Karthika Deepam 2 February 4th: విడాకులు కావాల్సిందే.. స్వప్న కాళ్లపై పడ్డ కాశీ, జ్యోత్స్నని నమ్మని పారు
Photo Courtesy: JioHotstar
డాక్టర్ హారిక రూమ్‌లో నుంచి బయటకు వస్తున్న కార్తీక్, దీపలకు దశరథ, జ్యోత్స్న, శివన్నారాయణలు ఎదురవుతారు. మీరిద్దరికి డాక్టర్ హారికతో ఏం పని? మీరు కలవాల్సింది గైనకాలజిస్ట్‌ను కదా అని జ్యోత్స్న అనుమానం వ్యక్తం చేస్తుంది. దానికి కార్తీక్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తారు. లోపలికి వెళ్లిన జ్యోత్స్నకి టేబుల్ మీద దీప పేరుతో రిపోర్ట్స్ కనిపించగా వెంటనే ఫైల్ దాచేస్తుంది డాక్టర్ హారిక. అది చూసిన జ్యోత్స్నకు అనుమానం ఎక్కువవుతుంది. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వకుండా తప్పించుకోలేనని జ్యోత్స్న కంగారుపడుతుంది. దీప- కార్తీక్‌లు హాస్పిటల్‌కు ఎందుకు వచ్చారు? వాళ్లిద్దరి కళ్లలో నీళ్లు ఎందుకున్నాయని డౌట్ పడుతుంది.
కాశీని తీసుకుని శ్రీధర్ ఇంటికి వస్తుంది కాంచన. భర్తను చూడగానే రగిలిపోతుంది స్వప్న. ఈ మనిషి వల్ల మనమంతా ఎంతో బాధపడ్డాం.. ఇతనిని క్షమించే ప్రసక్తే లేదు, కలిసి బతకలేను.. విడాకులు ఇచ్చేస్తానని స్వప్న తేల్చిచెప్పడంతో కాశీతో పాటు అంతా షాక్ అవుతారు. బిడ్డ గురించి డాక్టర్ హారిక చెప్పిన మాటలో కార్తీక్, దీపలు కుమిలిపోతుంటారు. అటుగా కారులో వెళ్తున్న దశరథ్.. వాళ్లిద్దరినీ చూసి ఆపి ఏం జరిగిందని అడుగుతాడు. మీరిద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారని చెప్పమని ప్రశ్నిస్తాడు. నేను, నా చెల్లి దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించే మాట్లాడుకుంటున్నామని దశరథ చెప్పడంతో కార్తీక్, దీపలకు మరింత దు:ఖం తన్నుకొస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 4వ తేదీ 585వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మేం బాధపడితే తట్టుకోలేమని వీడు అన్ని విషయాలు చెప్పడని బిడ్డకు ఏ ప్రాబ్లమ్ లేదు కదా అని దీపని అడుగుతాడు దశరథ. నీకు ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఈ తండ్రి ఉన్నాడని దీపకు చెప్పి వెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ బిడ్డ జాగ్రత్త అని దశరథ చెప్పడంతో కార్తీక్, దీపలు వెక్కి వెక్కి ఏడుస్తారు. మరోవైపు.. స్వప్న విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో ఏం చేయాలా అని శ్రీధర్, కాంచనలు ఆలోచిస్తుంటారు. నువ్వు కన్నతల్లివి నువ్వే స్వప్నతో మాట్లాడమని కావేరితో అంటుంది కాంచన. అది మొండిది.. అది పుట్టాల్సింది నాకు కాదు, నీకు అని చెబుతుంది. నేను దానిని పిలవనని, నువ్వే పిలవమని కావేరి అంటుంది. కూతురికి కూడా భయపడుతున్నావ్ అని మండిపడుతుంది. నా కాపురం నిలబెట్టకోలేకపోయినా.. నా కూతురి కాపురం నిలబెడతానని శ్రీధర్ అంటాడు.
