Karthika Deepam 2 February 10th:సుమిత్ర కోసం కార్తీక్ త్యాగం..జ్యోత్స్నకి షాకిచ్చిన డాక్టర్, గన్ తీసిన పారు
Photo Courtesy: JioHotstar
కార్తీక్, దీపలు ఉదయాన్నే ఇంటికి వస్తుండగా సుమిత్ర ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గా.. ఎవరు మీరు అని సుమిత్ర అడగటంతో కార్తీక్, షాక్‌లు షాక్ అవుతారు. ఆ వెంటనే దశరథ బయటికొచ్చి భార్యను లోపలికి తీసుకెళ్తుండగా అతని చేతిని పక్కకునెట్టి నన్నే పట్టుకుంటావా అని భర్తపై మండిపడుతుంది. దాంతో సుమిత్రకు ఏం జరిగిందో అర్ధం కాక కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఇప్పటి వరకు తనను తన బిడ్డ కాపాడుతుందని సుమిత్రకు నమ్మకం ఉండేది కానీ ఇప్పుడు శాంపిల్స్ మ్యాచ్ కాకపోవడంతో నమ్మకం పోయిందని.. అందుకే కొన్నిరోజులుగా దిగులుగా ఉంటోందని చెబుతాడు దశరథ.
సుమిత్ర భోజనం చేయడం లేదని కనీసం టాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదని.. నా భార్య ఎక్కువ రోజులు బతకదని భయంగా ఉందని కార్తీక్‌ను హత్తుకుని ఏడుస్తాడు దశరథ. తల్లిదండ్రుల పరిస్ధితి చూసి బాధపడిన దీప నేరుగా ఆసుపత్రికి వెళ్లి.. నా బిడ్డ చనిపోయినా పర్లేదు వెంటనే నా తల్లికి ఆపరేషన్ చేయమని అడుగుతుంది. దాంతో దీపపై డాక్టర్ హారిక కోప్పడుతుంది. కడుపులోని బిడ్డను నేను చంపలేనని, ఈ విషయం కార్తీక్‌కి తెలిస్తే నేను సమాధానం చెప్పలేనని అంటుంది డాక్టర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 10వ తేదీ 590వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

దీప కనిపించకపోవడంతో కాంచనకు ఫోన్ చేసి అక్కడికి వచ్చిందా అని అడుగుతాడు కార్తీక్. ఇక్కడికి రాలేదని కాంచన చెబుతూ... కోడలి గురించి కంగారు పడుతుంది. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి హాస్పిటల్‌కు రమ్మని చెబుతుంది. అక్కడ దీపని చూడగానే మండిపడతాడు కార్తీక్. ఇక్కడికి వస్తున్నానని చెబితే నేను కూడా వస్తాను కదా అని అంటాడు. అత్తకి టాబ్లెట్స్ వాడితే సరిపోతుందని అంటాడు కార్తీక్. లేదు మా అమ్మకి టాబ్లెట్స్‌తో నయం కాదని ఏడుస్తుంది దీప. సుమిత్ర గారిని కాపాడటానికి దీప ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. తల్లి కోసం తన కడుపులోని బిడ్డను వదలుకోవడానికి సిద్ధపడిందని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. మీరు దీనికి ఒప్పుకోరని తెలిసి నేనే ఫోన్ చేశానని అంటుంది కార్తీక్.
