Karthika Deepam 2 February 26th: జ్యోత్స్నకి దాస్ వార్నింగ్.. పారుతో కార్తీక్ మైండ్‌గేమ్, షాక్‌లో శివన్నారాయణ
Photo Courtesy: JioHotstar
కాంచనతో దశరథ మాట్లాడుతుండగా వచ్చిన జ్యోత్స్న.. అత్తకి నువ్వు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నావు? నేను అత్తకి కోడలిని ఎప్పుడు అయ్యాను? బావ నా మెడలో మూడు ముళ్లు వేశాడు? అని నిలదీస్తుంది. దాంతో కార్తీక్ జోక్యం చేసుకుని దీప తల్లిదండ్రుల స్థానంలో నిలబడి అత్తయ్య- మావయ్యలు నాకు కన్యాదానం చేశారు. అప్పుడు మావయ్యకి దీప కూతురు అయినట్లే కదా అని అంటాడు. అయినా దీప అనాథ కాదని.. తన తల్లిదండ్రులు బతికే ఉన్నారని దశరథ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతలో కుబేర్‌కు దీప ఎలా దొరికింది? తన తమ్ముడు దీపని ఎలా చూసుకున్నది అనసూయ చెప్పగా దశరథ ఎమోషనలై కుబేర్ ఫోటోకు దండం పెడతాడు. ఎన్ని జన్మలెత్తినా కుబేర్ రుణం తీర్చుకోలేమని చెబుతాడు.
ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. మావయ్యని ఎక్కువసేపు వదిలేస్తే నిజం చెప్పేలా ఉన్నాడని దశరథని బయటకు తీసుకెళ్తాడు కార్తీక్. ఈరోజు జ్యోత్స్న అడిగిన మాటలకు నేను నిజం చెప్పేసేవాడినని కార్తీక్‌తో అంటాడు దశరథ. జ్యోత్స్న కావాలని రెచ్చగొట్టి నీతో నిజం చెప్పించాలనే ఇలా ట్రాప్ చేసిందని చెబుతాడు కార్తీక్. మీ అన్నయ్య ప్రవర్తన రెండ్రోజులుగా తేడాగా ఉందని కాంచనతో అంటాడు శివన్నారాయణ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 26వ తేదీ 604వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పాముకి పాలు పోసినా విషమే కక్కుతుంది. అది తెలియకుండా దాని జోలికి వెళ్లడం మన తప్పే. ఇప్పుడు నువ్వు గాయపడ్డావు కాబట్టి మామూలుగానే ఉంటావు.. అలాగని నిన్ను క్షమిస్తే కోరలున్న పాము, చేరదీసిన వాడిని కాటువేసినట్లు మరోసారి బాధపెడతావని కాశీతో అంటుంది స్వప్న. దీప అక్క కార్తీక్ బావని ఎన్నోసార్లు బాధపెట్టింది. కానీ కార్తీక్ బావ మాత్రం అక్కని పెళ్లి చేసుకుని లైఫ్ ఇచ్చాడు. సుమిత్ర పెద్దమ్మ.. దశరథ పెదనాన్న మీద కోపంతో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది.. కానీ తర్వాత ఒకొరినొకరు క్షమించుకున్నారని గుర్తుచేస్తాడు కాశీ. ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతాడు. పగ తీర్చుకునేవాళ్లు చాలామంది ఉంటారు.. నువ్వు నన్ను బతిమలాడటం చూస్తుంటే దీని వెనుక కూడా ఏదో ప్లాన్ ఉన్నట్లే ఉందని అనుమానిస్తుంది స్వప్న.
