Karthika Deepam 2 February 24th: జ్యోత్స్నకి షాకిచ్చిన దాస్.. శివన్నారాయణకి దొరికిపోయిన దశరథ

Photo Courtesy: JioHotstar

ఎలాగైనా దాస్‌ని కలవాలని జ్యోత్స్న, పారిజాతంలు ఇంట్లో నుంచి వెళ్లాలని చూస్తుండగా శివన్నారాయణ గుమ్మం దగ్గరే ఉంటాడు. పెద్దాయన్ని దాటుకుని బయటకు వెళ్తుండగా దశరథ, దీప, కార్తీక్‌లు ఎదురవ్వగా పారు, జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఎర్రనీళ్లు తీసుకొచ్చి దీప, కార్తీక్‌లకు దిష్టి తీయమని దశరథ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. పారును కాకుండా సుమిత్రతో దీపకి దిష్టి తీయిస్తాడు. దశరథకు దాస్ నిజం చెప్పేశాడని పారు, జ్యోత్స్నలకు అనుమానం వస్తుంది. దాస్ నాకు గుడిలో కనిపించాడు.. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందని, గుండెల్లోని భారమంతా పోయిందని చెప్పి పారుని స్వీట్స్ తీసుకురమ్మని చెబుతాడు దశరథ.

ఈరోజుతో మన కథకు శుభం కార్డ్ పడిందని, దాస్ నా కొంప ముంచేశాడని టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. నా కూతురి నోట్లో స్వీట్ పెట్టమని పారుకి దశరథ చెప్పగా.. జ్యోత్స్న, దీపలలో ఎవరికి పెట్టాలో తెలియక టెన్షన్ పడుతుంది పారు. ఇంతలో దశరథే స్వయంగా జ్యోత్స్నకి స్వీట్ తినిపించడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. నా కొడుకు దాస్ ఎక్కడ అని పారు అడగ్గా.. మనింటికే వస్తున్నాడని చెబుతాడు దశరథ. దాంతో పారు, జ్యోత్స్నలకు చెమటలు పడతాయి. నేనే కూతురిని అని మా నాన్నకి చెప్పినందుకు థ్యాంక్స్ అని కార్తీక్‌ని హత్తుకుంటుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 24వ తేదీ 602వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 602 February 24th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

అమ్మని కాపాడటానికి నేను బిడ్డను త్యాగం చేస్తున్నట్లు ఎన్నటికీ తెలియకూడదని కార్తీక్‌తో చెబుతుంది. గుడిగంటలు, దీపాల వెలుగులో నీకు మీ నాన్న దేవుడిలా కనిపిస్తే నాకు మాత్రం ఊపిరి వదిలేస్తున్న నా బిడ్డే కనిపిస్తోందని కార్తీక్ చెప్పడంతో దీప కంటతడి పెడుతుంది. నీకు నేను ఏం ఇవ్వలేకపోతున్నాను క్షమించమని అడుగుతుంది దీప. నీ భారమంతా నేనే మోస్తానని దీప అనగా.. ఇప్పటి వరకు మోసింది చాలు, ఇకపై నేనే మోస్తానని భార్యను హత్తుకుంటాడు దీప. మరోవైపు.. పారిజాతం, జ్యోత్స్నలు దాస్ వచ్చి ఏం చెబుతాడోనని టెన్షన్ పడుతుంటారు. ఇంతలో దాస్ రాగా... ఎక్కడికి వెళ్లిపోయావు, నిన్నటి నుంచి నేను, గ్రానీ ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? అని అంటుంది జ్యోత్స్న.

