Karthika Deepam 2 February 19th: దశరథకు నిజం చెప్పిన కార్తీక్.. దాస్‌పై నోరుజారిన కాశీ, జ్యోత్స్న అలర్ట్

Photo Courtesy: JioHotstar

జ్యోత్స్నని ఇలాగే వదిలేస్తే ఎన్నో దారుణాలు చేస్తుంది.. అవసరమైతే సుమిత్ర వదినను కూడా చంపేస్తుందని కార్తీక్‌ను దాస్ హెచ్చరిస్తాడు. ఇంతలో సుమిత్ర ఫోన్ చేసి మీ మావయ్య రిపోర్ట్స్ అడుగుతున్నారు.. ఈ ప్రెజర్ నేను తట్టుకోలేకపోతున్నానని చెబుతుంది. దాంతో జ్యోత్స్న రిపోర్ట్స్‌ని మావయ్యకి మెయిల్ చేసేయమని చెబుతాడు కార్తీక్. ఆ మాటలతో దాస్, డాక్టర్ షాక్ అవుతారు. రేపటితో తాడోపేడో తేల్చుకుంటానని కార్తీక్ చెప్పి ఇంటికి వస్తాడు. రేపు దీపతో కలిసి గుడికి వెళ్తున్నానని చెప్పడంతో కాంచన సంతోషించగా.. భర్త మాటలతో దీప షాక్ అవుతుంది.

శివన్నారాయణతో మాట్లాడుతుండగా దశరథకు డాక్టర్ హారిక.. రిపోర్ట్స్‌ని మెయిల్ చేస్తుంది. అవి చూసిన దశరథ షాక్ అవుతుండగా కార్తీక్ ఫోన్ చేసి రేపు నీకు అన్ని నిజాలు చెబుతానని అంటాడు. సుమిత్రతో జ్యోత్స్న మాట్లాడుతుండగా రేపు ఉదయంతో చాలా విషయాలకు సమాధానాలు దొరుకుతాయని చెబుతాడు దశరథ. ఆ మాటలు విన్న జ్యోత్స్నకు తండ్రి మీద అనుమానం వస్తుంది. నువ్వు ఏదో చేయబోతున్నావని అర్ధమవుతుందని కార్తీక్‌తో అంటుంది దీప. ఉదయాన్నే కార్తీక్‌ని కలిసిన దశరథ .. దాస్‌, దీప, శౌర్యలపై జ్యోత్స్న అటాక్ చేయించినప్పటి నుంచి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వని విషయం వరకు చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 19వ తేదీ 598వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 598 February 19th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

నిజం తెలియకుండా నేను ఆపరేషన్‌కి వెళితే మీరంతా కలిసి నా భార్యను చంపేసేవాళ్లు.. నువ్వేమో నీ కూతురే సుమిత్ర అత్తని కాపాడుతుందని అంటున్నావని కార్తీక్‌పై మండిపడతాడు. ఇంతలో దాస్ వచ్చి కార్తీక్ ఉండగా వదిన ప్రాణానికి ఏం కాదు.. అలాగని జ్యోత్స్న వదినని కాపాడలేదని చెబుతాడు. కార్తీక్ మీ వదిన ప్రాణాల్ని ఎలా కాపాడుకుంటాడు.. జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావడం లేదు కదా అని అంటాడు దశరథ. ఎన్నిసార్లు చేసినా జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అవ్వవు అంటాడు దాస్. ఎందుకంటే జ్యోత్స్న నీ కన్నకూతురు కాదు కాబట్టి అని కార్తీక్ అనడంతో దశరథ షాక్ అవుతాడు.

టిఫిన్ చేయడానికి అందరూ కూర్చొంటుండగా ఇంకో ప్లేట్ పెట్టమని కావేరికి చెబుతాడు శ్రీధర్. ఇంకో ప్లేట్ ఎవరికి? ఉన్నది మన ముగ్గురమే కదా అని ప్రశ్నిస్తుంది స్వప్న. కాశీని శ్రీధర్ పిలవగా.. స్వప్న లేచి వెళ్లిపోతుంది. నాకు డ్రైవర్‌తో కూర్చొని టిఫిన్ చేయడానికి ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ మనిషితో కలిసి టిఫిన్ చేయడానికి చాలా ప్రాబ్లమ్‌గా ఉందని చెబుతుంది స్వప్న. నువ్వు కూర్చోమన్నా నేను కూర్చొను... నా కారణంగా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదని చెబుతాడు కాశీ. అలాగైతే నువ్వు ఈ ఇంటికే రాకూడదు... కారు డ్రైవర్ కారు దగ్గరే ఉండాలి కానీ లోపలికి వస్తాడా? అని మండిపడుతుంది స్వప్న.

