Karthika Deepam 2 March 3rd:కార్తీక్ కోసం జ్యోత్స్న‌తో శివన్నారాయణ డీల్.. దీప బిడ్డ గురించి తెలుసుకున్న పారు

Photo Courtesy: JioHotstar

కార్తీక్ ఎంత చెప్పినా దీప కడుపులోని బిడ్డను వదులుకోవడానికి దశరథ ఒప్పుకోడు. బిడ్డను చంపాలని అనుకుంటున్న నీకు, పారిజాతం పిన్నికి తేడా ఏంటని ప్రశ్నిస్తాడు దశరథ. అత్త ప్రాణాలు కాపాడటానికి మరో దారి ఉంటే బిడ్డను ఎందుకు వదులుకుంటానని కార్తీక్ ప్రశ్నిస్తాడు. భార్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆ బిడ్డను ఎప్పుడెప్పుడు చూడాలి? ఎప్పుడెప్పుడు గుండెలకు హత్తుకోవాలని తండ్రి వేయి కళ్లతో ఎదురుచూస్తుంటాడు. అత్త కడుపుతో ఉన్నప్పుడు నువ్వు కూడా ఇదే అనుభూతిని చూసి ఉంటావని చెబుతాడు కార్తీక్. నా కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపొద్దని వేడుకుంటాడు.

అయితే అత్త చనిపోయినా పర్లేదా? అని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఆ మాటలతో దశరథ షాక్ అవుతాడు. నా భార్య లేకుండా నేను బతకలేను.. నాకు సుమిత్ర కావాలని అడుగుతాడు. అయితే ఇంటికి వెళ్లి అత్త పరిస్ధితి ఒకసారి చూసి నీ నిర్ణయం ఏంటో చెప్పమని అంటాడు కార్తీక్. దశరథ ఇంటికి వెళ్లేసరికి సుమిత్ర విపరీతంగా దగ్గుతూ, నోటి వెంట రక్తం వస్తుంది. అది చూసి దశరథ తల్లడిల్లిపోతాడు. ఇంతలో పారిజాతం, శివన్నారాయణ, జ్యోత్స్నలు పరుగు పరుగున అక్కడికి వస్తారు. జ్యోత్స్న హెల్ప్ చేస్తానని చెప్పగా దశరథ కోప్పడతాడు. తల్లి పరిస్ధితి చూసి దీప కంటతడి పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 3వ తేదీ 608వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 608 March 3rd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

సుమిత్ర పరిస్ధితి చూసి ఒంటరిగా ఏడుస్తుంటాడు దశరథ. కార్తీక్- దీప వెళ్లి అతనిని ఓదారుస్తారు. ఒకేసారి రెండు వరాలు పొందినట్లు కూతురితో పాటు కూతురి బిడ్డ కూడా రాబోతోంది. నా కూతురి విషయంలో నేను చేసిన తప్పు.. నా మనవరాలి విషయంలో సరిదిద్దుకోవాలని అనుకున్నాను. అది పుట్టిన దగ్గరి నుంచి ఈ తాతయ్య ఒడిలోనే పెరగాలని అనుకున్నాను అంటాడు దశరథ. నా కూతురి అల్లరి, తొలి పిలుపు వినలేకపోయాను.. నా ఆశలన్నీ మనవరాలితోనే తీర్చుకోలేకపోయాను. ఒకపక్క నా చెల్లి మాత్రం దీప కడుపున మా అమ్మ పుడుతుందని సంబరపడుతోంది. నేను ఎంత మంది ఆశల్ని చంపేయాలి, ఎన్ని కలల్ని చంపేయాలి అని బాధపడతాడు దశరథ.

ఎవరిని వదులుకోవాలి? మీ అత్తను బతికించే దేవత నా కూతురే.. మా ఇంటి దీపానికి వెలుగునిచ్చే దేవత. తండ్రిగా నేను నీకు ఏం ఇవ్వలేదు.. అలాంటిది నీ నుంచి ఎందుకు తీసుకోవాలి అని అడుగుతాడు దశరథ. నాకు జన్మనిచ్చావు కదా.. తల్లిదండ్రుల కళ్లలో కన్నీళ్లు తుడవలేకపోతే ఈ జన్మ నాకెందుకు? తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశం ఎంతమందికి వస్తుంది. అలాంటి అవకాశం నాకు కాదు.. నా బిడ్డకు ఇచ్చాడని చెబుతుంది దీప. ఈ బిడ్డ నాలో నుంచి నా తల్లి ప్రాణంలోకి పోతుంది.. అప్పుడు నాకు బిడ్డ అయినా, తల్లి అయినా అమ్మే కదా అంటుంది. ఆ మాటలతో దీపకి చేతులెత్తి దండం పెడతాడు దశరథ.

