Karthika Deepam 2 February 23rd: దాస్- దశరథలపై జ్యోత్స్నలో అనుమానం.. బిడ్డ కోసం కార్తీక్ కంటతడి

Photo Courtesy: JioHotstar

నేను నీ మనవరాలిని అవునో, కాదో తర్వాత సంగతి ముందు దాస్‌ని ఆపాలని పారుతో గొడవ పడుతుంది జ్యోత్స్న. దాస్, దశరథలు కనిపించడం లేదు.. దీప, కార్తీక్‌లు ఇంకా డ్యూటీకి రాలేదు. ఏదో జరగబోతోందని జ్యోత్స్న చెప్పడంతో వెంటనే కాంచనకు ఫోన్ చేసి దీప, కార్తీక్‌ల గురించి అడుగుతుంది పారు. వాళ్లిద్దరూ గుడికి వెళ్లారని కాంచన చెప్పడంతో .. అంతా గుడిలో కలుసుకున్నారా అని మనం కూడా వెళ్లాలని చెబుతుంది జ్యోత్స్న. వాళ్లిద్దరూ గడప దాటుతుండగా శివన్నారాయణ చూసి ఇద్దరినీ లోపలికి వెళ్లమని చెబుతాడు.

జ్యోత్స్న అంతు చూస్తానని ఆవేశంగా వెళ్తున్న దశరథను దాస్, కార్తీక్, దీపలు ఆపుతారు. అమ్మకు ఆపరేషన్ జరిగే వరకు ఈ నిజం ఎవరికీ చెప్పొద్దని దశరథ దగ్గర ఒట్టు వేయించుకుంటుంది దీప. దాస్‌ మావయ్య నీకోసం ఎంతో తపన పడ్డాడని కార్తీక్ చెప్పడంతో దాస్‌ని క్షమిస్తాడు దశరథ. తర్వాత నలుగురూ కలిసి సంతోషంగా దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తారు. అయితే కడుపులోని బిడ్డను వదులుకోబోతున్నట్లు దశరథకు చెప్పబోతుండగా కార్తీక్‌ని దీప ఆపుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 23వ తేదీ 601వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 601 February 23rd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని జ్యోత్స్న, పారిజాతంలు ఎంత ట్రై చేసినా శివన్నారాయణ అక్కడే ఉండటంతో ఏం చేయాలో అర్ధం కాదు. మీ తాత ఈరోజు అక్కడి నుంచి కదిలేలా లేడు అని అంటుంది పారు. ఇంతలో నిజం తెలిసిన తర్వాత మొదటిసారి దీప, కార్తీక్‌లని తీసుకుని ఇంటికి వస్తాడు దశరథ. అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు జ్యోత్స్న, పారులు వస్తుండగా వీరు ముగ్గురు గుమ్మం దగ్గర ఎదురుకావడంతో షాక్ అవుతుంది. దశరథ ముఖం తేడాగా ఉండటంతో పారు, జ్యోత్స్నలకు అనుమానం వస్తుంది. ఎక్కడికి వెళ్లొద్దు.. నీతో చిన్నపని ఉందని, నా కూతురికి ఎర్రనీళ్లు తీసుకురమ్మని చెప్పడంతో పారు షాక్ అవుతుంది. మావయ్య కొంపలు ముంచేలా ఉన్నాడని కార్తీక్‌కు భయం వేస్తుంది. మీరేం మాట్లాడొద్దు.. జరిగేదానిని అలా చూస్తూ ఉండమని ఆర్డర్స్ వేస్తాడు దశరథ. జ్యోత్స్న మీద కోపంతో నిజం చెప్పేసేలా ఉన్నాడని భయపడతాడు కార్తీక్. దీపే ఈ ఇంటి వారసురాలని దాస్ చెప్పేశాడా? అన్న అనుమానం వస్తుంది జ్యోత్స్నకి.

