Karthika Deepam 2 January 31st: దశరథకు దొరికిపోయిన జ్యోత్స్న..మరోసారి టెస్ట్, కార్తీక్‌కి చిక్కిన జ్యోత్స్న
Photo Courtesy: JioHotstar
కార్తీక్ చెప్పినట్లుగానే జ్యోత్స్న దగ్గరికి వెళ్లి.. నా కొడుకు దాస్ కనిపించడం లేదని పోలీస్ కంప్లయంట్ ఇద్దామని, తోడు రమ్మని పారు అడగటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మనవరాలి ముఖంలో రంగులు మారడం చూసిన పారుకి అనుమానం వస్తుంది. నన్ను పట్టించుకోని నా తండ్రిని నేను పట్టించుకోనని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఇదే విషయాన్ని కార్తీక్‌కి చెప్పగా... దాస్ మావయ్య కిడ్నాప్‌కి, జ్యోత్స్నకి ఏదో సంబంధం ఉందని చెప్పడంతో పారు షాక్ అవుతుంది.
కాశీని స్వప్నని కలపడానికి గాను శ్రీధర్‌ను ఇంటికి పిలిపిస్తుంది కాంచన. స్వప్న క్షమిస్తే కాశీ నా ఇంటికి వస్తాడు.. అంతా బాగానే ఉంది. ఇక్కడ నేను, కాశీ ఒకటే ప్రాబ్లమ్‌లో ఉన్నాం. స్వప్న నన్ను క్షమించినట్లే నువ్వు కూడా నన్ను క్షమించాలని అడుగుతాడు శ్రీధర్. ఇంతలో కార్తీక్, దీప రావడంతో న్యాయం చెప్పమంటాడు శ్రీధర్. నా తల్లి నిర్ణయాన్ని నేను కాదనలేను.. కానీ మీ కొడుకుగా మీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నానని వెళ్లిపోతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి జనవరి 31వ తేదీ 582వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నేను ఇక్కడికి పిలిపించింది కాశీని, స్వప్నని ఒక్కటి చేస్తారని.. వాడు స్వప్న కోసం ఏడుస్తున్నాడు, తనతో కలిసి బతకాలని అనుకుంటున్నాడు. మనిద్దరం పుష్కరాలు చూశాం.. వాడు కనీసం పండగలు కూడా చూడలేదని అంటుంది కాంచన. స్వప్న నాకు పుట్టకపోయినా నా కూతురే.. స్వప్నని నేను కలుస్తాను, కానీ ఒప్పించాల్సింది మాత్రం మీరేనని శ్రీధర్‌కు చెబుతుంది. నేను బయటికి వెళ్లిపోతానని కాశీ చెప్పగా.. నువ్వు అడిగావని నేను తీసుకురాలేదు, ఓ పక్క నా కూతురి జీవితం, మరోపక్క నా మేనల్లుడి జీవితం.. మీ ఇద్దరి జీవితాల గురించి ఆలోచించి తీసుకొచ్చానని అంటుంది. ఇప్పటి వరకు నువ్వు నీ మనసు చెప్పినట్లు విన్నావు.. ఇకపై నేను చెప్పినట్లు విను. మొదటిది గాయం చేసింది.. రెండోది నయం చేస్తుందని చెబుతుంది కాంచన. కాశీ ఇక్కడే ఉన్నాడని స్వప్నకి చెప్పొద్దని అంటుంది కాంచన.
దీప లోపలికి వెళ్తుండగా.. చేతికి బ్యాండేజ్ చూసిన కాంచన నువ్వు రక్తం ఇచ్చావా అని అడుగుతుంది. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. గైనకాలజిస్ట్‌ని కలవడానికి హాస్పిటల్‌కు వెళ్తే టెస్ట్ కోసం దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారని చెబుతాడు కార్తీక్. బిడ్డ ఎదుగుదల బాగుంది.. కంగారు పడొద్దని చెప్పారని కార్తీక్ అనడంతో కాంచన సంతోషిస్తుంది. రాత్రి మనింటికి దీపను చంపడానికి ఓ మనిషి వచ్చాడని తలచుకుంటేనే భయంగా ఉంది, వాడి గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది కాంచన. వాడి సంగతి నేను చూసుకుంటానని అంటాడు కార్తీక్. వదిన పరిస్ధితి ఎలా ఉందని అడగ్గా.. ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఆపరేషన్ జరిగే వరకు వాటిని వాడితే సరిపోతుందని చెబుతాడు కార్తీక్.
