Karthika Deepam 2 February 7th:శివన్నారాయణ విశ్వరూపం.. జ్యోత్స్న- పారులకు ముచ్చెమటలు, సుమిత్ర హత్యకు కుట్ర
Photo Courtesy: JioHotstar
తను దశరథ కూతురిని కాదనే నిజం ఎక్కడ బయటపడిపోతుందోని దాస్ దగ్గర టెన్షన్ పడుతున్నట్లు నటిస్తుంది జ్యోత్స్న. నేను నీలాగా బతకలేను.. నాకు స్టేటస్, డబ్బు, అధికారం కావాలని చెబుతుంది. నువ్వు ఎప్పటికీ నా కూతురిగానే ఉంటావని దాస్ చెప్పడంతో తండ్రి మీద ఫైర్ అవుతుంది జ్యోత్స్న. అర్దరాత్రి ఇంట్లోకి దొంగచాటుగా వస్తోన్న జ్యోత్స్నని చూసి మండిపడతాడు దశరథ. ఆరోగ్యం బాలేని తల్లిని వదిలేసి నువ్వు ఫ్రెండ్స్‌తో షికారు చేస్తున్నావా? అని ఫైర్ అవుతాడు. దశరథను కూల్ చేసిన శివన్నారాయణ.. జ్యోత్స్నని తీసుకుని వెళ్లిపోమ్మని పారుతో చెబుతాడు.
దీప- కార్తీక్‌లు మౌనంగా ఏడుస్తుండటం చూసిన కాంచనకు అనుమానం వస్తుంది. ఏం జరిగిందో కనుక్కోమని అనసూయకు చెబుతుంది. దీపని ఎన్నిసార్లు అడిగినా ఏం చెప్పకపోవడంతో అనసూయ సీరియస్ అవుతుంది. దీప కోసం భోజనం తీసుకుని రాగా.. దానిని శౌర్యకి ఇచ్చి పంపుతుంది కాంచన. పాప ఎన్నిసార్లు భోజనం చేయమని చెబుతున్నా దీప పట్టించుకోకపోగా.. శౌర్య మీద అరవడంతో పాప భయపడి ఏడుస్తుంది. ఇదంతా చూసిన కాంచన, కార్తీక్, అనసూయలు షాక్ అవుతారు. అసలు సుమిత్ర గురించి బాధపడాల్సిన అవసరం నీకు ఏంటని మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 7వ తేదీ 588వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కాంచన సలహా మేరకు కాశీని స్వప్నతో కలిపేందుకు శ్రీధర్ ప్రయత్నిస్తాడు. స్వప్నని పిలిచి నీతో మాట్లాడాలని అంటాడు. కాశీ గురించి తప్ప ఏమైనా మాట్లాడమని అంటుంది స్వప్న. కాశీ ఎవరు? నేను నా కూతురి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను.. దాని కంటే ముందు నీ మెడలో ఉన్న తాళి తీసి పక్కనపెట్టమని అంటాడు. ఆ మాటలతో స్వప్న, కావేరిలు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నారు.. మెడలో తాళి తీసేయమని చెబుతారా అని సీరియస్ అవుతుంది కావేరి. మీ అమ్మ పాతకాలం మనిషి, మొగుడు తప్పు చేసినా సర్దుకుపోయే మనిషి .. నువ్వు ఎవ్వరి కోసం తగ్గొద్దు ఆ తాళి తీసేయమని చెబుతాడు శ్రీధర్. భర్తనే వద్దు అనుకున్నప్పుడు.. అతను కట్టిన తాళి ఎందుకు తీసేయ్ అంటాడు. ఆ మాటలతో స్వప్న షాక్ అవుతుంది.
