Karthika Deepam 2 February 16th: డాక్టర్‌ హారికపై హత్యాయత్నం.. కాపాడిన కార్తీక్, దాస్‌కి నిజం చెప్పిన కాశీ

Photo Courtesy: JioHotstar

ఉదయాన్నే గుడికి వెళ్లాలని కాంచన చెప్పగా.. నేను రాలేనని కంటతడి పెట్టుకుంటుంది దీప. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ప్రాణం చూసుకునే భర్త, అత్త ఉండగా నీ బాధేంటీ అని మండిపడుతుంది. నీ భార్యకు ఏమైంది రా? ఎందుకిలా ఏడుస్తోందని కార్తీక్‌ను అడుగుతుంది. నా బిడ్డకు ఏం కానివ్వను అని మాటిచ్చావు, దానికి కట్టుబడి ఉంటావా? అని చేతిలో చేయ్యేసి అడుగుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి నువ్వు మా నాన్నతో కలిసుంటానని మాటివ్వు అని అడగటంతో కోడలి చేయి వదిలేస్తుంది కాంచన. నా కొడుకుని కిడ్నాప్ చేసింది నువ్వేనని జ్యోత్స్నని చితకబాదుతుంది పారిజాతం.

మనిద్దరం సేఫ్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే దాస్‌ని కిడ్నాప్ చేయించానని జ్యోత్స్న చెప్పడంతో మండిపడుతుంది. నీ కొడుకు ఇక్కడికి రాలేదంటే, బావని కలవడానికి వెళ్లాడని అనుకుంటుంది జ్యోత్స్న. రిపోర్ట్స్ నాకు అనుకూలంగా రావడం వెనుక ఎవరున్నారో కనుక్కోవాలని నిర్ణయించుకుంటుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 16వ తేదీ 595వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 595 February 16th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

అత్తయ్య బిడ్డ మీద ఆశలు పెంచుకుంటోంది.. అలా వద్దని చెప్పమని భర్తతో చెబుతుంది దీప. ఇది నా వల్ల కాదు.. అమ్మ నీకు పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది నేను చెప్పలేను అంటాడు కార్తీక్. ఇప్పటికే ఎన్నో బరువులు మోస్తున్నాను, ఇక నా వల్ల కాదని చెబుతాడు. మావయ్య నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లాడని, ఆయనకు జ్యోత్స్న మీద అనుమానం వచ్చిందని కార్తీక్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. డాక్టర్ గారు సేవ్ చేశారని అంటాడు. మావయ్య వెళ్లిపోయాక నేను మరోసారి డాక్టర్‌తో మాట్లాడాను.. ఆపరేషన్ తర్వాత బిడ్డ బతికుండటానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అని అడిగాను. కానీ ఆశలు వదిలేసుకోమని చెప్పిందని.. ఆ మాట వినగానే నా పరిస్ధితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోమని కంటతడి పెడతాడు కార్తీక్. ఏ పూజలు నా బిడ్డను బతికించలేవుని అర్ధమైపోయింది.. అలాంటప్పుడు మా అమ్మకి ఏ నిజం చెప్పను అని ప్రశ్నిస్తాడు కార్తీక్. నేను చెప్పలేనంటూ దీప ఒడిలో పడుకుని ఏడుస్తాడు.

