Karthika Deepam 2 March 5th: నిజం రాబట్టేందుకు కాంచన మైండ్‌గేమ్.. శివన్నారాయణకి దొరికిపోయిన కార్తీక్- దీప

Photo Courtesy: JioHotstar

బిడ్డను వదులుకోవడం తప్పించి ఈ సమస్యకు పరిష్కారం లేదని దశరథతో కార్తీక్ చెబుతుండగా పారిజాతం దొంగచాటుగా వింటుంది. ఈ విషయాన్ని వెంటనే కాంచనకు చెప్పాలని అనుకుంటుంది. స్వప్నకి యాపిల్ తినిపిస్తూ ప్రేమగా చూసుకుంటూ ఉన్న శ్రీధర్‌పై కావేరి మండిపడుతుంది. కూతురు విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంది.. దానిని మందలించకుండా యాపిల్స్ తినిపిస్తున్నారా? అని ఫైర్ అవుతుంది కావేరి. ఏ కూతురికైనా నాన్నే హీరో.. కూతురు తప్పు చేసిందని వదిలేసుకోడు, ఆమెకు కొండంత ధైర్యంలా ఉంటాడని చెబుతాడు. ఆ మాటలతో తండ్రిని హత్తుకుంటుంది స్వప్న.

కాంచనకు పారిజాతం ఫోన్ చేసి దీప కడుపును వద్దు అనుకుంటోందని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. దశరథ, దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటూ ఉండటంతో నేను స్వయంగా చూశానని చెబుతుంది. పారిజాతం మాటలతో దీప ప్రవర్తనపై కాంచనకు అనుమానం వస్తుంది. హాస్పిటల్‌లో అడ్మిట్ ఎలా అవ్వాలి? అత్తయ్యకి ఏం చెప్పాలని అడుగుతుంది దీప. అంతా నేను చూసుకుంటానని కార్తీక్ అంటాడు. ఉదయాన్నే శ్రీధర్‌ని, అనసూయని పిలిపించిన కాంచన.. దీప తన కడుపును వద్దు అనుకుంటోందని చెప్పడంతో వారిద్దరూ షాక్ అవుతారు. ఇంతలో కార్తీక్- దీపలు లగేజ్‌తో అక్కడికి వచ్చి మేం కొద్దిరోజులు బయటకు వెళ్లొస్తామని చెబుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 5వ తేదీ 610వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 610 March 5th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దీప కడుపుతో ఉంది కదా? కొన్నిరోజులు బయట తిరిగొద్దామని అనుకుంటున్నానని చెబుతాడు కార్తీక్. నువ్వు అబద్ధం చెబుతున్నావని కాంచన కొడుకుపై సీరియస్ అవుతుంది. నిజమేనని కార్తీక్ నచ్చచెబుతుండగా.. అయితే నువ్వు మాతో చెప్పింది ఏంటీ అని శివన్నారాయణ ఎంట్రీ ఇవ్వడంతో కార్తీక్ - దీపలు షాక్ అవుతారు. నా భార్యకు ఒంట్లో బాలేదు.. డాక్టర్ కొన్నాళ్లు రెస్ట్ తీసుకోమన్నారు. కొన్ని రోజుల పాటు నా భార్య ఇంటి దగ్గరి నుంచి కదలకూడదు.. నా భార్యకు సేవలు చేయడానికి నేను కూడా ఉండాలి కాబట్టి నేను కూడా పనికి రావడం లేదని చెప్పాడని అంటాడు శివన్నారాయణ. కానీ ఇప్పుడు చూస్తే సార్ ఎక్కడికో బయల్దేరినట్లున్నాడని చెబుతాడు. ఆ మాటలతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.

ఇంటి దగ్గర ఉందామని లీవ్ తీసుకున్నాం.. కానీ దీపని ఎప్పుడూ? ఎక్కడికి తీసుకెళ్లలేదు.. కడుపుతో ఉన్న మనిషిని తను ఇష్టపడే ప్లేస్‌కి తీసుకెళ్తే మంచిదని ఫ్రెండ్ చెబితే దీపని తీసుకెళ్తున్నానని అంటాడు కార్తీక్. దశరథ ఏదో చెప్పబోతుండగా.. నేను నీతో తర్వాత మాట్లాడతానని అంటుంది కాంచన. అయితే అసలు నిజం నేను చెబుతాను.. నువ్వు దీపని ఎక్కడికి తీసుకెళ్తున్నావో తెలుసా? విహారయాత్రకు కాదు.. హాస్పిటల్‌కి అని అనడంతో అంతా షాక్ అవుతారు. వాడు ఎందుకు తీసుకెళ్తున్నాడో నాకు తెలుసు.. ఇది వాడి తప్పు కాదు, వాడి భార్య తప్పు అని మండిపడుతుంది కాంచన. మంచిదానిలా నటిస్తూ మొగుడిని మాట వినేలా చేసుకున్నావు.. అంతా నీకు నచ్చినట్లే చేసుకుంటున్నావని దీపపై సీరియస్ అవుతుంది.