నాన్న అని పిలవకూడదు, చిన్నాన్న అని పిలవాలి.. రిపోర్ట్స్ విషయం నా వరకు వచ్చిందని అర్ధమైందా అని చెబుతాడు దాస్. నా అదృష్టం కొద్ది నీ బుద్ధలు రాలేదని పారుపై మండిపడతాడు దాస్. నేను నీ కన్నతల్లిని అని పారు అనగా.. అందుకే ఎన్ని పాపాలు చేసినా కళ్లతో చూశానే కానీ చేతులతో ఆపలేకపోయానని అంటాడు దాస్. ఆరోజు నువ్వు వదిలేసింది దశరథ కూతురిని కాదు.. నీకూతురిని, బస్టాండ్‌లో నుంచి బిడ్డను ఎవరో తీసుకుపోయారని చెప్పావు కదా? నువ్వు ఆరోజు వదిలేయకుండా ఉండుంటే ఈరోజు నా మనవరాలు నాతోనే ఉండేదని అంటుంది పారు. నీ మనవరాలు నీతోనే ఉందని జ్యోత్స్న మండిపడుతుంది. నువ్వు దాస్ తల్లివి అని నీ నుదిటి మీద రాసుందా? రాసి లేనంత మాత్రాన తల్లివి కాకుండా పోతావా? అని ప్రశ్నిస్తుంది.

కానీ నువ్వు దశరథ కూతురివేనని రిపోర్ట్స్‌లో రాసుందని అంటుంది పారిజాతం. అది ఫేక్.. నిన్ను నమ్మించడానికి నేను డాక్టర్‌ని కూడా అవ్వాలి అంటుంది జ్యోత్స్న. నీ నిజాయితీని నువ్వయినా అర్ధం చేసుకో, నేను చాలా మంచిదానిని అని దాస్‌తో చెబుతుంది. ఇంత చిన్న వయసులో అలాంటి పదాలు వద్దు... నువ్వు నన్ను కిడ్నాప్ చేసినందుకు నిన్ను మెచ్చుకోవాలి. ఇకపై నువ్వు నన్ను నాన్న అని పిలవొద్దని తేల్చిచెబుతాడు దాస్. తను నన్ను చాలా బాగానే చూసుకుందని అంటాడు. కాకపోతే అది ప్రేమ కాదు.. భయం. నువ్వు నా కూతురువన్న నిజం ఎక్కడ బయటపడుతుందోనని నన్నే దాచావు. ఇప్పటి వరకు నాకే తెలియని విషయం ఏంటంటే? నువ్వు నా కూతురివి కాదు, నీకింక ఏ భయాలు లేవు, ఎవరినీ కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఉండొచ్చని చెబుతాడు దాస్.

మన పరిస్ధితి ఏంటీ అని దాస్‌ని అడుగుతుంది పారిజాతం. ఒకరి కోసం మనం గోతులు తీయకూడదని చెబుతాడు దాస్. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్‌తో మన ముగ్గురం ఫూల్స్ అవుతున్నాం. అది మనం అర్ధం చేసుకోకపోతే నష్టం మనకే అంటుంది జ్యోత్స్న. నువ్వు నా కూతురివి అనడానికి మా అమ్మ కాకుండా మరో సాక్ష్యం ఉందా? అని నిలదీస్తాడు దాస్. నువ్వు దశరథ కూతురివి కాదు అనడానికి నీకు వేరే సాక్ష్యం ఉందా అని అడుగుతాడు. నేను ఎవరికీ ఏది చెప్పాల్సిన అవసరం లేదు, అలాగే నువ్వు ఇక నన్ను దాచాల్సిన అవసరం లేదు. మా వదినను కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది, కన్నతల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతాడు దాస్. ఎక్కడున్నా నా కూతురు క్షేమంగానే ఉంటుందని అంటాడు. దీపే దాస్ కూతురని దీపకి చెప్పొచ్చు కదా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఈ కురుక్షేత్రాన్ని నడిపించేది నా మేనల్లుడు.. వాడే ఈ కథకు ముగింపు ఇస్తాడని అనుకుంటాడు దాస్.

