Karthika Deepam 2 January 29th: డాక్టర్ చేతికి దీప బ్లడ్ శాంపిల్స్...బిచ్చగాడిలా కాశీ, కార్తీక్ ట్రాప్‌లో పారు
Photo Courtesy: JioHotstar
దీప మీద రౌడీలు హత్యాయత్నం చేయడంతో ఏం జరిగిందని కాంచన అడుగుతుంది. గతంలోనూ ఇలాగే దీపని చంపాలని అనుకున్నారు? వాళ్లే మళ్లీ వచ్చారా? అని అడుగుతుంది. ఉదయాన్నే దీపపై హత్యాయత్నం జరిగినట్లు శ్రీధర్‌కు చెబుతుంది కాంచన. దాంతో శ్రీధర్ నేరుగా వెళ్లి శివన్నారాయణకు ఈ విషయం చెబుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్, దీపలు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని చెబుతారు. దీపపై హత్యాయత్నం ఎవరు చేశారో? ఎందుకు చేశారో? త్వరలోనే తెలిసిపోతుందని .. అన్ని రహస్యాలు బయటపడతాయని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న, పారులు వణికిపోతారు.
రాత్రి జ్యోత్స్న మాటలు, కంగారును గుర్తు చేసుకున్న దశరథకు అనుమానం మొదలవుతుంది. దీప, దాస్, జ్యోత్స్నకు ఏదో కనెక్షన్ ఉందని డౌట్ వస్తుంది. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదు.. సుమిత్రను ఎలా కాపాడుకోవాలని బాధపడతాడు దశరథ. అమ్మగారికి ఏం కాదని కన్నకూతురే కాపాడుతుందని అంటుంది దీప. వెంటనే కార్తీక్‌ను తీసుకుని డాక్టర్ హారికను కలుస్తుంది దీప. సుమిత్ర గారిని కాపాడటానికి జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావడం లేదని అంటుంది హారిక. అయితే సుమిత్ర గారి బ్లడ్ రిలేషన్ ఒకరు ఉన్నారని చెబుతాడు కార్తీక్. అది ఎవరు? అని డాక్టర్ అడగ్గా దీప అని అంటాడు. ఆ మాటలతో డాక్టర్ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 29వ తేదీ 580వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నీ రిపోర్ట్స్ మ్యాచ్ కాని రోజే సగం దొరికిపోయామని పారిజాతం చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. శ్రీధర్, దీప, దశరథ, కార్తీక్ ఇలా ఎవరి ముఖం చూసినా భయంగా ఉందని అంటుంది పారు. ఆస్తి మనకు దక్కేలా కొన్ని చేస్తానని అంటుంది జ్యోత్స్న. దాస్ గాడు ఉండుంటే ఏదో ఒకటి చేసేదానిని, కానీ వాడు ఏమైపోయాడో తెలియడం లేదని చెబుతుంది దాస్. ఇంతలో దాస్‌కి కాపలాగా ఉన్న రౌడీలు ఫోన్ చేస్తారు. నువ్వు ఏం చేసినా నాతో చెప్పు.. ఈలోపు నా కొడుకు ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటానని అంటుంది పారు.
దీపని చంపాలనే ప్లాన్ ఫెయిల్ అయింది కదా అని దాస్ అంటాడు. ముగింపు నా చేతిలో లేదు.. ఈ కథలో నా అల్లుడు కార్తీక్ బ్రహ్మదేవుడు. వాడే నీ కథకు ముగింపు పలుకుతాడు. దీప మహర్జాతకురాలు, మృత్యుంజయురాలు. ఇప్పటికి మూడు సార్లు చావును జయించిందని అంటాడు దాస్. ఆ మాటలతో జ్యోత్స్న రగిలిపోతుంది. మీ నానమ్మతో మొదలైన దీప గండాలు నీతో ముగిశాయి. ఇక నీ వంతు.. తప్పించుకోలేవు, పారిపోలేవు. నిజం ఒప్పుకుని కాళ్ల మీద పడటం తప్పించి నీకు వేరే దారి లేదని చెబుతాడు దాస్. దీపకి కార్తీక్, ఆ దైవం అండగా ఉంది.. నీలాంటి దుష్టశక్తులు ఎన్ని అడ్డొచ్చినా దీపకు ఏం కాదని అంటాడు. నా నుంచి దీపని ఏ దేవుడు కాపాడతాడో నేను చూస్తానని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
కన్నకూతురైన జ్యోత్స్న శాంపిల్సే మ్యాచ్ కానప్పుడు బయటి వ్యక్తి అయిన దీప శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అవుతాయని డాక్టర్ హారిక ప్రశ్నిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు వద్దు.. మా సుమిత్ర గారి ఆరోగ్యం గంట గంటకు కరిగిపోతుంది. మీరే ఆపరేషన్ చేయాలని దీప ఏడుస్తుంది. సుమిత్ర గారు డేంజర్ జోన్‌లో ఉన్నారు.. బ్లడ్ క్యాన్సర్ అనేది మనిషిని చావు అంచులదాకా తీసుకెళ్తుందని అంటుంది హారిక. దీపకి ఆ ఇంటికి ఏ సంబంధం లేదని సుమిత్ర గారే అన్నారు.. మీరెలా బ్లడ్ రిలేషన్ అంటారని డాక్టర్ హారిక ప్రశ్నిస్తుంది.