ప్రాణాలతో ఉన్న అత్తను చూసి ఈ బాధ నుంచి తేరుకుంటాం. ఈ సమస్యకు ఇంతకుమించి పరిష్కారం లేదని చెబుతాడు కార్తీక్. ఇంతలో జ్యోత్స్న వచ్చి... ఆ సమస్య ఏంటీ? ఆ పరిష్కారం ఏంటీ? అని నిలదీయడంతో అంతా షాక్ అవుతారు. అదే సమయంలో శివన్నారాయణ కూడా వచ్చి ఆ సమస్య ఏంటీ? అని అడుగుతాడు. వీరి ముగ్గురి మధ్య ఏదో మనకి తెలియని కథ నడుస్తోందని అంటుంది పారిజాతం. సమస్య ఎవరో కాదు.. మన జ్యోత్స్న మేడం గారే అనడంతో నేనేం చేశానని జ్యోత్స్న అడుగుతుంది.

అత్తకు ఆపరేషన్ అన్న ప్రతిసారి తమరు లగేజ్ సర్దుకుని రెడీగా ఉంటున్నారు కదా? చిన్నసారు వీలైనంత త్వరగా అత్తని ఆసుపత్రిలో జాయిన్ చేయండి.. డాక్టర్‌తో మాట్లాడండి అన్నారు. తమరికి ఆసుపత్రి అంటేనే భయం.. తమరు ఇల్లు వదిలి వెళ్లిపోతే అదో పెద్ద సమస్య, అందుకే ఇంటికి నేనే కాపలాగా ఉంటాను, ఇదే ఈ సమస్యకు పరిష్కారం అన్నాను అని కార్తీక్ కవర్ చేస్తాడు. బాధ్యత కలిగిన కూతురుంటే తండ్రికి సమస్య ఏం ఉంటుందని దశరథ అంటాడు. కార్తీక్, దీపలు డాడీతో ఏదో మాట్లాడుతున్నారు. నేను అడిగేసరికి మాట మార్చారు అని అనుకుంటుంది జ్యోత్స్న. నీకు టైం దగ్గరపడింది, లగేజ్ సర్దుకుని రెడీగా ఉండమని అనుకుంటాడు కార్తీక్.

కాశీ - స్వప్నలు విడిపోతున్నారని తెలిసి కాశీతో మండిపడతాడు దాస్. విడాకుల పేపర్‌ల మీద నువ్వు పెట్టింది సంతకం కాదు.. నువ్వు వదిలేసుకున్న జీవితం. ఈరోజుల్లో పెళ్లిళ్లు కూడా పిల్లాడికి కొనిచ్చిన బొమ్మల్లాగే ఉంటున్నాయని బాధపడతాడు దాస్. మనిషి తన తెలివి తేటలతో ప్రపంచాన్ని గెలవగలుగుతున్నాడు.. కానీ కట్టుకున్న మనిషిని తప్పా. అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నది విడిపోవడానికా అని ప్రశ్నిస్తాడు దాస్. నాకు కూడా విడాకులు ఇస్తే నీతో విడిపోతాను అంటాడు. ఆ మాటలతో కాశీ షాక్ అవుతాడు. నేను విడాకుల పేపర్ల మీద సంతకం మాత్రమే పెట్టాను.. కానీ స్వప్నను వదులుకోను అని చెబుతాడు కాశీ. మళ్లీ స్వప్నని ప్రేమించి తనకు దగ్గరవుతానని చెబుతాడు కాశీ. ఆ మాటలతో దాస్ సంతోషించి కొడుకుకి ఆల్ ది బెస్ట్ చెబుతాడు.

