Karthika Deepam 2 February 28th: జీవితంలో దీప తల్లి కాలేదు.. కార్తీక్‌కు డాక్టర్ షాక్, నిజం తెలుసుకున్న దశరథ

Photo Courtesy: JioHotstar

దాస్ కిడ్నాప్ గురించి కార్తీక్ ప్రస్తావించడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. దాస్ కనిపించాడని, మాట్లాడాడని దశరథ చెప్పాడని అంటాడు. ఈ కథ వేరని, ఆ కథ వేరని చెబుతాడు కార్తీక్. బావకి నిజం తెలిసిపోయిందా? దాస్, దశరథలపై నాకు అనుమానంగా ఉందని అంటుంది జ్యోత్స్న. బెడ్‌రూంలో నిద్రపోతున్న సుమిత్ర దగ్గరికి దీపని తీసుకెళ్లి నీ అసలు కూతురని చెప్పబోతుండగా కార్తీక్ అడ్డుపడతాడు. దీప కళ్లలో ఈ రోజు కన్నీళ్లు చూడాలని జ్యోత్స్న అనడంతో పారిజాతం ప్లాన్ చేస్తుంది. కాఫీ తీసుకురమ్మని అడగటంతో దీప వస్తుండగా.. కాలు అడ్డుపెడుతుంది జ్యోత్స్న. దాంతో కాఫీ వెళ్లి పారు మీద పడుతుంది.

కోపంతో ఊగిపోతున్న పారు వెంటనే దీప మీద చేయి చేసుకోబోతుండగా దశరథ సీరియస్ అవుతాడు. అసలు నువ్వు కాలెందుకు అడ్డుపెట్టావని దశరథ అడగ్గా.. ఏదో విధంగా కవర్ చేస్తుంది జ్యోత్స్న. అయినా నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లవి.. ఇకపై నువ్వే వంట చేయమని ఆర్డర్స్ వేస్తాడు దశరథ. కొడుకు ప్రవర్తనతో శివన్నారాయణ షాక్ అవుతాడు. దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి దశరథ భయపడుతున్నాడని అందుకే అలా కోప్పడ్డాడని పెద్దాయన చెబుతాడు. మావయ్యని బయటికి తీసుకెళ్లి కూల్ చేస్తాడు కార్తీక్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి ఫిబ్రవరి 28వ తేదీ 606వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 606 February 28th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

నువ్వు ఇలాగే చేస్తే జ్యోత్స్న, పారిజాతంలు ఎంతకైనా తెగిస్తారని దశరథకు చెబుతాడు కార్తీక్. అత్తకి ఏమైనా జరిగితే నీ జీవితానికి అర్ధం లేదు అన్నావు.. అలాగే నీకు ఏదైనా అయితే నీ కూతురి జీవితానికి కూడా అర్ధం లేదని అంటాడు కార్తీక్. అలాగని భయపడతామా? ఎవరు పనిమనిషిగా ఉండాలి.. ఎవరు సేవలు చేయించుకోవాలి.. బిడ్డల్ని మార్చేసిందే కాక, ఇప్పుడు కడుపులోని బిడ్డని కూడా చంపాలని చూస్తారా? ఎంత దుర్మార్గులు అంటూ మండిపడతాడు దశరథ.

గతంలో ఒకసారి ఇలాగే దీప కిందపడబోయింది.. అప్పుడు నాకు సరిగా అర్ధం కాలేదు కానీ, నిజం తెలిసినప్పటి నుంచి అంతా అర్ధమవుతోంది. వాళ్ల ముఖాలు చూస్తుంటే కోపం ఆగడం లేదని అంటాడు దశరథ. అత్తకు ఆపరేషన్ జరిగే వరకు తప్పదు, భరించాల్సిందే. ఇప్పుడు నువ్వు ఎంత ఓపిక పడతావో, భవిష్యత్ అంత అందంగా ఉంటుంది. జ్యోత్స్నని, మా పిన్నిని జీవితంలో క్షమించనని అంటాడు దశరథ. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేసి దీపని తీసుకుని ఆసుపత్రికి రమ్మని చెబుతుంది. నేను కూడా వస్తానని దశరథ అనగా.. నువ్వు ఇంటి దగ్గరే ఉండమని చెబుతాడు కార్తీక్.

స్వప్న- కాశీలకు విడాకులు ఇప్పించేసి ఇద్దరికి చెరో పెళ్లి చేసేయమని కాంచన చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. బిడ్డల జీవితాల్ని కలపమని నేను చెబుతుంటే నువ్వు విడాకులు ఇప్పించమంటావా? కళ్లముందే బిడ్డల జీవితాలు నాశనం అవుతుంటే దాని కన్నా నరకం మరొకటి ఉండదని బాధపడతాడు శ్రీధర్. ఈరోజు నేను చెప్పింది మీకు అలాగే అనిపిస్తుంది. కానీ ఆ పని చేసి చూస్తే తర్వాత ఏమవుతుందో మీకే అర్ధమవుతుందని అంటుంది కాంచన. నేను అంతా ఆలోచించే చెప్పాను.. మీరు కూడా ఒకసారి ఆలోచించమని చెబుతుంది.

