Karthika Deepam 2 February 17th: జ్యోత్స్నపై అనుమానం..డాక్టర్‌ను వెంటాడుతోన్న దశరథ.. కార్తీక్‌కి దాస్ క్లాస్

Photo Courtesy: JioHotstar

అత్తయ్య మన బిడ్డ మీద ఆశలు పెంచుకుంటోందని.. అలా పెంచుకోవద్దని నువ్వే చెప్పాలని కార్తీక్‌తో అంటుంది దీప. అది నా వల్ల కాదు .. నేను చెప్పలేనని భార్య ఒడిలో పడుకోని కంటతడి పెడతాడు కార్తీక్. ఉదయాన్నే తండ్రిని చూసి షాక్ అవుతాడు కాశీ. నువ్వు మారతావని అనుకోలేదని దాస్ అనగా.. జరిగిన తప్పు తెలుసుకోవడానికి ఇంత టైం పట్టిందని అంటాడు కాశీ. జీవితంలో జ్యోత్స్నని నమ్మను, క్షమించనని చెబుతాడు. నా జీవితాన్ని నాశనం చేసినందుకు జ్యోత్స్నని చంపేద్దామని అనుకున్నాను.. కానీ సుమిత్ర పెద్దమ్మని కాపాడాల్సింది జ్యోత్స్న అక్కేనని వదిలేశాని అంటాడు కాశీ. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదు కదా అని దాస్ అనగా.. ముందు మ్యాచ్ కాలేదు, కానీ తర్వాత డాక్టర్ గారే స్వయంగా మ్యాచ్ అయ్యాయని చెప్పారని కాశీ అనడంతో దాస్‌కి అనుమానం వచ్చి నేరుగా హాస్పిటల్‌కి వెళ్తాడు.

హాస్పిటల్‌లో డాక్టర్ హారికని జ్యోత్స్న కలిసి బ్లడ్ శాంపిల్స్ ఎలా మ్యాచ్ అయ్యాయని ప్రశ్నిస్తుంది. నీకు శాంపిల్స్ మ్యాచ్ కావడం కావాలా? వద్దా? అని డాక్టర్ కౌంటర్ వేయడంతో జ్యోత్స్న సైలెంట్ అయిపోతుంది. ఇదంతా చూసిన దాస్.. జ్యోత్స్నతో డాక్టర్ చేతులు కలిపిందనుకుని ఆమెను చంపాలని అనుకుని వెళ్తుండగా కార్తీక్ ఆపుతాడు. జరిగిదంతా చెప్పడానికి డాక్టర్ హారిక గారి దగ్గరికి వెళ్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 17వ తేదీ 596వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 596 February 17th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

మీ మావయ్య వచ్చి ఎలా అయితే బ్లడ్ శాంపిల్స్ గురించి అడిగారో జ్యోత్స్న కూడా అలాగే అడిగింది. నేను సీరియస్‌గా సమాధానం చెప్పేసరికి వెళ్లిపోయిందని అంటుంది హారిక. మీరు చాలా అలర్ట్‌గా ఉండాలి.. నిజం తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తోంది. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడటానికి ఏదో ఒకటి చేసేలా ఉందని కార్తీక్‌ను హెచ్చరిస్తుంది డాక్టర్. రేపు ఆపరేషన్ చేసేటప్పుడు అయినా దీప గురించి చెప్పాల్సిందే.. అదేదో ముందే చెప్పేయండి అంటుంది హారిక. ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఎవరికి దీప గురించి చెప్పలేను.. మీరు ఎంత నిర్లక్ష్యం ప్రాబ్లమ్ అంత పెద్దది అవుతుంది. దీపే సుమిత్ర గారి ఒరిజనల్ డాక్టర్ అని అందరికీ చెప్పడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమని చెబుతుంది డాక్టర్ హారిక.

ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ మీకు కొంచెం రిలీఫ్ దొరుకుతుందని అంటుంది. మీరు ఈ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేస్తారోనని భయంగా ఉందని, మా అత్త కోసం కొన్నిరోజులు నిజం దాచాల్సిందేనని అంటాడు కార్తీక్. జ్యోత్స్నకి కార్తీక్ ఎందుకు భయపడుతున్నాడు.. వాడు చెప్పకపోతే ఏంటీ? నేను నిజం చెప్పేస్తానని అనుకుంటాడు దాస్. జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే నిజం ఏంటో మీ మావయ్యతో చెప్పేయండి అని సలహా ఇస్తుంది డాక్టర్ హారిక. రెండోదే చేయాలని ఆ పని ఈరోజే చేయాల్సిందేనని దాస్ కోపంగా వెళ్లిపోతాడు. కార్తీక్ మాత్రం ఈ నిజాన్ని ఎన్నాళ్లు దాయగలడు, దశరథ గారికైనా చెప్పాల్సిందని అనుకుంటుంది డాక్టర్.

