Karthika Deepam 2 March 4th: కార్తీక్ గుట్టు పట్టేసిన పారిజాతం.. దీపపై జ్యోత్స్న నిఘా

Photo Courtesy: JioHotstar

సుమిత్ర ఆరోగ్య పరిస్థితి గురించి తలచుకుంటూ బాధపడతాడు దశరథ. కార్తీక్, దీపలు వచ్చి ఓదారుస్తారు. నా కూతురి బాల్యాన్ని నా మనవరాలి ద్వారా తిరిగి పొందాలని అనుకుంటున్నా.. నా కూతురి అల్లరి చిన్నారిలో చూడాలని కలలు కన్నా. అన్నింటికి మించి దీప కడుపులో పెరుగుతున్నది తన తల్లేనని కాంచన నమ్ముతోందని చెబుతాడు దశరథ. అత్తను కాపాడాలంటే బిడ్డను వదులుకోవడం తప్పించి మరో పరిష్కారం లేదని తేల్చిచెబుతాడు కార్తీక్. ఇంతలో అక్కడికి వచ్చిన జ్యోత్స్న, పారిజాతంలు.. అలు ప్రాబ్లమ్ ఏంటీ? పరిష్కారం ఏంటీ? అని నిలదీస్తారు. కార్తక్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు.

మరోవైపు.. కాశీ- స్వప్నలు విడిపోతున్నారని తెలిసి, ఏం చేయలేకపోతున్నానని బాధపడతాడు దాస్. నేను స్వప్నని వదిలిపెట్టనని, ఆమె ఈగో చల్లారేలా చేస్తున్నానని చెబుతాడు కాశీ. విడాకులు ఇచ్చినా నేను స్వప్నని మళ్లీ ప్రేమించి ఆమెతో తిరిగి కలుస్తానని అంటాడు. ఆ మాటలతో దాస్ సంతోషిస్తాడు. దీపను ఆసుపత్రిలో చేర్చేందుకు గాను రేపటి నుంచి నెల రోజుల పాటు మేం పనిలోకి రామని చెబుతాడు కార్తీక్. నా పర్మిషన్ లేకుండా ఈ నిర్ణయం తీసుకోకూడదని.. మీరిద్దరూ నెలరోజులు ఇక్కడే ఉండాలని ఆర్డర్స్ వేస్తుంది జ్యోత్స్న. దాంతో కార్తీక్ కట్టాల్సిన 10 కోట్ల రూపాయలు నేనే కట్టేస్తానని కార్తీక్‌ను వదిలేయమని చెబుతాడు శివన్నారాయణ. కార్తీక్, దీప, దశరథ మధ్య ఏదో జరుగుతుందని పారుకు అనుమానం వచ్చి దశరథను ఫాలో అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 4వ తేదీ 609వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 609 March 4th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

బిడ్డను వదులుకోవడం తప్పించి ఈ సమస్యకు పరిష్కారం లేదని దశరథతో అంటాడు కార్తీక్. ఈ మాటలు విన్న పారిజాతం షాకై వెంటనే ఈ విషయాన్ని పారిజాతానికి చెప్పాలని వెళ్తుంది. మరోవైపు.. స్వప్నకి యాపిల్ కట్ చేసి ప్రేమగా తినిపిస్తుంటాడు శ్రీధర్. అది చూసిన కావేరి రగిలిపోతుంది. విడాకుల పేపర్ల మీద సంతకం చేసి కూతురిని మందలిస్తారని అనుకుంటే మీరు ప్రేమగా యాపిల్ తినిపిస్తున్నారని మండిపడి వెళ్లిపోతుంది. అమ్మకి నా మీద చాలా కోపంగా ఉంది.. మరి నీకెందుకు లేదని అడుగుతుంది స్వప్న.

మీ అమ్మ బాధేంటీ అంటే.. తన కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో? నలుగురు ఏమనుకుంటారోనని? నేను కాశీ గురించో , మీ అమ్మ గురించో, దాస్ గురించో ఆలోచించడం లేదు. ఎందుకంటే ప్రతి కూతురికి నాన్న ఒక హీరో. నా కూతురికి నేను ధైర్యంలా.. ఆమె ముఖం మీద నవ్వులా ఉండాలని అనుకున్నానని చెబుతాడు శ్రీధర్. వివాహ బంధాన్ని ఎవ్వరూ కావాలని వదులుకోరు.. ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావు.. నచ్చలేదని వదిలేసుకుంటున్నావు. అందరిలాగే నేను కూడా తిట్టి బాధపెడితే వాళ్లకి నాకు తేడా ఏముందని ప్రశ్నిస్తాడు శ్రీధధఱ్. ఆ మాటలతో స్వప్న ఏడుస్తూ తండ్రిని హత్తుకుంటుంది. జీవితంలో ఏం పోయినా తిరిగొస్తుంది.. కానీ జీవితం పోతే తిరిగిరాదని నచ్చచెబుతాడు శ్రీధర్. నన్ను ఇంతగా అర్ధం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెబుతుంది స్వప్న. నువ్వెప్పుడూ నా హీరో అని అంటుంది.

