Karthika Deepam 2 February 3rd: దశరథ దెబ్బకు జ్యోత్స్నకి ముచ్చెమటలు.. దీప రిపోర్ట్స్ దాచేసిన డాక్టర్

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న మరోసారి తప్పించుకోవాలని చూసిందని మావయ్య, తాతకి దొరికిపోయిందని దీపకి చెబుతాడు కార్తీక్. మావయ్యకి జ్యోత్స్న మీద అనుమానం మొదలైంది.. ఆమెకు రెండోసారి బ్లడ్ టెస్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. దాస్‌కి ఫోన్ చేసిన జ్యోత్స్న తనతో చేతులు కలపమని అడగ్గా.. అది నా వల్ల కాదని తేల్చేస్తాడు దాస్. ఉదయాన్నే శివన్నారాయణ దగ్గరికి దశరథ వచ్చి జ్యోత్స్నకి మరోసారి బ్లడ్ టెస్ట్ చేయించాలని అనుకున్నట్లు చెబుతాడు. ఈ మాటలు విన్న పారిజాతం షాక్ అవుతుంది. జ్యోత్స్నతో కలిసి తండ్రీ కొడుకులు ఆసుపత్రికి బయల్దేరతారు.

తనపై భర్త చూపిస్తోన్న ప్రేమకు పొంగిపోతుంది దీప. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి ఆసుపత్రికి అర్జెంట్‌గా రమ్మని చెప్పడంతో ఇద్దరూ కంగారుగా వెళ్తారు. దీప బ్లడ్ శాంపిల్స్ సుమిత్రగారితో మ్యాచ్ అయ్యాయి. అంటే దీపే సుమిత్రగారి కన్నకూతురా అని డాక్టర్ హారిక ఆశ్చర్యపోతుంది. అయితే సుమిత్రను కాపాడటం దీప వల్ల కాదని.. అది జరగాలంటే తన కడుపులోని బిడ్డను వదులుకోవాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 3వ తేదీ 584వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 584 February 3rd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్నని తీసుకుని డాక్టర్ హారిక దగ్గరికి వస్తున్న శివన్నారాయణ, దశరథలకు కార్తీక్, దీపలు ఎదురుకావడంతో వారు షాక్ అవుతారు. నాతో పాటు వీళ్లని కూడా హాస్పిటల్‌కు రమ్మని చెప్పారా? అని మండిపడుతుంది జ్యోత్స్న. నీకు మరోసారి బ్లడ్ టెస్ట్ చేయించాలని అనుకున్నది నేను.. ఈ విషయం కార్తీక్‌కు తెలియదని అంటాడు దశరథ. మరి మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. దీప ప్రెగ్నెంట్ కదా చెకప్స్ కోసం తీసుకొచ్చానని చెబుతాడు కార్తీక్. అప్పుడు మీరు కలవాల్సింది గైనకాలజిస్ట్‌ని కానీ.. డాక్టర్ హారిక గారి రూమ్‌లో నుంచి ఎందుకు వస్తున్నారని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. సుమిత్రమ్మ గారి ట్రీట్‌మెంట్ గురించి తెలుసుకోవాలని వచ్చామని దీప చెబుతుంది. మరి మీ కళ్లు ఎందుకు అలా ఉన్నాయని జ్యోత్స్న అడగ్గా.. కొన్నిసార్లు మాటల్ని గుండెల్లో దాచుకోవాల్సి ఉంటుందని అంటాడు కార్తీక్.