ఇంతలో స్వప్న రాగానే.. ఇంతమంది నీ జీవితం గురించి ఆలోచిస్తుంటే నీపాటికి నువ్వు లోపలికి వెళ్లి కూర్చుంటున్నావ్, ఇదేనా నువ్వు నాకిచ్చే మర్యాద..మీ అన్నయ్యని ఫోన్ చేసి పిలవమంటావా? అని బెదిరిస్తుంది కాంచన. మధ్యలో అన్నయ్య ఎందుకు అని స్వప్న అడగ్గా.. నీకున్న తిక్కకి వాడే కరెక్ట్ అని అంటుంది కాంచన. నాకు ఇష్టం లేని వంకాయ కూరని మీరంతా కలిసి వడ్డించినా నేను తినలేను.. అలాగే ఈ మనిషితో నేను కలిసి బతకలేను అని తేల్చిచెబుతుంది స్వప్న. వరదల్లో కొట్టుకుపోయిన ఊరిలో బురద తప్పించి ఏం ఉండవని.. అలాంటి దగ్గర నా తులసి కోట ఏమైందని అడిగినట్లే ఉంటుంది మా ప్రేమ కూడా అని మండిపడుతుంది.
నీకు నచ్చినప్పుడు మోసి, నచ్చనప్పుడు దింపేసుకోవడం కాదు బంధం అంటే అని మండిపడతాడు శ్రీధర్. కలిసి బతలేనప్పుడు ఏం చేయలేమని అంటుంది స్వప్న. అలాంటప్పుడు ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావని ప్రశ్నిస్తుంది కావేరి. ఒక మనిషి లైఫ్ వందేళ్లు ఇలా ఉంటుందని రాసి పెట్టుందా అని ప్రశ్నిస్తుంది కావేరి. ఈ లోకమంతా తిరిగినా.. తప్పు చేయని భార్యని, తప్పు చేయని భర్తని చూపించు అని నిలదీస్తుంది కాంచన. వివాహ బంధం అంటే మూడేసే మూడు ముళ్లా? దాంపత్య బంధమంటే కలిసిన ఇద్దరు వ్యక్తులా? కాశీ నీకోసం పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. భర్త స్థానంలో కొడుకుంటే ఆడది వదిలేస్తుందా? రెండు తన్నైనా దారిలో పెడుతుంది. ఆడది తల్లిగా చేయగలిగింది.. భార్యగా ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తుంది కాంచన.
కాశీని క్షమించు.. నువ్వు వెంటనే ఈ నిర్ణయం తీసుకోలేకపోతే కాస్త టైం పెట్టు, వాడిని గమనించు .. మార్పు వచ్చిందని నీకు అనిపిస్తే అప్పుడు నీ జీవితంలోకి ఆహ్వానించు అని చెబుతుంది కాంచన. మనల్ని వదులుకోలేని బంధాల గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. నేను అలా ఆలోచించాను కాబట్టే నా జీవితంలో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలను నేను సరిదిద్దుకున్నాను, ఇప్పుడు నీకు సరిదిద్దుకునే టైం వచ్చిందని కాశీ చేతిలో చేయి పెడుతుండగా చేయి లాగేస్తుంది స్వప్న. నేను కాశీతో కలిసుండాలని తేల్చేస్తుంది. దాంతో అంతా షాక్ అవుతారు.
