Karthika Deepam 2 February 11th: జ్యోత్స్నతో పారుకు తెగిన బంధం.. శాంపిల్స్‌పై దశరథలో అనుమానం
Photo Courtesy: JioHotstar
ఇల్లంతా వెతికినా దీప జాడ కనిపించకపోవడంతో తల్లికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తాడు కార్తీక్. దీప అక్కడికి రాలేదని కాంచన చెప్పడంతో కార్తీక్ కంగారుపడతాడు. ఇంతో డాక్టర్ హారిక ఫోన్ చేసి దీప తన దగ్గరే ఉందని అర్జెంట్‌గా ఆసుపత్రి దగ్గరకి రమ్మని చెబుతాడు. సుమిత్ర గారి ప్రాణాలు కాపాడటానికి దీప తన బిడ్డను వదులుకోవడానికి సిద్ధమైందని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. నాకు వేరే దారి లేదు.. నాకు మరో తల్లి పుట్టదని, నాకు అనుమతి ఇవ్వమని దీప ప్రాధేయపడటంతో కార్తీక్ కంటతడి పెడతాడు. భార్య పరిస్ధితి, సుమిత్ర అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బిడ్డను వదులుకోవడానికి అంగీకరిస్తాడు కార్తీక్. దాంతో డాక్టర్ హారిక ఆ ఇద్దరికీ దండం పెడుతుంది.
మీ ఇద్దరి త్యాగం వృథా పోవడానికి వీల్లేదు.. వెంటనే దీప గురించి నిజం చెబుతానని కార్తీక్ ఎంత ఆపిన వినిపించుకోకుండా ఆవేశంగా శివన్నారాయణ ఇంటికి వెళ్తుంది డాక్టర్ హారిక. శివన్నారాయణ కుటుంబాన్ని పిలిచి జ్యోత్స్న గురించి నిజం చెబుతానని అంటుంది. దాంతో పారు లోపలికి వెళ్లి గన్‌తో డాక్టర్ కాల్చేస్తానని జ్యోత్స్నకి చెబుతుంది. సుమిత్ర గారి కూతురి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని హారిక చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు. ఆ మాటలు విని సుమిత్ర, దశరథ, శివన్నారాయణ సంతోషిస్తారు. నిజం చెప్పనందుకు కార్తీక్, దీపలు ఊపిరి పీల్చుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 11వ తేదీ 591వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే గుడికి వెళ్దామని కావేరి, స్వప్పలతో చెబుతాడు శ్రీధర్. అందరూ రెడీ అయి బయటికి వచ్చేసరికి శ్రీధర్ డ్రైవింగ్ సీట్లో కాకుండా పక్కనే కూర్చోవడంతో డ్రైవింగ్ ఎవరు చేస్తారని స్వప్న ప్రశ్నిస్తుంది. నాకు డ్రైవింగ్ ఇబ్బందిగా ఉందని డ్రైవర్‌ను పెట్టుకున్నాను.. అలాగే నేను ఇంటి దగ్గర లేనప్పుడు మిమ్మల్ని బయటకు తీసుకెళ్లడానికి, అలాగే ఇంటి పనుల్లో సాయం చేయడానికి అన్నింటికి ఉపయోగపడతాడని చెబుతాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అని ప్రశ్నిస్తుంది కావేరి. ఇంతలో కాశీ వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొంటాడు. అది చూసి స్వప్న, కావేరి షాక్ అవుతారు. స్వప్న కోపంతో బండి దిగి వచ్చేస్తుంది. కాశీ డ్రైవర్‌గా మన దగ్గర పనిచేయకూడదా? అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. కాశీ వచ్చింది డ్రైవర్‌గా కాదు.. నాతో కలిసిపోవడానికి అంటుంది స్వప్న.
