Karthika Deepam 2 February 27th: సుమిత్రకు నిజం చెప్పాలని దశరథ యత్నం.. దీప హత్యకు జ్యోత్స్న కుట్ర
Photo Courtesy: JioHotstar
దశరథ మాటలతో దీపే అసలు వారసురాలన్న నిజం బయటపడిందేమోనని జ్యోత్స్న వణికిపోతుంది. వెంటనే దాస్‌ని కలిసి నువ్వు నిజం చెప్పేశావా? మా డాడీ మాటలు అనుమానం వచ్చేలా ఉన్నాయని అంటుంది జ్యోత్స్న. నువ్వే సుమిత్ర కూతురివి అనడానికి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి కదా? ఎందుకు భయపడుతున్నావని అడుగుతాడు దాస్. ఇంతలో జ్యోత్స్న వచ్చి.. నువ్వేందుకు భయపడుతున్నావు.. నువ్వే సుమిత్ర కూతురివని అంటుంది. నేను ఎవరి కూతురినో త్వరలోనే తేల్చుకుంటానని దాస్‌తో సవాల్ విసురుతుంది జ్యోత్స్న.
దశరథ మావయ్య పట్టరాని సంతోషంతో ఎక్కడ నిజం చెబుతాడోనని టెన్షన్‌గా ఉందని దీపతో చెబుతాడు కార్తీక్. దశరథ మావయ్యని రెచ్చగొట్టి ఎలాగైనా నిజం రాబట్టాలని జ్యోత్స్న అనుకుంటోందని అంటాడు. నిన్ను వారసురాలిగా ఈ ఇంట్లో చేర్చేసరికి పారు, జ్యోత్స్నలు ఏదో ఒకటి చేస్తారని చెబుతాడు. అయితే మనం ఆ ఇంట్లోకి వెళ్లి అమ్మానాన్నలతోనే ఉందామని చెబుతుంది దీప. ఉదయాన్నే యోగ చేసుకుంటున్న పారిజాతం, జ్యోత్స్న దగ్గరికి కార్తీక్ వచ్చి దాస్ కిడ్నాప్ గురించి చెబుతాడు. ఈ మాటలు విన్న శివన్నారాయణ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 27వ తేదీ 605వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
దాస్ వచ్చాడని, గుడిలో నన్ను కలిశాడని దశరథ చెప్పాడు కదా మళ్లీ కిడ్నాప్ అంటావేంటీ అని అడుగుతాడు శివన్నారాయణ. ఇందులో అంత టెన్షన్ పడేది ఏముందని ప్రశ్నిస్తాడు. నీకు టెన్షన్ లేదా తాత అని కార్తీక్ అడగ్గా.. సుమిత్రకు ఆపరేషన్ జరిగి మామూలు మనిషి అవుతుందా లేదా అని ఇప్పటికీ భయంగా ఉందని చెప్పి వెళ్లిపోతాడు పెద్దాయన. మొత్తానికి భలే తప్పించుకున్నావని పారు మీద సెటైర్లు వేస్తాడు కార్తీక్. వీడికి మన గుట్టు తెలిసిపోయినట్లుగా ఉందని జ్యోత్స్నతో అంటుంది పారు. నా భయం కూడా అదే.. బావకి దాస్ ఏం చెప్పాడు? డాడీలో మార్పుకు కారణం అదేనా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
దీప, కార్తీక్‌లని సుమిత్ర దగ్గరికి తీసుకెళ్లిన దశరథ.. ఏ ఇంట్లో అయినా కన్నబిడ్డను తొలుత తండ్రికి పరిచయం చేసేది భార్యే. కానీ దేవుడు నా కథను కొత్తగా రాశాలు.. నేనే నా భార్యకు కన్నకూతురు ఎవరో చెప్పాల్సిన పరిస్ధితి నెలకొందని అంటాడు. తన ప్రాణాలు కాపాడేది కన్నకూతురేనని సుమిత్రకు తెలియాలి? ఈరోజు ఏం జరిగినా సరే నిజం చెప్పేస్తానని అంటాడు దశరథ. నిద్రపోతున్న సుమిత్రకు వినిపించేలా దీపే మన కన్నకూతురని చెబుతుంటాడు. కార్తీక్, దీపలు మాత్రం దశరథను బయటకు తీసుకురావాలని చూస్తారు.
నువ్వు ఎవరో తెలియకముందే మీ అమ్మను రౌడీ బారి నుంచి కాపాడావు.. ఇప్పుడు మరోసారి తల్లికి ప్రాణం పోస్తున్నావని అంటాడు దశరథ. నిన్నటి వరకు నా భార్య బతుకుతుందో లేదోనని టెన్షన్ ఉండేది.. ఇప్పుడు కన్నకూతురు ఉండటంతో చాలా ధైర్యం వచ్చిందని అంటాడు దశరథ. కార్తీక్ మాత్రం దీపను బలవంతంగా బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాడు. గతంలో నా బిడ్డను పొత్తిళ్లలో ఇలాగే తీసుకెళ్లిపోయారు, ఇప్పుడు నా బిడ్డను నువ్వు నా బిడ్డను తీసుకెళ్లిపోతావా అని ప్రశ్నిస్తాడు కార్తీక్. అత్తకి ఆపరేషన్ జరిగి పూర్తిగా కోలుకునే వరకు నిజం చెప్పకూడదని అంటాడు కార్తీక్.
