Karthika Deepam 2 February 14th: జ్యోత్స్నని చితకబాదిన పారు.. దీప ప్రవర్తనపై కాంచనలో అనుమానం

Photo Courtesy: JioHotstar

సుమిత్ర బ్లడ్ శాంపిల్స్‌తో జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావడంతో అంతా సంతోషిస్తారు. జ్యోత్స్నను కాంచన దగ్గరికి పిలిచి నీకు జన్మనిచ్చిన తల్లి ప్రాణాలు కాపాడే అదృష్టం నీకు దక్కిందని.. ఇకపై మా వదినను కంటికి రెప్పలా కాపాడమని చెబుతుంది. ఆ మాటలతో దీప, కార్తీక్‌లు బాధపడతారు. కార్తీక్‌ను పక్కకి పిలిచిన దశరథ కారులో ఓ చోటికి తీసుకెళ్లమని చెబుతాడు. నేనే అసలు కూతురినా? లేక దీప సుమిత్ర కూతురా? అని తెలియాలంటే వెంటనే దాస్‌ని కలవాలని బయల్దేరుతుంది జ్యోత్స్న. ఆ వెంటనే ఆమెను పారిజాతం ఫాలో అవుతుంది.

డాక్టర్ హారిక దగ్గరికి కార్తీక్‌తో కలిసి వెళ్లిన దశరథ.. అసలు నిజంగానే జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయా? లేదా? అని నిలదీస్తాడు. సుమిత్ర గారి ప్రాణాలను కాపాడేది కన్నకూతురేనని డాక్టర్ చెప్పడంతో దశరథ శాంతిస్తాడు. ఇంటికి వెళ్తూ బిడ్డను కాపాడటానికి ఏదైనా పరిష్కారం ఉందా? అని ప్రశ్నిస్తాడు కార్తీక్. అలాంటి ఛాన్స్ లేదని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ కంటతడి పెడతాడు. దాస్ చెప్పిన మాయమాటలకు పడిపోయిన రౌడీలు అతని కట్లు విప్పేసి మందు కొట్టి పడిపోతారు. ఇదే అదనుగా తప్పించుకుంటాడు దాస్. ఇంతలో అక్కడికి వచ్చిన జ్యోత్స్నకి దాస్ కనిపించకపోవడంతో కంగారుపడుతుంది. ఇదంతా చూసిన పారిజాతం తన మనవరాలిపై రగిలిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 14వ తేదీ 594వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 594 February 14th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

కాంచన తనను గుడికి తీసుకెళ్తానని చెప్పడంతో చంపుకునే బిడ్డ కోసం పూజలెందుకు అని ఆలోచిస్తుంది. దీప ముఖం డల్‌గా ఉండటం చూసి అనసూయ.. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? ఇంకో బిడ్డ పుడితే ఏం చేయాలా? అని ఆలోచిస్తున్నావా? నీ ఇద్దరు బిడ్డల్ని కార్తీక్ బాబు చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అని చెబుతుంది. ఇంతలో శౌర్య.. బాబు బొమ్మ వేసి నాకు తమ్ముడు పుడితే ఇలా ఉంటాడని అంటుంది. నాకు చెల్లి కావాలని అడుగుతుంటే పెద్ద నాన్నమ్మ తమ్ముడు పుడతాడని చెప్పింది? నాకు ఎవరు పుడతారు అని అడగటంతో కార్తీక్, దీపలు బాధపడతారు.

