Karthika Deepam 2 February 25th:దీప చుట్టూ జ్యోత్స్న ఉచ్చు.. దశరథపై శివన్నారాయణ, కాంచనలో అనుమానం

Photo Courtesy: JioHotstar

అమ్మని కాపాడటానికి నా బిడ్డను త్యాగం చేస్తున్నట్లు నాన్నకి ఎప్పటికీ తెలియకూడదని కార్తీక్‌తో ఏడుస్తూ చెబుతుంది దీప. ఇప్పటి వరకు ఈ భారాన్ని నువ్వు మోశావు.. ఇకపై నేను మోస్తానని భార్యను హత్తుకుంటాడు కార్తీక్. డాడీకి దాస్ కనిపించి ఏం చెప్పాడోనని పారు దగ్గర టెన్షన్ పడుతుంటుంది జ్యోత్స్న. ఇంతలో దాస్ వచ్చి... నువ్వు నా కూతురివి కాదు, ఇకపై నన్ను దాయాల్సిన అవసరం కూడా లేదు. సుమిత్ర వదినను కాపాడమని చెబుతాడు దాస్. నువ్వు ఎన్ని చెప్పినా నేనే నీ కూతురిని, ఏదో ఒక రోజు నిజం తెలుసుకుంటావని అంటుంది జ్యోత్స్న. ఈ కురుక్షేత్రాన్ని మొదలుపెట్టింది నా మేనల్లుడు.. వాడే ఈ కథకు ముగింపు పలుకుతాడని అనుకుని వెళ్లిపోతాడు దాస్.

దశరథ ప్రవర్తన, దాస్ ‌మాటలతో జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. మన టైం దగ్గర పడిందని పారుతో చెబుతుంది. నువ్వే ఈ ఇంటి వారసురాలివి.. అయినా బిడ్డల్ని మార్చినందుకు దశరథ నన్ను వదిలిపెట్టడని భయపడుతుంది పారిజాతం. దీప, కార్తీక్‌లతో పాటు కాంచన దగ్గరికి వస్తాడు దశరథ. ఈరోజు మీ అన్నయ్య ముఖం ఆనందంతో వెలిగిపోతోందని చెబుతాడు శివన్నారాయణ. నువ్వు నా కూతురిని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తానని ఇచ్చిన మాట నెరవేర్చుకున్నానని చెబుతాడు దశరథ. ఇంతలో జ్యోత్స్న రావడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 25వ తేదీ 603వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 603 February 25th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

నీ కూతురు కాంచన అత్తకి కోడలు ఎప్పుడైంది? బావ నా మెడలో తాళి కట్టలేదు కదా? అలాంటప్పుడు నువ్వు అత్తకిచ్చిన మాట ఎలా నెరవేరిందని దశరథను నిలదీస్తుంది జ్యోత్స్న. లేదంటే దీప నీ కూతురు అయ్యుండాలి.. నువ్వు దత్తత అయినా తీసుకుని ఉండాలని అంటుంది. అమ్మనాన్న చచ్చిన ఈ అనాథ ఈ ఇంటికి కోడలైందని దీపని నానామాటలు అంటుంది. దాంతో రగిలిపోయిన దశరథ.. దీప అనాథ కాదు, ఆమె తల్లిదండ్రులు బతికే ఉన్నారని చెబుతాడు. ఆ మాటలతో జ్యోత్స్నతో పాటు అందరూ షాక్ అవుతారు. అయితే దీప అమ్మనాన్న ఎక్కడున్నారు? అని నిలదీస్తుంది జ్యోత్స్న.

ఆ ప్రశ్నకు నేను ఆన్సర్ ఇస్తానని కార్తీక్ జోక్యం చేసుకుంటాడు. కొన్ని నిజాలు నువ్వు తట్టుకోలేవని అంటాడు. మా పెళ్లి మీ ఇంట్లోనే జరిగింది.. నాకు కాళ్లు కడిగి కన్యాదానం చేసింది మీ నాన్నే. అప్పుడు మీ నాన్న నాకు మామగారు అవుతారు, దీపకి తండ్రి అవుతారు అంటాడు కార్తీక్. అప్పుడు మావయ్య కూతురినే మా అమ్మకి కోడలిగా పంపినట్లే కదా అంటాడు కార్తీక్. అయితే మీ అమ్మనాన్న బతికే ఉన్నారని డాడీ చెప్పాడు.. ఉంటే ఎక్కడ ఉన్నారు? అసలు మీ అమ్మనాన్న ఎవరు? నాకు ఇప్పుడే తెలియాలని అంటుంది జ్యోత్స్న.

నేను మళ్లీ చదువుకుంటాను, ఒక మంచి డిగ్రీ సంపాదించి ఎవరి మీదా ఆధారపడకుండా బతుకుతానని కాశీతో సీరియస్‌గా చెబుతుంది స్వప్న. ఆగిపోయిన చదువునే మళ్లీ మొదలుపెట్టావు.. మరి సంసారాన్ని కూడా చక్కదిద్దుకోవచ్చు కదా అని మండిపడుతుంది కావేరి. కాశీకి జ్యూస్ ఇచ్చి తనకు ఇవ్వకపోవడంతో స్వప్న మండిపడుతుంది. ఎవరిని ఎలా చూడాలో నాకు బాగా తెలుసు అంటాడు శ్రీధర్. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేసి పదిమందికి ఉపాధి కల్పిస్తానని అంటుంది స్వప్న. దానికి ఎంతో ఓపిక కావాలని.. ఆ ఓపికలో కొంచెం ఉన్నా సంసారాన్ని చక్కదిద్దుకోవచ్చని అంటాడు శ్రీధర్. కాశీతో సంసారం కంటే సన్యాసమే బెటర్ అని అంటుంది స్వప్న. కాశీ ఈరోజు ఇక్కడే పడుకుంటాడని శ్రీధర్ చెప్పడంతో స్వప్న మండిపడుతుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతానని చెబుతాడు శ్రీధర్. ఉదయాన్నే గుడికి వెళ్లాలి.. కాశీయే తీసుకెళ్లాలని అంటాడు. ఈరోజు నుంచే కాశీ మన ఇంట్లోనే ఉంటాడని తేల్చేస్తాడు శ్రీధర్.

