Karthika Deepam 2 February 9th: గతం మరిచిపోయిన సుమిత్ర.. షాక్‌లో దశరథ.. తల్లి కోసం దీప త్యాగం

Photo Courtesy: JioHotstar

కాంచన చెప్పినట్లు స్వప్నని, కాశీని కలిపేందుకు గాను కూతురితో మాట్లాడతాడు శ్రీధర్. కాశీ అక్కర్లేనప్పుడు అతను కట్టిన తాళి మాత్రం ఎందుకు? తీసి విసిరిపారేయ్ అని శ్రీధర్ చెప్పడంతో స్వప్న, కావేరిలు షాక్ అవుతారు. నువ్వు పెద్దమ్మని ఇలాగే అడగగలవా అని కోప్పడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న. నేను మీ జీవితంలో నుంచి వెళ్లిపోతాను అప్పుడు అక్కా మీరు కలిసిపోవచ్చని కావేరి చెప్పగా ఆమెపై కోప్పడతాడు శ్రీధర్. అక్క నాకు ఎన్నో ఇచ్చింది.. ఇప్పుడు నా కూతురి కాపురం కోసం తాపత్రయపడుతోంది. నేను మీ జీవితంలో నుంచి వెళ్లిపోతే నువ్వు అక్కా ఒక్కటి అవుతారు.. అలాగే నా కూతురు - అల్లుడు కూడా కలిసిపోతారని చెబుతుంది కావేరి.

నాకు నువ్వు, కాంచన రెండు కళ్లు.. ఇందులో ఒక కన్నును పొడవమంటే ఏ కన్ను పొడవను అని శ్రీధర్ బాధపడతాడు. సుమిత్రను బతికించాలంటే కడుపులోని బిడ్డను వదులుకోవాలని డాక్టర్ చెప్పడంతో ఏం చేయాలో అర్ధం కాక దీప, కార్తీక్‌లు ఏడుస్తుంటారు. దీప ముఖం చూస్తే భయం వేస్తోందని ఏం జరిగిందని అడుగుతుంది కాంచన. మరోవైపు.. జ్యోత్స్నకి పారు భోజనం తినిపిస్తుండగా శివన్నారాయణ వచ్చి దశరథ ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఏం జరుగుతుందో కూడా తెలియదని వార్నింగ్ ఇస్తాడు. దాంతో సుమిత్రను చంపేయడమో? నువ్వు నిజం చెప్పడమో రెండింటిలో ఒకటే దారి ఉందని జ్యోత్స్నతో పారు అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 9వ తేదీ 589వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 589 February 9th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే సుమిత్ర ఒంటరిగా గార్డెన్‌లో అటు ఇటూ నడుస్తుండటం చూసి కార్తీక్, దీపలు దగ్గరికి వెళ్లి పలకరిస్తారు. మీరిద్దరూ ఎవరు? నన్నెందుకు పిలుస్తున్నారు? అని సుమిత్ర అడగటంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఇంతలో దశరథ వచ్చి సుమిత్రను పట్టుకుని లోపలికి తీసుకెళ్తుండగా అతని చేతిని పక్కకు తోసేస్తుంది. నేను నీ భర్తను, ఇది మన ఇల్లు అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు దశరథ. దాంతో భార్యాభర్తలు ఇద్దరూ ఉలిక్కిపడతారు. శివన్నారాయణ వచ్చి ఎవరికీ చెప్పకుండా గడప దాటోద్దని సుమిత్రకు చెబుతాడు. కోడలి పరిస్ధితి చూసి పెద్దాయన కంటతడిపెడతాడు. మీ అమ్మకి మతిపోయినట్లుగా ఉందని జ్యోత్స్నతో చెబుతుంది పారు. లోపలికి తీసుకెళ్లి సుమిత్రకు టాబ్లెట్ వేస్తాడు దశరథ.