దీప కళ్లలో నీళ్లు చూడాలని చూడాలని జ్యోత్స్న- పారిజాతంలు ప్లాన్ చేస్తారు. కాఫీ తీసుకురమ్మని చెప్పి దీపకి కాలు అడ్డుపెడుతుంది జ్యోత్స్న. దాంతో కాఫీ వెళ్లి పారుపై పడుతుంది. కోపంతో ఊగిపోయిన పారిజాతం.. దీపని కొట్టబోతుండగా దశరథ వచ్చి ఆపుతాడు. దీపకి నువ్వు కాలు ఎందుకు అడ్డుపెట్టావని జ్యోత్స్నని ప్రశ్నిస్తాడు. ఆ మాటలతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. మొబైల్ చూస్తూ పొరపాటున కాలు తగిలింది.. దీప చూడకుండా వచ్చేసిందని చెబుతుంది జ్యోత్స్న. అసలు తప్పంతా నువ్వు చేశావని పారుపై దశరథ మండిపడతాడు. దాంతో మావయ్యని ఎలాగైనా కూల్ చేయాలని ప్రయత్నిస్తాడు కార్తీక్.
నువ్వు ఎంతో పెద్ద తప్పు చేశావు.. నువ్వు చేసింది నీకు తెలియదా? అసలు దీప పనిమనిషి కాదని పారిజాతంతో మండిపడతాడు. దీప నా మేనల్లుడి భార్య, నా చెల్లెలి కోడలు, నీకు దీప పనిమనిషి కావొచ్చు, కానీ నాకు మాత్రం ఇంట్లో మనిషి. నా ఆప్తురాలు, నా శ్రేయోభిలాషి, నా భార్య ప్రాణదాత అంటాడు దశరథ. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఎప్పుడో ఒకసారి సుమిత్ర ప్రాణాలు కాపాడిందని గతాన్ని గుర్తుపెట్టుకుంటావా అని అడుగుతుంది పారిజాతం. నీకు గతమే కావొచ్చు.. కానీ అది కొందరికీ కథ. దీప పనిమినిషే కావొచ్చు.. తను కడుపుతో ఉన్న మనిషి. కాఫీ కావాలంటే ఎవరిని అడగాలని పారు అడగ్గా.. జ్యోత్స్నని అడగాలని తేల్చేస్తాడు. జ్యోత్స్న తీసుకురాదా? అని అంటాడు దశరథ.
నేను కిచెన్‌లోకి వెళ్లడం నువ్వు చూశావా? కాఫీ నన్ను పెట్టమంటావా? నేనెందుకు పనిచేయాలని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఈరోజు నుంచి దీప నీకు కానీ, పిన్నికి కానీ కాఫీలు, టిఫిన్‌లు ఇవ్వదు. నీకు ఏదైనా అవసరం అయితే జ్యోత్స్నని అడుగు అంటాడు తేల్చేస్తాడు దశరథ. నువ్వు ఏం మాట్లాడవేంటి అని శివన్నారాయణని అడుగుతుంది జ్యోత్స్న. ఎవరు అడిగినా ఇదే మాట చెబుతాను అంటాడు దశరథ. ఏమైంది రా నీకు, జ్యోత్స్న మీద ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నావని మండిపడతాడు శివన్నారాయణ. కొన్ని అలవాట్లు, పద్ధతులు నేర్చుకోవాలి. జ్యోత్స్న పెళ్లి చేసుకోకుండా జీవితాంతం మనింట్లోనే ఉండిపోతుందా? ఈరోజు కాకపోయినా రెండు నెలల తర్వాతైనా వెళ్లిపోవాలి కాదా అని అంటాడు. అక్కడ భర్తకి కాఫీ పెట్టదా? టీ అడిగితే నాకు రాదు అని చెబుతుందా? పెళ్లి కావాల్సిన పిల్ల వంట వార్పూ నేర్చుకోవాలని అంటాడు.
ఈరోజు నుంచి జ్యోత్స్న ఇంటి పనులు నేర్చుకోవాల్సిందేనని అంటుంది. దీపకి ఏం కాదు.. నేను చూసుకుంటానని దశరథను కార్తీక్ బయటకు తీసుకెళ్తాడు. దీప కడుపులో పెరుగుతున్నది వాళ్ల అమ్మ అని దశరథ, కాంచన నమ్ముతున్నారు. దీప కడుపులోని బిడ్డకు ఏమైనా అవుతుందని వాడి భయమని శివన్నారాయణ అంటాడు. నీ కడుపులోని బిడ్డ కోసం నువ్వు కొన్ని పనులు తగ్గించుకుంటే మంచిదని చెబుతాడు. ఈ మధ్య మీ నాన్నకి ఏదో అయ్యింది.. దీపని ఒక్క మాట పడనివ్వడం లేదని జ్యోత్స్నతో అంటుంది పారిజాతం. నీ కోపాన్ని, సంతోషాన్ని చూడలేకపోతున్నానని దశరథతో అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