దీప తల్లిదండుల్ని ఈరోజు తీసుకురాకపోవచ్చు.. కానీ ఏదో ఒకరోజు వాళ్లని నీ ముందు నిలబెడతానని అంటాడు దశరథ. దీపని పెంచిన తల్లిదండ్రులు బతికుంటే ఆమె కన్నవాళ్లు ఎక్కడున్నారో తెలిసేదని అంటుంది జ్యోత్స్న. కానీ వాళ్లెవరో నా తమ్ముడికి కూడా తెలియదని చెబుతుంది అనసూయ. దాంతో కుబేర్ ఫోటో దగ్గరికి వెళ్లి ఎమోషనల్ అవుతాడు దశరథ. దీప విషయంలో నీ తమ్ముడు నీకు ఏం చెప్పాడో చెప్పమని అడుగుతాడు దశరథ. మా తమ్ముడికి పిల్లలంటే చాలా ఇష్టం.. కానీ తమ్ముడి భార్యకు పిల్లలు లేకపోవడంతో బాధపడేవాడు. ఓరోజు బస్టాండ్‌లో వెళ్తుండగా దీప దొరికింది. అప్పటి నుంచి దీపని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. దీప కోసం పెళ్లి కాకుండా కూతురినే చూసుకుంటూ మురిసిపోయాడని చెబుతుంది అనసూయ.

దాంతో కుబేర ఫోటోకి దండం పెట్టి ఏడుస్తాడు దశరథ. నీ తమ్ముడు దేవుడు.. బతికుంటే అతని కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేవాడిని అంటాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. దీపే తన కూతురు అని డాడీకి తెలిసిపోయిందా? ఆమెను పెంచినందుకు కుబేర పట్ల ఎమోషనల్ అవుతున్నాడా అని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. నువ్వెందుకు ఎమోషనల్ అవుతున్నావని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. కుబేర ఆ రోజున దీపని బస్టాండ్‌లో వదిలేసి వెళ్లిపోయుంటే దీప మనకి దక్కేది కాదు.. ఇలాంటి వ్యక్తి రుణం తీర్చుకోవాలంటే ఎన్ని జన్మలెత్తినా సరిపోదని దశరథ అంటాడు. ఇది మహర్జాతకురాలు.. దీప ఎవరో గొప్పింటి బిడ్డ అయ్యుంటుందని చెబుతుంది అనసూయ. దశరథ ఏదో చెప్పబోతుండగా కార్తీక్ బయటకు తీసుకెళ్తాడు. అసలు నువ్వు ఎందుకొచ్చావు.. ఎందుకు వెళ్తున్నావని జ్యోత్స్నని అడుగుతాడు శివన్నారాయణ.

అన్నయ్య నా కంటికి చాలా కొత్తగా కనిపిస్తున్నాడని శివన్నారాయణని అడుగుతుంది కాంచన. గుడి నుంచి వచ్చిన తర్వాతే వాడిలో ఏదో మార్పు మొదలైందని అంటాడు పెద్దాయన. నాన్న ఎవరికో నిజం చెప్పేసేలా ఉన్నాడని దీప భయపడుతుంది. కుబేర నా కూతురికి జీవితాన్ని ఇచ్చాడు.. అలాంటి వ్యక్తికి నేను ఏం చేయలేదు, చేతులెత్తి మొక్కడం తప్పించి ఏం చేయలేను అంటాడు దశరథ. నేను ఆపకపోయుంటే ఈరోజు నువ్వు నిజం చెప్పేసేవాడివి అని మండిపడతాడు కార్తీక్. గొప్పింట్లో పెరగాల్సిన నా బిడ్డ పేదరికంలో మగ్గిపోయింది దీనికి కారణం నేనే. ఆరోజు కళ్యాణి బిడ్డ పురిట్లోనే చనిపోయింది అన్నప్పుడు పుట్టిన బిడ్డ ఏది అని పిన్నిని అడిగిఉంటే ఈ నిజం ఆరోజే తెలిసేది. కానీ నేను బిడ్డ గురించి కలలు కంటూ చేతులు కట్టుకుని ఉండిపోయానని బాధపతాడు దశరథ. అప్పుడు జరిగిన తప్పుకి ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదని అంటాడు కార్తీక్.

కుబేర బతికి ఉన్నంత వరకు దీపని చాలా గొప్పగా చూసుకున్నాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత భర్త మోసం చేశాడు.. అత్తగారి మోసం చేసింది. చేసిన అప్పులు కట్టడానికి ఆరేళ్ల కూతురిని వదిలేసి రోడ్డునపడి నరకయాతన అనుభవించింది. పేదవాడైన కుబేర నా కూతురిని మహారాణిలా చూసుకున్నాడు. అలాంటిది నేను ఎలా చూసుకోవాలని ప్రశ్నిస్తాడు దశరథ. జ్యోత్స్న కావాలనే నీ నుంచి నిజం రాబట్టాలని వచ్చింది.. చాలా తెలివిగా నిన్ను ట్రాప్ చేసిందని అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X