కాంచనకి పారిజాతం ఫోన్ చేసి నీకొక నిజం చెప్పాలని అనుకుంటున్నానని చెబుతుంది. ఈ నిజం చెబితే నీకు నిద్రపట్టదని అంటుంది పారు. నువ్వు చెప్పకపోయినా నాకు నిద్రపట్టదు.. నువ్వు ఏం చెప్పాలని అనుకున్నావో అని ఆలోచిస్తూ తెల్లవార్లు కూర్చొంటానిన అంటుంది కాంచన. అంత ఇబ్బంది పెట్టకూడదనే ఉంది.. కానీ లేనిపోని గొడవలు అవుతాయని ఆలోచిస్తున్నానని అంటుంది పారిజాతం. అసలు నీకెం తెలుసు? నాతో ఏం చెప్పాలని అనుకుంటున్నావు? దాని వల్ల ఏం గొడవలు అవుతాయని ప్రశ్నిస్తుంది కాంచన. నీ ఆశల మీద నీళ్లు చల్లిన దానిని అవుతాను అని అంటుంది పారిజాతం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త సమస్య వస్తూనే ఉంది.. సుమిత్ర వదిన ఆపరేషన్ అవ్వగానే దీపను ఎక్కడికి వెళ్లనివ్వనని చెబుతుంది కాంచన. ప్రసవం అయ్యే వరకు నా కళ్లముందే పెట్టుకుని దీపని చూసుకోవాలని అనుకుంటున్నానని చెబుతుంది. మళ్లీ ఏ సమస్య వచ్చింది? ఏం జరిగిందో చెప్పమని బతిమలాడుతుంది కాంచన.

నువ్వు నీ కోడలి గురించి, పుట్టబోయే బిడ్డ గురించి గంపెడు ఆశలు పెట్టుకున్నావు.. వాటిలో ఏ ఒక్కటి నిజం కాదని తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? అని పారిజాతం అనగా.. కాంచన షాక్ అవుతుంది. నీ కోడలు కడుపు వద్దు అనుకుంటోంది అని పారు చెప్పడంతో కాంచన ఉలిక్కిపడుతుంది. నీ కొడుకు, కోడలు నీ అన్న.. ముగ్గురు మాట్లాడుకుంటుంటే విన్నాను అని చెబుతుంది పారిజాతం. బిడ్డ, సమస్య, పరిష్కారం, కడుపు లేకపోతే అనే పదాలు విన్నాను అంటుంది. నీ కోడలికి ఈ కడుపు మోయడం ఇష్టం లేదు. దాని వెనుక ఎన్ని వందల కారణాలు ఉన్నాయో నాకు తెలియదు.. అది నువ్వే తెలుసుకో, జాగ్రత్త తీసుకోమని చెబుతుంది పారిజాతం. నా కోడలు, నా కొడుకు పిల్లలు అనే ఆశలు ఏమైనా ఉంటే వదిలేసుకోవడం మంచిది. నీ కలలు ఈ జన్మలో నెరవేరవు.. నీ కోడలు నీ కొడుకుని అలా గుప్పిట్లో పెట్టుకుందని అంటుంది పారు. ఆ మాటలతో కాంచన షాక్ అవుతుంది.

తాతయ్యకి అబద్ధం చెప్పావు.. మరి అత్తకి ఏ అబద్ధం చెబుతావని కార్తీక్‌ని అడుగుతుంది దీప. మా నాన్నని ఏదోలా ఒప్పించగలం.. కానీ అత్తయ్య అలా కాదు. పైగా నేను బిడ్డ గురించి మాటిచ్చానని అంటుంది దీప. అబద్ధం చెప్పి అమ్మని మోసం చేస్తున్నానే బాధ కంటే ఆవిడ పెట్టుకున్న ఆశల్ని తీర్చలేకపోతున్నానని బాధగా ఉందని అంటాడు కార్తీక్. అత్తయ్యకి అనుమానం వస్తే మనల్ని బయటికి వెళ్లనివ్వదని చెబుతుంది దీప. అత్తకి ఏం చెప్పినా నమ్మేలా చెప్పమని అంటుంది దీప. ఏం జరిగినా నువ్వు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతావని తేల్చిచెబుతాడు కార్తీక్.