సుమిత్ర ఆపరేషన్ జరిగే వరకు నువ్వు ఎక్కడికి వెళ్లొద్దని జ్యోత్స్నకి వార్నింగ్ ఇస్తాడు శివన్నారాయణ. ఇంతలో కార్తీక్, దీపలు వచ్చి రేపటి నుంచి మేం డ్యూటీకి రావడం లేదని చెబుతారు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. దీప రెస్ట్ తీసుకుంటే నువ్వు డ్యూటీ మానేయడం ఎందుకు? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. ఇంటి దగ్గర అత్త, అనసూయ ఉన్నారు కదా అని అడుగుతుంది. ఇవన్నీ చేయాలంటే ముందు నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలని జ్యోత్స్న అనడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. అగ్రిమెంట్ ప్రకారం వీళ్లు ఇక్కడ పనిచేయాలన్నా, మానేయాలన్నా నాకు చెప్పాల్సిందేనని అంటుంది జ్యోత్స్న. అయితే దీప ఎక్కడికి వెళ్లదు, తనకు కావాల్సిన సౌకర్యాలు, ఏర్పాట్లు అన్ని ఇక్కడే చేస్తానని చెప్పడంతో కార్తీక్, దీప షాక్ అవుతారు.

దీప ఈ ఇంటి పనిమనిషి, బావ ఈ ఇంటి డ్రైవర్ .. పనివాళ్ల బాధ్యత యజమానులదే. అందుకే నెల రోజుల వరకు వారిద్దరూ ఏ పని చేయకుండా ఈ ఇంట్లోనే ఉండొచ్చని చెబుతుంది జ్యోత్స్న. దీనికి ఏదో అనుమానం వచ్చింది.. అందుకే లీవ్ ఇవ్వకుండా అడ్డుపడుతోందని అనుకుంటాడు కార్తీక్. మేం పనివాళ్లం.. మా హద్దుల్లో మేముండాలని మా ఇంట్లోనే ఉంటామని చెబుతాడు కార్తీక్. నీకు అగ్రిమెంటే ముఖ్యమైతే.. కార్తీక్ ఫైన్ కింద కట్టాల్సిన 10 కోట్లు నేనే కడతానని అంటాడు శివన్నారాయణ. ఆ మాటలతో జ్యోత్స్న, పారు షాక్ అవుతారు. ఉండటం, ఉండకపోవడం దీప- కార్తీక్‌ల ఇష్టమని లీవ్ ఇచ్చేస్తున్నానని అంటాడు శివన్నారాయణ. దాంతో ఏదో జరుగుతుందని పారిజాతానికి అనుమానం వచ్చి దశరథను ఫాలో అవుతుంది.

లీవ్ ఎందుకు అడిగావు అని దశరథ అడగ్గా.. దీపని ఆసుపత్రిలో అడ్మిట్ చేయడానికి అని చెబుతాడు దశరథ. నాన్న అని పిలుపు దూరం అవుతున్నందుకు బాధగా లేదా అని అడగ్గా.. అందుకు శౌర్య ఉంది కదా అంటాడు కార్తీక్. ఇది చాలా పెద్ద త్యాగమని దశరథ అనగా.. ఈ ఇల్లు మాకు దేవాలయం, నా బాల్యమంతా ఈ ఇంట్లోనే గడిచింది. అత్త లేని రెండ్రోజులు ఈ ఇంట్లో ఏం లేదని చిన్నప్పుడే అర్ధమైంది. ప్రకృతి మనం ఏది అడిగితే అది ఇస్తుంది.. కానీ మన నుంచి అపురూపమైనది ఒకటి తీసుకుని అమూల్యమైనది తిరిగి ఇస్తుందని అంటాడు కార్తీక్. దేవుడిని కూడా మేం ఒకటి అడిగాం.. అపురూపమైన నా బిడ్డను తీసుకుని, అమూల్యమైన అత్తను తిరిగి ఇస్తున్నాడని చెబుతాడు కార్తీక్. దీప కడుపులోని బిడ్డను వదులుకోవడం అంటే మనసు ఒప్పుకోవడం లేదని దశరథ అంటాడు. ఈ మాటలు విన్న పారు షాక్ అవుతుంది. దీప బిడ్డను వదులుకోవడం తప్పించి వేరే దారి లేదని కార్తీక్ చెప్పడంతో పారు ఇంకా కంగారు పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X