తర్వాత దీప కడుపుని పట్టుకుని నేను మీ అక్కని... నువ్వు నా చెల్లెలివా? తమ్ముడివా? అని అడుగుతుంది. తమ్ముడికైతే ఏ పేరు పెట్టాలి? చెల్లెలికైతే ఏ పేరు పెట్టాలి? అని ప్రశ్నిస్తుంది దీప. గుడికి ఎవరూ వెళ్లొద్దని దీప అనడంతో అంతా షాక్ అవుతారు. కడుపుతో ఉన్న ఆడవాళ్లు పూజ చేయొచ్చా అని ప్రశ్నిస్తుంది. నువ్వు చేయకూడదు.. మేం చేయొచ్చు అని అంటుంది కాంచన. నేను గుడికి రాలేనని దీప ఏడుస్తూ వెళ్లిపోవడంతో కాంచన మండిపడుతుంది. ఇలాగైతే కష్టం.. మీ ఆవిడకు ఏమైంది? మీ ఇద్దరితో మాట్లాడాలని కార్తీక్‌తో అంటుంది.

దాస్ ఎక్కడా కనిపించకపోవడం, ఇంటికి రాకపోవడంతో జ్యోత్స్న కంగారుపడుతుంటుంది. ఇంతలో పారిజాతం వచ్చి నా కొడుకు కనిపించడం లేదని చెప్పాను కదా? ఏమైందో తెలిసింది అంటుంది. దాస్‌ని కిడ్నాప్ చేశారని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దాస్‌ని కార్తీక్, దీపలు కిడ్నాప్ చేసి ఓ ఇంటిలో దాచిపెట్టారు.. అక్కడ ఇద్దరు రౌడీలు కూడా ఉన్నారని వెళ్లి కాపాడదామని పారు చెప్పడంతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి. కార్తీక్ గాడి మీద డౌట్ వచ్చి వాడిని ఫాలో అయ్యాను, వాడు ఆ ఇంట్లోకి వెళ్లగా.. అక్కడ దాస్ గాడు ఉన్నాడు అంటుంది.

నువ్వు పొరపాటు పడుతున్నావు.. బావకి దాస్‌ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటీ? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. మరి ఎవరు చేసుంటారని పారు అడగ్గా.. నాకెలా తెలుస్తుందని జ్యోత్స్న అడగ్గా లాగిపెట్టి కొడుతుంది పారు. నా కొడుకు ఏమయ్యాడో తెలియదు, కానీ నీకు తెలుసు.. వాడి గురించి నీకు ఎన్నోసార్లు చెప్పాను. కానీ నువ్వు అబద్ధాలతో కవర్ చేశావు.. వాడి కోసం నేను వెతుకుతూనే ఉన్నాను. నా కొడుకుని కిడ్నాప్ చేసి దాచిపెట్టావు.. ఇదంతా నేను చూశానని పారు చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది.

కార్తీక్, దీపలను పిలిచిన కాంచన .. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతానని భార్యాభర్తలిద్దరూ షాక్ అవుతారు. మనిషితో కొంతకాలం కలిసి నడిచిన తర్వాత కూడా అర్ధం కావడం లేదంటే ఇక కలిసుండటం దండగ అంటుంది కాంచన. నాకు దీప అర్ధం కావడం లేదు.. మొన్నటి వరకు నీ భార్య బాధపడుతుంది అంటే అత్త కోసం అన్నావు. ఇప్పుడు జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయి అందరూ సంతోషంగా ఉన్నారు. నీ భార్యకు ఏమైంది.. ఎప్పుడు చూసినా ఆ కంట్లో కన్నీళ్లు అలాగే ఉంటాయని మండిపడుతుంది కాంచన. కడుపుతో ఉన్న ఆడది ఇలాగేనా ఉండేది.. నచ్చింది వండించుకుని తినాలి. మీ నాన్న ముందు ఏడిస్తే మీ నాన్న ఆనంద భాష్పాలు అంటున్నాడు. ఇప్పుడు పూజకి రాను అని దీప చెబుతోంది.. మరి ఇవి ఆనంద భాష్పాలా? లేక దాయలేనంత భారం గుండెల్లో ఉందా? అని ప్రశ్నిస్తుంది కాంచన.