తను టిఫిన్ చేస్తే నీకెంటీ ప్రాబ్లమ్.. కాశీని నువ్వు భర్తగా చూస్తున్నావా? ఎవరో అనుకోవచ్చు కదా అని శ్రీధర్ అంటాడు. ఇంట్లో ఉండొద్దు అన్నావు.. బయట ఎక్కడో ఉంటున్నాడు. మనతోనే ఉన్నప్పుడు మనతోనే కలిసి తింటాడని చెబుతాడు శ్రీధర్. కాశీని నువ్వు వద్దు అనుకున్నప్పుడు అతను ఎక్కడ ఉంటే నీకెందుకు? ఏం తింటే నీకెందుకు అని ప్రశ్నిస్తాడు. ఒక మనిషి కనిపించగానే మనం లేచి వెళ్లిపోతున్నామంటే ఆ పని ప్రతిసారి, ప్రతిచోటా చేయాలి.. నువ్వు ప్రతిసారి చేయగలవా? అని నిలదీస్తాడు శ్రీధర్. ఒక డ్రైవర్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి.. నేను ఆ రూల్స్‌లోనే ఉంటానని కింద కూర్చొంటాడు కాశీ. దాంతో అంతా షాక్ అవుతారు. తను నీ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని శ్రీధర్ చెప్పగా.. నా భయం కూడా అదేనని, తను ఎప్పుడేం చేస్తాడో తనకే తెలియదని అంటుంది స్వప్న. ఇంతలో కాశీకి టిఫిన్ వడ్డించిన స్వప్న దూరంగా ప్లేట్ పెడుతుంది.

జ్యోత్స్న నా కన్నకూతురు కాదంటే నమ్మలేకపోతున్నాను.. నా భార్య ప్రసవించగా మొదటిసారిగా బిడ్డను ఎత్తుకుంది నేనే. ఆరోజు నుంచి ఈరోజు వరకు నా చేతుల్లోనే పెరిగింది. దాని ప్రవర్తన, పద్ధతి వేరుగా ఉండొచ్చు . జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కాకపోవచ్చు... కానీ జ్యోత్స్న నా కూతురే కాదంటే నేను ఎలా నమ్మాలని ప్రశ్నిస్తాడు దశరథ. అత్త ప్రసవించాక బిడ్డను తొలుత పొత్తిళ్లలోకి తీసుకున్నది నువ్వే.. నువ్వు తీసుకున్న బిడ్డే జ్యోత్స్న. నువ్వు బిడ్డను ఎత్తుకోవడానికి ముందే అసలు కథ మొదలైందని చెబుతాడు కార్తీక్. అత్త ప్రసవించిన కాసేపటికే బిడ్డల్ని మార్చేశారు.. నీ కూతురు అంతస్తుల్ని దిగి నేలకు చేరుకుంది. మరొకరి కూతురు నీ కూతురు స్థానంలో ఊయలలోకి చేరుకుంది.. నీ కూతురు పరాయిదైంది, మరొకరి కూతురేమో మన రెండు కుటుంబాలకు ఈ ఊరికి దూరమైపోయిందని చెబుతాడు కార్తీక్.

బిడ్డల్ని మార్చాల్సిన అవసరం ఎవరికి ఉంది అని దశరథ ప్రశ్నించగా.. స్వార్ధంతో నిండిన ఈ సమాజంలో మంచితనం, మానవత్వం లేకుండా బంధువుల రూపంలో మనతోనే ఉన్నారని చెబుతాడు కార్తీక్. వాళ్లు ఎవరు? అని దశరథ అడగ్గా... మా అమ్మ అని చెబుతాడు దాస్. ఆ మాటలతో దశరథ షాక్ అవుతాడు. తాత మీద పగతో బిడ్డల్ని మార్చేసింది.. ఇదంతా కళ్లతో చూసిన ప్రత్యక్ష సాక్షి దాస్ మావయ్యేనని చెబుతాడు కార్తీక్. బిడ్డల్ని కళ్లముందే మార్చినా .. ఏమీ చేయలేని అసమర్ధుడిని అంటాడు దాస్. పిన్ని నా కూతురిని అనాథను చేసి, ఎవరో బిడ్డను నా కూతురిని చేయడం ఏంటి అని ప్రశ్నిస్తాడు దశరథ. జ్యోత్స్న ఎవరి బిడ్డో కాదు.. దాస్ మావయ్య కూతురు అని కార్తీక్ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు.