నీ కడుపులో నా కొడుకు బిడ్డను మోయడం నీకు ఇష్టం లేదు. మరో బిడ్డ పుడితే శౌర్యను ఎక్కడ సరిగా చూడమనే భయంతో ఈ బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటున్నావు. నిజం తెలిస్తే నేను ఒప్పుకోను కాబట్టి.. నా కొడుకుని ఎలాగోలా ఒప్పించావు. వాడు నీ మాటకు అడ్డుచెప్పడు కాబట్టి.. విహారయాత్ర పేరుతో నిన్ను ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాడని అంటుంది కాంచన. బిడ్డను వదిలించుకోవడానికి సిద్ధపడ్డారు, ఇన్ని అబద్ధాలు ఎందుకు చెప్పడం.. మేం ఏ ఆశలు పెట్టుకునేవాళ్లం కాదని కంటతడి పెడుతుంది కాంచన. మేమంతా పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూస్తున్నామని ఏడుస్తుంది. ఆ మాటలతో అనసూయ సీరియస్ అవుతుంది. కడుపులోని బిడ్డ క్షేమంగా ఉంటుంది.. ఇదంతా అబద్ధమని చెప్పమని వార్నింగ్ ఇస్తుంది అనసూయ. నువ్వెందుకు మౌనంగా ఉన్నావో చెప్పమని నిలదీస్తుంది.

అనాథలా బతకాల్సిన నిన్ను చేరదీసి జీవితాన్నిచ్చిన ఈ కుటుంబం కోసం నువ్వు ప్రాణాలిచ్చిన తక్కువే. అలాంటిది బిడ్డను ఇవ్వలేవా? శౌర్య కోసం కడుపులోని బిడ్డను చంపుకుంటున్నావా అని నిలదీస్తుంది. దీప మనకి సమాధానం చెప్పదు.. అది ఒకటి అనుకుంది, చేసే తీరుతుందని కాంచన సీరియస్ అవుతుంది. ఎంతైనా పరాయి మనిషి కదా? పరాయి దానిలా ఆలోచిస్తుంది. సొంత మనిషిలా ఎందుకు ఆలోచిస్తుందని కాంచన నానామాటలు అంటుంది. దాంతో దశరథ సీరియస్ అవుతాడు. దీపని ఇంకొక్క మాట కూడా అనడానికి వీల్లేదని అంటాడు. మావయ్య ఎక్కడ నిజం చెబుతాడోనని కార్తీక్ టెన్షన్ పడతాడు. దీప ఎందుకు హాస్పిటల్‌కు వెళ్తుందో నీకు తెలుసా అని శివన్నారాయణ అడగ్గా.. నిజం నేను చెబుతానని అంటాడు.

మావయ్య గారు ఎక్కడికెళ్లారు.. కారు కనిపించడం లేదని కావేరిని అడుగుతాడు కాశీ. ఇంతలో స్వప్న వచ్చి కాఫీ ఇస్తుంది. నిన్నటి వరకు అంటే కాశీ నాకు భర్త.. నేను కాశీకి భార్యని. మళ్లీ ఎక్కడ కలిసిపోతామనే భయంతో తిట్టేదానిని.. ఇప్పుడు విడిపోయాం కదా అంటుంది స్వప్న. ఈరోజు నుంచి కాశీ అంటే శ్రీధర్ గారి డ్రైవర్.. స్వప్న అంటే శ్రీధర్ గారి కూతురు. తను ఎక్కడుంటే నాకెందుకు అని ప్రశ్నిస్తుంది. డ్రైవర్ బయట వెయిట్ చేయాలని అంటుంది స్వప్న. విలువైన దాని విలువ ఉన్నప్పుడు కాదు.. పోయినప్పుడు తెలుస్తుంది. నేను ఏం పొందానో, ఏం పొగొట్టుకున్నానో నాకు తెలుసు... జీవితాంతం వెయిట్ చేస్తాను. ఒక మనిషికి ఒకే ప్రేమ ఉంటుంది.. అది ఒక్కరితోనే ఉంటుంది. ఆ ఒక్కరి కోసమే బతుకుతాను.. ఈ జన్మకి తనే నా ప్రేయసి, తనే ప్రాణమని అంటాడు. నేను మళ్లీ ప్రేమలో పడ్డానని కాశీ చెప్పడంతో స్వప్న ఆలోచనలో పడుతుంది.

