Karthika Deepam 2 February 20th: జ్యోత్స్న‌పై పగతో రగిలిపోతోన్న దశరథ... పారుతో జ్యోత్స్న క్రూరమైన ప్లాన్

Photo Courtesy: JioHotstar

ఎన్నిసార్లు శాంపిల్స్ టెస్ట్ చేసినా జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ కావని దాస్ అనగా... ఎందుకు అని దశరథ ప్రశ్నిస్తాడు. ఎందుకంటే జ్యోత్స్న నీకూతురు కాదు.. దాస్ మావయ్య కూతురని కార్తీక్ అనడంతో దశరథ షాక్ అవుతాడు. శివన్నారాయణ గారి మీద కోపంతో పారు బిడ్డల్ని మార్చేసిందని.. ఇప్పుడు నీ దగ్గర పెరుగుతున్న జ్యోత్స్న ఎవరో కాదు.. స్వయంగా దాస్ మావయ్య కూతురు అని కార్తీక్ చెప్పడంతో దశరథ నిర్ఘాంతపోతాడు. ఎక్కడ ఈ నిజం బయటపడుతుందోనని దాస్ మావయ్యని జ్యోత్స్న చంపాలని అనుకుందని, దీప మీద అటాక్ చేయించిందని చెబుతాడు కార్తీక్.

ఇంట్లో అందరూ టిఫిన్ చేస్తూ కాశీకి కూడా టిఫిన్ వడ్డించమని చెబుతాడు శ్రీధర్. కాశీని చూడగానే లేచి వెళ్లిపోతుంది స్వప్న. దాంతో కూతురికి గట్టిగా క్లాస్ పీకుతాడు శ్రీధర్. నేను కింద కూర్చొని తింటాను, ఎందుకంటే నేను డ్రైవర్‌ని అని కాశీ చెప్పడంతో శ్రీధర్, కావేరి బాధపడతారు. చిరికి కాశీకి టిఫిన్ వడ్డించి టీపాయ్ మీద పెడుతుంది స్వప్న. కాశీని వెంటపెట్టుకుని శివన్నారాయణ ఇంటికి వెళ్తాడు శ్రీధర్. కాశీని చూసిన పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. మా నాన్న నన్ను కలిశాడు బాగానే ఉన్నాడని కాశీ చెప్పగా.. జ్యోత్స్నకి తనకి ఏదో జరగబోతోందని డౌట్ వస్తుంది. ఇన్నిరోజులు ఇన్ని నిజాలు నా దగ్గర ఎందుకు దాచారు? నా కూతురు బతికే ఉందా? ఉంటే ఎక్కడుందని దశరథ కుమిలిపోతాడు. నీ కూతురు ఇక్కడే ఉంది.. ఆమెను నీ కోసమే తీసుకొచ్చామని చెబుతాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 20వ తేదీ 599వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 599 February 20th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

కాశీతో బయటకొచ్చి సీక్రెట్‌గా మాట్లాడతారు పారు, జ్యోత్స్న. నీ వల్లే నేను నా భార్యకు దూరమయ్యానని కాశీ మండిపడతాడు. ప్రపంచమంతా ఏటో పరిగెడుతుంటే వీడేంటీ పెళ్లాం.. పెళ్లాం అని కలవరిస్తాడని సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. నీకు పెళ్లయి ఉంటే వాడి బాధ తెలిసేది.. నిన్ను ఎవడూ పెళ్లి చేసుకోడని అంటుంది పారు. దాస్ బాబాయ్ కనిపించాడు కదా ఏమైనా చెప్పాడా? అని అడుగుతుంది జ్యోత్స్న. మా నాన్న గురించి నీకెందుకు అని మండిపడతాడు కాశీ. నువ్వు చేసినదానికి జీవితాలు నాశనమైపోతున్నాయి.. నీకు ప్రేమ విలువ తెలియదు కాబట్టే మనుషుల్ని తేలికగా వదులుకుంటావని మండిపడతాడు కాశీ.

నీ ఖాతాలలో బలైనవాళ్ల లిస్ట్‌లో వీడు కూడా ఒక్కడు. నీ దెబ్బకు ఆధార్ కార్డ్ చూపించడానికే జనం భయపడుతున్నారు. ఈవిడగారు మళ్లీ ఎవరి జీవితాన్ని నాశనం చేసిందని ప్రశ్నిస్తాడు కాశీ. ముందు మీ నాన్న ఏం చెప్పాడో చెప్పమని దబాయించి అడుగుతుంది జ్యోత్స్న. ఏం చెప్పలేదు.. బావని కలుస్తానని చెప్పి వెళ్లాడని కాశీ అనగానే జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. నీలాంటి దానికి ఇవన్నీ చెప్పడం కూడా వేస్ట్ అని ఛీకొట్టి వెళ్లిపోతాడు. దాస్ నా గురించి బావకి నిజం చెబితే అని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. ఏం చెప్పినా నీకు నష్టం లేదు.. సుమిత్ర కూతురివని అంటుంది పారు. ఏదో జరగబోతోంది.. గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని అనుకుంటుంది జ్యోత్స్న.