ఇంతలో కార్తీక్ వచ్చి ఎవరినీ గుర్తుపట్టడం లేదు అని అడగ్గా.. దశరథ ఏడుస్తూ వెళ్లిపోతాడు. డాక్టర్ గారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పమని అంటుంది. లేదంటే మనమే అమ్మగారిని తీసుకుని ఆసుపత్రికి వెళ్దామని చెబుతుంది. నేనే ఆల్రెడీ డాక్టర్ గారితో మాట్లాడాను.. వ్యాధి అనేది అందరిలో ఒకేలా ఉండదు, వారి వయసును బట్టి శారీరక సామర్ధ్యాన్ని బట్టి రకరకాలుగా ఉంటుందని చెప్పారు. ఇన్నిరోజులు తనని బతికించడానికి కూతురు ఉందన్న ధైర్యంతో సుమిత్ర మామూలుగా ఉంది, కానీ శాంపిల్స్ మ్యాచ్ కాలేదని ఎప్పుడైతే తెలిసిందే అప్పటి నుంచి లేనిపోని బెంగ పెట్టుకుంది, తన కూతురి పెళ్లి చూడకుండానే చచ్చిపోతానని అనుకుంటోందని బాధపడతాడు దశరథ. మందులు కూడా వేసుకోవడం, భోజనం చేయడం మానేసింది.. దాంతో మనుషుల్ని గుర్తుపట్టలేకపోతోంది. మీ అత్తని బతికించుకోవాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలి.. ఆపరేషన్ చేయాలంటే జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వాలని చెబుతాడు దశరథ.

మీ అత్త బతకదని నాకు అర్ధమైపోయింది.. ఉదయం లేచిన దగ్గరి నుంచి ఇంట్లో ఎవరినీ గుర్తుపట్టడం లేదు. ఏం చేయాలో ఎవరికీ అర్ధం కావడం లేదని అంటాడు. ఇంట్లో లేదని వెతుక్కుంటూ వస్తే బయటుంది. మీరు కనిపించకపోతే గేటు తీసుకుని వెళ్లిపోయేదని, ఇంత ఐశ్వర్యం ఉండి కూడా భార్యను కాపాడుకోలేకపోతున్నానని దశరథ కంటతడి పెడతాడు. దాంతో నాన్న అని దీప గట్టిగా అరుస్తుంది. నా కన్నీరు చూసి నీ గుండెల్లో పిలుపు బయటకు వచ్చిందా అని అంటాడు దశరథ. నీ తండ్రిని కాకపోయినా కాళ్లుకడిగా కన్యాదానం చేసినందుకు నాన్న అని పిలిచావా? ఈ నాన్న ఇంక బతకడు అని చెబుతాడు దశరథ. సుమిత్రమ్మకు ఏం కాదని దీప చెబుతుంది. ఏం కాదని ఎలా అంటావు? ఏ ధైర్యంతో అంటావని దశరథ ప్రశ్నిస్తాడు. అసలు కాపాడుకోవడానికి అవకాశం లేని స్థితిలో నేనుంటే, భార్య బతుకు మీద ఆశ పెట్టుకోను అని అంటాడు.

మీ అత్త ఎన్నాళ్లో బతకడని నాకు అర్ధమైపోయింది. భార్యను బతికించుకోలేని భర్తగా మిగిలిపోతే నేను తట్టుకోలేను.. అదే జరిగితే మీ అత్త కంటే ముందు నేనే చనిపోతాను అని చెప్పడంతో కార్తీక్, దీపలు కంటతడి పెడతారు. ఎంతోమంది దేవతలకు మీ అత్త పూజ చేసింది. వారిలో ఏ దేవతైనా నేనుంత కాలం బతికే ఆయుష్సు మీ అత్తకి ఇస్తే బాగుంటుందని అంటాడు. మీ అత్త లేని బతుకు నాకెందుకు అంటాడు. కార్తీక్‌ను పట్టుకుని దశరథ ఏడుస్తుండగా ఇద్దరినీ చూసి దీప కన్నీటి పర్యంతమవుతాడు. మీ అత్త బతుకుతుందని నాకు చేతిలో చేయి వేసి చెప్పమని అంటాడు దశరథ. మావయ్య పరిస్ధితి చూసి బయటకు తీసుకెళ్లి మాట్లాడతాడు కార్తీక్.