దాస్‌ని సీక్రెట్‌గా కలుస్తాడు దశరథ. నీ ఫేస్‌లో సంతోషం కంటే బాధే ఎక్కువగా కనిపిస్తోందని .. నా కూతురు ఏమైనా చేసిందా అని అడుగుతాడు దాస్. నేను పెద్ద పాపం చేస్తున్నాను.. నన్ను శిక్షించు అంటాడు దశరథ. నీకు తప్ప ఎవరికి చెప్పుకోలేను... నువ్వు తప్ప ఎవరూ అర్ధం చేసుకోలేరని అంటాడు. మీ వదినను కాపాడటానికి నీ కూతురు దీప ఉంది.. కానీ నా మనవరాలిని ఎవరు కాపాడతారు అంటాడు దశరథ. వదినకి ఆపరేషన్ చేయాలంటే కన్నకూతురైన దీప కావాలి.. దీప ఆపరేషన్‌కి రెడీగానే ఉంది, కానీ ఆమె ఆపరేషన్‌కి సిద్ధపడితే కడుపులో ఉన్న బిడ్డను కాపాడలేమని డాక్టర్ చెప్పారని దశరథ అనడంతో దాస్ షాక్ అవుతాడు. దీప ఆగిపోతే కడుపులో ఉన్న బిడ్డ బతుకుతుంది.. కానీ మీ వదిన బతకదు, ఆపరేషన్ చేస్తే మీ వదిన బతుకుతుంది.. దీప కడుపులో ఉన్న బిడ్డ బతకదు. కానీ నా కూతురు తన తల్లి కోసం బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడింది.. నా అల్లుడు కూడా భార్య త్యాగానికి సరేనని ఒప్పుకున్నాడని అనడంతో దాస్ షాక్ అవుతాడు.

ఒక ఆడది పడకూడదని కష్టాలు, అవమానాలన్నీ పడింది దీప. తల్లిని కాపాడుకోవాలని మురిసిపోయేలోపు.. తన బిడ్డను తల్లి కోసం వదులుకోవాల్సి వస్తోందని బాధపడతాడు దాస్. బిడ్డకు ఏం కాదని నాకు నమ్మకంగా ఉందని చెబుతాడు. దీప పుట్టడంతోనే కష్టాలు అనుభవిస్తే.. దీప బిడ్డకు కడుపులోనే కష్టాలు మొదలయ్యాయని బాధపడతాడు దాస్. దీప కడుపులోని బిడ్డ మృత్యుంజయురాలు అవుతుందని చెబుతాడు. ఇంతలో శివన్నారాయణ ఫోన్ చేసి దశరథను ఇంటికి రమ్మని చెబుతాడు.

మరోవైపు.. దీప తన కడుపులో బిడ్డను వద్దు అనుకుంటోందని అనసూయ, శ్రీధర్‌లకు చెబుతుంది కాంచన. ఆ మాటలతో వారిద్దరూ షాక్ అవుతారు. పిన్ని చెప్పిందనే కాదు.. గత కొద్దిరోజులుగా దీప ప్రవర్తనను నేను గమనిస్తూనే ఉన్నాను అంటుంది కాంచన. పారిజాతంగారు మందర లాంటిది, పాల లాంటి మనసులో కూడా విషం నింపగలదు. మీ పిన్ని చెప్పిన మాటలు విని నీ మనసు పాడుచేసుకుంటున్నావు. అది నిజమో, అబద్ధమో ఒక్కసారి ఆలోచించావా? అని ప్రశ్నిస్తుంది అనసూయ. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పెట్టడమే అత్తయ్య గారి పని అంటాడు శ్రీధర్. రోజూ ఈ టైంకి భార్యాభర్తలిద్దరూ జీతం లేని పనికి బయల్దేరేవారు. కానీ ఈరోజు ఇంత వరకు గది దాటి బయటకు రాలేదు.. లోపల వాళ్లు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది కాంచన. ఇంతలో కార్తీక్, దీపలు లగేజ్ తీసుకుని బయటకు వస్తారు. నేను దీప కొన్నిరోజులు సరదాగా కొన్నిరోజులు బయటకు వెళ్లాలని అనుకుంటున్నామని కార్తీక్ చెబుతాడు. ఇంకా నా దగ్గర నిజాలు దాస్తారు.. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు.. పారిజాతం పిన్ని నాతో అంతా చెప్పిందని కాంచన అనడంతో దీప కార్తీక్‌లు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X