Karthika Deepam 2 January 24th: దశరథ పొరపాటు.. తప్పించుకున్న జ్యోత్స్న, కార్తీక్‌కి దొరకని దాస్ ఆచూకీ
Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే పూజ చేసుకుంటున్న కాంచన దగ్గరికి శ్రీధర్ వచ్చి సుమిత్ర దగ్గరికి వెళ్దామని నచ్చచెబుతాడు. నేను మా వదినను చూడలేను.. ఆవిడ నాకు మంచి స్నేహితురాలు కూడా అనిచెబుంది కాంచన. చివరికి శ్రీర్‌తో కలిసి శివన్నారాయణ ఇంటికి వెళ్తుంది. తల్లి ఆరోగ్య పరిస్ధితి చూసి కంటతడి పెట్టుకుంటుంది దీప. ఇంతలో శౌర్య వచ్చి నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? నీ కోసం నానమ్మ, తాతయ్య వచ్చారు అని చెప్పడంతో దీప షాక్ అవుతుంది. సుమిత్రను చూడగానే కాంచన ఎంతో సంతోషిస్తుంది. వాళ్లిద్దరి స్నేహం చూసి శివన్నారాయణ, దశరథలు మురిసిపోతారు.
అత్తకి ఏం కాదు.. తన ప్రాణాలను కాపాడే కూతురు ఇక్కడే ఉంది కదా అని అంటాడు కార్తీక్. ఆ మాటలతో భయపడిపోయిన జ్యోత్స్న మేడ మీదకి వెళ్లిపోతుంది. రౌడీల బారి నుంచి తప్పించుకున్న దాస్ పరిగెత్తుకుంటూ వచ్చి శివన్నారాయణ ఇంటి ముందు కుప్పకూలిపోతాడు. అది చూసిన జ్యోత్స్న వెంటనే రౌడీలకు ఫోన్ చేసి దాస్‌ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోమ్మని చెబుతంది. దాస్ రావడం కిందపడిపోవడం చూసిన పారిజాతం పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. ఆమె మాటలు విని పారు కూడా వస్తుంది. అయితే అక్కడ దాస్ కనిపించకపోవడం... పై నుంచి జ్యోత్స్న చూస్తుండటంతో కార్తీక్‌కి అనుమానం వచ్చి మరదలిని నిలదీస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 24వ తేదీ 576వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దాస్ అసలు వచ్చాడో లేదో తెలుసుకోవాలని కార్తీక్ ప్రయత్నిస్తాడు. లాప్‌టాప్‌లో సీసీటీవీ ఫుటేజ్ కోసం వెతుకుతుండగా సీసీ కెమెరా పనిచేయడం లేదని దశరథ చెబుతాడు. దాంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. అసలు దాస్ బాబాయ్ రాలేదని నేను చెబుతుంటే వినిపించుకోవడం లేదని ఇప్పుడు చూశావా అని మండిపడుతుంది జ్యోత్స్న. నెల క్రితమే ఆ సీసీ కెమెరాను పాడు చేశాను.. అప్పటి నా ముందు జాగ్రత్తే నన్ను కాపాడిందని అనుకుంటుంది జ్యోత్స్న. దాస్ అన్నయ్య ఇంటికి వస్తే ఖచ్చితంగా లోపలికి వచ్చేవాడని.. మనం రావొద్దని చెప్పలేదు కదా అని అంటుంది కాంచన.
సుమిత్ర అత్తకు ఆరోగ్యం బాలేదని తెలిసినప్పటి దగ్గరి నుంచి దాస్ మావయ్య నిజం చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచే కనిపించకుండా పోయాడు.. జ్యోత్స్న మీదే నా అనుమానం అని అనుకుంటాడు కార్తీక్. నువ్వు నన్ను ఎప్పటికీ కనిపెట్టలేవని.. దాస్ ఎక్కడున్నాడనే నిజం తెలుసుకోలేవని అనుకుంటుంది జ్యోత్స్న. దాస్‌ని నేను చూశాను.. కానీ నువ్వెందుకు నమ్మడం లేదని మనవరాలిపై అరుస్తుంది పారిజాతం. అక్కడ నాకు సపోర్ట చేయాల్సిందిపోయి.. నా మీద అరుస్తావేంటీ అని పారుపై సీరియస్ అవుతుంది జ్యోత్స్న. అసలే దాస్ వస్తే ఎక్కడ నిజం బయటపడుతుందోనని నాకు టెన్షన్‌గా ఉందని అంటుంది. నీ కళ్ల జోడు మార్చుకోమని వెళ్లిపోతుంది.