శివన్నారాయణ, సుమిత్రలను కూడా పిలుస్తాడు దశరథ. కొడుకును చూడగానే పెద్దాయన కోప్పడతాడు. ఎక్కడికి వెళ్లావు.. ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేశావని నిలదీస్తాడు. నేను మీకు చాలా చెప్పాలని అంటాడు దశరథ. ఇంతలో దిష్టి నీళ్లు తీసుకుని పారు రావడంతో ఎందుకు అని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. నా కూతురికి, అల్లుడికి దిష్టి తీయడానికి అని కార్తీక్, దీపల గురించి చెప్పడంతో శివన్నారాయణ, పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. పుట్టిన బిడ్డను ఈ ఇంటికి దూరం చేసింది నీ చేతులే కదా? అదే చేతులతో హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలని మనసులో అనుకుంటాడు దశరథ. అయితే కూతురికి అల్లుడికి నానమ్మతో దిష్టి తీయించడం కంటే అమ్మతో దిష్టి తీయించడం ఇంకా మంచిదని సుమిత్రను దిష్టి తీయమంటాడు. ఖచ్చితంగా దాస్ నిజం చెప్పేశాడని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది.

భర్త చెప్పడంతో సరేనని దీప, కార్తీక్‌లకు దిష్టి తీస్తుంది సుమిత్ర. కన్నతల్లి చేతుల్లో ఎన్నో అవమానాలు పడ్డావని దీప గురించి బాధపడతాడు దశరథ. ఈ రోజు దశరథకు ఏమైంది? ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు అని అనుమానం వస్తుంది పారుకి. దిష్టి నీళ్లు బయట పోసిరమ్మని జ్యోత్స్నకి శివన్నారాయణ చెప్పగా.. జ్యోత్స్న కాదు ఆ పని పిన్ని చేయాలని అని అంటాడు దశరథ. ఆ మాటలతో పారు షాక్ అవుతుంది. పదిమంది మంచి కోరుకునే పెద్దమనసు పిన్నిది అంటాడు. నీ చేతులు ఎన్నో మంచిపనులు చేశాయి. ఈ ఇంటి వారసురాలి పేరు మీద అన్నదానం చేశావు కదా అని అంటాడు. నిజం తెలిసినా ఏముంది.. సైదులు గాడు నన్ను మోసం చేశాడు, నీ అసలైన కూతురు జ్యోత్స్నే అనుకుంటుంది పారిజాతం. దీపని, కార్తీక్‌ని కుడికాలు పెట్టి లోపలికి రమ్మని చెబుతాడు దశరథ. ఆ మాటలతో శివన్నారాయణ ఫ్యామిలీ షాక్ అవుతుంది.

వీళ్లిద్దరి పేరు మీద గుడిలో అర్చన చేయించానని అంటాడు దశరథ. డాడీ నిజం తెలిసి మాట్లాడుతున్నాడా? లేక నేనే అలా అనుకుంటున్నానా అని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. గుడిలో దాస్ కనిపించాడని దశరథ చెప్పడంతో పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. కార్తీక్, దీపలు లోపల అడుగుపెడతారు. డాడీకి దీపే సొంత కూతురని దాస్ చెప్పేశాడు.. అందుకే ఈరోజు హడావుడి చేస్తున్నాడని అనుకుని వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలని వెళ్తుండగా జ్యోత్స్న, పారులని దశరథ పిలుస్తాడు. గుడికి మేం కూడా వచ్చేవాళ్లమని అడుగుతాడు శివన్నారాయణ.

పారిజాతంను స్వీట్స్ తీసుకురమ్మని చెప్పి నీ చేతులతో నువ్వే నా కూతురికి స్వీట్స్ పెట్టమని చెబుతాడు దశరథ. అయితే పారిజాతం స్వీట్స్‌ని జ్యోత్స్నకు బదులు దీపకి తినిపించబోతుండటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వెందుకు కన్‌ఫ్యూజ్ అవుతున్నావని అడుగుతాడు దశరథ. దీపని కూడా నువ్వు కూతురు అనుకుంటున్నావు.. జ్యోత్స్న కూడా నీకూతురే.. నేను ఇద్దరిలో ఏ కూతురికి పెట్టాలని అని ప్రశ్నిస్తుంది పారు. నా కూతురికే పెట్టాలని దశరథ చెప్పడంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. నీ కొడుకు దాస్.. నన్ను నిండా ముంచాడు అని రగిలిపోతుంది జ్యోత్స్న.