ఉదయాన్నే తండ్రిని చూసి షాక్ అవుతాడు కాశీ. ఆరోజు బుద్ధి తక్కువయి నీతో అలా మాట్లాడాను.. లైఫ్‌లో జ్యోత్స్నని నమ్మనని చెబుతాడు. కాంచన అత్త శ్రీధర్ మావయ్యతో మాట్లాడి స్వప్నని నన్ను కలిపే ప్రయత్నం చేసింది. కానీ స్వప్న నాకు విడాకులు కావాలని చెప్పింది.. మావయ్య మాట విని డ్రైవర్‌గా జాయిన్ అయ్యాయని అంటాడు కాశీ. మీ ఆవిడ మంచి పనే చేసింది.. పెద్దవాళ్లు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయని అంటారు. మా అమ్మ చేసిన పాపానికి నా పిల్లల జీవితాలు ఈ రకంగా తయారయ్యాయని చెబుతాడు. ఆ మాటలతో కాశీ షాక్ అవుతాడు. నేనొక్కడినే కదా నీకు ఉంది.. మరి పిల్లల జీవితాలు నానమ్మ వల్ల నాశనం అయ్యాయని చెబుతావేంటీ అని ప్రశ్నిస్తాడు కాశీ. నాకు తోడబుట్టిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నిస్తాడు. ఏదో మాట వరుసకు చెప్పానని కవర్ చేస్తాడు దాస్.

నానమ్మ పెద్ద పాపమే చేసుండాలి.. నువ్వు చెబుతున్నావంటే నీకు కూడా తెలుసుండాలని కాశీ నిలదీస్తాడు. ఊరికే నువ్వు ఏది మాట్లాడవు, ఇక్కడ లేని మనిషి గురించి నువ్వు మాట్లాడావంటే ఏదో జరిగిందని అంటాడు. మీ అమ్మ బాగోగులు మా అమ్మ చూసుకోలేదు, లేదంటే నా కళ్యాణి బతికుండేది.. ఆ బాధతోనే అలా అన్నానని చెబుతాడు దాస్. కోడలి కోపాన్ని ఎలా పొగొట్టాలో ఆలోచించు.. ఇక జ్యోత్స్న జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇస్తాడు దాస్. నాకు చేసిన అన్యాయానికి జ్యోత్స్న అంతు చూసేవాడిని.. కానీ ఇప్పుడు సుమిత్ర పెద్దమ్మని కాపాడబోతోందని వదిలేశానని అంటాడు కాశీ.

పెద్దమ్మకు బ్లడ్ క్యాన్సర్ కదా.. జ్యోత్స్న అక్కే బోన్ మ్యారో ఇచ్చి పెద్దమ్మని కాపాడాలని చెబుతాడు. బ్లడ్ శాంపిల్స్ మొదట మ్యాచ్ కాలేదని అన్నారు కదా అని అడుగుతాడు దాస్. మొదటిసారి మ్యాచ్ కాలేదు.. కానీ రెండోసారి మ్యాచ్ అయ్యింది.. పెద్దమ్మని ట్రీట్ చేస్తున్న డాక్టర్ హారిక గారే స్వయంగా వచ్చి చెప్పారని అనడంతో దాస్ షాక్ అవుతాడు. జ్యోత్స్న సుమిత్ర వదిన కూతురు కాదు కదా? మరి శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయని అనుకుంటాడు దాస్. కాశీ చెప్పిన మాటలతో ఆసుపత్రిని వెతుక్కుంటూ బయల్దేరతాడు దాస్.

డాక్టర్ సుమిత్రను కలిసిన జ్యోత్స్న పక్కకి తీసుకెళ్లి ఏదో మాట్లాడాలని చెబుతుంది. దాంతో బ్లడ్ శాంపిల్స్ గురించి మాట్లాడాలని అనుకుంటుందని భావించిన డాక్టర్.. వెంటనే కార్తీక్‌కి ఫోన్ చేస్తుంది. ఆ మాటలు కార్తీక్ వింటాడు. నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదన్నారు.. తర్వాత అయ్యిందన్నారు, రెండు సార్లు బ్లడ్ ఇచ్చింది నేనే అయినప్పుడు రెండు సార్లు రిపోర్ట్స్ ఒకేలా రావాలి కదా అని అంటుంది జ్యోత్స్న. మొదటిసారి నిజమైతే, రెండోసారి అబద్ధం ఎందుకు చెప్పారు? అబద్ధం ఎవరైనా చెప్పించారా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నువ్వు సుమిత్రగారి కూతురివే కదా? అని డాక్టర్ ప్రశ్నించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంతలో దాస్ అక్కడికి వస్తాడు.