నేను కరెక్ట్‌గా లేనప్పడు నమ్మావు.. నేను ఇప్పుడు మారాను, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే ఇలా మాట్లాడుతున్నావని బాధపడతాడు కాశీ. ఈ పరిస్ధితి తెచ్చుకుంది నువ్వే అంటుంది. మనిద్దరం కలిసి బిజినెస్ చేసుకుందామని కాశీ అడగ్గా.. బిజినెస్ అంటే నమ్మకం. నువ్వు రెస్టారెంట్‌లో పీఏగా పెట్టుకుంటూనే, ఎవరితోనే చేతులు కలిపి మా నాన్న మీద నేరం మోపిన మహానుభావుడివి, ఇప్పుడు నీతో కలిసి బిజినెస్ చేస్తే ఎవరితోనే చేతులు కలిపి ఫుడ్ పాయిజిన్ చేసి నా మీద కూడా పగతీర్చుకుంటావని నానామాటలు అంటుంది స్వప్న. నిన్ను జీవితంలో క్షమించనని అనుకుంటుంది.
దాస్‌ని సీక్రెట్‌గా కలిసిన జ్యోత్స్న.. అక్కడ మా డాడీ, ఇక్కడ నువ్వు చాలా కొత్తగా ఉన్నారు. ఇన్నిరోజులు దీప ఎవరు? అనేది అందరికీ చెప్పాలి.. అదే నా జీవితం లక్ష్యం అనేవాడివి. ఇప్పుడు నీ జీవిత సాఫల్యం దక్కింది అంటే ఏంటీ? నిజం చెప్పేశావా అని తండ్రిని నిలదీస్తుంది జ్యోత్స్న. నీకు అలా అనిపిస్తుందా అని దాస్ ప్రశ్నించగా.. అనిపించడం కాదు, కళ్ల ముందే కనిపిస్తోంది. దీప దశరథ కూతురైతే ఎలా బిహేవ్ చేస్తారో మా డాడీ అలాగే బిహేవ్ చేస్తున్నాడు. దానికి కారణం నిజం తెలిసిపోవడమే కదా అని అంటుంది జ్యోత్స్న. నీకు అన్నయ్య చెప్పాడా? అని ప్రశ్నిస్తాడు దాస్. నేను నిజంగానే దశరథ కూతురినా? అని అడుగుతుంది జ్యోత్స్న.
రిపోర్ట్స్‌ను బట్టి నువ్వే దశరథ అన్నయ్య కూతురివి అంటాడు దాస్. నేను రిపోర్ట్స్ నమ్మనని అంటుంది జ్యోత్స్న. డాక్టర్ అబద్ధం చెప్పదు కదా అని అంటాడు దాస్. మరి మా డాడీ ఏంటీ దీప గురించి, దీపను పెంచిన ఆ కుబేర గురించి అంత ఫీల్ అయిపోతున్నాడని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. వాళ్లంతా మనుషులు.. మంచి, మానవత్వం ఉంటాయి కదా. ఏం జరిగినా నువ్వే మా వదిన ప్రాణదాతవి అని చెబుతాడు దాస్. ఇన్నిరోజులు ఆస్తి కోసం ఎన్నో దారుణాలు చేశారు.. ఇకనైనా వదిలేయండి. నీ మీద నాకు ఎంత అనుమానం ఉందంటే? దశరథ అన్నయ్యని దీప షూట్ చేసిందని చెప్పారు కదా? అది కూడా నీ పనే ఏమోనని డౌట్ అంటాడు దాస్.
వీలైనంత త్వరగా నీ గూటికి నువ్వు చేరుకుంటే నీకే మంచిదని సలహా ఇస్తాడు దాస్. నేను దశరథ కూతురినా? నీ కూతురినా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నువ్వు ఏది నమ్ముతున్నావని దాస్ అడుగుతాడు. నిజం ఏంటో నువ్వే కనిపెట్టు అని చెబుతాడు జ్యోత్స్న. నువ్వు వయసులో మా అందరికంటే చాలా చిన్నదానివి, కానీ తెలివితేటల్లో మా అమ్మ కంటే పెద్దదానివి. పనికొచ్చే తెలివితేటల్లో కాదు, పనికి మాలిన తేలివితేటలు అంటాడు దాస్. నువ్వు గుడికి ఎందుకు వెళ్లావో? అక్కడ ఏం చేశావో? ఎందుకు మా డాడీ చిత్రంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడో? ఎందుకు నువ్వు భుజాల మీద భారం దిగిపోయినట్లు ప్రవర్తిస్తున్నావో అన్ని చెబుతాను అంటుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం వచ్చి పిల్ల బాతు బచ్చా అని వార్నింగ్ ఇస్తుంది.