మగాడు తన జీవిత పోరాటంలో ఎంత పెద్ద యుద్ధానికైనా భయపడడు. నిద్రను, సుఖాన్ని, ఆరోగ్యాన్ని త్యాగం చేస్తాం.. ఎవరి కోసం అంటే కుటుంబం కోసం. ఫ్యామిలీ కోసం దేనినైనా వదులుకుంటాం. అలాంటి కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే మగాడికి చెప్పేది ఆ ఇంటి ఆడది. మరి ఆ ఇంటి ఆడదానికే సమస్య వస్తే భార్యను మించిన ధైర్యం, ఆ భగవంతుడు కూడా ఇవ్వలేదని చెబుతాడు. భార్య నీరసంతో పడుకుని ఉంటే భర్త తీసుకునే ఊపిరి కూడా బరువుగానే ఉంటుంది. అలాంటిది భార్య శాశ్వతంగా నిద్రపోతుందన్న ఆలోచన నిన్నెంత బాధపెడుతుందో నాకు తెలుసు అంటాడు కార్తీక్. అత్త ఎప్పటికీ ఒంటరి కాదు.. నీలోనే ఉందని ధైర్యం చెబుతాడు.

నిద్రపోతున్న తల్లి దగ్గరికి వచ్చిన దీప కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతాడు కార్తీక్. కానీ భార్య ఎక్కడా కనిపించకపోవడంతో టెన్షన్ పడతాడు. ఇంతలో దీప నేరుగా డాక్టర్ హారిక దగ్గరికి వెళ్తుంది. ఆమె మాటలు వినగానే డాక్టర్ షాక్ అవుతుంది. నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా అని సీరియస్ అవుతుంది. స్పృహలో ఉన్నాను కాబట్టే నా తల్లి పరిస్ధితి అర్ధం చేసుకుని మాట్లాడుతున్నాను, నా తల్లి మనుషుల్ని కూడా గుర్తుపట్టడం లేదు. ఇంకా లేట్ చేస్తే ఆ మనిషి ఏమైపోతుందోనని భయంగా ఉంది అని అంటుంది దీప. అందుకని బిడ్డను చంపుకుంటావా? ఒక ప్రాణం పోతుందని తేలిస్తే మరో బిడ్డను చంపుకుంటావా అని డాక్టర్ ప్రశ్నిస్తుంది. నా తల్లి రుణం నేను తీర్చుకోవాలి.. మీరు నా పరిస్ధితుల్లో ఇలాగే మాట్లాడతారా అని ఫైర్ అవుతుంది డాక్టర్.

నా తల్లిని నేను తప్పించి ఎవరూ కాపాడలేరని దీప అంటుంది. అయితే నీ బిడ్డను నువ్వు తప్పించి ఎవరూ కాపాడలేరని డాక్టర్ చెబుతుంది. పెంచిన తల్లిని పొగొట్టుకున్నాను, ఇప్పుడు కన్నతల్లిని పొగొట్టుకోలేను అంటుంది దీప. నీ కూతురు ఎలా అయితే కన్నతల్లి సంరక్షణలో పెరుగుతుందో? అలాగే కడుపులోని బిడ్డ కూడా నువ్వు ఉన్నావన్న నమ్మకంతోనే బతుకుతోందని చెబుతుంది డాక్టర్. నా తల్లిని బతికించుకోవడానికి నాకు వేరే మార్గం లేదని దీప అంటుంది. నీ తల్లిని బతికిస్తే ప్రాణదాతవి అవుతావు, నీ బిడ్డను చంపితే హంతకురాలివి అవుతావు.. తల్లి మీద ఇష్టంతో బిడ్డను చంపుతున్న కూతురిని నిన్నే చూస్తున్నాను అంటుంది డాక్టర్. నువ్వు బిడ్డను త్యాగం చేయాలని అనుకుంటున్నావని కార్తీక్‌కి తెలుసా? నీ తల్లి కోసం నా బిడ్డను ఎందుకు వదిలేస్తున్నావని కార్తీక్ అడిగితే ఏం సమాధానం చెబుతావు అని ప్రశ్నిస్తుంది డాక్టర్. మా బావతో నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను అంటుంది దీప. నీ భర్త దీనికి ఒప్పుకోడు, నేనేం చేయలేనని చెబుతుంది డాక్టర్. ఆ మాటలతో దీప కంటతడి పెడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X