Karthika Deepam 2 February 6th:దశరథకు దొరికిపోయిన జ్యోత్స్న.. పారుకు దారులన్నీ క్లోజ్, దీపకు కాంచన పరిష్కారం

Photo Courtesy: JioHotstar

కాశీ - స్వప్నలకు కలపమని శ్రీధర్‌ను అడుగుతుంది కాంచన. నా ఇద్దరు బిడ్డలకు తల్లులు వేరైనా బుద్ధులు మాత్రం ఒకటే వచ్చాయని అంటాడు శ్రీధర్. కార్తీక్‌తో స్వప్నను పోల్చొద్దని వాడి కోపం, ఆవేశం అంతా అయినవాళ్ల మంచి కోసమే వాడతాడని అంటుంది కాంచన. ఇంతలో శివన్నారాయణ వచ్చి నా కోడలి గురించే కాదు.. నా కూతురి గురించి కూడా ఆలోచించాలని అంటాడు. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మరోసారి ఇచ్చింది.. కానీ మీ గురించే భయంగా ఉందని, ఇకనైనా శ్రీధర్‌ను భర్తగా అంగీకరించమని చెబుతాడు పెద్దాయన.

ఇంతలో కార్తీక్, దీపలు రావడంతో వీళ్లు డాక్టర్ హారిక దగ్గర కనిపించారని శివన్నారాయణ చెప్పగా.. అంతా షాక్ అవుతారు. నిన్న కూడా వెళ్లారని కాంచన చెప్పడంతో శివన్నారాయణకు అనుమానం వస్తుంది. సుమిత్ర అత్త గురించి కనుక్కోవడానికి వెళ్లామని కార్తీక్ కవర్ చేస్తాడు. ఉదయాన్నే అనసూయ వచ్చి కార్తీక్ బాబుకు అండగా ఉంటుందని ఊళ్లో ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టానని చెబుతుంది. ఆ మాటలతో కాంచన ఎమోషనల్ అవుతుంది. అనసూయ ఇచ్చిన పాప బొమ్మని తీసుకుని శౌర్య తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లగా అది చూసి కార్తీక్ - దీపలు కంటతడి పెడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 6వ తేదీ 587వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 587 February 6th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దాస్ దగ్గరికి వచ్చిన జ్యోత్స్న... మరోసారి నా బ్లడ్ శాంపిల్స్‌ని టెస్ట్‌కి చేయబోతున్నారని చెబుతుంది. అంత అయిపోయింది.. మీ అందరికీ కావాల్సింది ఇదే కదా? ఇప్పుడు నీకు సంతోషమే కదా అని అంటుంది. దీపను ఆ ఇంటి వారసురాలిగా చూసేవరకు నాకు సంతోషమే లేదని అంటాడు దాస్. లోకంలో నీలాంటి తండ్రి ఎవరికీ ఉండడు.. అయినా నాది కోటి మందిలో ఒకరికి ఉండే జాతకం. అందుకే పనిమనిషి కూతురిగా పుట్టిన నేను యజమానిగా బతుకుతున్నాను. అమ్మ బతికుంటే నా వైభవం చూసి ఎంత సంతోషించేదోనని ఎమోషనల్ డ్రామా ఆడుతుంది జ్యోత్స్న. తప్పు చేసినవాళ్లకి శిక్ష పడాలంటే మొదటి శిక్ష మీ అమ్మకే పడాలి.. ఎందుకంటే బిడ్డల్ని మార్చింది తనే, రెండో శిక్ష నీకు పడాలి.. ఎందుకంటే నిజం తెలిసినా ఇన్ని రోజులు మౌనంగా ఉన్నందుకు. నేనేం తప్పు చేశాను.. నన్ను శిక్షించడానికి. సొసైటీలో దశరథ కూతురిని అన్నది అబద్ధం. నేను దాస్ కూతురిని అని ప్రపంచానికి పరిచయం చేసుకోలేను. నీ స్థాయిలో నేను బతకలేను అని అంటుంది జ్యోత్స్న.