మీ పెద్దమ్మ అమాయకురాలు.. నీ గురించి తెలియక నిన్ను, కాశీని ఒక్కటి చేయాలని అనుకుంటోంది. ఆ తాళి నీకు ఎలా ఉందో కానీ, నాకు మాత్రం చాలా బరువుగా ఉందని అంటాడు శ్రీధర్. నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు నా ఇంటికి మావిడాకులు కట్టాను, ఇప్పుడు విడిపోతాను అంటున్నావు.. విడాకులు ఇప్పిస్తాను అంటాడు శ్రీధర్. ఇద్దరు మనుషులు కలిసుండటం కష్టం కానీ, విడిపోవడం చాలా సులభం .. ఇలాంటి విషయాలకు సొసైటీ బాగా సహకరిస్తుందని చెబుతాడు. నేను తండ్రిని కదా తీస్తే బాగోదు.. నువ్వు తల్లివి నీ కూతురి సౌభాగ్యాన్ని తెంపేయ్ అంటాడు శ్రీధర్. ఆ మాటలతో కావేరి షాక్ అవుతుంది. మన కూతురి లాంటి తెలివైన అమ్మాయికి సౌభాగ్యం గడ్డిపరక లాంటిదని చెబుతాడు. తండ్రి మాటలన్నీ విన్న స్వప్న.. మిమ్మల్ని పెద్దమ్మ క్షమించగలదా? నన్ను అడిగినట్లే పెద్దమ్మను అడిగుంటే నా బాధ నీకు తెలిసేదని అంటుంది స్వప్న.
ముల్లుని ముల్లుతోనే తీయాలి. నచ్చజెబితే వినని మనిషితో ఇలాగే మాట్లాడాలని కావేరితో శ్రీధర్ అంటాడు. స్వప్న వాళ్ల పెద్దమ్మని ఫాలో అవుతోంది. అక్కా మీరు కలిస్తే అల్లుడు, కూతురు కలుస్తారని అంటుంది కావేరి. మొదటిది జరగదని శ్రీధర్ అనగా.. నేను మీ జీవితంలో లేకపోతే అదే జరుగుతుందని స్వప్న అంటుంది. ఆ మాటలతో శ్రీధర్ షాక్ అవుతుంది. నేను మీ జీవితంలో నుంచి వెళ్లిపోతాను.. ఎప్పటికీ మీ జీవితంలోకి తిరిగిరానంత దూరం వెళ్లిపోతాను. అక్క నాకు చాలా ఇచ్చింది.. ఇప్పుడు కూడా నా కూతురి కోసం తాపత్రయపడుతుంది. అలాంటి మనిషి కోసం నేనేం చేయాలి? కాంచన, నేను దీనికి ఒప్పుకోమని శ్రీధర్ అనగా అందుకే మీ అందరికీ చెప్పకుండా నేనే వెళ్లిపోతాను. అప్పుడు మీరు, అక్కే కాదు.. నా కూతురు, అల్లుడు కూడా కలుస్తారని అంటుంది కావేరి. నాకు కాంచన కావాలి, అలాగని నిన్ను వద్దు అనుకోవడం లేదు. ఎవరి గురించో నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. స్వప్నకి భర్త విలువ తెలియజేయాలని కావేరితో అంటాడు.
కనిపించని ప్రాణం కంటే కనిపించే ప్రాణమే ఎక్కువమని అత్తయ్య చెప్పిందని కార్తీక్‌తో అంటుంది దీప. కడుపులో బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటాను అని మా అమ్మకి నేను మాటిచ్చాను. బిడ్డ నా బాధ్యత అని నువ్వూ మాట ఇచ్చావని దీపకి గుర్తుచేస్తాడు కార్తీక్. అత్తయ్య 100 చెబుతుంది ఎందుకంటే నిజం తెలియదు కాబట్టి. నేను సుమిత్ర అమ్మ కోసం నా కడుపులో బిడ్డను త్యాగం చేయాలని అనుకుంటున్నాను వెళ్లి మా అమ్మతో చెప్పు ఎలా రియాక్ట్ అవుతుందో చూడు అంటాడు కార్తీక్. నేను బిడ్డను చంపుకునే దానిలా కనిపించానా? అని ప్రశ్నిస్తుంది దీప. కడుపులో పెరుగుతున్న బిడ్డ మీదే కాదు.. శౌర్య మీద కూడా సర్వహక్కులు ఉన్నాయి. శౌర్య కూడా నా కూతురే అంటాడు కార్తీక్. నాకు పుట్టని కూతురి మీదే నాకు అంత ప్రేమ ఉంటే.. నాకు పుట్టబోయే బిడ్డ మీద ఇంకెంత ప్రేమ ఉండాలని కార్తీక్ ప్రశ్నిస్తాడు. కానీ అది పుట్టాలి కదా అని కార్తీక్ అనడంతో దీప ఏడుస్తుంది.
