Karthika Deepam 2 February 2nd: దీపే దశరథ కూతురని తేల్చిన డాక్టర్.. సుమిత్ర ప్రాణాలు దీప బిడ్డ చేతిలో..

Photo Courtesy: JioHotstar

కాశీని స్వప్న క్షమించి ఇంట్లోకి రానిచ్చేలా ఆమె మనసు ఒప్పించమని శ్రీధర్‌కు చెబుతుంది కాంచన. దీప మోచేతికి బ్యాండేజ్ ఉండటంతో నువ్వు బ్లడ్ ఇచ్చావా? అని అడుగుతుంది కాంచన. దీప బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్లు అమ్మకి అనుమానం వచ్చేసిందని కార్తీక్ షాక్ అవుతాడు. దీపని టెస్ట్‌ల కోసం గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లానని బిడ్డ ఆరోగ్యం బాగుందని కవర్ చేస్తాడు కార్తీక్. నేను బతికి ఉండాలన్నా, ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలన్నా నువ్వు బతికి ఉండకూడదని సుమిత్రకు వేయాల్సిన టాబ్లెట్స్‌ను డస్ట్ బిన్‌లో పడేస్తుంది జ్యోత్స్న. అది చూసిన దశరథ, శివన్నారాయణ, పారులు ఆమెను నిలదీస్తారు.

ఇకపై నువ్వు మీ అమ్మ దగ్గరికి రావొద్దని, నా భార్యను నేను చూసుకుంటానని.. లేదంటే కార్తీక్, దీపలు అప్పగిస్తానని చెబుతాడు దశరథ. ఏ ప్లాన్ వేసినా వర్కవుట్ కావడం లేదు. అర్జెంట్‌గా దాస్‌ని కలిసి నా ప్లాన్‌ని అమలు చేయాలని అనుకుని అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బయటకు వెళ్లబోతుండగా జ్యోత్స్నని పట్టుకుంటారు కార్తీక్, పారు. ఆ వెంటనే దశరథ, శివన్నారాయణలు బయటికి వచ్చి ఎందుకు బయటకు వెళ్తున్నావని అడుగుతారు. నిద్రపట్టడం లేదని నైట్ డ్రైవ్‌కి వెళ్తున్నానని చెబుతుంది జ్యోత్స్న. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి.. జ్యోత్స్నకి మరోసారి టెస్ట్‌లు చేయించాలని కార్తీక్‌తో చెబుతాడు దశరథ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 2వ తేదీ 583వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 583 February 1st 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న మరోసారి తప్పించుకోవాలని చూసిందని దీపకి చెబుతాడు కార్తీక్. మావయ్యకి జ్యోత్స్న మీద అనుమానం మొదలైంది. జ్యోత్స్నని మళ్లి టెస్టులకు తీసుకెళ్తానని మావయ్య చెప్పాడు. శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడానికి సరైన కారణం ఇప్పటి వరకు ఎవ్వరికీ అర్ధం కాలేదు. మనకి జ్యోత్స్న, పారులకి, డాక్టర్‌కి తప్పించి నిజం ఎవ్వరికీ తెలియదని అంటాడు కార్తీక్. ఈసారి మనం చెప్పకుండానే నిజం బయటపడిపోతుందని అంటుంది దీప. మీ అమ్మ ఈ విషయం తెలిశాక తట్టుకోలేదు. కానీ మా అమ్మకి తెలియకుండా మనమే ఆపాలని చెబుతుంది దీప. జ్యోత్స్న అసలైన కూతురు కాదని టెస్ట్‌లకి వెళ్లారంటే రహస్యం బయటపడిపోతుందని అంటాడు కార్తీక్.