నీకు తల్లి చనిపోయింది.. అయినా అమ్మ అనే పిలుపు చావలేదు. పెంచిన తల్లి రూపంలో ఆ పిలుపు ఇంకా బతికే ఉంది. కానీ దీపకి తల్లి బతికే ఉంది.. కానీ తనకి అమ్మ అనే పిలుపు చచ్చిపోయింది. ఈ జన్మలో చేసిన పాపాలన్నీ ఈ జన్మలోనే కడుక్కోవాలి. దూరమైన బిడ్డని మళ్లీ ఆ ఇంటికి చేర్చాలి.. అమ్మనాన్న పిలుపులు కూడా లేకుండా బతుకుతున్న దీపకి అమ్మానాన్నని ఇవ్వాలి. నీ పరిస్ధితి ఏమవుతుందో నేను చెప్పలేను.. వాళ్లు తమ దగ్గరే నిన్ను కూడా బిడ్డగా ఉంచుకుంటారో, లేదా తరిమేస్తారో తెలియదు. కానీ నువ్వు చేసిన పాపాలన్నీ వాళ్లకి తెలియాలని అంటాడు దాస్. నువ్వే నన్ను కాపాడు.. నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు. నిజం తెలిసే టైం వచ్చేసింది.. రోజులు కాదు, ఇక లెక్కపెట్టుకోవాల్సింది గంటలేనని అనుకుంటాడు దాస్.

దీప ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన అనసూయ, కాంచనలు ఏం జరిగిందని కార్తీక్‌ను నిలదీస్తారు. సుమిత్ర అత్త గురించి బాధపడుతోందని కార్తీక్ చెప్పడంతో కాంచన సీరియస్ అవుతుంది. మా వదిన గురించిన బాధ అందిరికీ ఉంది.. దీపకు ఎందుకు అని మండిపడుతుంది. కడుపుతో ఉన్న ఆడవాళ్లు తొందరగా భోజనం చేసి, తొందరగా పడుకోవాలి, తన ఆరోగ్యం గురించి కాకపోయినా బిడ్డ ఆరోగ్యం గురించైనా ఆలోచించాలి. ఆడపిల్లకు అత్తింటిలో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పుకోవడానికి పుట్టింటికి వెళ్తుంది. దానికి అత్తిల్లు పుట్టిల్లు ఇదే.. అత్తనైనా, అమ్మనైనా నేనే అని అంటుంది. అనసూయ భోజనం తీసుకుని రాగా.. కార్తీక్‌ ఇస్తానంటాడు. కానీ కాంచన మాత్రం శౌర్యని పిలిచి అమ్మకి భోజనం ఇచ్చి రమ్మని చెబుతుంది.

దీప దగ్గరికి వెళ్లిన శౌర్య.. భోజనం తినమని చెబుతుంది. నేను తర్వాత తింటానని దీప కోప్పడటంతో శౌర్య భోజనం ప్లేట్ కింద పడేసి ఏడుస్తుంది. ఇది చూసిన అనసూయ వచ్చి సీరియస్ అవుతుంది.. ఇంటికొచ్చిన దగ్గరి నుంచి చూస్తున్నాను.. మనిషివైతే ఉన్నావు, కానీ మతిలేని దానిలా ఉన్నావు? ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. సుమిత్ర గారి గురించి బాధపడాల్సిన అవసరం నీకెంటీ? ఆవిడని కాపాడుకోవడానికి కన్నకూతురు ఉందని చెబుతుంది అనసూయ.

అర్థరాత్రి వేళ దొంగచాటుగా ఇంట్లోకి వెళ్తున్న జ్యోత్స్నపై దశరథ సీరియస్ అవుతాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫ్రీడమ్‌ని పిల్లలు అలుసుగా తీసుకోకూడదని మండిపడతాడు. ఇంతలో శివన్నారాయణ, పారిజాతంలు వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. చెప్పకుండా బయటకు వెళ్లాను.. అది తప్పా అని అడుగుతోందని మండిపడతాడు. జ్యోత్స్న ఎప్పుడూ వెళ్తూనే ఉంటుందని కవర్ చేస్తుంది పారు. ఎప్పుడూ వెళ్లడం వేరు.. ఈ రోజు వెళ్లడం వేరు. దీప కార్తీక్‌లు ఇంటికి వెళ్లారు, నేను రెస్టారెంట్‌కి వెళ్లాను, నాన్న చెల్లెలి దగ్గరికి వెళ్లారు, సుమిత్రను ఎవరు చూసుకుంటారని ప్రశ్నిస్తాడు దశరథ. నీరసంగా ఉందని పడుకున్న సుమిత్రను లేపి తినడానికి ఏమైనా పెట్టావా? టైంకి టాబ్లెట్స్ ఇవ్వాలి.. ఇచ్చావా? అని పారుని అడుగుతాడు.