నువ్వే సుమిత్రగారి కూతురివి అయినప్పుడు ఏ రిపోర్ట్ నిజం.. ఏ రిపోర్ట్ అబద్ధమో నీకు తెలియదా? అని డాక్టర్ ప్రశ్నించడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. రెండోసారి మ్యాచ్ కావడానికి ఏం చేశారని నిలదీస్తుంది జ్యోత్స్న. మిమ్మల్ని చూస్తుంటే మీ అమ్మగారి ప్రాణాలు కాపాడటం ఇష్టం లేనట్లుగా ఉంది.. ఆపరేషన్ అంటే భయం వల్ల కావచ్చని అంటుంది డాక్టర్ హారిక. ఇంతలో వారిద్దరూ మాట్లాడుకోవడం దాస్ చూస్తాడు. మీకు ఇబ్బంది అయితే మీ నాన్నగారికి నేనే చెబుతానని డాక్టర్ హారిక ఫోన్ చేసి చెప్పడంతో జ్యోత్స్న కంగారుపడుతుంది. మీరే మా మమ్మీని కాపాడగలరని అంటుంది జ్యోత్స్న. ఆపరేషన్‌లో ఏదైనా మిస్టేక్ జరుగుతుందన్న భయంతోనే ఇదంతా అడిగాను, నేనొచ్చిన విషయం ఎవరితోనూ చెప్పకండి అని బతిమలాడుతోంది. ఇదంతా చూసిన దాస్... ఆ డాక్టర్.. జ్యోత్స్నకి అమ్ముడుపోయిందని, ఆపరేషన్ జరిగితే సుమిత్ర వదిన చనిపోతుందని భయపడి డాక్టర్‌ను చంపాలని అనుకుంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి ఆపుతాడు.

గుడికి ఎందుకు రాను అన్నావని దీపపై మండిపడుతుంది కాంచన. ఇంతలో శ్రీధర్ వచ్చి స్వీట్స్ ఇస్తాడు. మీ అత్తయ్య గారికి నీ చేతితో స్వీట్స్ ఇవ్వాలని దీపకి ఇవ్వగా.. అమ్మ పెడితే నానమ్మ అస్సలు తీసుకోదని అంటుంది శౌర్య. నానమ్మతో అమ్మ మాట్లాడటం లేదని అంటుంది. ఆ మాటలతో శ్రీధర్ షాక్ అవుతాడు. ఏం జరిగిందని ప్రశ్నిస్తాడు శ్రీధర్. కడుపుతో ఉన్న ఆడవాళ్లు ఇష్టమైనవి తినాలని, ఈ స్వీట్స్ నేనే చేయించి తీసుకొచ్చాను, నీ ఇష్టం గురించి ఆలోచించిన వాడిని నీ గురించి ఆలోచించనా? అసలు ఏం జరిగిందని దీపని అడుగుతాడు శ్రీధర్. మీ గురించే గొడవ అయ్యిందని జరిగిందంతా చెబుతుంది దీప.

జ్యోత్స్నకు అమ్ముడు పోయిన డాక్టర్‌ని చంపేస్తానని రగిలిపోతున్న దాస్‌ని ఆపుతాడు కార్తీక్. డాక్టర్ హారిక గారికి అన్నీ తెలుసు.. నీకే కొన్ని తెలియాలని చెబుతాడు. ఈయన మావయ్య అని.. సుమిత్ర గారి అసలైన కూతురు మావయ్యకి కూడా తెలుసని అంటాడు కార్తీక్. జ్యోత్స్న మిమ్మల్ని ఎందుకు కలిసిందో చెప్పమని అడుగుతాడు. దాంతో జరిగినదంతా చెబుతుంది డాక్టర్ హారిక. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X