Karthika Deepam 2 January 28th: జ్యోత్స్నపై దశరథకు అనుమానం.. దీపే వారసురాలని కనుగొన్న డాక్టర్

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావని మీ ఇద్దరికీ ముందే ఎలా తెలిసిందని కాంచన అడగటంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. తల్లికి అనుమానం రావడంతో.. ఎక్కువ రోజులు ఈ నిజాన్ని దాయలేమని కార్తీక్‌ భయపడతాడు. కాంచనకి ఏదో చెప్పి కవర్ చేస్తాడు. శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడంతో జ్యోత్స్న జాగ్రత్తపడుతుందని.. ప్రస్తుతానికి తప్పించుకున్నా ప్రతిసారి ఇలాంటి పరిస్దితి రాకుండా ఉండటానికి మా అమ్మని చంపడానికైనా వెనుకాడదని కార్తీక్‌తో అంటుంది దీప. నీ బుర్ర పాదరసంలా పనిచేసి చివరి నిమిషంలో తప్పించుకున్నామని.. కానీ కార్తీక్ గాడికి అనుమానం వచ్చిందని పారిజాతం చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

దాస్ దగ్గరికి వచ్చి భోజనం పెడుతుంది జ్యోత్స్న. నీకు రోజులు దగ్గరపడ్డాయని.. కార్తీక్ నీ ఆట కట్టిస్తాడని దాస్ చెప్పడంతో జ్యోత్స్న వణికిపోతుంది. నీ అంతట నువ్వే వెళ్లి దీపే అసలైన వారసురాలని ఒప్పుకుంటే మంచిదని దాస్ అనడంతో జ్యోత్స్న సీరియస్ అవుతుంది. వెంటనే రౌడీలకు 10 లక్షల రూపాయలు ఆశపెట్టి దీపని చంపమని పంపిస్తుంది. రౌడీ కార్తీక్ ఇంటికి వెళ్లి దీపను కత్తితో పొడవబోతుండగా ఆమె గట్టిగా అరుస్తుంది. దాంతో కార్తీక్ ఉలిక్కిపడి లేచి రౌడీ నుంచి దీపని కాపాడి వెంబడిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 28వ తేదీ 579వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 579 January 28th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దీపను చంపాలనుకుంది ఎవరు అంటూ కాంచన కంగారు పడుతుంది. ఇంతలో శౌర్య రావడంతో పిల్ల ముందు ఏం మాట్లాడొద్దని చెప్పి వెళ్లిపోతాడు. మనింట్లోకి ఇంత దైర్యంగా వచ్చి నిన్నే చంపాలని అనుకుందంటే నువ్వంటే వాళ్లకి తీరని పగ అయినా ఉండాలి లేదంటే నువ్వు అడ్డుగానైనా ఉండాలని అంటుంది కాంచన. ఈ అవసరం ఒక్కరికే ఉంది జ్యోత్స్న అని అనుకుంటుంది దీప. దీప జస్ట్ మిస్ అయ్యిందని రౌడీలు ఫోన్ చేసి చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మిమ్మల్ని ఎవరైనా చూశారా? డెన్‌కు వెళ్లిపోండి తర్వాత మాట్లాడుకుందామని అంటుంది. రౌడీలతో ఫోన్ మాట్లాడి వెళ్లిపోతుండగా దశరథ కనిపించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.

ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు మిస్ అయ్యారు అంటున్నావని దశరథ అడగటంతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. కెనడాలో మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి మమ్మీ ప్రాబ్లమ్ గురించి డాక్టర్‌ను అడగమన్నానని.. రెండు సార్లు డాక్టర్ అపాయింట్‌మెంట్ మిస్ అయ్యిందని చెబుతున్నావని కవర్ చేస్తుంది. నువ్వు మీ అమ్మ గురించి ఇంత ఆలోచిస్తున్నావా? అని సెటైర్లు వేస్తాడు. తల్లి గురించి బిడ్డకు కూడా బాధ్యత ఉంటుందని చెబుతుంది. రిపోర్ట్స్ తేడాగా రావడంతో కంగారుపడ్డానని.. కానీ ఎక్కడో తప్పు జరిగిందని అంటుంది జ్యోత్స్న. నేను ఈసారి ఛాన్స్ ఇస్తాను, నువ్వు వెళ్లి నిద్రపో అంటాడు దశరథ. ఛాన్స్ ఇచ్చేది డాక్టర్ హారికకు కాదు... నాకు అంటూ కంగారుపడుతుంది జ్యోత్స్న. దీప చచ్చుంటే ఇక్కడ ప్రాబ్లమ్ సెట్ అయ్యేది... ఆ దాస్ గాడి నోరు మూతపడేదని అనుకుంటుంది జ్యోత్స్న.

రాత్రి మనింటికి ఎవరో వచ్చారని అమ్మానాన్న మాట్లాడుకుంటుంటే విన్నానని చెబుతుంది శౌర్య. ఇంతలో శ్రీధర్ కాంచనకు ఫోన్ చేసి టిఫిన్ చేశావా? అని అడుగుతాడు. మన అదృష్టం బాగుంది.. దీపని ఎవరో చంపబోయారని కాంచన చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. అక్కడ ఉండొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. ఆ ఇల్లు ఖాళీ చేసి రమ్మని అడుగుతాడు. దీపని చంపాలని అనుకోవడం ఏంటీ? పొరపాటున జరిగిందా? ప్లాన్ ప్రకారం జరిగిందా? అని శ్రీధర్ ఆలోచిస్తాడు. కడుపుతో ఉన్న ఆడదానిని చంపాలని అనుకున్నారంటే వాళ్లు ఎవరో? ఎలాంటి వారోనని అనుకుంటుంది కాంచన. దీపని వెళ్లొద్దని కాంచన ఎన్నిసార్లు చెప్పినా కార్తీక్, దీపలు వినిపించుకోరు.

