Karthika Deepam 2 January 27th: దాస్ దెబ్బకి ముచ్చెమటలు.. దీప హత్యకు జ్యోత్స్న కుట్ర, భార్యని కాపాడిన కార్తీక్

Photo Courtesy: JioHotstar

దాస్ కనిపించకపోవడంతో జ్యోత్స్నపై అనుమానం వ్యక్తం చేస్తుంది పారిజాతం. బావ తెలివిగా మన మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నాడని కోప్పడుతుంది జ్యోత్స్న. రిపోర్ట్స్ బయటకు వచ్చేసరికి మనం ఇక్కడ ఉండకూడదని హడావుడిగా వెళ్లబోతుండగా అప్పుడే డాక్టర్ హారిక రావడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ విషయాన్ని పారుకు చెప్పడంతో ఆమె కూడా వణికిపోతుంది. ఇంతలో వాళ్లని తీసుకెళ్లడానికి దీప వస్తుంది. సుమిత్ర గారి బ్లడ్ శాంపిల్స్‌కు జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.

బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడంతో మీరు, మీ హాస్పిటల్‌లో ఏదో తప్పు జరిగిందని తెలివిగా తప్పించుకుంటుంది జ్యోత్స్న. ఆమె మాటలతో డాక్టర్ మండిపడుతుంది. నువ్వు ఈ రిపోర్ట్స్ తప్పని నిరూపిస్తే డాక్టర్ వృత్తిని వదిలేస్తానని చెబుతుంది. నాకు ఎవ్వరినీ నమ్మించాల్సిన అవసరం లేదని.. వెంటనే మా మమ్మీని కెనడా తీసుకెళ్తానని జ్యోత్స్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంటికొచ్చిన వెంటనే జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావని మీ ఇద్దరికీ ముందే ఎలా తెలుసని కాంచన అడగటంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 27వ తేదీ 578వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 578 January 27th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

మీరిద్దరి వరస చూస్తుంటే జ్యోత్స్న మా అన్నయ్య కూతురు కాదేమోనని డౌట్‌గా ఉందని అంటుంది కాంచన. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. మర్యాదగా నిజం చెప్పమని కాంచన నిలదీయడంతో కార్తీక్ సీరియస్ అవుతుంది. జ్యోత్స్న దశరథ మావయ్య కూతురు కాదు అంటూ సీరియస్‌ అవుతాడు కార్తీక్. ఆ మాటలతో దీప ఉలిక్కిపడుతుంది. అనుమానానికి ఒక హద్దు ఉండాలి అంటాడు. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావని మీ ఇద్దరికీ ముందు ఎలా తెలుసు అని ప్రశ్నిస్తుంది కాంచన. జ్యోత్స్న శాంపిల్స్ ఇవ్వడానికి బాగా ఇబ్బంది పడింది అంటాడు కార్తీక్. జ్యోత్స్న ఏమో టెస్టింగ్ రాంగ్ అంటోంది.. పారు అయితే ఏకంగా శాంపిల్స్ మారిపోయాయని అంటోంది.. ఏది నిజం ఏది అబద్ధమో మాకు కూడా తెలియదు... ఈ కన్‌ఫ్యూజన్స్‌కి ఒక దారి దొరికే రోజు దగ్గరిలోనే ఉందని చెబుతాడు. నిజం తెలిసే రోజు వస్తే జ్యోత్స్న మా అమ్మని బతకనివ్వదని దీప భయపడుతుంది.

మా అమ్మని గతంలో చంపించాలని అనుకున్నది నువ్వేనని నాకు తెలుసు... దీప కాపాడకపోయుంటే ఈ పాటికి మా మమ్మీకి సంవత్సరీకం కూడా జరిగేదని పారుతో జ్యోత్స్న అంటుంది. సమయానికి రివర్స్ డ్రామా ఆడి డాక్టర్ వెళ్లిపోయేలా చేశావని మనవరాలిని మెచ్చుకుంటుంది పారిజాతం. జ్యోత్స్న అంత ఈజీగా దొరికిపోదని అనగా.. కానీ నువ్వు కార్తీక్‌కి దొరికిపోయావని పారు అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని కార్తీక్‌కి ముందే తెలుసని పారు చెప్పగా.. బావకి నిజం తెలుసుంటే సైలెంట్‌గా ఉండే రకం కాదని, వెంటనే నిజం బయటపెట్టేసేవాడని అంటుంది జ్యోత్స్న. కానీ ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తావని ప్రశ్నిస్తుంది పారు. అసలు సుమిత్ర కన్నకూతురు ఎక్కడ ఉందోనని ఆలోచిస్తుంది.