నాకు వేరే దారి లేదని నన్ను క్షమించమని అంటుంది దీప. నా తల్లి కోసం నా ప్రాణాలు వదలాల్సి వచ్చినా నేనింత బాధపడే దానిని కాదు.. బిడ్డను వదలాలంటే నా ఆలోచనల్లో ఒక తల్లిగా నేను ఎన్నిసార్లు చనిపోయానో ఆలోచించు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయకపోతే నా తల్లి బతకదని చూస్తుంటూనే అర్ధమవుతోంది.. ఇద్దరిలో ఒకరిని వదులుకోవాలంటే తల్లి కోసం బిడ్డను వదలుకోవాలని అత్తయ్య చెప్పారు కదా అని గుర్తుచేస్తుంది దీప. నా ఇష్టమే నీ ఇష్టమే అని చెప్పమని అడుగుతుంది. నువ్వు అడుగుతుంటే.. ఒక పాప బొమ్మకి పట్టు పరికినీ వేసి నా చెల్లి కూడా ఇలాగే ఉంటుందా? నాన్న అని అడిగితే ఇంతకన్నా అందంగా ఉంటుందని చెప్పాను. నా చెల్లెలు ఎప్పుడొస్తుంది? నేను ఆడుకుంటాను అని అడిగింది.. ఇప్పుడు దానికి నేను ఏం చెప్పాలి? నీ చెల్లిని చంపేశానని చెప్పాలా? నా మనవరాలు ఏది అని అడిగితే నేను ఏం చెప్పాలి? అని అడుగుతాడు కార్తీక్.
సరే అన్న ఒక్కమాట విలువ .. నా బిడ్డ ప్రాణమని అంటాడు కార్తీక్. మా అమ్మని కాపాడు అంటూ భర్త కాళ్లు పట్టుకుంటుంది కార్తీక్. మా అమ్మ పోతే నాకు మరో అమ్మ పుట్టదని ఏడుస్తుంది దీప. ఆడది తన ప్రాణాలు పోయినాసరే బిడ్డకు జన్మనిస్తుంది.. అలాంటిది నాకు జన్మనిచ్చిన నా తల్లి కోసం నేను ఒక ప్రాణాన్ని వదులుకుంటానని అంటుంది. నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను.. నా తల్లిని బతికించమని అడుగుతుంది దీప. ఇదంతా చూసిన డాక్టర్ హారిక కన్నీటి పర్యంతం అవుతుంది. నువ్వు ఎంత చెప్పినా.. నీ భర్త ఒప్పుకోడని డాక్టర్ హారిక అనడంతో, ఒప్పుకుంటున్నానని అంటాడు కార్తీక్. ఆ మాటలతో డాక్టర్ షాక్ అవుతుంది. మీరైనా మీ భార్యకి అర్ధమయ్యేలా చెబుతారని అనుకుంటే ఇలా మాట్లాడతారేంటీ అని ప్రశ్నిస్తుంది. వెంటనే ఆపరేషన్‌కి ఏర్పాట్లు చేయమని అడుగుతాడు కార్తీక్.
నా వల్ల కావడం లేదు.. ఇంత పెయిన్‌ఫుల్ పరిస్ఠితి లైఫ్‌లో ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఫ్యామిలీ కోసం బిడ్డను త్యాగం చేస్తున్నారా? మీ ఇద్దరి కోసం చేతులెత్తి దండం పెట్టాలని ఉందని అంటుంది డాక్టర్ హారిక. సుమిత్ర గారి ఫ్యామిలీకి ఏం చెప్పాలి అని అడుగుతుంది. నేను ఏదో ఒకటి చెబుతానని కార్తీక్ అంటాడు. ఏదో ఒకటి కాదు.. నిజం చెప్పాలి. అది నా డ్యూటీ అని చెబుతుంది. కార్తీక్, దీపలు ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా డాక్టర్ హారిక హుటాహుటిన శివన్నారాయణ ఇంటికి పరిగెత్తుతుంది.
కార్తీక్, దీపలు కనిపించకపోవడంతో పారిజాతం రంకెలు వేస్తుంది. ఇంతలో శివన్నారాయణ, జ్యోత్స్నలు వచ్చి ఏం జరిగిందని అడుగుతారు. కార్తీక్, దీపలు కనిపించడం లేదని చెబుతుంది. అసలు అన్ని అనర్ధాలకు కారణం నువ్వే.. ఆ రోజు రిపోర్ట్స్ ఎలా ఇచ్చావో తెలియదు, మీ అమ్మకి ఏం అవుతుందో తెలియదు అని అంటుండగా డాక్టర్ హారిక అందుకే వచ్చానని చెబుతుంది. డాక్టర్‌ను చూసి అంతా షాక్ అవుతారు. అందరినీ పిలవండి మీకు నిజం చెప్పాలని చెబుతుంది డాక్టర్. ఆ మాటలతో పారిజాతం, జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్న వెళ్లిపోవడానికి రెడీ అవుతుండగా నేను వచ్చిందే నీకోసం .. నువ్వు ఉండాల్సిందేనని చెబుతుంది హారిక.