శివన్నారాయణ, దశరథ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారని పారుని అడుగుతుంది జ్యోత్స్న. దీప - బావ రాలేదంటే రెస్ట్ కోసం లీవ్ అడిగారు.. మరి తాత, డాడీ ఎక్కడికి వెళ్లినట్లు అని అడుగుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు పడిపడి నవ్వుకుని.. ఇంట్లో నీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి, అవన్నీ కాంచనతో చెప్పానని అంటుంది. దీప తన కడుపులోని బిడ్డను వదిలించుకోవాలని అనుకుంటోందని పారు చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. కార్తీక్ బిడ్డను కంటే తనకి చాలా మంచి గుర్తింపు వస్తుంది.. దానిని కాదని, బిడ్డను వదిలించుకోవాలని అనుకుంది అంటే అదేదో చాలా పెద్ద సీక్రెట్ అయ్యుంటుంది కదా అని అంటుంది పారు. ఈ విషయంలో దశరథ ప్రమేయం ఏంటీ? దీప బిడ్డను వద్దు అనుకుంటే కార్తీక్ ఎందుకు ఊరుకుంటున్నాడు? కాంచన అస్సలు ఊరుకోదని అంటుంది పారిజాతం. దీపే అసలైన వారసురాలా? దీప ఆసుపత్రిలో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి బోన్ మ్యారో ట్రీట్‌మెంట్‌కి రెడీ అయిపోయిందా అని టెన్షన్ పడుతూ విషయం కనుక్కోవాలని బయల్దేరుతుంది జ్యోత్స్న.

దీప గొప్పతనం తెలిస్తే ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారని దశరథ నిజం చెప్పబోతుండగా.. ఏ అర్హతతో నా భార్య గురించి, నా బిడ్డ గురించి మాట్లాడతావని మండిపడతాడు కార్తీక్. నీ సంస్కారం అర్హతల గురించి మాట్లాడే వరకు వెళ్లింది... నేనే అధికారాల గురించి మాట్లాడతానని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. నీ భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి నా కొడుక్కి మాట్లాడే అర్హత లేదు.. కానీ నా కూతురి కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి మాట్లాడే అర్హత.. నీ తల్లిని కన్న నాకుందని అంటాడు. మీరు బిడ్డను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారని నిలదీస్తాడు శివన్నారాయణ. ఆ మాటలతో కొడుకుపై శ్రీధర్ కూడా సీరియస్ అవుతాడు.

మీ జీవితాల్లో ఆనందం ఉంటేనే మా ముఖాల్లో నవ్వులు ఉంటాయి. మీరు మనసులో అన్ని దాచేసుకుని మేం బాధపడే పనులు ఎందుకు చేస్తున్నారని నిలదీస్తాడు. పిల్లల్ని కన్నందుకు తల్లిదండ్రులు ఆనందపడాలి.. ఎందుకు కన్నాం రా భగవంతుడా అని అనుకోకూడదు. ఇప్పటికే మీ చెల్లి జీవితం ఎటుపోతుందో అర్ధం కావడం లేదని అంటాడు శ్రీధర్. నిన్ను ఏనాడూ నా కోడలిగా చూడలేదు.. నువ్వు నా కొడుకు జీవితంలోకి రావడం నచ్చేది కాదు. కానీ నువ్వు గర్భవతివని తెలిసిన తర్వాత కాంచన కోరిక నెరవేరబోతోందని తెలిసి మొదటిసారి నిన్ను నా కోడలిగా అనుకున్నానని అంటాడు శ్రీధర్. నీ కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ వల్లే నీకు గుర్తింపు వచ్చింది. నీ బిడ్డను కాంచన చేతుల్లో పెడితేనే అత్తగారి రుణం తీర్చుకున్నట్లు... ఇప్పుడు బిడ్డను వదిలించుకుంటే మాట తప్పినట్లేనని అంటాడు. ఆ మాటలతో దీప కంటతడి పెడుతుంది.

దీప మౌనంగా ఉండటంతో ఏదో ఒకటి మాట్లాడమని నిలదీస్తుంది అనసూయ. నువ్వు కూడా కార్తీక్ బాబులా నాకు మాట్లాడే అర్హత లేదు అంటావా? నేను నీ మేనత్తలా కాకుండా కాంచనకి అక్కలా అడుగుతున్నాను.. బిడ్డను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నావని ప్రశ్నిస్తుంది. నువ్వు, నీ భర్త బిడ్డను నా చేతుల్లో పెడతారని మాటిచ్చారు కదా? అని అడుగుతుంది. దీప నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు.. తల్లి ప్రాణం, బిడ్డ ప్రాణంలో ఎవరో ఒకరి ప్రాణాలు వదులుకోవాల్సి వస్తే.. నువ్వు ఏం చేస్తావని ప్రశ్నిస్తాడు కార్తీక్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X