Karthika Deepam 2 February 12th:స్వప్నకు షాకిచ్చిన శ్రీధర్, పారుని ఇరికించిన కార్తీక్.. జ్యోత్స్నకు ముచ్చెమటలు

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్న కన్నకూతురు కాదన్న నిజం దాచిపెట్టినందుకు డాక్టర్ హారికకు దీప, కార్తీక్‌లు థ్యాంక్స్ చెబుతారు. మీరు చేస్తోన్న త్యాగం ముందు నేను చేసింది చాలా చిన్నది.. తల్లిని కాపాడుకోవడంలో దీపకు ఎలాంటి సాయమైనా చేస్తానని చెబుతుంది హారిక. ఉదయాన్నే గుడికి వెళ్లేందుకు శ్రీధర్, స్వప్న, కావేరిలు కారులో కూర్చోగా.. దానిని డ్రైవ్ చేయడానికి కాశీ వస్తాడు. అది చూసి స్వప్న కోప్పడుతుంది. ఇకపై మనింట్లో కాశీ డ్రైవర్‌గా, ఇంట్లో మనిషిగా అన్ని సాయాలు చేస్తాడని.. అతనికి జీతం కూడా ఇస్తానని శ్రీధర్ చెబుతాడు. దాంతో స్వప్న సీరియస్‌గా వెళ్లిపోతుంది.

హారిక మాటలతో జ్యోత్స్న తన మనవరాలు కాదని మండిపడుతుంది పారిజాతం. ఆ సైదులు గాడిని పిల్లల్ని మార్చమంటే నా మనవరాలినే మార్చేశాడని రగిలిపోతుంది. జరుగుతున్నది నాకు తెలియడం లేదని ఇదంతా నమ్మొద్దని పారుతో అంటుంది జ్యోత్స్న. బావ -దీపలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? నేనే అసలు కూతురిని కాదని తెలిసిందా? లేక నేనే సుమిత్ర అసలైన కూతురినా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. కార్తీక్ - దీపలు బిడ్డ గురించి తలచుకుని బాధపడుతుండగా సుమిత్ర స్వీట్స్ తీసుకురమ్మని చెబుతుంది. జ్యోత్స్న విషయంలో ఏదో జరుగుతుందని దశరథకు అనుమానం వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 12వ తేదీ 592వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 592 February 12th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్నతో సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కావాలని దేవుడిని మొక్కుకుని 9 శుక్రవారాల వ్రతం చేస్తానని అనుకున్నానని అంటుంది పారు. అంటే నీకు జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావని డౌట్‌గా ఉందా? అని కార్తీక్ ప్రశ్నించడంతో అంతా షాక్ అవుతారు. శివన్నారాయణ కూడా నిలదీయడంతో ఏం చెప్పాలో తెలియక పారు కంగారు పడుతుంది. అత్తయ్య గారిని ఏం అనోద్దని, ఇన్ని రోజులు మీతో ఉండననే భయంతో మిమ్మల్ని బాధపెట్టాను. ఇప్పుడు నా కూతురు.. నాతో ఉందన్న ధైర్యం వచ్చింది. ఇక నాకేం కాదు.. నేను కొలిచే అమ్మవారే నా కూతురి రూపంలో వచ్చి నా ప్రాణాలు కాపాడుతోందని అంటుంది సుమిత్ర.

నా కూతురి పెళ్లి చూస్తానన్న నమ్మకం ఉంది.. రోజు ఉదయం నన్ను నువ్వే నిద్రలేపాలని జ్యోత్స్నతో చెబుతుంది. నేను రోజు అమ్మవారి ఫోటోకి దండం పెట్టుకుని మంచం దిగుతాను.. ఈరోజు నుంచి నా కూతురే అమ్మవారు అంటుంది సుమిత్ర. ఇప్పటి నుంచి దాని ముఖం చూశాకే నేను మంచం దిగాలని అంటుంది సుమిత్ర. నువ్వు ఎన్ని చెప్పినా జ్యోత్స్న మాత్రం నాకు పాత మనిషిలాగే కనిపిస్తోంది. ఎందుకు నేను నా కూతురిని నమ్మలేకపోతున్నానని అనుకుంటాడు దశరథ.