నన్ను ఏం చేయమంటావో చెప్పు.. నాకు నువ్వు కావాలి, నేను తప్పుచేశాను.. నన్ను క్షమించు అంటాడు కాశీ. తప్పు చేయడం నీకు అలవాటు కాదు.. వ్యసనం. దానిని నువ్వు మానలేవు. ఈ జన్మలో నువ్వు మారవు అంటుంది స్వప్న. ఏం చేస్తే నువ్వు నన్ను క్షమిస్తావని కాళ్ల మీద పడబోతాడు కాశీ. దాంతో అంతా షాక్ అవుతారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం.. అన్నయ్య మీద నీకు ఎలాంటి హక్కుందో.. నా మీద కూడా నీకు అలాంటి హక్కుంది కానీ ఈ మనిషిని నేను ఎప్పటికీ క్షమించలేను, అందరినీ తలదించుకునేలా చేశాడని కాశీ మీద సీరియస్ అవుతుంది స్వప్న. కన్నతండ్రి గురించి పట్టించుకోని ఈ మనిషి, కట్టుకున్న భార్యను పట్టించుకుంటాడా... నేను ఒకసారి కాదు మూడు సార్లు ఈ మనిషి చేతిలో మోసపోయాను, మరోసారి మోసపోయాను.. పోరా బయటికి అని స్వప్న అనడంతో అంతా షాక్ అవుతారు.
కుక్కకైనా విశ్వాసం ఉంటుంది.. ఈ మనిషికి ఉండదు. నాకు కాశీతో విడాకులు కావాలి.. ఇదే నా ఆఖరి నిర్ణయమని తేల్చేస్తుంది స్వప్న. దాంతో కాశీ కోపంగా వెళ్లిపోతాడు. మరోసారి ఈ మనిషిని ఇంట్లోకి రానియొద్దని చెబుతుంది స్వప్న. దాంతో కాంచన బాధగా వెళ్లిపోతుంది. మీరేం మాట్లాడరేంటీ? అని కావేరి తన భర్తను అడగ్గా.. నా స్థానంలో నువ్వుంటే అర్ధమయ్యేది, నేనెందుకు మౌనంగా ఉన్నానో అంటాడు శ్రీధర్. నేను మాట్లాడాల్సింది స్వప్నతో కాదని కాశీ దగ్గరికి వెళ్తాడు.
ఆసుపత్రిలో ఏం జరిగింది? బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావా అని మనవరాలిని అడుగుతుంది పారిజాతం. నేను హాస్పిటల్‌కు వెళ్తున్న విషయం నీకు ముందే తెలిసినా నాకెందుకు చెప్పలేదని అడుగుతుంది జ్యోత్స్న. ఒక మెసేజ్ చేయొచ్చు కదా అని ఫైర్ అవుతుంది. మాటల సందర్భంలో దాస్ గురించి నోరు జారుతుంది జ్యోత్స్న. మర్యాదగా దాస్ ఎక్కడున్నాడని అడుగుతుంది పారిజాతం. నిజం దాయడానికి జ్యోత్స్న ఏడుస్తున్నట్లు నాటకం ఆడుతుంది. ఈ కన్నీళ్లు ఒరిజనలా? లేక గ్లిజరిన్ పూసుకున్నావా అని పారు అడుగుతుంది. నాకు దాస్ అంటే ప్రాణం.. చిన్నప్పుడు వాడిని కొట్టానని నా చేతికి నేనే వాత పెట్టుకున్నాను, అదే వేరే చేయి అయితే దానిని నరికేసేదానిని అంటుంది పారిజాతం. దశరథ, శివన్నారాయణలతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది పారు. దాస్ మేటర్ బయటికి రానీయకూడదు.. తేలిస్తే గ్రానీ నన్ను బతకనివ్వదని వణికిపోతుంది జ్యోత్స్న.
కార్తీక్- దీపలు బిడ్డ గురించి తలచుకుని ఏడుస్తుంటారు. బిడ్డ గురించి ఎన్నో కలలు కన్నానని కార్తీక్ చెప్పడంతో దీప కంటతడి పెడుతుంది. వదలుకోవడానికి అదేమైనా వస్తువా? మన ఆరో ప్రాణం అంటాడు కార్తీక్. ఇంటికి వెళ్దామని దీప ఏడుస్తుంది. ఈ నిజాన్ని మన మధ్య ఉంచు.. ఏం జరగనట్లే ఉండమని అంటాడు కార్తీక్. నువ్వు ఉండగలవా? అని కార్తీక్‌ను దీప అడుగుతుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