కార్తీక్, దీపలు ఇంటికి రాకపోవడంతో టెన్షన్ పడుతుంది కాంచన. ఇంతలో వారిద్దరినీ తీసుకుని దశరథ రావడంతో కాంచన షాక్ అవుతుంది. నేను నీ వియ్యంకుడిగా వచ్చానని దశరథ ఏదో చెప్పబోతుండగా కార్తీక్ ఆపుతాడు. ఇంతలో శివన్నారాయణ కూడా రావడంతో అంతా సంతోషిస్తారు. మనం ఏదైతే బలంగా నమ్ముతామో అదే మన జీవితంలో జరుగుతుంది. మన జీవితంలో ఈరోజు చాలా మంచి జరిగిందని, గుడి నుంచి వచ్చినప్పటి నుంచి మీ అన్నయ్య ముఖం వెలిగిపోతోందని శివన్నారాయణ చెబుతాడు.

దశరథ ప్రవర్తన, దాస్ మాటలతో ఏదో జరిగిందని జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. నీ టెన్షన్‌లు అన్ని తీరిపోయాయి కదా? ఎందుకు భయపడుతున్నావని అడుగుతుంది పారిజాతం. దీప అసలు ఎవరి కూతురో నీకు తెలుసా? హారతి ఇచ్చి మా నాన్న ఎందుకు హడావుడి చేస్తున్నాడో నీకు తెలుసా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నిజం చెప్పబోతుండగా జ్యోత్స్న ఆగిపోతుంది. దశరథకి దీపే సొంతకూతురని చెబుతావా అని పారు ప్రశ్నిస్తుంది. దీప నా మనవరాలు కావడానికి నా లక్షణాలు రావాలి కదా.. తనలో నా అలవాట్లు, బుద్ధులు లేవని అంటుంది పారు. అసలు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ ఎలా అయ్యాయో నాకు అర్ధం కావడం లేదని చెబుతుంది జ్యోత్స్న.

డాక్టర్ హారిక శాంపిల్స్‌తో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు.. కానీ నా కొడుకైనా నాతో చెప్పాలి కదా? జ్యోత్స్నే నా కన్నకూతురు, నీ సొంత మనవరాలని చెప్పాడా? నాలాగే వాడు కూడా నమ్మాడు కదా అని అంటుంది పారిజాతం. కాకపోతే దశరథ ప్రవర్తనలో మార్పు వచ్చింది.. బిడ్డల్ని మార్చింది నేనే అని మేటర్ లీక్ అయితే నన్ను క్షమించడని చెబుతుంది పారు. నాకు చిన్న పని ఉందని బయటకు వెళ్తున్నానని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న.

మీ మావయ్య ఆనందానికి కారణం ఏంటో వాడి చెల్లెలికి చెప్పాలని అనుకుంటున్నాడు. నువ్వు మధ్యలో మాట్లాడొద్దని కార్తీక్‌పై కోప్పడతాడు శివన్నారాయణ. గుడిలో ఏం జరిగింది? నీ ఆనందానికి కారణం ఏంటీ? అని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. అమ్మ చనిపోతూ.. మన పిల్లలకి పెళ్లిళ్లు జరిగాక కూడా వాళ్లిద్దరూ కలిసే ఉండాలని మాట తీసుకుందట. అందుకే శ్రీధర్ బావతో పెళ్లి చేసి నీకు అందుబాటులో ఉండేలా చేశాడు. అందుకే ఎప్పుడూ పుట్టింటికి దూరం కాలేదని అంటాడు దశరథ. అందుకే ఆ దూరం రాకూడదని నీ కూతురిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అంటుంది కాంచన. ఆ మాట ఏ మట్టిలో కలిసిపోలేదు.. ఆ మాట నిజమైంది, నీ కోరిక తీరింది. నువ్వు కోరుకున్నట్లు నా కూతురే నీ ఇంటి కోడలైంది అని దశరథ చెప్పగా అంతా షాక్ అవుతారు. ఇంతలో జ్యోత్స్న వచ్చి ఏంటీ ఆ మాటలు అని ప్రశ్నిస్తుంది. జ్యోత్స్నను చూడగానే అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X