ఈరోజు నుంచి కాశీ మన డ్రైవర్.. మనతోనే ఉంటాడు, మనతోనే తింటాడు. మన పనులన్ని చేస్తాడు.. నెలకు 25 వేల జీతం ఇస్తున్నాను అని చెబుతాడు శ్రీధర్. అయితే నేను ఈ ఇంట్లో ఉండే ఆఖరు రోజు ఇదే అవుతుందని స్వప్న చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నేను కూడా ఈ తండ్రి కూతురినే ఆయనకు నచ్చింది ఆయన చేసుకున్నప్పుడు నాకు నచ్చింది నేను చేస్తానని చెబుతుంది స్వప్న. కాశీ మాట్లాడబోతుండగా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్లిపోతుంది.
నేనే సుమిత్ర గారి కూతురిని అని నిజం చెప్పకపోవడంతో డాక్టర్‌కి థ్యాంక్స్ చెబుతుంది దీప. నిజం చెబితే సుమిత్రగారు బతకదని అంటుంది డాక్టర్. అసలు మీరు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నిస్తుంది డాక్టర్. నా స్థానంలో మీరుండి.. మీ తల్లికి ఇలాంటి పరిస్ధితి వస్తే ఏం చేస్తారని ప్రశ్నిస్తుంది దీప. ఎంత విలువైనదైనా సరే.. అది మన దగ్గర ఉన్నంత వరకు దాని విలువ మనకు తెలియదు, ఒకసారి వదులుకుని చూడండి.. మళ్లీ దక్కించుకోవడానికి జీవితం సరిపోదు. కానీ నా తల్లిని కాపాడుకోవడానికి దేవుడు నాకో అవకాశం ఇచ్చాడు. జన్మనిచ్చిన తండ్రి కన్నీళ్లు తుడవటానికి నాకు ఇంతకుమించిన అవకాశం రాదు.. దాని కోసం నా ప్రాణాలైనా వదులుకుంటానని చెబుతుంది దీప.
మీ అమ్మ ఎంతో అదృష్టవంతురాలు.. తను కూతురిని కనలేదు, అమ్మని కనిందని మెచ్చుకుంటుంది డాక్టర్ హారిక. ఆవిడ తన ప్రాణం పోసి నీకు జన్మనిస్తే.. నువ్వు నీ బిడ్డ ప్రాణం పోసి తనకి జన్మనిస్తున్నావు. ఇది మామూలు కథ కాదు.. తల్లి ప్రాణాలు కాపాడుకోవడానికి తల్లి స్థానాన్ని వదులుకుంటున్న గొప్ప కూతురి కథ. కళ్లు లేని తల్లిదండ్రుల్ని కావిట్లో మోసిన కొడుకు కథ విన్నాను.. తండ్రి కోసం యవ్వనాన్ని త్యాగం చేసిన కొడుకు కథ విన్నాను. నీలాంటి కథ నేను ఎక్కడా వినలేదు... నీ లాంటి కూతురిని కూడా చూడలేదు. మీ అమ్మ ఏం చేసిందని నీకు ఇంత ప్రేమ, మీ నాన్న ఏం చేశాడని నీకింత తపన అని ప్రశ్నిస్తుంది డాక్టర్. ఏనాడు వాళ్ల ప్రేమ.. కూతురిగా నువ్వు పొందలేదని అర్ధమవుతోందని అంటుంది.
వాళ్లిద్దరూ నాకు జన్మనిచ్చారు.. కన్నవాళ్ల ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు, అది విధిరాత. నాకు లేని అదృష్టాన్ని వాళ్లకెందుకు దూరం చేయాలి.. నా ప్రేమను వాళ్లకు పంచొచ్చు కదా అని అంటుంది. ఈ జన్మకి ఈ ఆనందం చాలు అని చెబుతుంది దీప. నీకు చేయగలిగినంత సాయం చేస్తానని చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్ హారిక. జ్యోత్స్న- పారిజాతంలు ఏం ఆలోచిస్తుంటారని అడుగుతుంది దీప. అసలు ఇలా ఎలా జరిగిందని ఆలోచిస్తూ ఉంటారని అంటాడు కార్తీక్. అక్కడ నిజంగానే జ్యోత్స్న- పారులు జరిగినదానికి ఏం అర్ధం కాక ఆలోచిస్తుంటారు.