దీప వాళ్ల అమ్మగారు, సుమిత్రగారు అక్కాచెల్లెళ్లా అని అడుగుతుంది డాక్టర్. మీకు అన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తాను. ముందు దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకుని మ్యాచ్ చేసి చూస్తే అన్ని నిజాలు అప్పుడే బయటపడతాయని కార్తీక్ అంటాడు. మీరు ఏ టెస్ట్ చేసినా నేను సిద్ధంగానే ఉన్నానని అంటుంది దీప. జ్యోత్స్న సొంతకూతురైనా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి భయపడింది. నీకు ఆ ఇంటికి సంబంధం లేదు.. నువ్వు సుమిత్రగారిని కాపాడటానికి ప్రాణాలు ఇస్తాను అంటున్నావని డాక్టర్ హారిక అంటుంది. దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటానని డాక్టర్ చెబుతుంది. రిపోర్ట్స్ చూశాక మీరే దీపే సుమిత్ర కూతురని అంటారని కార్తీక్ అనుకుంటాడు.
గుడి దగ్గర కాశీని చూసి కాంచన షాక్ అవుతుంది. నాకు ఎవరున్నారు? నేనేం మిగిల్చుకున్నాను? చలి మంట వేసుకోవడానికి అగ్గిపుల్ల గీశాను.. తగలబడుతుంది ఇల్లని తెలిసేసరికి బూడిద మిగిలిందని అంటాడు కాశీ. మావని మోసం చేశాను, బావని మోసం చేశాను, తండ్రిని ఛీ కొట్టాను, ఆఖరికి భార్యను కూడా మోసం చేశాను.. అందరూ నన్ను వదిలేశారని కాశీ ఏడుస్తాడు. తల్లి ప్రేమ తెలియకుండా పెరిగాను.. నీలో కన్నతల్లి కనిపించింది అంటాడు. అలా మాట్లాడొద్దు.. గుండె తరుక్కుపోతోందని అంటుంది. నేను ఎంతకు దిగానో అంతకు దిగి మాట్లాడాను.. కానీ స్వప్న నా మాట వినడం లేదని బాధపడతాడు కాశీ. నేను కనపడితే తను నా ముఖం కూడా చూడదు, నా నెంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందని చెబుతాడు. స్వప్న మనసుకు అయిన అయిన గాయాన్ని నీ మాటలు నయం చేయలేవని అంటుంది కాంచన. నేనేం చేయాలో చెప్పు.. నాకు నా భార్య కావాలి.. మేం మళ్లీ కలిసుండాలి, నువ్వు ఏం చెప్పినా చేస్తాను.. నా భార్యను నేను బాధపెట్టను, నా తప్పుని నేను సరిదిద్దుకోవాలని చెబుతాడు కాశీ. ముందు ఇంటికి వెళ్దామని కాశీని తీసుకెళ్తుంది కాంచన.
హాస్పిటల్ నుంచి వస్తున్న కార్తీక్‌ని దీప గురించి అడుగుతుంది పారిజాతం. దాంతో కార్తీక్ మండిపడతాడు. నువ్వు అసలైన సిసలైన తల్లివి అయితే ఆరాలు తీసేదానివి. నీ కొడుకు కనిపించడం లేదు, మెడలోని తాయెత్తు మన గార్డెన్‌లో దొరికింది, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఒకసారి నాకు కాల్ చేశాడు.. నేను తిరిగి కాల్ చేస్తే నో ఆన్సర్. నీకేమో ఇంటి వాకిట్లో కనిపించాడు.. ఎవరూ నమ్మడం లేదు. నిన్ను మతిలేని దానిని చేశారు.. నువ్వు కూడా నాది భ్రమ అన్న ఆలోచనలో పడిపోయావు అని అంటాడు కార్తీక్. ఆ రోజు దాస్ మావయ్య ఇంటికి రావడం.. నీతో పాటు చూసిన మనిషి ఇంకొకరు ఉన్నారని కార్తీక్ అంటాడు. అది నేనే అని చెబుతాడు కార్తీక్.
దాస్ మావయ్య కనిపించకుండా పోవడానికి, జ్యోత్స్నకి ఏదో సంబంధం ఉందని కార్తీక్ అనడంతో పారు షాక్ అవుతుంది. జ్యోత్స్న నీ మనవరాలు.. కనపడకుండా పోయింది నీ కొడుకే అంటాడు కార్తీక్. నీ మనవరాలి దగ్గరికి వెళ్లి నేను చెప్పినట్లు చేయమని కార్తీక్ ఓ ప్లాన్ చెబుతాడు. కార్తీక్ చెప్పినట్లే మనవరాలి దగ్గరికి వెళ్లి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాలని చెబుతుంది పారు. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











