Karthika Deepam 2 January 26th: డాక్టర్ రిపోర్ట్స్‌తో దశరథ, కాంచనలో అనుమానం..కెనడా పారిపోయేలా జ్యోత్స్న స్కెచ్
Photo Courtesy: JioHotstar
సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అసలు దాస్ ఇక్కడికి వచ్చాడో లేదో కార్తీక్ చెక్ చేస్తుండగా ఒక కెమెరా మాత్రమే పనిచేస్తుంది. మరో కెమెరా పనిచేయడం లేదని దశరథ చెప్పడంతో జ్యోత్స్న ఊపిరి పీల్చుకుంటుంది. అసలు దాస్ రాలేదని.. వస్తే ఇంట్లోకి రాకుండా ఉంటాడా అని అంటుంది. అందరూ అదే మాట అనడంతో కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. దాస్ రావడం నేను చూశానని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. ముందు నువ్వు కళ్లజోడు మార్చు అంటూ నాయనమ్మ మీద అరుస్తుంది జ్యోత్స్న. భోజనాల దగ్గర దీపను దశరథ, సుమిత్రలు ప్రేమగా చూసుకోవడంతో జ్యోత్స్న రగిలిపోతూ నానామాటలు అంటుంది. దాంతో శివన్నారాయణ గడ్డిపెడతాడు.
నేను ఉన్న నాలుగు రోజులైనా నా బిడ్డతో ఉండాలని అనుకుంటున్నానని సుమిత్ర అనడంతో నీ కన్నకూతురు బతికి ఉండగా.. నీకు ఏం కాదని అంటుంది జ్యోత్స్న. మరోవైపు.. దాస్‌కి ఫోన్ చేసిన జ్యోత్స్న తప్పించుకోవాలనే ప్రయత్నాలు చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఫోన్ మాట్లాడి వెనక్కి తిరిగి చూసిన జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 26వ తేదీ 577వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దాస్‌తో ఫోన్‌లో మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి పారిజాతం ఉండటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నావని పారు అడగ్గా.. ఫ్రెండ్‌తో అని చెబుతుంది జ్యోత్స్న. నిజంగానే నువ్వు దాస్‌ని చూడలేదా అని నాయనమ్మ అడగటంతో జ్యోత్స్న మండిపడుతుంది. అసలే ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక ఏడుస్తుంటే... మధ్యలో నీ గోల ఏంటీ? అని కోపంగా వెళ్లిపోతుంది. ఈ కార్తీక్ గాడు మా మధ్యలో తెలివిగా గొడవలు పెడుతున్నాడని పారు కూడా సైలెంట్ అయిపోతుంది. నేను బయటకు వెళ్తున్నాను... డాక్టర్ రాదు, రిపోర్ట్స్ రావు అని చెబుతుంది జ్యోత్స్న. మనవరాలి మాటలతో డాక్టర్‌ని ఏమైనా చేసిందా అని పారు అనుకుంటుంది. జ్యోత్స్న బయటకు వెళ్తుండగా డాక్టర్ హారిక కనిపించడంతో షాక్ అవుతుంది.
డాక్టర్ రిపోర్ట్స్ తీసుకుని ఇంటికి తీసుకువచ్చినట్లు పారుకు చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు షాక్ అవుతుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రిపోర్ట్స్ ఈరోజు రాకూడదు, అలాగే ఆ డాక్టర్‌కి వేరే సర్జరీ ఉండటంతో ఈరోజు వేరే చోటికి వెళ్లాలి. కానీ ఏం జరిగిందో? ఏంటో కానీ రిపోర్ట్స్ తీసుకుని ఆ డాక్టర్ నేరుగా మనింటికే వచ్చేసిందని అంటుంది జ్యోత్స్న. నువ్వు బాల్కనీ నుంచి తప్పించుకుని పారిపో అని చెబుతుంది. ఇంతలో జ్యోత్స్న, పారులను దీప వచ్చి పిలుస్తుంది. పారు వణికిపోతూ కనిపించడంతో ఏం జరిగిందని అడుగుతుంది దీప. చలిగా ఉంటే కిందకి వస్తే వేడిగా ఉంటుందని దీప అంటుంది. మీరు పారిపోతారేమోనని దగ్గరుండి మరి తీసుకురమ్మన్నారని చెబుతుంది దీప. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
ఈ రోజుతో నీ ఛాప్టర్ క్లోజ్ అని మనసులో అనుకుంటాడు కార్తీక్. నేను రేపు రావాల్సింది.. కానీ కార్తీక్ ఈరోజే రమ్మన్నాడని డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. జ్యోత్స్న బాధ చూడలేకపోయా.. భోజనం చేసేటప్పుడు అత్త గురించి జ్యోత్స్న చెప్పే మాటలు చూడలేక వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేశాను. రిపోర్ట్స్ తీసుకుని మార్నింగ్ వస్తానని డాక్టర్ చెప్పగా.. మీ పనులన్నీ పక్కనపెట్టి ఇప్పుడే రమ్మన్నాను అని చెబుతాడు కార్తీక్. కన్నకూతురిలాగా కన్నతల్లిని మరెవరూ ప్రేమించలేరు కదా? అని అంటాడు. డాక్టర్ గారు రిపోర్ట్స్‌తో వచ్చారు అని తెలియగానే జ్యోత్స్న పరిగెత్తుకుంటూ వచ్చిందని చెబుతాడు. రిపోర్ట్స్ గురించి చెప్పమని డాక్టర్‌తో అంటాడు కార్తీక్.
జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్‌తో సుమిత్ర గారి శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. రెండు మూడు సార్లు చెక్ చేశాం.. సేమ్ రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ చూసి మేమే షాక్ అయ్యామని అంటుంది డాక్టర్. జ్యోత్స్న కన్నకూతురు కాకపోతే రిపోర్ట్స్ మ్యాచ్ కాదని అంటాడు కార్తీక్. తప్పు మీ వైపు ఉన్నప్పుడు ఎన్ని అయినా అంటారని జ్యోత్స్న అనడంతో డాక్టర్ షాక్ అవుతుంది. నా బ్లడ్ శాంపిల్స్ మా మమ్మీతో మ్యాచ్ కాలేదు అంటే టెస్టింగ్ సరిగా చేయని మీది అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో డాక్టర్ హారిక మండిపడుతుంది. నాకు ముందు నుంచి మీ ట్రీట్‌మెంట్ మీద, మీ హాస్పిటల్ మీద గానీ నమ్మకం లేదని అంటుంది జ్యోత్స్న. తప్పించుకోవడానికి భలే మెలిక పెట్టావని కార్తీక్ అనుకుంటాడు.
డైలీ వందల మందికి ట్రీట్‌మెంట్ జరుగుతుంది.. ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లమ్ రాలేదని చెబుతుంది డాక్టర్ హారిక. పొరపాటు జరిగిందని మీరు నమ్ముతున్నారా అని కార్తీక్‌ని హారిక అడగ్గా.. కార్తీక్ సైలెంట్‌గా పారు వద్దకు వెళ్లి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదని నాకు ముందే తెలుసని చెవిలో చెబుతాడు. నేను ఎవరి కూతురినో మీ అందరికీ తెలియదా? అలాంటప్పుడు శాంపిల్స్ మ్యాచ్ కాలేదంటే ఎక్కడో మిస్టేక్ జరిగిందనే కదా అని అంటుంది జ్యోత్స్న. వీళ్ల పొరపాటును సరిదిద్దుకోవడానికి నింద మన మీద వేస్తారని మండిపడుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫ్రాడ్స్ ఎన్నో జరిగాయని.. నా బ్లడ్ శాంపిల్స్ అనుకుని వేరే బ్లడ్ శాంపిల్స్‌ని టెస్ట్ చేశారని ఆరోపిస్తుంది జ్యోత్స్న. నా బ్లడ్ శాంపిల్స్ మీద స్టిక్ చేసిన కోడ్ రాంగ్ అంటుంది. నువ్వు మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నావు.. ఈ రిపోర్ట్స్ అబద్ధమని నిరూపించగలిగితే నేను డాక్టర్ వృత్తిని మానేసి ఇంట్లో కూర్చొంటానని హారిక సవాల్ విసురుతుంది.
ఎవ్వరినీ నమ్మించాల్సిన అవసరం లేదు.. వీళ్లను నమ్ముకుని మమ్మీ ట్రీట్‌మెంట్ చేయించడం నాకు ఇష్టం లేదు. మనం కెనడా వెళ్దాం.. అక్కడ నా ఫ్రెండ్ ఉంది, చాలామంది డాక్టర్స్ ఉన్నారని దశరథకు చెబుతుంది జ్యోత్స్న. ఇప్పటి వరకు మీ ఫీజు ఎంత అయ్యిందో చెబితే చెక్ రాసిస్తానని అనడంతో హారిక సీరియస్ అవుతుంది. నేను డబ్బుల కోసం ఈ వృత్తిని ఎంచుకోలేదని మండిపడుతుంది. నువ్వు ఇలా మాట్లాడొద్దు.. డాక్టర్ హారిక బెస్ట్ డాక్టర్.. తన గురించి నాకు పూర్తిగా తెలుసు. మనం మీ అమ్మని కెనడా తీసుకెళ్లినా, ఆస్ట్రేలియా తీసుకెళ్లినా ట్రీట్‌మెంట్ ఇదేనని అంటాడు దశరథ. రిపోర్ట్స్ దశరథకు ఇచ్చేసి వెళ్లిపోతుంది హారిక. నా కూతురి పెళ్లి చూసే యోగం నా చేతిలో లేనప్పుడు ఏం చేస్తానని బాధపడుతుంది సుమిత్ర. డాక్టర్ చెప్పింది నిజమా? లేక పొరపాటు జరిగిందా? అని దశరథ ఆలోచిస్తాడు.
తన పుట్టింట్లో ఇంట్లో జరిగింది? డాక్టర్ చెప్పిన మాటలు విని కాంచనకు అనుమానం వస్తుంది. మీరిద్దరూ నా దగ్గర ఏం దాస్తున్నారని కార్తీక్, దీపలను ప్రశ్నిస్తుంది. కొన్ని వినేటప్పుడు ఏం అర్ధం కాదు.. జరిగేటప్పుడే తెలుస్తుంది. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అని డాక్టర్ చెబితే అందరూ ఆశ్చర్యపోయారు.. కానీ మీ ఇద్దరూ మాత్రం భయపడ్డారని కాంచన అనగానే దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. అదే భయం జ్యోత్స్న, పారులలో చూశానని అంటుంది. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని వీరిద్దరికీ ముందే తెలుసని కాంచన అనడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? జ్యోత్స్న మా అన్నయ్య సొంత కూతురు కాదా? అని కాంచన అడగటంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