పిన్ని, దాస్, నువ్వు అంతా నన్ను మోసం చేశారు.. నా కూతురు ఎక్కడుంది? చూపించమని బాధపడతాడు దశరథ. టైం వచ్చే వరకు నిజం బయటపడదు. ఈరోజుతో నీ కూతురు ఎవరో నీకు తెలిసే టైం వచ్చిందని జ్యోతుల మధ్య దీపంలా వెలిగిపోతున్న నీ కూతురిని చూడమని చెబుతాడు కార్తీక్. అక్కడ దీపను చూడగానే దశరథ షాక్ అవుతాడు. దీపే నీ కూతురని, మా వదిన దగ్గరి నుంచి దూరం చేసిన బిడ్డే దీప అని దాస్, కార్తీక్‌లు చెబుతారు. నువ్వే కన్నతండ్రివి అని దీపకి తెలుసని అంటాడు కార్తీక్. దాంతో గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటాడు దశరథ. వెళ్లి దీప ముందు నిలబడి సంతోషంగా చూస్తుంటాడు.

చిన్నయ్య గారు కూడా గుడికి వస్తున్నారని నాకెందుకు చెప్పలేదని కార్తీక్, దాస్‌లని అడుగుతుంది దీప. దశరథ కంట్లో కన్నీళ్లు ఉండటంతో దీప తుడవబోతుంది.. చిన్నయ్య గారికి ఏం జరిగిందని అడుగుతుంది. చిన్నయ్య గారు కాదు.. నాన్న అని పిలవమని చెబుతాడు దశరథ. కోరుకున్న ప్రతిసారి నేను అలా పిలవలేనని అంటుంది దీప. కన్నతండ్రి మీద కన్నకూతురి కంటే అధికారం ఎవరికి ఉంటుందని అడుగుతాడు దశరథ. మీ నాన్నకి నువ్వే కూతురివి అని నిజం చెప్పేశామని.. కార్తీక్ అనడంతో దీప కంటతడి పెడుతూ దశరథను హత్తుకుంటుంది. ఇకపై నాన్న అనే పిలుపును నువ్వు గొంతులో దాచుకోవద్దు.. మనస్పూర్తిగా నాన్న అని పిలవొచ్చని చెబుతాడు కార్తీక్. కళ్లముందున్న కూతురిని గుర్తించడానికి ఈ తండ్రికి ఇంతకాలం పట్టిందని దాస్ అంటాడు.

వాడు మేనల్లుడు నిజం తెలిసినా ఇన్నాళ్లూ దాచాడు. నువ్వు నా కన్నకూతురివే కదా.. నీ కళ్లముందే వేరొకరిని అభిమానిస్తున్నా, ఎలా తట్టుకున్నావు. ఆడదాని కన్నీటి బరువుని భూదేవి కూడా మోయలేదంటారు. అలాంటి కన్నీటిని నేల మీద పడకుండా, మా కంటికి కనిపించకుండా గుండెల్లో ఎలా మోశావని ప్రశ్నిస్తాడు దశరథ. తెలిసిన కాసేపటికీ నా కూతురు ఎక్కడుంది అని అడిగాను. నా తండ్రి మనసు కన్నబిడ్డ కోసం అంతలా తాపత్రయపడిందని అంటాడు దశరథ. నా ఆకలి తీరడానికి దేవుడు ప్రసాదం కాదు.. కడుపు నిండా భోజనం పెట్టాడు. మీ నుంచి నాకు తెలియకుండానే దూరమయ్యాను, అలాగే తెలియకుండానే దగ్గరయ్యానని బాధపడుతుంది దీప. మీరు నన్ను చూసినప్పుడు తొలుత అమ్మ దీప అని పిలిచారు.. మీరు పిలిస్తే నాకు పెంచిన తండ్రి గుర్తొచ్చాడని చెబుతుంది దీప.