మావయ్య ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని భయపడి చస్తున్నానని దీపతో చెబుతాడు కార్తీక్. కుబేర్ గారి ఫోటో దగ్గరికి వెళ్లి ఏడుస్తుంటే.. మా అమ్మకి, తాతకి కొత్త అనుమానాలు వచ్చాయి. జ్యోత్స్న వెళ్లి ఖచ్చితంగా దాస్ మావయ్యని కలుస్తుందని చెబుతాడు కార్తీక్. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానని అంటుంది దీప. నా టార్గెట్ ఒక్కటే.. నువ్వే ఆ ఇంటి వారసురాలివి అని నిజం చెప్పి ఈ ఇంట్లో కూర్చోబెట్టాలి. కానీ ఈలోపు జ్యోత్స్న, పారిజాతంలు ఏం చేస్తారోనని భయంగా ఉందని అంటాడు కార్తీక్. మనం అమ్మనాన్నలతో కలిసి ఆ ఇంట్లో ఉందామని చెబుతుంది దీప. రేపు ఆపరేషన్ సమయంలో చాలా పెద్ద టాస్క్ ఉంది అంటాడు కార్తీక్. బిడ్డకు ఏం జరిగినా తట్టుకోవడానికి రెడీగా ఉన్నానని చెబుతాడు.
నువ్వు ప్రతిసారి నన్ను కలవడం చూస్తే శివన్నారాయణ గారికి అనుమానం వస్తుంది. అప్పుడు నీ గురించి ఆయనకి నిజం తెలుస్తుంది.. డాక్టర్ సర్టిఫికెట్ వల్ల నువ్వు, కానీ బిడ్డను మార్చిన విషయం శివన్నారాయణ గారికి తెలిస్తే గన్‌తో మా అమ్మని కాల్చేస్తాడు అని భయపెడతాడు దాస్. నన్ను పదే పదే కలవొద్దని శివన్నారాయణ గారి మనవరాలికి నువ్వయినా చెప్పమని అంటాడు దాస్. నువ్వు నీ కూతురిని వెతుకమని చెబుతుంది పారిజాతం. నీ మనవరాలిని నేనే.. ప్రపంచంలో ఎక్కడ వెతికినా కనిపించదని అంటుంది జ్యోత్స్న. నీకు తొందర్లోనే ఈ జ్యోత్స్న ఎవరో తెలుస్తుందని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఆట మొదలుపెట్టేలోపు.. నా మేనల్లుడు ఆట ముగిస్తాడని అనుకుంటాడు దాస్.
ఉదయాన్నే పారు, జ్యోత్స్నలు కలిసి యోగా చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి కార్తీక్ వచ్చి మీరిద్దరూ ఇంత ఉదయాన్నే ధ్యానం చేస్తున్నారని అడుగుతాడు కార్తీక్. ఆ వెంటనే శివన్నారాయణ రావడంతో పారుకు మనశ్శాంతి పోయిందట అని చెబుతాడు కార్తీక్. నేనే నీ హెల్త్ సూపర్‌వైజర్‌ని.. ఎందుకు నీకు ఇంత ఒత్తిడి అని జ్యోత్స్న, పారులను ప్రశ్నిస్తాడు కార్తీక్. దాస్ మావయ్యని కిడ్నాప్ చేసిన దాని గురించి టెన్షన్ పడుతున్నారా అని అడగటంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