డాక్టర్ హారికను కలిసినట్లు పారిజాతానికి చెబుతుంది జ్యోత్స్న. కానీ ఈ విషయం ఇంట్లో చెప్పొదని అంటుండగా ఈ మాటలు విన్న దశరథ ఎందుకు? అని ప్రశ్నిస్తాడు. ఇంతలో శివన్నారాయణ రావడంతో ఏం జరిగిందని అడుగుతాడు. డాక్టర్ హారికను జ్యోత్స్న కలిసింది. ఈ విషయం ఇంట్లో తెలియకూడదని భయపడుతోందని చెబుతాడు దశరథ. మమ్మీ హెల్త్ కండీషన్ బాలేదు కదా.. ముందుగానే ఆపరేషన్ చేస్తారేమోనని అడగాలని వెళ్లాలని చెబుతుంది జ్యోత్స్న. అంటే మీ అమ్మకి ఈ ఆపరేషన్ ఎప్పుడు చేయాలో కూడా డాక్టర్ గారికి తెలియదా అని దశరథ మండిపడతాడు. నాకు చెబితే నేను కూడా వచ్చేవాడిని.. అయినా నీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, త్వరలోనే ఆపరేషన్, అలాంటప్పుడు ఎందుకు బాధపడాలని ప్రశ్నిస్తాడు దశరథ. మీ అమ్మకి ఏం కాదన్న హ్యాపీ మూడ్‌‌లోనే ఉన్నాను. కానీ నువ్వు మాత్రం బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయిన దగ్గరి నుంచి కొంత బెంగ పెట్టుకున్నావని అంటాడు దశరథ. ఆ మాటలతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. అది బెంగా? లేక భయమా? అని అడుగుతాడు దశరథ.

అయితే డాక్టర్ గారికి ఫోన్ చేసి.. తనను నువ్వు ఏం అడిగావో? అది నేను కనుక్కుంటానని దశరథ అనడంతో జ్యోత్న్సకి ముచ్చెమటలు పడతాయి. సుమిత్ర కూతురు ఇదే అయినప్పుడు ఎందుకు భయపడుతోంది. ఇదేదో తప్పు చేసినట్లే ఉందని పారిజాతం అనుకుంటుంది. నా మీద నమ్మకం లేకపోతే ఫోన్ చేయమని జ్యోత్స్న రివర్స్ డ్రామా ఆడుతుంది. నా భయాలు.. నాకుంటాయని అంటుంది. తను ఆడపిల్ల.. పైగా కన్నతల్లికి ఇలాంటి పరిస్ధితి రావడం తనే తల్లిని రక్షించుకోవాలని అనుకోవడం చాలా పెద్ద బాధ్యత అని శివన్నారాయణ నచ్చచెబుతాడు. తల్లికి క్యాన్సర్ అని నిజం చెప్పాలని అనుకోవడం, టాబ్లెట్స్ డస్ట్ బిన్‌లో వేయడం వంటి తప్పులు చేసిందని దశరథ చెబుతాడు. జ్యోత్స్న కొన్ని విషయాల్లో భయస్తురాలని శివన్నారాయణ అంటాడు. మిస్టేక్ నాలో లేదు.. టెస్టింగ్ సరిగా చేయని ఆసుపత్రిదే తప్పని జ్యోత్స్న ఆరోజే చెప్పింది కదా అని అంటాడు పెద్దాయన. నా అనుమానం కూడా అదే నాన్న.. రెండోసారి శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అయ్యాయో తెలుసుకోవాలని అనుకుంటాడు దశరథ. ఇదంతా బావ గేమ్‌లా ఉంది.. అయినా దీపే ఈ ఇంటి వారసురాలని నిజం తెలిస్తే ఈపాటికే డాడీకి చెప్పేసేవాడని అనుకుంటుంది జ్యోత్స్న.