మరోవైపు.. కాశీని డ్రైవర్‌గా తీసుకురావడంతో శ్రీధర్‌పై కోప్పడి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది స్వప్న. ఒకప్పుడు కాశీ కావాలని ఇంట్లోంచి వెళ్లిపోయావు, ఇప్పుడు కాశీ వద్దని ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నావు. అప్పుడు మా మాట వినలేదు.. ఇప్పుడు కూడా మాట వినడం లేదని చెబుతాడు శ్రీధర్. కాశీ ఉన్న చోట నేనుండాలని తేల్చిచెబుతుంది స్వప్న. కాశీ వచ్చింది నీ కోసం కాదు.. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నాకు డ్రైవర్ కావాలి అని అంటాడు శ్రీధర్. యాక్సిడెంట్ చేసిన ట్రాక్ రికార్డ్ కూడా ఉందని స్వప్న సెటైర్లు వేస్తుంది.

మొదట్లో మన మీద మనకున్న నమ్మకం వల్ల ఒంటరి ప్రయాణం ధైర్యంగానే సాగుతుంది. దూరంగా కనిపిస్తోన్న ఎత్తయిన గుట్టల్ని దాటితే మనం అనుకున్నది సాధించినట్లేనని అనుకుంటారు. తీరా గుట్టల్ని దాటి వెళితే కానీ అర్ధం కాదు.. అప్పటికే చాలా దూరం వచ్చేస్తాం, ముందుకెళ్లాలో తెలియదు, వెనక్కి వెళ్లాలో తెలియదు. కనిపించే తీరాలు దాటేలోపు.. జీవితం అయిపోతుంది. మనం దారి తప్పామని తెలుసుకున్నా ఇక వెనక్కి రాలేం. ఎందుకంటే మనం ఇంత దూరం ప్రయాణించింది కూడా దారి తప్పే.. ఇప్పుడు చాలామంది జీవితాలు ఇలానే ఉంటున్నాయి.

చదువుకున్న డిగ్రీలు చేతిలో ఉంటే ఒంటరిగా బతకగలమని అనుకుంటున్నారు.. డిగ్రీలు సంపాదించింది జీవితానికి ఒంటరితనాన్ని పరిచయం చేయడానికి కాదని చెబుతాడు శ్రీధర్. మీరు కోరుకునే స్వేచ్ఛలో ఒంటరితనం ఉంది.. మేం కోరుకునే స్వేచ్ఛలో కుటుంబం ఉందని అంటాడు. మనం నలుగురం కలిసే ఉందామని అంటాడు. కాశీ ఉన్న చోట నేనుండలేను.. ఇలాంటి మనిషితో బతకడం కంటే ఎడారిలో చావడం మేలని అంటుంది స్వప్ప. నేను కాశీని మా కంపెనీ తరపున డ్రైవర్‌గా పెట్టానని చెబుతాడు శ్రీధర్. నువ్వు ఎక్కడికి వెళ్లినా అక్కడికొచ్చి వెతుకుతాను.. ఈరోజు నుంచి కాశీ కూడా నా డ్రైవర్‌గా ఇక్కడే ఉంటాడని తేల్చేస్తాడు శ్రీధర్.