మీరే నా కన్నతండ్రి అని తెలిసిన తర్వాత నేనే మీ కన్నబిడ్డనని చెప్పుకోలేకపోయానని అంటుంది దీప. అది నేనే చెప్పొద్దని కార్తీక్ అంటాడు. ఈ నిజాలన్నీ ఎవరు దాయమన్నారు? నాతో దీపని నిజం ఎందుకు చెప్పనివ్వలేదని అడుగుతాడు దశరథ. దీపని, శౌర్యని చంపాలనుకుంది జ్యోత్స్నే.. దీపే శివన్నారాయణ గారి అసలైన మనవరాలని తెలిసిన దగ్గరి నుంచి దీపని ఆ ఇంటికి ఏ రకంగా దూరం చేయాలా అని చూస్తోంది. దీపకి, దాస్‌కి, జ్యోత్స్నకి ఏదో సంబంధం ఉందని నువ్వే ఒకసారి చెప్పావు కదా? అది ఇదే. కానీ దీపే అసలైన వారసురాలని దాస్ మావయ్యకి, నాకు జ్యోత్స్నకి, దీపకి తప్పించి ఇంకెవ్వరికీ తెలియదు. పారుకి తెలిస్తే ఎక్కడ నోరుజారుతుందోనని దాస్ మావయ్యని దీప చెప్పనివ్వలేదు. ఆసుపత్రిలో పిల్లల్ని మార్చింది ఒకప్పుడు మనింట్లో పనిచేసిన సైదులు.. వాడితోనే నిజం అంతరించిపోవాలని పారు వాడిని చంపించింది. తన మనవరాలి కోసం పారు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేది.. ఇప్పుడు ఆ పని జ్యోత్స్న చేస్తోందని చెబుతాడు కార్తీక్.

నేను దీపని పెళ్లి చేసుకున్న తర్వాత మీరంతా నాతో మాట్లాడటం మానేశారు. మీరంతా ప్రమాదంలో ఉన్న సంగతి మాకు తెలుసు. మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాలేదు. అదే సమయంలో దీపకి ఆపరేషన్ చేయాల్సి రావడం, నా దగ్గర డబ్బులు లేకపోవడం, జ్యోత్స్న నాతో అగ్రిమెంట్ మీద సంతకం పెడితేనే డబ్బులు ఇస్తానని చెప్పింది. అలా మీ ఇష్టం లేకుండానే మీ ఇంట్లో అడుగుపెట్టాం. అవమానాలు భరించి మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాం. అత్తకి జ్యోత్స్న ఎందుకు నిజం చెప్పాలనుకుంది? టాబ్లెట్స్‌ని డస్ట్ బిన్‌లో వేయాలని ఎందుకు అనుకుందో నీకు అర్ధమై ఉంటుందని అంటాడు కార్తీక్. జ్యోత్స్నని అత్త దేవతలా చూసుకుంటోంది.

నిజం చెబితే అత్త ఏమవుతుందోనని భయంగా ఉంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, అందుకే నిజం చెప్పలేకపోయామని అంటాడు కార్తీక్. దీపకి పుట్టబోయే బిడ్డకు కూడా ఆస్తిలో హక్కుంటుందని తెలిసి దీప బిడ్డను జ్యోత్స్న చంపాలనుకుంది. ఆస్తి కోసం జ్యోత్స్న ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని చెబుతాడు కార్తీక్. ఇదంతా నాకు తెలియనంత వరకే తన ఆటలు.. ఇప్పుడు తెలిసింది కదా ఏం చేస్తానో చూడని దశరథ కోపంతో ఊగిపోతాడు. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీసులతో ఇంటికి వెళ్తానని కోపంతో వెళ్లిపోతాడు. దాస్, దీప, కార్తీక్‌లు ఎంత చెబుతున్నా వినిపించుకోడు.

బావని కలవకుండా దాస్‌ని దారిలోనే ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది జ్యోత్స్న. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుండగా పారు అడ్డొస్తుంది. నువ్వు శివన్నారాయణ గారి అసలైన వారసురాలివి, ఓడిపోయింది నేను అంటుంది పారు. ఈసారి ఆట బావ మొదలుపెట్టాడు.. మనం తెలియకుండానే అందులోకి వెళ్లిపోయామని అంటుంది పారు. ఆట కార్తీక్ మొదలుపెట్టుంటే ఈపాటికి నీకు మంగళ హారతులు ఇచ్చే కార్యక్రమం మొదలయ్యేదని అంటుంది పారు. ఎక్కడికి సాగనంపడానికి అని జ్యోత్స్న అడగ్గా... పోలీస్ స్టేషన్‌కి అంటుది పారు. నువ్వు నా సొంత మనవరాలివి కాదు అని ప్రూవ్ చేయడానికి డాక్టర్ హారిక ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి.. కానీ నువ్వే దాస్ కూతురివి అని ప్రూవ్ చేయడానికి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నిస్తుంది పారు. కానీ నీ పాపం పండింది.. దాస్ కిడ్నాప్ సంగతి ఎక్కడ బయటపడుతుందనే భయంతో నాన్న అంటున్నావా అని జ్యోత్స్నపై మండిపడుతుంది పారు. నువ్వు ఎవరో ఆడుతున్న గేమ్‌లో తిరుగుతున్నావని ప్రశ్నిస్తుంది పారు. పిల్లల్ని మార్చి పెద్ద తప్పే చేశావని జ్యోత్స్న చెప్పడంతో పారు భయపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X