నువ్వు ఆల్రెడీ హాస్పిటల్‌లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావు.. నిజం బయటపడ్డాక జ్యోత్స్నని ఎవరు కాపాడతారన్న ప్రశ్న ఎదురవుతుంది. నిజం చెప్పడానికి దాస్ మావయ్య రాడు.. ఎందుకంటే జ్యోత్స్న మావయ్యని ఎక్కడో దాచేసిందని నా అనుమానం. కానీ చంపలేదు.. ఎందుకంటే దానికి తన వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అత్తను కాపాడాలంటే నిజమైన కూతురు రావాలి.. అప్పుడు నువ్వు ఇచ్చిన బ్లడ్ శాంపిల్స్‌తో నిజం తెలిసిపోతుందని అంటాడు కార్తీక్. అత్తకు ఏదో అవుతుందన్న భయం వదిలేయ్... ఏం జరిగితే అదే జరుగుతుంది. మనం ఆడుతున్న దాగుడుమూతలకు ఇదే లాస్ట్ రౌండ్... సుమిత్ర, దశరథలను అమ్మానాన్న అని పిలవడానికి రెడీగా ఉండమని చెబుతాడు కార్తీక్. నీ టెస్ట్ రిపోర్ట్స్ బయటకు వచ్చినా, జ్యోత్స్న టెస్ట్ రిపోర్ట్స్ బయటికి వచ్చినా నువ్వే శివన్నారాయణ గారి అసలైన మనవరాలివని వాళ్ల నోటితోనే చెప్పిస్తానని అంటాడు కార్తీక్. ఇవన్నీ ఆపడానికి జ్యోత్స్న మైండ్‌లో ఏదో ఒక గేమ్ స్టార్ట్ అయ్యే ఉంటుందని చెబుతాడు.

దాస్‌కి జ్యోత్స్న కాల్ చేసి ఓడిపోతున్నానని అంటుంది. నీలో మార్పు వస్తుందంటే అది నీ మంచితనం కాదు.. అల్లుడి మాయ. కార్తీక్ ఏదో చేసుంటాడు. నువ్వు, నేను, గ్రానీ, కాశీ మన నలుగురం ఒక ఫ్యామిలీ. మన జీవితాలు బాగుండాలని నేను ఒక ప్లాన్ రెడీ చేశాను.. దానికి నీ హెల్ప్ కావాలని అడుగుతుంది. మా అమ్మ మా అన్నయ్య కూతురి జీవితాన్ని రోడ్డు పాలు చేసింది.. నువ్వేమో నా కొడుకు జీవితాన్ని గంగపాలు చేశావు. ఆస్తి మొత్తం మనదే అయినప్పుడు నీ కూతురు ఎంత గొప్పగా బతుకుతుందో ఆలోచించు అంటుంది జ్యోత్స్న. నేను జీవితంలో మారను, నువ్వే మారాలని అంటాడు దాస్. ఏదో ఒకటి చేసి తప్పించుకుంటానని అనుకుంటుంది జ్యోత్స్న.

ఉదయాన్నే గుడికి వెళ్లి దీప నుదిటిన బొట్టు పెట్టడంతో దీప ఎమోషనల్ అవుతుంది. నువ్వు మోస్తున్న బరువు చూస్తుంటే ఆనందంగా ఉందని చెబుతుంది. రోడ్డు పక్కన కూర్చోబెట్టి నీతో కొబ్బరి చిప్ప తినిపిస్తున్నాను.. నువ్వేమో కోట, అంతస్తు అంటున్నావని అంటాడు కార్తీక్. నీ ప్రేమకు మించిన ఐశ్వర్యం, నీ గుండెకు మించిన కోట.. నాకు ఈ జన్మలో దొరకావు. నేను నీ పక్కనే ఉంటే ఎక్కడున్నా నేను రాణినే అంటుంది దీప. తనవాళ్ల కోసం తనే సేవకుడిగా మారిన రాజు కథ. ఈ రాజుకు సింహాసనం అవసరం లేదు, కీరిటాలు అవసరం లేదని చెబుతుంది. ఒకవైపు చెల్లెలి కాపురం సరిచేయాలి, మరోవైపు తల్లిదండ్రుల్ని కలపాలనే ఆశ, ఇంకోవైపు కడుపుతో ఉన్న భార్యను బాగా చూసుకోవాలన్న ఆరాటం. వీటిని దాటికి అత్తయ్యని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం.. ఇన్ని మోయాలంటే నీ ఆలోచనలకు ఎంత బలం ఉండాలని అంటుంది దీప.