జ్యోత్స్నని దేవతని చేసి మా అత్త భుజాల మీద మాటల పల్లకిని మోస్తోందని దీపతో అంటాడు కార్తీక్. జ్యోత్స్న ముఖం చూస్తే కానీ నిద్రలేవదట.. ప్రాణం పోసేదెవరు? ప్రశంసలు అందుకునేదెవరు? నా వల్ల కావడం లేదని మండిపడతాడు. చేసిన తప్పులకి జ్యోత్స్నని అరెస్ట్ చేసి జైళ్లో కూర్చోబెట్టాలని అంటాడు కార్తీక్. నా జీవితంలో నువ్వు కలిసెంత వరకు నేను ఎవరినీ పట్టించుకునేవాడిని కాదు. నేను చేయాలనుకున్నది చేయలేకపోవడానికి కారణం జ్యోత్స్న. అలాంటి మనిషికి నీకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు, నువ్వు పొందాల్సిన ప్రేమానురాలు తన సొంతం అవుతుంటే తట్టుకోలేకపోతున్నానని అంటాడు కార్తీక్.

నా తల్లి క్షేమంగా ఉంటే చాలు.. నవ్వుతూ ఉంటే చాలు. ఆ నవ్వే నాకు బహుమతి, ఆ నవ్వే నేను కోరుకునే గౌరవ మర్యాదలు అంటుంది దీప. నువ్వు కోరుకోకపోవచ్చు కానీ నేను కోరుకోవచ్చు. అమ్మ ప్రాణాల కోసం అమ్మతనాన్నే పణంగా పెట్టిన కూతురిని ఏమనాలని అడుగుతాడు. ఈ పూలతో పూజించాలి.. ఏ రాళ్లతో గుడికట్టాలి.. అంత గొప్ప త్యాగం చేస్తుంటే దూరంగా నిలబడతావా? రేపు నిజం చెప్పినా కూడా జ్యోత్స్నే మా అసలు కూతురని అంతా అనుకుంటారని చెబుతాడు కార్తీక్. డాక్టర్ గారు వచ్చినప్పుడు పారు గన్ తీసుకొచ్చిందని కార్తీక్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పించాం కదా.. ఇప్పుడు వాళ్లిద్దరూ ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారని చెబుతాడు కార్తీక్.

ఇంతలో అక్కడికి కాంచన, శ్రీధర్‌లు రావడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. లోపల కాంచనకి సుమిత్ర స్వీట్ తినిపించగా.. జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని శివన్నారాయణ చెప్పడంతో కాంచన సంతోషిస్తుంది. మా అమ్మ పరిస్ధితి నీకు రాకూడదని వెయ్యి మంది దేవుళ్లకు మొక్కుకున్నాను.. వదిన లేకపోతే ఈ ఇంటికి వెలుగే లేదని చెబుతుంది కాంచన. ఇకపై అందరూ కన్నీళ్లకు శాండఫ్ ఇవ్వాలని చెబుతాడు శ్రీధర్. జ్యోత్స్న, పారుల ముఖం చూస్తే డల్‌గా ఉండటంతో శ్రీధర్‌కి అనుమానం వస్తోంది.

నాకంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది.. శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అయ్యాయని అంటుంది పారు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. జ్యోత్స్న, పారుల ముఖంలో భయం దేనికి అని దశరథకి అనుమానం వస్తుంది. నువ్వెందుకు హ్యాపీగా లేవని జ్యోత్స్నని ప్రశ్నిస్తాడు శ్రీధర్. మమ్మీ బాధ చూసి బాధపడేదానిని, ఆపరేషన్ అంటే స్కిన్ కట్ చేస్తారు కదా నాకు బాధగా అనిపించిందని అనడంతో కార్తీక్ చప్పట్లు కొడతాడు. జ్యోత్స్న మేడం గారు ఎందుకు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారో నీకు క్లారిటీ వచ్చిందా? అని పారుని కార్తీక్ అడుగుతాడు. దాంతో అదేంటో చెప్పమని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. దాంతో ఇరుక్కుపోయానని పారు షాక్ అవుతుంది. జ్యోత్స్న ఎవరికీ తెలియని విషయాన్ని పిన్నితో చెప్పినట్లుగా ఉందని దశరథ అనడంతో పారుకు చెమటలు పడతాయి. ఈలోపు అందరికీ జ్యూస్‌లు ఇస్తుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X