ఆ నిజం బయటికొచ్చిన వెంటనే డాక్టర్‌తో పాటు ఇంట్లో వాళ్లందరినీ చంపేస్తానని గన్ తీసుకుంటుంది పారిజాతం. అది చూసిన జ్యోత్స్న షాక్ అవుతుంది. డీఎన్ఏ టెస్ట్ చేసైనా నేను కూతురిని కాదని డాక్టర్ నిరూపిస్తుందని అంటుంది జ్యోత్స్న. ఈ నిజం తెలిసిన ఆ సైదులు గాడిని వదల్లేదు, ఆ డాక్టర్‌ని ఎందుకు వదులుతాను అంటుంది పారిజాతం. ఇంతలో కార్తీక్, దీపలు ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. సుమిత్ర గతం మరిచిపోయిందని.. ఇప్పుడు కొంచెం పర్లేదని, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అర్ధం కావడం లేదని బాధపడతాడు దశరథ. నేను రిపోర్ట్స్ గురించి మాట్లాడేముందు మీ మనవరాలి గురించి మాట్లాడాలని చెబుతుంది డాక్టర్ హారిక.
దీపని పిలిచి తన పక్కన నిలబడమని చెబుతుంది డాక్టర్ హారిక. అది చూసిన జ్యోత్స్నకి.. నేను సుమిత్ర కూతురిని కాదని తెలుసుకోవచ్చు, కానీ దీపే ఈ ఇంటికి వారసురాలని ఎలా తెలిసిందని అనుకుంటుంది. దీపకి, రిపోర్ట్స్‌కి ఏంటీ సంబంధం అని శివన్నారాయణ, దశరథలు అడుగుతారు. తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం అని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ముందు రిపోర్ట్స్ గురించి.. ఆ తర్వాత రిపోర్ట్స్‌కి, దీపకి ఉన్న సంబంధం గురించి చెబుతానని అంటుంది హారిక. మీ కూతురి బ్లడ్ శాంపిల్స్ అన్ని రకాలుగా ఒకటికి రెండుసార్లు టెస్ట్ చేశాం... ఫైనల్‌గా రిపోర్ట్ తాలూకా రిజల్ట్ ఏంటంటే.. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పడంతో అంతా సంతోషిస్తారు. సుమిత్రగారి కన్నకూతురి శాంపిల్స్ ఆమెతో మ్యాచ్ అయ్యాయని చెబుతుంది. ఈ కంగారులో గన్ కిందపడేస్తుంది పారిజాతం. అది చూసిన కార్తీక్‌కి అనుమానం వస్తుంది.
సుమిత్ర గారికి నేను కొన్ని మందులు రాసిస్తాను వాటిని క్రమం తప్పకుండా వాడాలి.. అలాగే ఫ్రీ మెడికేషన్ ఉంటుందని చెబుతుంది హారిక. అయితే శాంపిల్స్‌కి, దీపకి సంబంధం ఏంటీ? అని శివన్నారాయణ అడగ్గా.. తల్లి లాంటి మీ మీద కూతురి లాంటి దీప ఎంతో ప్రేమను, బంధాన్ని పెంచుకుందని చెబుతుంది. రిపోర్ట్స్ కోసం దీప ఎంతగానో ఎదురుచూసింది... అందుకే తన ముందే రిపోర్ట్స్ గురించి చెప్పాలని అనుకున్నాను అంటుంది. దీప మా కూతురి లాంటిది అంటాడు దశరథ. రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పడంతో జ్యోత్స్నపై అనుమానంగా చూస్తుంది పారిజాతం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










