Karthika Deepam 2 March 6th: జ్యోత్స్న ప్లాన్‌ని తిప్పికొట్టిన డాక్టర్ హారిక.. దీపకి కాంచన ఊహించని శిక్ష
Photo Courtesy: JioHotstar
పెళ్లయినప్పటి నుంచి దీపను ఎక్కడికి తీసుకెళ్లలేదు.. అందుకే తనని కొద్దిరోజులు బయటకు తీసుకెళ్దామని అనుకుంటున్నానని తల్లితో చెబుతాడు కార్తీక్. నువ్వు అబద్ధం చెబుతున్నావు.. నీ భార్యకు నా వారసత్వాన్ని మోయం ఇష్టం లేదు. అందుకే నిన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్తోందని మండిపడుతుంది కాంచన. ఆ మాటలతో దశరథ కుమిలిపోతాడు. అసలు దీప ఎందుకు ఈ పని చేస్తుందో తెలిస్తే మీరంతా తనకు దండం పెడతారని నిజం చెప్పబోతుండగా కార్తీక్ అడ్డుపడతాడు. అసలు నా భార్య గురించి మాట్లాడటానికి నీకు ఏం అర్హత ఉంది? అని అనడంతో అంతా షాక్ అవుతారు.
మరోవైపు.. ఇంట్లో దశరథ, శివన్నారాయణలు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లారని పారుని అడుగుతుంది జ్యోత్స్న. దీప బిడ్డను చంపుకోవాలని అనుకుంటోందని పారు చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప, బావ, డాడీ మధ్య ఏదో జరుగుతోంది.. అదేంటో తెలుసుకోవాలని అనుకుని బయటకు వెళ్తుంది. కాశీకి ఉదయాన్నే కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది స్వప్న. ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు.. చాలా హ్యాపీగా ఉందని అంటుంది స్వప్న. ఆ మాటలు విన్న కావేరి తన కూతురిపై మండిపడుతుంది. నీకు విలువైన దాని విలువ ఉన్నప్పుడు తెలియదు.. తర్వాత తెలుస్తుందని చెప్పి వెళ్లిపోతాడు కాశీ. కాంచన మాటలు విన్న అనసూయ, శ్రీధర్‌లు కడుపు ఎందుకు తీయాలని అనుకుంటున్నావని నిలదీస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 6వ తేదీ 611వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
డాక్టర్ హారికను జ్యోత్స్న కలుస్తుంది. మా మమ్మీకి బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయడం అంటే అది జ్వరానికి ఇంజెక్షన్ చేసినంత ఈజీ కాదు కదా.. దానికొక ప్రొసీజర్ ఉంటుంది. దానిని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అడగటానికి వచ్చాను అంటుంది జ్యోత్స్న. మీ అమ్మగారి ప్రాణాలు మీరు ఖచ్చితంగా కాపాడాలని అంటుంది డాక్టర్. నేనే కాపాడాలి.. ఎందుకంటే కన్నకూతురిని నేనే కాబట్టి అని చెబుతుంది జ్యోత్స్న. కన్నకూతురినని కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? అని ప్రశ్నిస్తుంది హారిక. కొందరు తెలివైనవాళ్లు ఏమనుకుంటారో తెలుసా? మనం ఏం చెప్పినా అవతలివాళ్లు నమ్ముతారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. అవతలివాళ్లు నమ్మరు, వింటారు అని చెబుతుంది జ్యోత్స్న.
మనం ఎంత పర్ఫెక్ట్‌గా ఫేక్‌ని క్రియేట్ చేసినా అది ఒరిజినల్ కాలేదు.. ఒరిజినల్ ఎప్పుడూ ఒరిజినలే అంటుంది డాక్టర్. ఫేక్‌ని ఒరిజినల్ అని అవతలివాళ్లను నమ్మించాలి అంటే కొంతమంది నమ్ముతారు.. కానీ కొంతమంది నమ్ముతున్నట్లు నటిస్తారు. ఎందుకంటే టైం కోసం అని చెబుతుంది హారిక. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇప్పుడు నాకొక క్లారిటీ వచ్చింది.. నా రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వడం వెనుక ఏదో పెద్ద డ్రామానే జరుగుతోందని అనుకుంటుంది జ్యోత్స్న. కన్నకూతురే కాకుండా బోన్‌మారో ఎవరైనా డొనేట్ చేయొచ్చా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. బ్లడ్ రిలేషన్ అయ్యుండాలని చెబుతుంది హారిక. ప్రెగ్నెన్సీ ఉమెన్ డోనర్‌గా పనికివస్తారా అని జ్యోత్స్న ప్రశ్నించడంతో హారిక షాక్ అవుతుంది. సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తల్లిబిడ్డల్లో ఒకరిని మాత్రమే కాపాడాల్సిన పరిస్ధితి ఉంది.. ఎవరి ప్రాణాల్ని కాపాడమంటావు అని కార్తీక్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. బిడ్డకు తల్లికి ఇద్దరికీ సమస్య ఉంది.. ఇద్దరిలో ఒకరే క్షేమంగా ఉండే పరిస్ధితి అని కార్తీక్ చెబుతాడు. ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదని కాంచన నిలదీస్తుంది. నా మాటని కాదని నువ్వు నా పుట్టింటికి పనికి వెళ్లినప్పుడే నేను నిన్ను ఆపి ఉండాల్సింది. ఆరోజు నువ్వు నా మాట వినలేదు. ఈ పరిస్ధితికి దీపే కారణం.. నా కొడుక్కి బిడ్డ పుట్టబోతోంది అంటే వాడి తల్లిగా నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈ దీప నాకు ఆ ఆనందాన్ని కూడా మిగల్చలేదని కాంచన ఏడుస్తుంది.