అర్ధం చేసుకునే భార్యను మించిన అదృష్టం లేదు.. నిన్ను నీ కుటుంబంతో కలపాలి, నాకు అమ్మమ్మ ఇల్లు. మనవాళ్ల కోసం మనమే నిలబడాలని అంటాడు కార్తీక్. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి రిపోర్ట్స్ వచ్చాయని ఫోన్ చేసి చెబుతుంది. ఉదయాన్నే పారిజాతం పూజలు చేయడంతో శివన్నారాయణ సెటైర్లు వేస్తాడు. ఇంతలో దశరథ వచ్చి మనం జ్యోత్స్నని హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని చెబుతాడు. బ్లడ్ శాంపిల్స్ మళ్లీ టెస్ట్ చేయించాలని దశరథ చెప్పగానే పారు షాక్ అవుతుంది. మళ్లీ బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలని జ్యోత్స్నకి చెప్పకుండా తీసుకెళ్లాలని అంటాడు దశరథ. జ్యోత్స్నని పిలిచి బయటకు వెళ్లాలని శివన్నారాయణ చెప్పగానే.. పారు సైగలతో చెబుతుండటాన్ని చూసి షాక్ అవుతాడు. దాంతో పారు ఉలిక్కిపడతాడు.

దీప శాంపిల్స్ సుమిత్రగారికి మ్యాచ్ అయ్యాయని డాక్టర్ హారిక చెప్పడంతో దీప, కార్తీక్‌లు సంతోషిస్తారు. మీరింత కాన్ఫిడెంట్‌గా శాంపిల్స్ ఇచ్చారంటే మీకు ముందుగానే నిజం తెలిసుండాలని అంటుంది డాక్టర్. దీపే మా అత్తకూతురు అని కార్తీక్ చెప్పడంతో డాక్టర్ షాక్ అవుతుంది. ఈ విషయం నాకు, దీపకు తప్పించి మా ఇంట్లో ఎవరికీ తెలియదని చెబుతుంది. నేను దశరథ గారికి నిజం చెబుతానని డాక్టర్ అనడంతో కార్తీక్ ఆపుతాడు. నిజం అందరికీ చెప్పాల్సిందేనని హారిక అంటుంది. బయటి నుంచి ఏ ప్రాబ్లమ్ రాకుండా నేను చూసుకుంటానని మా అత్తని బతికిస్తే చాలని అంటాడు కార్తీక్. నేను మీ అత్తని బతికించలేను, నువ్వు మీ అమ్మని కాపాడుకోలేవని డాక్టర్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది.

నేను చెప్పబోయేది వింటే మీరు తట్టుకోలేరని అంటుంది డాక్టర్. ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్.. నీ కడుపులో ఉన్న ప్రాణాన్ని నువ్వు వదులుకుంటావా? అని డాక్టర్ చెప్పగానే దీప, కార్తీక్‌లు షాక్ అవుతారు. నీ ఆరోగ్యం బాలేనప్పుడు నువ్వు బోన్‌మారో డొనేట్ చేయకూడదు. అలా చేస్తే కడుపులో ఉన్న బిడ్డ బతకదని అంటుంది డాక్టర్. నీ హెల్త్ కండీషన్ బాలేదు.. నువ్వు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి పనికిరావు, అయినాసరే రిస్క్ చేస్తానంటే కన్నతల్లి ప్రాణం కోసం కడుపులోని బిడ్డను వదులుకోవాలని చెబుతుంది డాక్టర్. మీరు మీ బిడ్డ ప్రాణాన్ని వదిలేసుకోగలరా అని డాక్టర్ అడగటంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X