ఇంట్లో అందరూ కలిసి భోజనం చేస్తుండటంతో శివన్నారాయణ సంతోషిస్తాడు. నువ్వు రావడం లేదని అందరం బాధపడ్డాం.. వెంటనే బావకి ఫోన్ చేసి చెబితే ఆయన ఇక్కడికి తీసుకొచ్చాడని అంటాడు దశరథ. కలిసి తినడంలో ఎంతో ఆనందం ఉంటుంది. కానీ నేను వండిన వంటలు మీరంతా తింటుంటే మనసు తృప్తి పడుతోందని చెబుతుంది దీప. సుమిత్ర, దశరథల మధ్య కూర్చొని దీప భోజనం చేస్తుండగా జ్యోత్స్న మండిపడుతుంది. పదే పదే తల్లిలాంటిది, తండ్రి లాంటిది అని మా అమ్మనాన్నల్ని అనోద్దని సీరియస్ అవుతుంది. మా మమ్మీ ఇంట్లో నుంచి వెళ్లిపోతే దీప తన ఇంట్లో దాచింది.. మా మమ్మీకి హెల్త్ బాగోకపోతే బావ నిజం దాచాడు. కానీ మేం మాత్రం జరిగినదానికి ఈరోజుకి బాధపడుతూనే ఉన్నాం. ఏమైనా జరిగితే నష్టం ఎవరికి అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న.
దీని మాటలు వింటుంటే మేం ఇక్కడికి రావడం ఇష్టం లేనట్లుగా ఉందని కాంచన సీరియస్ అవుతుంది. కొన్నిరోజులుగా దీని చేతలు, మాటలు తేడాగా ఉన్నాయని శివన్నారాయణ కూడా మండిపడతాడు. మన ఫ్యామిలీలో మనం మాట మాట అనుకోవద్దని హితవు చెబుతాడు శ్రీధర్. నువ్వు అడ్డదారిలో ఈ ఫ్యామిలీలో కలిసిపోయావు.. ఇష్టం లేకపోయినా కాంచన వెనుకే తిరుగుతున్నావు, నువ్వు ఫ్యామిలీతో రావాల్సి వస్తే కావేరితోనూ, స్వప్నతోనూ కలిసి వస్తావా? అని నిలదీస్తుంది పారిజాతం. నీ రెండో భార్యకి విడాకులు ఇచ్చి కాంచన దగ్గరికి వచ్చేస్తావా? అని నానామాటలు అంటుంది. ఆ మాటలతో కార్తీక్ రగిలిపోతాడు.
అందరం సంతోషంగా ఉన్న టైంలో విషం కలుపుతావా? అని పారిజాతంపై మండిపడతాడు శివన్నారాయణ. ఇంతలో సుమిత్ర జోక్యం చేసుకుని అందరికీ నచ్చచెబుతుంది. నేను బాగుండాలని మీరంతా ఈ విందు ఏర్పాటు చేశారు. కానీ నేను అప్పటి వరకు బతుకుతానని అనుకోవడం లేదు. నా కూతురి పెళ్లి చూసే వరకైనా బతుకుతానో లేదో అని బాధపడుతుంది. మీ అందరితో కలిసి మళ్లీ ఇలా భోజనం చేస్తానో లేదోనని కంటతడి పెడుతుంది. ఖచ్చితంగా వస్తాయి... నేనుండగా నీకు ఏం కానివ్వను, కన్నకూతురు తన తల్లిని ప్రాణాలు అడ్డుపెట్టయినా కాపాడుకుంటుందని చెబుతుంది. త్వరలోనే ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుంది.. నువ్వు కోలుకుని నా పెళ్లి చేస్తావు, నా పిల్లలతో ఆడుకుంటావని అంటుంది. తల్లి మాటలతో దీప కంటతడి పెడుతుంది. ఇంతలో శౌర్య రావడంతో భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్లావని మండిపడుతుంది సుమిత్ర. వెంటనే తన ఒడిలో కూర్చోబెట్టుకుని అన్నం తినిపిస్తుంది. మనవరాలితో ఆడుకుంటావు... భోజనం తినిపిస్తావని నేనన్న మాటలు ఇంత త్వరగా నెరవేరతాయని అనుకోలేదని అనుకుంటుంది జ్యోత్స్న. శౌర్యకు సుమిత్ర అన్నం తినిపిస్తూ ఉండటంతో కార్తీక్, దీపలు సంబరపడిపోతారు.
నా ప్లాన్ వేరే ఉంది బావా.. ఏం చేయాలో నేను ముందే డిసైడ్ అయ్యానని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. మీ అమ్మని ఎలా కాపాడుకుంటావు.. ఎలా తప్పించుకుంటావు అని జ్యోత్స్నని ప్రశ్నిస్తుంది పారిజాతం. దానికి ఓ కథ చెప్పిన జ్యోత్స్న.. కొన్నాళ్లు నేను సైలెంట్‌గా తప్పుకుంటానని, మా అమ్మ చచ్చిపోయిన తర్వాత వస్తానని అనుకుంటుంది. జ్యోత్స్న దగ్గర ఏదో ప్లాన్ ఉండబట్టే అంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడిందని కార్తీక్‌తో అంటాడు జ్యోత్స్న. దాస్‌ని ఎత్తుకుపోయిన రౌడీలు అతనికి వార్నింగ్ ఇస్తారు. ఇంతలో జ్యోత్స్న ఫోన్ చేసి నిజం చెప్పాలని అనుకుంటున్నావా? చచ్చిపోతావా? అని మండిపడుతుంది. తప్పు సరిదిద్దుకో, దీపని ఏం చేయొద్దని చెబుతాడు దాస్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