నాకు, కళ్యాణికి పుట్టిన బిడ్డే జ్యోత్స్న.. మా అమ్మ కావాలనే తన మనవరాలిని నీ ఇంటి వారసురాలిని చేసింది. ఎందుకంటే తనని చిన్నచూపు చూస్తోన్న శివన్నారాయణ గారి మీద కోపం మొదటి కారణమైతే, శివన్నారాయణ గారు నన్ను ఇంట్లో నుంచి గెంటేయడం రెండో కారణమని చెబుతాడు దాస్. తనను అన్నిరకాలుగా అవమానించిన కుటుంబం మీద పారు పగ తీర్చుకోవాలని అనుకుంది. సొంత మనవరాలు కాబట్టి జ్యోత్స్న అంటే పారుకి చాలా ఇష్టం.. సొంత మనవరాలు కాబట్టే జ్యోత్స్నని చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచిందని చెబుతాడు కార్తీక్. జ్యోత్స్న నీ కూతురు కాదన్న నిజం.. జ్యోత్స్నకి కూడా తెలుసు. ఈ నిజం బయటకు రాకుండా ఉండేందుకు జ్యోత్స్న, పారులు అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నారు. నిజం చెప్పొద్దని దాస్ మావయ్య దగ్గర మాట తీసుకుంది, కానీ ఎక్కడ నీకు నిజం చెబుతాడోనని జ్యోత్స్న కన్నతండ్రినే చంపాలనుకుందని చెబుతాడు కార్తీక్. మీరిద్దరూ నా దగ్గర ఇన్ని నిజాలు దాచారా? అని కార్తీక్, దాస్‌లపై మండిపడతాడు దశరథ.

తన మనవరాలు జ్యోత్స్న కాదని తెలిసి పారిజాతం బాధపడుతుండగా శివన్నారాయణ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఇంతలో కాశీ, శ్రీధర్‌లు అక్కడికి రావడంతో అంతా షాక్ అవుతారు. గుళ్లు పట్టుకుని తిరుగుతున్నావా? అని కాశీపై పారు సెటైర్లు వేస్తుంది. గుళ్లు పట్టుకుని తిరగాల్సిన అవసరం నా అల్లుడికి లేదని చెబుతాడు శ్రీధర్. భార్య పొమ్మన్నది.. మావయ్య గారు తరిమేశారు ఇంకా ఎక్కడికి పోతాడని జ్యోత్స్న సెటైర్లు వేస్తుంది. నీ మనవడిని డ్రైవర్‌గా పెట్టామని శివన్నారాయణ చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. కాశీ చేస్తున్న పని వెనుక ఒక ప్రయోజనం ఉందని చెబుతాడు పెద్దాయన. తండ్రి కనిపిస్తే బాధ ఎందుకు ఉంటుందని కాశీ అనడంతో .. పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఈ ఇంటికి రాకుండా కాశీని దాస్ కలవడం ఏంటీ? అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.

నీకు నిజాలన్నీ తెలిసి మా మధ్యే తిరుగుతున్నావా అని కార్తీక్‌పై మండిపడతాడు దశరథ. జ్యోత్స్న నా కూతురు కాదు.. దాస్ కూతురు, మరి నా కూతురు ఎవరు? ఎక్కడుంది? ఎలా ఉంది? తనెవరో నీకు తెలుసా? అసలు బతికుందా? మా పిన్ని చంపేసిందా? అని దశరథ కంటతడి పెడతాడు. నీ కూతురు బతికే ఉంది.. ఇక్కడే ఉంది, నీకోసం నీ కూతురిని కూడా తీసుకొచ్చానని చెబుతాడు కార్తీక్. నీ కూతురు ఎవరో చూపిస్తానని దశరథని తీసుకెళ్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X