సాయం చేయగలిగే స్థితిలో ఉండి, సాయం చేయలేని పరిస్థితులు వస్తే అంతకంటే బాధ మరొకటి ఉండదని చెబుతాడు కార్తీక్. సుమిత్రకు మనలో ఎవరైనా డోనర్‌గా ఉంటే మనకి అంత బాధ ఉండేది కాదని.. కానీ కన్నకూతురే ఉండాలి. తల్లిని కాపాడుకోవడానికి జ్యోత్స్న ముందుకొచ్చినా, రిపోర్ట్స్ మనం అనుకున్నట్లుగా రాలేదు. అందుకే మరోసారి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించడానికి జ్యోత్స్నని తీసుకొచ్చామని చెబుతాడు పెద్దాయన. గతంలో ఏం జరిగిందో? ఎక్కడ పొరపాటు జరిగిందో అర్ధం కావడం లేదని అంటాడు శివన్నారాయణ. హాస్పిటల్‌కు తీసుకొస్తున్నారని తెలిస్తే రాకుండా తప్పించుకునే దానిని అనుకుంటుంది జ్యోత్స్న. ఈసారి ఎక్కడా తప్పు జరగకుండా చూసుకుంటానని అంటాడు దశరథ. కార్తీక్, దశరథలు బయటకు వెళ్తుండగా.. బ్లడ్ రిపోర్ట్స్ డాక్టర్ గారి టేబుల్ దగ్గర ఉన్నాయని దీప చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. అదే సమయంలో దీప టెస్ట్ రిపోర్ట్స్‌ని చూసిన జ్యోత్స్నకు అనుమానం వస్తుంది.. అది గమనించిన డాక్టర్ హారిక వాటిని దాచేస్తుంది. ఈ విషయాన్ని దీపతో చెబుతాడు కార్తీక్.

జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మరోసారి తీసుకుని టెస్ట్ చేయమని చెబుతాడు దశరథ. ఆమెకు మా దగ్గర నమ్మకం లేదు కదా అని హారిక అంటుంది. ఈసారి మా వైపు నుంచి ఎలాంటి తప్పు జరగదని పెద్దాయన అంటాడు. శాంపిల్స్ ఈసారి కూడా మ్యాచ్ కాకపోతే అని హారిక అడగ్గా.. జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతలో దశరథకు రెస్టారెంట్ నుంచి ఫోన్ రావడంతో వెళ్లమని చెబుతాడు పెద్దాయన. బ్లడ్ టెస్ట్ ఇవ్వడానికి కో ఆపరేట్ చేయమని కూతురికి చెబుతాడు దశరథ. కొన్ని మన నమ్మకాల మీద కాదు.. వాస్తవాల మీద ఆధారపడి ఉంటాయి. వాస్తవాల్ని మనం మార్చకూడదు కదా అని అంటుంది డాక్టర్. ఈవిడ గారికి నేను అసలైన కూతురు కాదని తెలిసినట్లే మాట్లాడుతోందని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది.

మీ నాన్నగారు నిన్ను ఎంతలా నమ్ముతున్నారో చూశావా? ఆ నమ్మకం వెనుక ఎంత ప్రేమ ఉంటుందో చూడు అంటుంది డాక్టర్. తర్వాత బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి జ్యోత్స్నని రమ్మంటుంది హారిక. దాంతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. ఈసారి నేను పక్కనే ఉంటాను.. ఏ పొరపాటు జరగదని చెబుతాడు శివన్నారాయణ. చివరికి చేసేది లేక బ్లడ్ శాంపిల్స్‌ని దగ్గరుండి ఇప్పిస్తారు. దీప, కార్తీక్‌ హాస్పిటల్‌కు ఎందుకొచ్చారు. వాళ్ల కళ్లు చూస్తుంటే దీనికో బాధపడుతున్నట్లే ఉన్నారు.. వాళ్లు గైనకాలజిస్ట్‌ను కలవడానికి కాదు, మరెందుకో వచ్చారని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది.