ఆ సైదులు గాడు మోసం చేశాడు.. నా మనవరాల్నే నా చేతుల్లో పెట్టి నేనే దానిని దూరం చేసుకునేలా చేశాడు. వాడిని చంపానని అప్పుడప్పుడు బాధపడతాను కానీ, నిన్ను చంపడం తప్పే కాదని అంటుంది పారు. డాక్టర్ గారు శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని తేల్చిచెప్పేశారు.. నువ్వే సుమిత్ర కూతురివి. ఎవరు తీసిన గోతిలో వాడే పడతాడని చిన్నప్పుడు చదువుకున్నాను.. ఆ సైదులు గాడు తీసిన గోతిలో నేనే పడ్డానని పారిజాతం రగిలిపోతుంది. నువ్వు సుమిత్ర - దశరథల అసలైన కూతురివి, నేను దూరం చేసింది నా కొడుకు దాస్ కూతురిని. అసలైన నా మనవరాలిని.. చివరికి నా కొడుకు కూడా నాలాగే మోసపోయాడని బాధపడుతుంది పారు.
నా చేతులారా? నేనే మనవరాలిని దూరం చేసుకున్నాను అని అనుకుంటుంది. నువ్వు ఇక భయపడాల్సిన అవసరం లేదు.. దర్జాగా తిరగొచ్చని జ్యోత్స్నతో అంటుంది. నేను నిజంగానే సుమిత్ర కూతురినా? దీప దాస్ కూతురా? అందుకే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా? డాక్టర్ మీద అనుమానం వస్తోంది. బావకి నిజం తెలిసిపోయి నాటకం ఆడించడం లేదు కదా. బావకి నిజం తెలిస్తే నాటకం ఆడాల్సిన అవసరం లేదు. దీప- బావ ఏదో చేస్తున్నారు.. నేనిప్పుడు ఎవరి కూతురిని అని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న.
ఇంట్లో జరిగినదంతా కార్తీక్- దీపలు ఆలోచిస్తుంటారు. బిడ్డల్ని మార్చిన పారిజాతం... డాక్టర్ అబద్ధం చెప్పారని, లేదంటే తన అసలు మనవరాలు జ్యోత్స్న కాదు అనుకుంటుందని చెబుతాడు కార్తీక్. పారు పరిస్ధితి ఇలా ఉంటే.. డాక్టర్‌తో మనమే అబ్ధం చెప్పించామని, లేదంటే నేనే అసలైన సుమిత్ర కూతురిని అని జ్యోత్స్న అనుకోవచ్చు అంటాడు. ఈ మొత్తం వల్ల దశరథ మావయ్యకి. జ్యోత్స్న తన దగ్గర ఏదో నిజం దాస్తోందని.. అందుకే దాస్‌ని చంపాలని అనుకుందని మావయ్యకి అనుమానం. దశరథ మావయ్య... ఈ బ్లడ్ శాంపిల్స్ నమ్మడని అంటాడు కార్తీక్. బిడ్డ గురించి భర్త బాధపడుతుంటే కార్తీక్‌ని ఓదారుస్తుంది దీప. ఇంతలో దీపని పిలిచి స్వీట్స్ తీసుకురమ్మని చెబుతుంది సుమిత్ర. ఆమెకు స్వీట్స్ తినిపించి.. నన్ను కాపాడటానికి నా కూతురు ఉందని మురిసిపోతుంది సుమిత్ర. కార్తీక్ అనుకున్నట్లే... జ్యోత్స్నని అనుమానిస్తాడు దశరథ. పారిజాతం అదోలా ఉండటంతో శివన్నారాయణ ఏం జరిగిందని అడుగుతాడు. శాంపిల్స్ మ్యాచ్ అవ్వాలని దేవుడిని మొక్కుకున్నానని పారు చెప్పగా.. శాంపిల్స్ మ్యాచ్ కావని నీకెలా తెలుసు అని అడుగుతాడు కార్తీక్. దాంతో పారు షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