వాడకపోతే చాలా ప్రమాదం.. ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే నిద్రలోనే ప్రాణం పోవచ్చు. కానీ మావయ్య అత్తని జాగ్రత్తగా చూసుకుంటాడని ధైర్యం చెబుతాడు కార్తీక్. నా మనసంతా నా తల్లి దగ్గరే ఉంది.. నా భయమంతా జ్యోత్స్న మీదే ఉందని అనుకుంటుంది కాంచన. ఉదయాన్నే సుమిత్ర బెడ్ రూమ్‌కి వచ్చిన జ్యోత్స్న.. నువ్వు టాబ్లెట్స్ వేసుకుంటే ఆపరేషన్ జరిగే వరకు బతుకుతావు. కానీ నువ్వుంటేనే నాకు ప్రాబ్లమ్. నువ్వు లేకపోతేనే నాకు రిలీఫ్. అందుకే నేను టాబ్లెట్స్ వేస్ట్ చేయాలని అనుకుంటున్నానని మనసులో అనుకుని టాబ్లెట్స్ తీసుకెళ్లి డస్ట్ బీన్‌లో వేస్తుంది. ఆటవిక ధర్మం మనకు నేర్పించింది ఇదే.. మనకు అడ్డున్న దేనినైనా మన స్వార్ధం కోసం తొలగించుకోవచ్చు.. నా జీవితానికి అడ్డుగా ఉన్నది నువ్వేనని అనుకుంటుంది. ఇంతలో జ్యోత్స్న ఆ టాబ్లెట్స్‌ని డస్ట్ బీన్‌లో వేయడాన్ని దశరథ చూస్తాడు. దాంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
మీ అమ్మకి వేయాల్సిన టాబ్లెట్స్‌ని డస్ట్ బీన్‌లో ఎందుకు వేశావని శివన్నారాయణ, పారిజాతం, దశరథ అడగటంతో జ్యోత్స్నకు ముచ్చెమటలు పడతాయి. కిందపడిపోతే టాబ్లెట్ పనిచేస్తుందా? ఎవరూ అర్ధం చేసుకోరేంటీ? అని జ్యోత్స్న కవర్ చేస్తుంది. ఇంతలో సుమిత్ర నిద్రలేచి ఏం జరిగిందని అడుగుతుంది. నువ్వు టాబ్లెట్స్ డస్ట్‌బీన్‌లో వేయడం నేను చూశానని దశరథ చెప్పడంతో సుమిత్ర షాక్ అవుతుంది. నువ్వు ఆ టాబ్లెట్స్ వేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటావు.. నువ్వు ఒక్కరోజు వేసుకోకపోయినా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తుందని చెబుతాడు దశరథ. కానీ ఒక్క టాబ్లెట్ దాచి కవర్ చేస్తుంది జ్యోత్స్న. నా భార్యను నేను చూసుకుంటాను.. నాకు కుదరకపోతే దీప కానీ, కార్తీక్ కానీ చూసుకుంటారని దశరథ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇలాంటి టైంలో కాస్త జాగ్రత్తగా చూసుకునే వాళ్లు పక్కనే ఉండాలి.. నువ్వు మీ అమ్మ గదిలోకి రావొద్దని చెప్పడంతో జ్యోత్స్న ఉలిక్కిపడుతుంది.
దానిని ఎందుకు నా రూమ్‌లోకి రావొద్దని చెబుతున్నారని అడుగుతుంది సుమిత్ర. జ్యోత్స్న నీకు ఏం జరుగుతుందోనని బాధపడుతుంది.. దానిని కూడా ఎందుకు బాధపెట్టడం అని చెబుతుంది సుమిత్ర. ఏ ప్లాన్ వేసినా ఫెయిల్ అవుతోంది.. నేను వెంటనే దాస్‌తో మాట్లాడాలని అర్ధరాత్రి చీకట్లో ఒంటరిగా బయల్దేరుతుండగా పారిజాతం ముసుగులో కనిపిస్తుంది. నిన్ను ఒక కంట కనిపెట్టడానికి కాపలా కాస్తున్నాను అని చెబుతుంది పారు. నన్ను ఒక కంట కనిపెట్టమని ఎవరు చెప్పారని జ్యోత్స్న అడగ్గా.. నేనే అంటాడు కార్తీక్. ఆ వెంటనే పారు లాగిపెట్టి జ్యోత్స్నను కొడుతుంది. ఇక నుంచి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ... నువ్వు ఎక్కడికి వెళ్లేది చెప్పకపోతే కొడుతూనే ఉంటానని చెబుతుంది పారిజాతం.