తప్పు పిన్నిది కాదు.. నా కూతురిది. ఎవరూ లేనప్పుడు ఎవరో ఒకరు అమ్మని కంటికి రెప్పలా చూసుకోవాలి. కన్నతల్లి కంటే ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయారా అని జ్యోత్స్నపై మండిపడుతుంది. టాబ్లెట్స్ డస్ట్ బిన్‌లో కాదు.. మీ అమ్మకి వేయాలని చెబుతాడు. మార్నింగ్ ఆసుపత్రికి వెళ్తున్నట్లు నాకెందుకు చెప్పలేదని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. మీ అమ్మని కాపాడగలిగింది నువ్వేనని తెలిసి కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ఎన్నిసార్లు ట్రై చేశావు. అందుకే మేం దగ్గరుండి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని చెబుతాడు దశరథ. తల్లి చనిపోవాలని నువ్వు కోరుకుంటున్నావని అనడంతో శివన్నారాయణ కొడుకుపై కోప్పడి లోపలికి వెళ్లిపోమ్మని చెబుతాడు. జ్యోత్స్న ప్రవర్తన వల్లే దశరథ ఇలా మారిపోతున్నాడని శివన్నారాయణకు అనుమానం వస్తుంది.

కార్తీక్ బాబు నీ మెడలో తాళి కట్టాక నీ జీవితమే మళ్లీ మారిపోయింది. దొరికిన బతుకుని పూల తోట చేసుకోక.. పనికిరాని మొక్కల్ని పెంచుతున్నావా అని దీపై కోప్పడుతుంది అనసూయ. ఏం జరిగిందని దీపని దగ్గరికి పిలిచి అడుగుతుంది కాంచన. శౌర్య మీద అరిచేంత బాధ ఏంటో నాకు చెప్పమని అంటుంది. కార్తీక్ నాకు నిజం చెప్పాడని కాంచన అనడంతో బావ నిజం చెప్పేశాడా? అత్తకి నేను ఏం చెప్పాలి? అని దీప మనసులో అనుకుంటుంది. మీరిద్దరూ నాకు దొరకడం లేదు.. ఇద్దరూ తెలివిగా ఆన్సర్ ఇస్తున్నారని మండిపడుతుంది కాంచన. కంటికి కనిపించే ప్రాణానికి ఒక ప్రమాదం ఉంది.. తను ప్రాణం పెట్టుకున్న ఒక ప్రాణం వదులుకుంటే కంటికి కనిపించే ప్రాణానికి ప్రమాదం తప్పొచ్చు. కనిపించని ప్రాణాన్ని కనిపించే ప్రాణం కోసం వదులుకుంటే న్యాయం అవుతుందా? అన్యాయం అవుతుందా? ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోలేని పరిస్ధితి అని చెబుతుంది దీప.

నా జీవితంలో జరిగిన ఒక సంఘటనే దానికి సమాధానం. కార్తీక్ పుట్టిన తర్వాత నాకు యాక్సిడెంట్ జరిగింది. ఈ రెండు కాళ్లు జీవితంలో పనిచేయవని చెప్పారు.. అంటే నేను చచ్చిపోయిన మనిషితో సమానం. ఒక అర్ధరాత్రి చచ్చిపోదామని అనుకున్నా.. ఆఖరి నిమిషంలో ఊయలలో ఉన్న పిల్లాడి ఏడుపు వినిపించింది. నా కోసం కాదు నేను వాడి కోసం బతకాలని అనుకున్నాను.. వాడికి నేను ప్రాణం పోస్తే, నాకు వాడు ప్రాణం పోశాడు. కనిపించే ప్రాణాన్ని పొగొట్టుకుంటే.. కనిపించని ప్రాణానికి అర్ధం ఏముంది? అనడంతో కార్తీక్, దీపలు ఎమోషనల్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X