రెండు ప్రాణాలు , రెండు కళ్లలాంటివి. ఏ కన్ను పొడుచుకోను అని ప్రశ్నిస్తాడు కార్తీక్. నువ్వు నాకు అన్నీ ఇచ్చావు.. నేను నీకు ఏమీ ఇవ్వలేదు. బిడ్డను నీకిస్తే నా బావ సంతోషం కోసం నేను ఒక పని చేయగలిగాననే తృప్తి ఉండేదని అంటుంది దీప. మా అమ్మకి నేను ప్రతీరూపం, ఇది నీ ప్రతిరూపం. ఎవరి కోసం ఎవరిని వదులుకోను అని ప్రశ్నిస్తుంది దీప. నా దగ్గర ఏ సమాధానం లేదు.. నన్నేమి అడగొద్దు.. కానీ అత్త బతకాలని అంటాడు కార్తీక్. ఏ నిర్ణయం తీసుకోవాలో? ఎవరిని వదులుకోవాలో తెలియడం లేదని కార్తీక్ కంటతడి పెడతాడు.
మరోవైపు.. తనకు భోజనం తినిపిస్తోన్న పారుతో నా మీద నీకు అనుమానం పోయిందా? లేదా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నా కొడుకు నా కళ్ల ముందుకు వచ్చే వరకు నేను ఎవ్వరినీ నమ్మనని అంటుంది పారు. దశరథ విశ్వరూపం చూశావా? ఉన్నట్లుండి దశరథలో శివన్నారాయణ ఆవహించాడని చెబుతుంది. ఇంతలో శివన్నారాయణ అక్కడికి రావడంతో మీరు మమ్మల్ని దూరం పెడుతున్నారని అంటుంది. జ్యోత్స్న మొదటిసారి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు నువ్వు పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకోలేదని మండిపడతాడు శివన్నారాయణ. ఒకవేళ ఈసారి కూడా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోతే అని ప్రశ్నిస్తుంది పారు. దాంతో శివన్నారాయణ సీరియస్ అవుతాడు.
ఈసారి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాకపోతే దశరథ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో కూడా అర్ధం కావడం లేదు. నా దగ్గర వాగినట్లు దశరథ వాగొద్దని మండిపడి వెళ్లిపోతాడు. నిజం తెలిసిపోయే రోజు బయటపడిందని.. దీనిని ఆపాలంటే రిపోర్ట్స్ రాకూడదు, లేదంటే సుమిత్రను లేకుండా చేయాలని పారు అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఉదయాన్నే దీప, కార్తీక్‌లను పిలిచి కాంచన సీరియస్ అవుతుంది. నీ భార్యకు టిఫిన్ పెట్టమని కార్తీక్ చేతిలో ప్లేట్ పెడుతుంది. దీప ముఖంలో నీకు ఏమైనా సంతోషం కనిపిస్తుందా అని అనసూయని అడుగుతుంది కాంచన. బాగా కావాల్సిన వాళ్లు చనిపోతారని తెలిస్తే ఎలాంటి దిగులు పెట్టుకుంటామో దీప ముఖం కూడా అలాగే ఉందని అంటుంది అనసూయ. ఆడది ఏ జాతిలో ఉన్నా అమ్మతనం కోసం ఆరాటపడుతుంది. బిడ్డ ఆకలి కోసం బాధపడుతుందని దీపపై కాంచన మండిపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