మా గ్రానీని కూడా మార్చేశావా అని జ్యోత్స్న అడగ్గా.. మార్పు అనేది మానవ సహజం. మనిషి చేసే పెద్ద తప్పు ఏంటీ అంటే మన బలహీనతని ఎదుటివాళ్ల చేతుల్లో పెట్టడం, అవతలివాడు మనకంటే పెద్ద తోపు అయితే మనం పెట్టకుండానే, మన జుట్టు వాడి చేతిలో పెట్టుకుంటాడు. ఒక్కసారి దొరికిందో ఆట మొదలైనట్లే... ఈ గేమ్‌కి రూల్స్ ఉండవు, ఎథిక్స్ ఉండవు.. నిజాయితీ ఉన్నవాడే నిలబడతాడు. తప్పు చేసినవాడు శిక్షించబడతాడు అని చెబుతాడు కార్తీక్. ఇవన్నీ వైట్ పేపర్ మీద అంటించి శౌర్యకి ఇవ్వు అని చెబుతుంది జ్యోత్స్న. అయినా ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావని కార్తీక్‌ను అడగ్గా.. నేనే రమ్మన్నానని దశరథ, శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని దశరథ, శివన్నారాయణ అడగటంతో నాకు నిద్రపట్టడం లేదని నైట్ రైడ్‌కి వెళ్తున్నానని చెబుతుంది జ్యోత్స్న. ఈ టైంలో బయటికి వెళ్తుంటే ఎవ్వరూ నమ్మరు.. లోపలికి పదా అని పారు గట్టిగా చెప్పడంతో ఇన్నాళ్టీకి నీకు తగ్గ పని చేస్తున్నావని ప్రశంసిస్తాడు శివన్నారాయణ. నువ్వొచ్చి చాలా మంచిపని చేశావు.. లేదంటే జ్యోత్స్న ఎక్కడికో వెళ్లిపోయేదని అంటాడు దశరథ. బావతో కలిసిపోయి నన్ను ఫూల్‌ని చేస్తావా అని పారుపై సీరియస్ అవుతుంది జ్యోత్స్న. వాడు చెప్పినట్లు చేస్తే దాస్ ఎక్కడున్నాడో చెబుతానని అన్నాడు.. దాస్ ఏమయ్యాడో నీకు తెలుసా అని అడుగుతుంది పారిజాతం. అందుకని నన్ను కొడతావా అని ఫైర్ అవుతుంది జ్యోత్స్న.
నీ మీద నాకు అనుమానంగా ఉందని మండిపడుతుంది. జ్యోత్స్న ప్రవర్తన మీద నాకు అనుమానంగా ఉంది.. టాబ్లెట్స్ డస్ట్‌బిన్‌లో వేసింది, ఇంట్లో నుంచి సైలెంట్‌గా వెళ్లిపోతోంది. అసలు జ్యోత్స్న ఎందుకు భయపడుతోంది.. దాస్ ఏమయ్యాడు? దాస్‌ని జ్యోత్స్న ఎందుకు చంపాలని ప్రయత్నించింది? దీప మీద అటాక్ చేసింది ఎవరు? జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ కాలేదు? రోజురోజుకు ప్రశ్నలు అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయని అంటాడు దశరథ. అన్ని ప్రశ్నలకు సమాధానాలు తొందరలోనే తెలిసిపోతాయని కార్తీక్ చెబుతాడు. మరోసారి జ్యోత్స్నకు బ్లడ్ టెస్ట్ చేయించబోతున్నానని అంటాడు దశరథ. లేట్ చేయకుండా తాత హెల్ప్ తీసుకుని ఈ పని వెంటనే చేయమని చెబుతాడు కార్తీక్. అత్తకు ఏం కాదు.. నా బిడ్డను ఊయలలో వేయాల్సింది మీరేనని చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