దీప మీద హత్యాయత్నం జరిగిందని శివన్నారాయణకు చెబుతాడు శ్రీధర్. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని చెబుతాడు శివన్నారాయణ. ఇంతలో దశరథకు జ్యోత్స్న మీద అనుమానం వస్తుంది. ఇది మళ్లీ తప్పించుకుందని జ్యోత్స్న అన్నదని గుర్తుచేసుకుంటాడు. నీకు ఎవరిమీదైనా అనుమానంగా ఉందా? అని శివన్నారాయణ అడగటంతో కార్తీక్, దీపలు జ్యోత్స్న వైపు ఎందుకు చూస్తున్నారని దశరథకు అనుమానం వస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అని శివన్నారాయణ అడగ్గా... జ్యోత్స్న అని పేరు చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నీ హెల్ప్ కావాలని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. నేను ఎవ్వరినీ వదిలిపెట్టను వాళ్ల వంతు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నానని అంటాడు కార్తీక్.

మన రహస్యాలు ఎవరికైనా తెలిస్తే ఏం చేస్తావని శివన్నారాయణను అడగ్గా.. చంపేస్తానని అంటాడు పెద్దాయన. అంటే జ్యోత్స్న గురించి దీపకు ఏదో రహస్యం తెలుసు.. దీపకి, జ్యోత్స్నకి, దాస్‌కి ఏదో లింక్ ఉంది.. అందుకే దీపను జ్యోత్స్న చంపాలని అనుకుందని దశరథ అనుకుంటాడు. నాకు, దీపకి కొందరి వ్యాపార రహస్యాలు తెలుసు.. అందుకే దీపని చంపాలని అనుకుందని చెబుతాడు. ఇదంతా ఇక్కడే వదిలేద్దామని ఎవరికి ఎప్పుడు సమాధానం చెప్పాలో చూద్దామని అంటాడు కార్తీక్. ఆ వైరా గాడి అంతు తేలుద్దామని శివన్నారాయణ, శ్రీధర్ రగిలిపోతారు. నాకు ఆధారాలు దొరికిఉంటే ఈరోజు కథ మరోలా ఉండేదని అంటాడు కార్తీక్.

సుమిత్ర ఆరోగ్యం గురించి టెన్షన్ ఉంది.. జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ కావడం లేదని తెలిసినప్పటి నుంచి మనిషి దక్కదేమోనని భయంగా ఉందని అంటాడు దశరథ. త్వరగా ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయాలని కానీ ఎలా అని అడుగుతాడు దశరథ. అమ్మగారికి ఏం కాదని.. దేవుడు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడని చెబుతుంది దీప. దీపని రెగ్యులర్ టెస్టుల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెబుతాడు కార్తీక్. దాంతో నా కారు తీసుకుని అమ్మాయితో కలిసి హాస్పిటల్‌కు వెళ్లమని అంటాడు శివన్నారాయణ. ఇంతలో కార్తీక్‌ను తీసుకుని దీప.. హాస్పిటల్ ‌కు వెళ్తుంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఇక నేను ఎదురుచూడను, మా అమ్మని నేనే కాపాడుకుంటానని అంటుంది దీప.

ఇద్దరూ కలిసి డాక్టర్ హారికను కలుస్తారు. జ్యోత్స్న నా మీద, మా హాస్పిటల్ మీద చాలా పెద్ద ఆరోపణ చేసిందని డాక్టర్ హారిక మండిపడుతుంది. మా సుమిత్ర అత్తగారికి మీరే ట్రీట్‌మెంట్ చేస్తున్నారు? మీరే మా అత్తకి బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని అడుగుతాడు కార్తీక్. అలా జరగాలంటే జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావాలని చెబుతాడు. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఆపరేషన్స్ చేశాను.. ఒక కన్నతల్లికి, కన్నకూతురి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడం అనేది కొత్తగా చూస్తున్నాను. అసలు జ్యోత్స్న సుమిత్ర గారి కూతురు కాదని చెప్పడంతో దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. సుమిత్ర గారిని కాపాడాలంటే బ్లడ్ రిలేషన్ ఉన్నవాళ్లు కావాలని చెబుతుంది డాక్టర్. అలాంటి వారు ఎవరు లేరని మీరే అన్నారు కదా? మళ్లీ ఇప్పుడు ఎవరు ఉన్నారని డాక్టర్ హారిక అడగటంతో ఆ వ్యక్తి దీప అని చెబుతాడు కార్తీక్. దాంతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది.

దీపని ఎందుకు చంపాలని అనుకున్నావని జ్యోత్స్నపై మండిపడుతుంది పారిజాతం. దీప ఏం చేసింది? దానిని ఎందుకు చంపించాలని అనుకున్నావు? అని అడుగుతుంది. అసలు వారసురాలు దొరికిపోయిందని అంటుంది పారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X