దీపకి జ్యూస్ చేసి ఇస్తాడు కార్తీక్. కానీ వద్దు అంటుంది దీప. నువ్వు అన్ని మరిచిపోతున్నావు... ప్రతిదానిని నేనే గుర్తుచేయాలని అంటాడు కార్తీక్. కడుపుతో ఉన్నప్పుడు మనం ఇష్టంగా తాగినప్పుడే బిడ్డకు కూడా అవే అలవాట్లు వస్తాయని చెబుతాడు కార్తీక్. దురదృష్టం కొద్దీ నా తల్లిదండ్రుల నుంచి కూతురిగా నేను ఏ ప్రేమను పొందలేదు. నా అదృష్టం కొద్ది నేను వాళ్లకు ప్రేమించే అవకాశం దొరికింది. కానీ నేను ఇలా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే నా తల్లిని నా కళ్ల ముందే దూరం చేయాలని అనుకుంటున్నాడని బాధపడుతుంది దీప. అత్తకు ఏం కాదని కార్తీక్ ధైర్యం చెబుతాడు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ఫైనల్‌గా వెళ్లాల్సింది నువ్వేనని అంటాడు కార్తీక్.

మనం ఈ బరువును ఇక మోయొద్దు.. శాంపిల్స్ మ్యాచ్ కాలేదని అందరికీ తెలిసిపోయింది. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జ్యోత్స్న, పారిజాతంలు నిజాన్ని మాటలతో అబద్ధంగా మార్చేశారు. వాళ్లు అక్కడితో ఆగరు.. అసలు నిజాన్ని లేకుండానే చేస్తారు. అంటే మా అమ్మని బతకనివ్వరు అని బాధపడుతుంది. తప్పించుకోవడానికి వాళ్లకి వేరే దారిలేదు.. అసలు శాంపిల్స్ ఇచ్చే అవకాశం లేకుండా చేయాలంటే మనిషిని చంపేయాలని అనుకుంటారని అంటుంది దీప. మా అమ్మని మనమే కాపాడాలని అడగ్గా... దీని గురించి నేను ఆలోచిస్తానని చెబుతాడు కార్తీక్. బావ ఏం చేయాలని అనుకుంటున్నాడు? అసలు జ్యోత్స్న ఏం చేయబోతోంది? అని ఆలోచిస్తుంది దీప.

దాస్ దగ్గరికి వెళ్లి భోజనం పెడుతుంది జ్యోత్స్న. ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదని రిపోర్ట్ వచ్చిందని చెబుతుంది. మళ్లీ మళ్లీ ఇచ్చినా అదే రిపోర్ట్ వస్తుందని.. దీని నుంచి నువ్వు బయటపడాలంటే నేను వారసురాలిని కాదని నిజం చెప్పామని అంటాడు దాస్. దీనికి ముగింపు నువ్వు ఇవ్వకపోయినా నా అల్లుడు ముగింపు ఇస్తాడు. ఇక్కడితో ఆపిస్తే నీకే మంచిదని వార్నింగ్ ఇస్తాడు దాస్. బావని అల్లుడు అని ఎందుకు అంటున్నావని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. దీప నా కూతురి లాంటిది.. కూతురి భర్త అల్లుడే కదా అని అంటాడు దాస్. నువ్వు మరోసారి అయినా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాల్సిందే. అది కూడా మిస్ అయితే డీఎన్ఏ టెస్ట్‌కి వెళ్తారు... కార్తీక్‌కి అనుమానం వచ్చిందని నువ్వు చెప్పావు కదా? అల్లుడు ఆగేరకం కాదు... అంతు చూసే రకం, నిజాలు అన్ని తెలిసిపోయి... శివన్నారాయణ గారి ఆస్తికి దీపే అసలు వారసురాలని ప్రకటించే రోజు చాలా తొందరలోనే ఉందని అంటాటు దాస్. ఆ మాటలతో జ్యోత్స్న వణికిపోతుంది. అది నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు జరగదని చెబుతుంది జ్యోత్స్న.

బయట కాపలా కాస్తున్న రౌడీల దగ్గరికి వెళ్లి.. ఎందుకు? ఏమిటీ? అనేది అడగ్గకుండా నేను ఒకటి చెప్తాను. అది చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాను. నా పేరు అస్సలు బయటకు రాకుండా చేయాలని అంటుంది జ్యోత్స్న. 1000 రూపాయలకే మర్దర్ చేసేవాళ్లం.. 10 లక్షల రూపాయలు ఇస్తున్నారంటే జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు ఉంటామని అంటారు రౌడీలు. వాళ్లకి ప్లాన్ చెప్పి కార్తీక్ ఇంటికి పంపిస్తుంది జ్యోత్స్న. అర్ధరాత్రి రౌడీలు ముసుగు వేసుకుని కార్తీక్ ఇంట్లోకి ప్రవేశిస్తారు. జ్యోత్స్న ఇచ్చిన ఫోటోతో మ్యాచ్ చేసుకున్న ఆ రౌడీ దీపను చంపబోతుండగా ఆమె పక్కకి తిరగడంతో తప్పించుకుంటుంది. అయితే వెంటనే రౌడీని చూసిన దీప గట్టిగా అరవడంతో కార్తీక్ ఉలిక్కిపడి లేచి రౌడీతో గొడవపడి అతనిని వెంబడిస్తాడు. అయితే ఆ రౌడీ తప్పించుకుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X