నీ కూతురు అంటే కాదు.. పేరు చెప్పమని అడుగుతుంది పారు. ఎవరైతే నా భార్య ప్రాణాలు కాపాడుతున్నారో వాళ్లే నా కన్నకూతురు అంటాడు దశరథ. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పినా నేను నమ్మను, కానీ బావ ఎలా శాంపిల్స్ మార్చి డాక్టర్‌‌ను మోసం చేయగలిగాడు. నేను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. ఈ స్వీట్స్ పెట్టడం నా వల్ల కాదు.. నువ్వే పెట్టుకోమని దశరథ చేతుల్లో పెడుతుంది పారు. దాంతో దశరథ స్వీట్స్ తీసుకుని జ్యోత్స్న నోట్లో పెడతాడు దశరథ. నీ అనారోగ్యం, నీ ఆపరేషన్ గురించి నాలో కొంత భయం అలాగే ఉండిపోయింది. ఆ భయాన్ని మనసులో పెట్టుకునే నేను గుడికి వెళ్లాను, కానీ దేవుడు నాకు సర్‌ప్రైజ్ ఇచ్చాడని చెబుతాడు దశరథ. నా భార్య ప్రాణాన్ని కాపాడుకోవడానికి నా కూతురు ఉండగా నేనెందుకు భయపడాలని అంటాడు. అమ్మని కాపాడుకోవడానికి నేను ఉన్నానని నీ నోటితో చెబితే బాగుంటుందని చెబుతాడు దశరథ.

డాడీకి నిజం తెలిసిందా? లేదా? దాస్ ఏం చెప్పాడని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. మమ్మీని కాపాడటానికి నేనున్నాను కదా అని చెబుతాడు జ్యోత్స్న. దీపని ఎందుకు ప్రత్యేకంగా దిష్టి తీయించి లోపలికి రమ్మన్నావని అడుగుతాడు పెద్దాయన. గుడిలో అర్చన చేయించేటప్పుడు పూజారిగారు.. మీ అమ్మాయికి నరదిష్టి ఎక్కువగా తగులుతోందని చెప్పారు. నేను కన్యాదానం చేశాను కాబట్టి దీప కూడా నా కూతురే, బాధ్యత తీసుకోవాలని చెబుతాడు దశరథ. ఇంతకీ దాస్ ఎక్కడ అని పారు అడగ్గా.. దాస్ మనింటికే వస్తానని చెప్పాడని దశరథ చెప్పడంతో పారిజాతం, జ్యోత్స్నలు షాక్ అవుతారు. నాకు చాలా ఆనందంగా ఉంది.. ఆ దేవుడు నాకు అంతులేని సంతోషాన్ని వరంగా ఇచ్చాడని సంబరపడిపోతాడు దశరథ.

నిజం చెప్పి తన తండ్రిని తనకు దగ్గర చేయడంతో కార్తీక్‌ని హత్తుకుంటుంది దీప. నేను మీ కూతురినే అని మా అమ్మానాన్నలకు ఎప్పటికీ చెప్పుకోలేనని అనుకున్నాను. కానీ ఎదురుచూడని అదృష్టం ఎదురుగా వచ్చినట్లు ఈరోజు నిజం తెలిసిపోయిందని కన్నీటితో భర్తకు ముద్దు పెడుతుంది. దీప నీ కూతురు అనగానే మా నాన్న కళ్లలో మెరుపు చూశానని చెబుతుంది దీప. మా నాన్న ఆ సమయంలో దేవుడిలా కనిపించాడు. ఇదంతా నాకు రాత్రే చెప్పి ఉండొచ్చు కదా అని అడుగుతుంది దీప. చెబితే సర్‌ప్రైజ్ ఏముంది.. ఇప్పుడు చూడు నువ్వెంత ఆనందంగా ఉన్నావో అని అంటాడు. ఇంత ఆనందంలోనూ నాకున్న భయం ఏంటంటే.. దీపే నా కూతురని ఎక్కడ చెప్పేస్తాడోనని అంటుంది దీప. నీ మీద ఒట్టేశాడు కదా.. మళ్లీ మనం చెప్పమనేంత వరకు మావయ్య ఎవరికి చెప్పడు అంటాడు కార్తీక్. అంత బాగానే ఉంది కానీ బిడ్డను వదిలేయడం గురించి నాన్నకు తెలిస్తే పరిస్ధితి ఏంటీ? అని భయపడుతుంది దీప. ఈ నిజం తెలిస్తే నాన్న ఈ ఆపరేషన్‌కు ఒప్పుకోడు అంటుంది. తల్లిదండ్రులుగా మనమే సిద్ధమయ్యాకా.. అత్తను మావయ్య మాత్రం ఎలా కాపాడతాడని ప్రశ్నిస్తాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X