కాంచన చెప్పినట్లే ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి దాస్‌ని కూడా పిలుస్తాడు శ్రీధర్. మన రోజుల్లో పెద్దలు తీసుకునే నిర్ణయాలు పిల్లలకు చెప్పేవారు. ఈరోజుల్లో పిల్లలు తీసుకునే నిర్ణయాలు పెద్దలకు చెబుతున్నారు. కాశీ - స్వప్నలు విడిపోవాలని అనుకుంటున్నారని శ్రీధర్ చెప్పడంతో దాస్ షాక్ అవుతాడు. భార్యాభర్తలు విడిపోతుంటే అలా జోక్‌గా చెబుతావు అని మండిపడతాడు దాస్. కొడుకు గురించే నువ్వు ఇంతలా బాధపడుతుంటే నా కూతురి పరిస్థితి ఏంటీ అని ప్రశ్నిస్తాడు శ్రీధర్.

ఈరోజుల్లో కొడుకు, కూతురు సమానమే అని దాస్ చెబుతాడు. రెగ్యులర్‌గా మా ఇంట్లో జరిగేది ఇదేనని చెబుతాడు శ్రీధర్. ఇక్కడ విడాకుల నిర్ణయం జరిగిపోయింది, సంతకాలు పెట్టడమే మిగిలిందని అంటాడు. విడాకులకు నువ్వు ఒప్పుకున్నావా అని కాశీని అడుగుతాడు దాస్.. నేను విడాకుల మాటెత్తలేదు.. స్వప్నే అడిగిందని, నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చిందని అంటాడు కాశీ. ఇలా వదిలేస్తే కష్టమని పిల్లలకి అర్ధమయ్యేలా చెప్పాలని దాస్ అంటాడు. అయితే నేను నీకో ఛాన్స్ ఇస్తాను నువ్వు ఒప్పిస్తే విడాకుల ప్రోగ్రామ్ ఆపేస్తానని చెబుతాడు శ్రీధర్.

బోన్ మ్యారో ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తున్నానని దీని గురించే మిమ్మల్ని పిలిపించానని చెబుతుంది డాక్టర్ హారిక. ఒకసారి ఇది ప్రారంభమైతే వెనక్కి తిరిగి రావడం కుదరదని చెబుతుంది డాక్టర్. మీరు రెడీగా ఉన్నారా? అని అడగ్గా.. వెంటనే ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేయమని కార్తీక్, దీపలు చెప్పడంతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. ఈ బిడ్డను మీరు వద్దు అనుకుంటే జీవితంలో దీపకి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు.. ఇప్పుడు కూడా మీరు ఓకేనా అని డాక్టర్ చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. అమ్మకి ఏదైనా జరిగితే అదే పెద్ద బాధ.. దాని ముందు నేను ఏదైనా భరిస్తానని అంటుంది దీప.

డాక్టర్ వచ్చి ఏం నిర్ణయం తీసుకున్నారని అడగ్గా ఆపరేషన్‌ చేయడానికి అంగీకరిస్తానని కార్తీక్ చెప్పడంతో డాక్టర్ షాక్ అవుతుంది. సుమిత్ర గారికి దీప బోన్‌మారో ఇవ్వడం వల్ల ఇప్పుడు కడుపులోని బిడ్డనే కాదు, జీవితాంతం తల్లి అయ్యే అవకాశం కూడా కోల్పోతుందని డాక్టర్ చెబుతుండగా దశరథ వచ్చి ఆ మాటలు విని షాక్ అవుతాడు. దీప మీ కూతురని మీకు తెలుసా అని హారిక చెప్పడంతో నిజం తెలిసిందని చెబుతాడు దశరథ. నా భార్యను కాపాడటానికి నా కూతురు తన కడుపులోని బిడ్డను వదులుకుంటుందా అని దశరథ అడగటంతో అవును అని డాక్టర్ ఆన్సర్ ఇస్తుంది. ఆ మాటలతో దశరథ షాక్ అవుతాడు.

విడాకులు తీసుకోకుండా కాశీ - స్వప్నలను కలపాలని ప్రయత్నిస్తాడు దాస్. నీకు నచ్చకపోతే నీ బిడ్డని, నీ తండ్రిని మార్చుకుంటావా? భర్త కాబట్టే మార్చుకోవాలని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు దాస్. మా నాన్నని, మా అన్నయ్యని, నన్ను ఎన్నిసార్లు మోసం చేశావని మండిపడుతుంది స్వప్న. ఇంత నిజాయితీపరుడితో నేను కాపురం చేయలేను.. నన్ను వదిలేయమంటుంది స్వప్న. ఆ మాటలతో కాశీకి గతంలో తాను అన్న మాటలు గుర్తొస్తాయి. మీరు విడాకులు తీసుకోవడానికి వీల్లేదని చేతులెత్తి దండం పెడతాడు దాస్. కాశీని పెళ్లి చేసుకోకపోయినా నువ్వు నాకు మావయ్యవే, నీతో బంధాన్ని వదులుకోలేనని అంటుంది స్వప్న. కాశీతో కలిసుండలేను, కాగితాలు ఎక్కడ ఉన్నాయో చెబితే సంతకాలు పెట్టేస్తానని చెబుతుంది.

నా చుట్టూ ఇంత జరుగుతున్నా నేను ఏం తెలుసుకోలేకపోతున్నాను అని బాధపడతాడు దశరథ. దీప హెల్త్ కండీషన్ ప్రకారం.. బిడ్డను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే, కడుపులోని బిడ్డను నేను సేవ్ చేయలేనని అంటుంది డాక్టర్ హారిక. బిడ్డను కాపాడాలి అంటే దీప డోనర్‌గా ఉండకూడదు.. అప్పుడు సుమిత్ర గారు బతకరని డాక్టర్ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. దీనికి నేను ఒప్పుకోనని దశరథ తేల్చి చెబుతాడు. ఏదో ఒక ప్రాణాన్ని వదులుకోవడమో సొల్యూషన్ అని డాక్టర్ చెప్పడంతో దశరథ బాధపడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X