నా కొడుక్కి నా కంటే వాళ్ల అమ్మ అంటేనే చాలా ఇష్టం.. నేను కన్నీళ్లు పెట్టుకుంటే ఓదారుస్తాడు, అదే వాళ్లమ్మ పెట్టుకుంటే తట్టుకోలేడు. నా విషయంలో మీ అమ్మని రిక్వెస్ట్ చేయమని నేను ఎన్నోసార్లు అడిగాను. కానీ వాళ్లమ్మని బాధపెట్టే పని చేయలేదు. అలాంటి వాడు నా విషయంలో తల్లిని ప్రశ్నించాడంటే ఆశ్చర్యంగా ఉందని దీపతో అంటాడు శ్రీధర్. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించానని చెబుతాడు. కానీ కాంచన నిన్ను అడిగిన మాటను కవర్ చేయడానికి కార్తీక్ మరో మాట అడిగి బంధాన్ని ముడిపెట్టాడంటే మీరిద్దరూ చాలా పెద్ద ప్రాబ్లమ్‌ని ఎదుర్కొంటున్నారని, అది ఏంటని శ్రీధర్ అడగటంతో దీప షాక్ అవుతుంది.

మీ ఇద్దరి మధ్యా దాపరికాలు ఉండవు, తల్లితో అన్న మాట వెనుక ఏదో ఉంది.. అదేంటో చెప్పమని బతిమలాడతాడు శ్రీధర్. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త.. కాంచన చాలా చిన్న వయసులోనే కన్నతల్లిని పొగొట్టుకుంది. తండ్రి ప్రేమతోనే పెరిగింది, నీ కూతురిని నా కొడుక్కిచ్చి పెళ్లిచేయమని దశరథ దగ్గర మాట తీసుకుంది. నీకు పుట్టబోయే బిడ్డని చూడటమే మీ అత్తగారి జీవిత లక్ష్యం.. నీకు చిన్న దెబ్బ తగిలినా సరిపెట్టుకుంటుంది కానీ, కడుపులోని బిడ్డకు ఏం జరిగినా కాంచన భరించలేదని శ్రీధర్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. నా కొడుకు వారసత్వాన్ని నా భార్య చేతుల్లో చూసేందుకు ఎదురుచూస్తున్నానని శ్రీధర్ చెప్పి వెళ్లిపోగానే దీప కన్నీటి పర్యంతమవుతుంది.

అసలు నువ్వు ఇన్నిరోజులు ఏమైపోయావని దాస్‌ని కార్తీక్ అడగ్గా.. నన్ను జ్యోత్స్న కిడ్నాప్ చేసిందని చెబుతాడు దాస్. మనం వదిలేస్తే జ్యోత్స్న చాలా అరాచకాలు చేస్తుంది.. అది నా కూతురేనని అందరికీ చెప్పేస్తానని అంటాడు దాస్. కడుపుతో ఉన్న దీపని చంపాలనుకున్నది జ్యోత్స్నే అని దాస్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇంతలో డాక్టర్ హారికని దశరథ కలుస్తాడు. మీరెందుకు ప్రతిసారి నన్ను కలుస్తున్నారని ప్రశ్నిస్తుంది డాక్టర్. జ్యోత్స్న మీ కన్నకూతురు కాదనుకుంటున్నారా అని హారిక అడగటంతో దశరథ షాక్ అవుతాడు. నాకు జ్యోత్స్న రిపోర్ట్స్ కావాలని దశరథ అడగటంతో డాక్టర్ షాక్ అవుతుంది. నా ట్రీట్‌మెంట్ మీద మీకు నమ్మకం లేదా అని ప్రశ్నిస్తుంది డాక్టర్. సెకండ్ ఓపీనియన్ కోసం నేను వేరే డాక్టర్‌ని కలవాలని అనుకుంటున్నానని చెబుతాడు దశరథ. ఆ మాటలతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. రిపోర్ట్స్ మీకు నేనే మెయిల్ చేస్తానని డాక్టర్ కంగారుగా వెళ్లిపోతుంది. నేను ఈ ప్రెజర్ భరించలేను.. ఏదో ఒకటి చేయమని కార్తీక్‌నే అడగాలని అనుకుంటుంది డాక్టర్ హారిక. నిజం చెప్పేద్దామని కార్తీక్‌ని రెచ్చగొడతాడు దాస్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X