కాంచన, కాశీల కోసం ఎదురుచూస్తుంటాడు శ్రీధర్. ఇంతలో కాంచన వచ్చి కాశీని లోపలికి రమ్మని పిలుస్తుంది. అతనిని అవతారం చూడగానే స్వప్న, కావేరిలు షాక్ అవుతారు. కాశీ లోపలికి వస్తుండగా అక్కడే ఆగమని మండిపడుతుంది స్వప్న. ఈ మనిషి కారణంగా మనమంతా ఎంత బాధపడ్డామో మరిచిపోయావా.. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉండాలి అంటుంది స్వప్న. మా నాన్నకి మొదట్లో మా అమ్మ మీదున్న ప్రేమ.. ఇప్పటికీ అలాగే ఉందని అంటుంది. నాకు నీ మీద అలాంటి ప్రేమే ఉందని కాశీ చెబుతాడు. ఇద్దరూ గొడవ పడటంతో కాంచన సీరియస్ అవుతుంది. గతాన్ని మనం మర్చలేకపోవచ్చు కానీ, వర్తమానంలో మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్‌ని మారుస్తాయని అంటుంది. మనవాళ్లే ఆ నిర్ణయాల్ని సరిచేస్తారని చెబుతుంది కాంచన. నేను కాశీతో కాపురం చేయలేను.. నేను కాశీతో కలిసుండలేను.. నేను కాశీకి విడాకులు ఇస్తానని స్వప్న తేల్చిచెప్పడంతో అంతా షాక్ అవుతారు.

డాక్టర్ హారిక చెప్పిన మాటలు తలచుకుని కార్తీక్, దీపలు ఏడుస్తుంటారు. వాళ్లని చూసిన దశరథ కారు ఆపి ఏం జరిగిందని అడుగుతాడు. హాస్పిటల్‌లో ఏదో జరిగిందని మీ ముఖాలు చూసినప్పుడే నాకు అర్ధమైంది. డాక్టర్ గారు మీతో ఏమైనా చెప్పారా? అని దశరథ అడగ్గా.. దీపని జాగ్రత్తగా ఉండమని చెప్పారని అంటాడు కార్తీక్. దీపకు అమ్మనాన్న ఉండుంటే కడుపుతో ఉన్న కూతురిని పుట్టింటికి తీసుకొచ్చి కాళ్లు కిందపెట్టకుండా దేవతలా చూసుకునేవారు. కానీ దీపకు ఆ అవకాశం లేదు.. పోని మనింటి దగ్గర అలా చూసుకుందామా అంటే అనారోగ్యంతో ఉన్న భార్య గురించి ఆలోచించాలా? కూతురి లాంటి దీప గురించి ఆలోచించాలా? అని ప్రశ్నిస్తాడు దశరథ.

సుమిత్ర ఏమైపోతుందోనని నాకు భయంగా ఉండేది. కానీ తనకు ఏం కాదని మీరిద్దరూ చెప్పడం వల్లే ధైర్యంగా ఉన్నాను. కానీ ఎందుకో దీప ముఖంలో భయం కనిపిస్తోందని అంటాడు దశరథ. మీరు చెప్పరు.. నేనే తెలుసుకుంటాను, ఆ గైనకాలజిస్ట్ పేరు చెప్పమని దశరథ అడగటంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. దీప కడుపులోని బిడ్డ గురించి డాక్టర్ ఏదో చెప్పుంటారు.. అసలే మేం బాధలో ఉన్నాం కదా మాతో చెప్పలేక మీలో మీరే బాధపడుతున్నారని అంటాడు దశరథ. ఎంత ఖర్చయినా పర్లేదు.. కడుపులో బిడ్డకు మాత్రం ఏం కాకూడదని చెబుతాడు. మా చెల్లి, నేను ఎప్పుడూ నీకు పుట్టబోయే బిడ్డ గురించే మాట్లాడుకుంటున్నామని దశరథ చెప్పడంతో కార్తీక్ ఇంకా బాధపడతాడు. నీ బిడ్డను కూడా నా దగ్గరే పెట్టుకుంటా... మా చెల్లి, సుమిత్ర నీ బిడ్డతో కలిసి ఆడుకుంటామని చెబుతాడు దశరథ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X