నేను గుడికి రాను అంటే నా మనసు బాలేదని అర్ధం చేసుకోవచ్చు కదా అని దీప అంటుంది. నిన్ను బాధపెట్టడానికి ఇక్కడ ఎవరున్నారు? ఎవరి వల్ల కష్టపడుతున్నావని నిలదీస్తుంది కాంచన. నీ భర్త నిన్ను పల్లెత్తు మాట అనడు, నేను నిన్ను వేధించను, ఆడపడుచు పోరు లేదని చెబుతుంది. అయినా దీప ఏడుస్తూనే ఉండటంతో కోడలిని దగ్గరికి పిలిచి.. నా బిడ్డకు ఏం కానివ్వను అని చెప్పావు, ఆ మాటకే కట్టుబడి ఉంటానని చేతిలో ఒట్టేసి చెప్పమని అడుగుతుంది కాంచన. దాంతో కార్తీక్ వచ్చి నువ్వు నాన్నతో కలిసుంటానని మాటివ్వు అని తల్లిని అడగటంతో కాంచన షాక్ అవుతుంది. దాంతో దీప చేతిని వదిలేస్తుంది.

నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పమని జ్యోత్స్నని చితకబాదుతుంది పారిజాతం. నీ కారణంగా నా మనవరాలు పోయింది, ఇప్పుడు నా కొడుకు కూడా పోయేలా ఉన్నాడని చెబుతుంది. మా నాన్నని నేనే కిడ్నాప్ చేశానని ఒప్పుకుంటుంది జ్యోత్స్న. నీ కొడుకు నా మీద కోపంతో నేను అసలైన వారసురాలిని కాదని ఈ ఇంట్లో అందరికీ చెప్పేస్తానని అన్నాడు. అసలు నీ ఈ ఇంటి వారసురాలిని చంపాలని అనుకున్నావు.. నేను సేఫ్ అయినా, నీ ఆలోచన గురించి తాతకి తెలియగానే నిన్ను వదిలేస్తాడా గన్‌తో షూట్ చేస్తానని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. రిపోర్ట్స్‌ని నేను నమ్మను నీ మనవరాలిని అంటుంది జ్యోత్స్న. దాస్ వస్తే ఇక్కడికి రావాలి.. లేదంటే బావని కలవాలని అంటుంది.

బావకి నిజం తెలియగానే పోలీసులతో ఇక్కడికి వస్తాడు.. అయినా నువ్వు శివన్నారాయణ గారి మనవరాలివి, డాక్టర్ గారి రిపోర్ట్స్ వాడి ముఖాన కొడతావని అంటుంది. నువ్వు డాక్టర్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేశావా? లేదంటే రిపోర్ట్స్ నిజమే అంటుంది. అప్పుడు నువ్వు సుమిత్ర కూతురివి.. కళ్యాణి కూతురు ఎక్కడుందో ఏంటోనని బాధపడుతుంది పారిజాతం. డాక్టర్ ఈ డ్రామా ఆడటం వెనుక ఎవరో ఉన్నారని ఆ నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది జ్యోత్స్న. మరోవైపు.. కాంచన అడిగిన ప్రశ్నల గురించి కార్తీక్, దీపలు ఆలోచిస్తుంటారు. మనం ఏం చేయబోతున్నామో, ఏం ఆలోచించబోతున్నామో అమ్మ అర్ధం చేసుకుంటుంది, లేదంటే మనల్ని దూరం పెట్టేదని అంటాడు కార్తీక్. భర్త, తండ్రి చెప్పినా వినలేదు.. కనీసం కొడుకు చెప్పినా వింటే అమ్మ బాగుపడుతుందని చెబుతాడు. బిడ్డను క్షేమంగా మీ చేతుల్లో పెడతానని మాటిచ్చాను.. కానీ మాట తప్పిన మనిషిగా జీవితాంతం మిగిలిపోవాల్సిందేనా? అత్తయ్య ఆ మోసాన్ని క్షమించలేదు.. అప్పుడు ఈ ఇంట్లో నుంచి అత్తయ్య వెళ్లిపోతుందని అంటుంది దీప. పుట్టబోయే బిడ్డ మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పమని భర్తతో అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X