారుగా బయటకు వెళ్తారు. కానీ దాస్ కనిపించకపోవడంతో కంగారుగా బయట పరుగులు తీస్తుంది.

కార్తీక్ అటు ఇటూ చూస్తూ పైకి చూడగా.. జ్యోత్స్న కంగారుగా కనిపిస్తుంది. ఇప్పుడే అసలు సంగతి చెబుతానని కార్తీక్ కంగారుగా మేడపైకి పరుగులు తీస్తాడు. దాస్ అన్నయ్య కోసం ఎందుకు అంతా కంగారుపడుతున్నారని కాంచన అడగ్గా.. దాస్ కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదని అనడంతో కాంచన కంగారుపడుతుంది. దాస్ మావయ్యని చూశావా అని జ్యోత్స్నని నిలదీస్తాడు కార్తీక్. నేను ఎవ్వరినీ చూడలేదని తేల్చిచెబుతుంది జ్యోత్స్న. దాస్ గురించి నువ్వెందుకు ఇంత కంగారుపడుతున్నావని శివన్నారాయణ అడగ్గా.. వాడు వచ్చాడు, నేను చూశానని పారిజాతం చెబుతుంది. నేను నమ్మనని జ్యోత్స్న అనగా.. నేను నమ్ముతానని కార్తీక్ అంటాడు. నువ్వే కాదు.. దాస్ మావయ్య రావడం మరొకరు కూడా చూశారని కార్తీక్ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అందరికీ చూపిస్తారు కూడా అని కార్తీక్ చెప్పడంతో ఎవరు వాళ్లు అని జ్యోత్స్న అడుగుతుంది. సీసీ కెమెరా అని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. నీ బుర్ర సూపర్‌రా.. దాస్ వచ్చాడంటే మీ తాత నమ్మడం లేదు. ఇప్పుడు సీసీ కెమెరాలో రౌడీలు దాస్‌ను రౌడీలు తీసుకుపోవడం చూస్తే దొరికిపోతానని వణికిపోతుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X