Karthika Deepam 2 March 2nd: దీప త్యాగం.. కూతురి కాళ్లపై పడ్డ దశరథ.. చావుకి దగ్గరవుతోన్న సుమిత్ర

Photo Courtesy: JioHotstar

నువ్వు ఇలాగే చేస్తే పారు, జ్యోత్స్నలు ఎంతకైనా తెగిస్తారని దశరథని హెచ్చరిస్తాడు కార్తీక్. ఎవరు పనిమనిషి.. ఎవరు సేవలు చేయించుకోవాలని దశరథ నిలదీస్తాడు. ఇంతలో డాక్టర్ హారిక ఫోన్ చేయడంతో కార్తీక్, దీపలు ఆసుపత్రి చేరుకుంటారు. నేను కూడా వస్తానని దశరథ చెప్పగా సీక్రెట్‌గా కార్తీక్, దీపలు మాత్రమే వెళ్తారు. అయితే దశరథ మాత్రం అనుమానంతో వాళ్లని ఫాలో అవుతాడు. సుమిత్ర గారి ఆపరేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని, అయితే మీ బిడ్డను వదులుకోవాల్సిందేనని.. ఒకసారి ఆలోచించుకోమని చెబుతుంది డాక్టర్ హారిక. దానికి కార్తీక్, దీపలు సరేనని అంటారు. అయితే ఈ ఒక్క బిడ్డే కాదు... దీపకి భవిష్యత్తులో బిడ్డ పుట్టే అవకాశమే ఉండదని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ వెక్కి వెక్కి ఏడుస్తాడు.

దీప బలవంతం మీద ఆపరేషన్‌కి సరేనని చెబుతాడు. ఈ మాటలన్నీ విన్న దశరథ.. సుమిత్ర ప్రాణాలను కాపాడితే దీప తన బిడ్డను కోల్పోతుందని నాకెందుకు చెప్పలేదని ప్రశ్నిస్తాడు. రెండు ప్రాణాల్లో ఒకటి వదులుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని డాక్టర్ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. మరోవైపు.. కాశీతో తాను కాపురం చేయలేనని తనకు విడాకులు కావాల్సిందేనని స్వప్న తేల్చేస్తుంది. దాస్ ఎంత నచ్చచెప్పాలని చూసినా స్వప్న వినిపించుకోదు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 2వ తేదీ 607వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 607 March 2nd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

నా కూతురి కడుపులోని బిడ్డను చంపమని డాక్టర్‌కి చెప్పడానికి అసలు నువ్వు ఎవరు? కడుపులోని బిడ్డను చంపాలనుకున్న నువ్వు.. పుట్టిన బిడ్డన చంపాలనుకున్న పారిజాతం పిన్నికి తేడా ఏంటీ? నా దృష్టిలో ఇద్దరూ ఒక్కటేనని దశరథ మండిపడతాడు. బిడ్డలకు ఏదైనా జరిగితే వాళ్ల కోసం జీవితాల్ని పణంగా పెట్టి వారిని కాపాడుకునే తల్లిదండ్రులను చూశాను కానీ మీలాంటి వాళ్లను నేను ఎక్కడా చూడలేదని అంటాడు. ఆ మాటలతో కార్తీక్ సీరియస్ అవుతాడు. అత్త ప్రాణాలు కాపాడటానికి వేరే దారే ఉంటే నా బిడ్డను ఎందుకు వదులుకుంటానని నిలదీస్తాడు. నీ భార్యను కాపాడుకోవడానికి నీ దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటీ? అని ప్రశ్నిస్తాడు కార్తీక్.

నేనేదో నిన్ను బలవంతంగా ఒప్పించి బిడ్డను వదులుకోమని చెబుతున్నానని మీ నాన్న అనుకుంటున్నాని మండిపడతాడు కార్తీక్. భార్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే భర్త కళ్లలో నీళ్లు తిరుగుతాయి. తనలో ఉన్న ప్రాణం భార్య గర్భంలో ఊపిరి పోసుకుంటుంది. పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు. నెలల నిండిన భార్య కడుపులో నుంచి బిడ్డ పాదముద్రలు స్పష్టంగా కనిపిస్తుంటే అది ఎప్పుడు భూమీ మీద అడుగుపెట్టి ఈ నాన్న చేతితో నడక నేర్చుకుంటుందోనని ఎదురుచూశా. ఇలాంటి అనుభూతిని పొందాలని నేను కూడా కోరుకుంటానని అంటాడు కార్తీక్.

నేను నా భార్య కడుపులోని బిడ్డను వద్దు అనుకుంటే దీప పుట్టేదే కాదు. ఇప్పుడు నా కూతురి కడుపులో మరో దీప పెరుగుతోంది. దానిని ఈ లోకం చూడకముందే సాగనంపొద్దని బతిమలాడతాడు దశరథ. అయిత అత్త చనిపోయినా పర్లేదా? అని కార్తీక్ నిలదీయడంతో దశరథ షాక్ అవుతాడు. ఇది ఇద్దరు తండ్రుల మధ్య జరుగుతున్న యుద్ధం, ఇద్దరు భర్తల మధ్య జరుగుతున్న యుద్ధం.. ఆయన కూతురి బిడ్డను వదులుకోలేడు.. నా అత్తను నేను కూడా వదులుకోలేనని అంటాడు కార్తీక్. నా భార్య ప్రాణాల మీదకి వస్తే నీ జీవితాన్నే తాకట్టు పెట్టి నా భార్యను నేను బతికించుకున్నాను.. అలాంటి బాధ్యత నీకు లేదా? నిన్నే నమ్ముకుని బతుకుతున్న నీ భార్యను అలాగే వదిలేస్తావా అని నిలదీస్తాడు కార్తీక్.

కంటికి కనిపించని ప్రాణం మీద ఇంత మమకారం ఉంటే.. కనిపించే ప్రాణం మీద ఇంకెంత మమకారం ఉండాలని అడుగుతాడు కార్తీక్. అత్తకి మావయ్య అంటే ఎంత ప్రేమంటే.. మతిస్థిమితం కోల్పోయినప్పుడు ఎవ్వరిని గుర్తుపట్టకపోయినా? మావయ్యని మాత్రమే గుర్తుపట్టేది అది కదా ప్రేమంటే. ఈ బిడ్డ పోతుందని తెలిసి నేను, దీప ఎంతో బాధపడుతున్నాం. కానీ తనకు ప్రాణం పోసిన కన్నతల్లి కోసం బిడ్డను వదులుకుంటుంది. అలాంటి త్యాగం చేస్తున్న నీ కూతురి కాళ్లను మనం మొక్కాలని అంటాడు కార్తీక్. ఆ మాటలతో ఎమోషనల్ అయిన దశరథ.. సుమిత్ర లేకుండా నేను బతకలేనని అంటాడు.

అయితే మేం బిడ్డను వదులుకోవడానికి సరేనని చెప్పమని అడుగుతాడు కార్తీక్. నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? నీ గుండె ఎలా తట్టుకుంటుంది? అని అడుగుతాడు దశరథ. మీరిద్దరు నాకు ఆకాశమంత ఎత్తులో కనిపిస్తున్నారని అంటాడు. ఇది నువ్విచ్చిన ప్రాణమే.. మీ బిడ్డకు మీ రుణం తీర్చుకునే అవకాశం దొరికిందని అంటాడు. ఈ తండ్రి చేతకానితనం వల్ల ఇన్నేళ్లు కష్టాలు పడ్డావు.. ఇప్పుడు మరో భారం మోయడానికి సిద్ధపడ్డావు.. నువ్వు నా కూతురివా? కన్నతల్లివా అంటూ దీప కాళ్ల మీద పడబోతాడు దశరథ. అయినప్పటికీ నేను ఎవరిని వదులుకోలేను.. మనం ఇద్దరినీ కాపాడుకునే ప్రయత్నం చేద్దామని అంటాడు దశరథ. అయితే ఇంటికెళ్లి అత్త పరిస్ధితి చూడు.. అప్పుడు నీకే ఏం చేయాలో తెలుస్తుందని చెబుతాడు కార్తీక్.

డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆపరేషన్‌కి కావాల్సిన ప్రోసీజర్ స్టార్ట్ చేయమని చెబుతాడు కార్తీక్. మళ్లీ మీ మావయ్య వచ్చి గొడవ చేయరు కదా అని ప్రశ్నిస్తుంది డాక్టర్. ఎంతపెద్ద ఆపరేషన్స్ అయినా చేయగలను కానీ.. ఇలాంటి టెన్షన్ భరించలేను. ఈ నిజాలన్నీ దాస్, దశరథ గారికి చెబుతూ వచ్చారు.. తర్వాత శివన్నారాయణ గారికి చెబుతారా అని ప్రశ్నిస్తుంది డాక్టర్. మేం ఏది ప్లాన్ చేసుకోలేదు.. ఆ సమస్యకి ఒక్కో పరిష్కారం వెతుకుతూ వస్తున్నానని చెబుతాడు. దీపని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలని డాక్టర్ చెప్పడంతో కార్తీక్ సరేనని చెబుతాడు. నాన్న ఒప్పుకోలేదు కదా అని దీప అనగా.. దశరథ గారు ఒప్పుకోలేదా అని డాక్టర్ షాక్ అవుతుంది.

దశరథ ఇంటికెళ్లి చూసేసరికి సుమిత్ర దగ్గుతూ నరకయాతన అనుభవిస్తుంది. నేను బతుకుతాను కదా? ఆపరేషన్ వరకు నేను బతకనా అని బాధపడుతుంది. ఇంతలో జ్యోత్స్న, పారిజాతం, శివన్నారాయణలు బాధపడతారు. జ్యోత్స్న హెల్ప్ చేస్తానని చెప్పడంతో దశరథ మండిపడతాడు. నేను మీ అందరినీ బాధపెడుతున్నానని అంటుంది సుమిత్ర. దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉందా? అని దీపని సుమిత్ర అడగటంతో కార్తీక్, దశరథ ఎమోషనల్ అవుతారు. నాకు భయంగా ఉంది.. మీరంతా ఇక్కడే ఉండండి అని చెబుతుంది సుమిత్ర. ఒకవేళ నేను నిద్రలోనే పోతే అని అంటుంది. నన్ను చూసుకోవడానికి నా కూతురు ఉంది.. తను చూసుకుంటుందని బాధపడుతుంది సుమిత్ర. డాక్టర్‌తో వెంటనే మాట్లాడి ఆపరేషన్‌ చేయించమని చెబుతాడు శివన్నారాయణ. దాంతో కార్తీక్ అన్న మాటలు గుర్తుకొచ్చి దశరథ కంటతడి పెడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X