దీపని, దీప బిడ్డని కాపాడటానికి ఎంత ఖర్చయినా నేనే పెడతానని అంటాడు శివన్నారాయణ. కొన్నిసార్లు ఎంత డబ్బు ఖర్చుపెట్టినా లాభం ఉండదని దశరథ చెబుతాడు. నేను కూడా హాస్పిటల్‌కి వచ్చి డాక్టర్ గారిని అడుగుతానని అంటుంది కాంచన. నాకేం మాట్లాడాలో అర్ధం కావడం లేదు.. దీని జీవితంలో కొద్దిపాటి ఆనందం కూడా ఆరిపోతుంది. జీవితంలో ఇది ఉంటే బాగుంటుంది అని అనుకునేలోపే అది దూరమైపోతుంది. ఇన్నాళ్లూ మీ అమ్మనాన్న ఎవరో తెలిస్తే బాగుండు అనుకునే దానిని, వాళ్లెవరో ఎప్పటికీ తెలియకూడదని దేవుడిని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్లు నీ జీవితంలోకి వస్తే ఉండరని.. దేవుడు తీసుకెళ్లిపోతాడని అనసూయ చెప్పడంతో దీప, దశరథలు షాక్ అవుతారు. అందరూ దీపని తప్పుబట్టేవాళ్లే కాదని.. ఒకరు కూడా అర్ధం చేసుకోరా అని దశరథ మండిపడతాడు. ఏ తల్లయినా బిడ్డను వదలుకోవాలని అనుకుంటుందా? అని ప్రశ్నిస్తాడు దశరథ. బిడ్డ పోయినా పర్లేదని నువ్వు అనుకోగలవా? అని నిలదీస్తాడు.
కడుపుతో ఉన్నవాళ్లు బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి వీలవుతుందా అని జ్యోత్స్న అడగటంతో మీరు ఇప్పుడు ప్రెగ్నెంటా అని ప్రశ్నిస్తుంది హారిక. నాకు పెళ్లే కాలేదని సీరియస్ అవుతుంది జ్యోత్స్న. మీ పర్సనల్ లైఫ్ గురించి నాకు తెలియదు.. మీరు పదే పదే ఈ ప్రశ్న అడగటంతో మీరు ప్రెగ్నెంట్ అని అనుకున్నానని అంటుంది హారిక. కొన్ని మనం ఎక్కడి వరకు తెలుసుకోవాలో అక్కడి వరకు తెలుసుకుంటే మంచిదని వార్నింగ్ ఇస్తుంది. మీకు ఆన్సర్ ఇవ్వగలిగేది దశరథ గారే.. ఆయనకి ఫోన్ చేస్తే మొత్తం మీ డాడీయే చూసుకుంటారని అంటుంది హారిక. మీరంతా నాతో మైండ్ గేమ్ ఆడుతున్నారు.. దీనిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలుసుకుంటానని జ్యోత్స్న వెలిగిపోతుంది.
పుట్టబోయే బిడ్డ మీద నేను ఎన్నో ఆశల్ని పెంచేసుకున్నాను.. ఆ బిడ్డ లేదు అంటే మరోసారి మా అమ్మ చనిపోయిందని బాధపడతాను. తెలియని వయసులో కాబట్టి కోలుకున్నాను.. కానీ ఈసారి కోలుకోలేనని బాధపడుతుంది కాంచన. ఈరోజే దీపని ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలి ఏం చేయమంటావు అని అడుగుతాడు కార్తీక్. దాంతో కాంచన మీ ఇష్టం అని చెబుతుంది. నా మాట వినకపోవడం వల్లే దీప ఈ పరిస్ధితి తెచ్చుకుంది కాబట్టి.. బిడ్డకు ఏమైనా అయితే దీపని నా జీవితంలో క్షమించను. దీప అనే మనిషి ఉన్నా, లేనట్లేనని కాంచన చెప్పడంతో దీప కంటతడి పెడుతుంది. దీపని, కార్తీక్‌ని తీసుకుని దశరథ ఆసుపత్రికి వెళ్లబోతుండగా.. ఎంత ఖర్చయినా పర్లేదు, ఎలాంటి స్పెషలిస్ట్‌నైనా తీసుకురమ్మని చెబుతాడు శివన్నారాయణ.
నేను అనుకున్నది జరగాలని ఆశీర్వదించమని కాంచనని అడుగుతుంది దీప. మనసు అనేది ఉంటేనే కదా మనస్పూర్తిగా దీవించడానికి అని అంటుంది కాంచన. కొన్ని బాధలు చావుకి మించిన నొప్పులు కలిగిస్తాయని చెబుతుంది. బిడ్డ జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త అని అంటుంది కాంచన. దీపని దశరథ చేతిలో పెట్టి.. నా కోడలిని నీ కూతురే అనుకో, నువ్వే బాధ్యత తీసుకోవాలని అంటుంది కాంచన. దీపకి పెళ్లి చేసి నీ కూతురిని నా చేతుల్లో పెట్టావు.. ఇప్పుడు నా కోడల్ని నీ చేతిలో పెడుతున్నాను, డాక్టర్‌తో మాట్లాడి బిడ్డను కాపాడు.. బిడ్డ కోసం ఇక్కడ చాలాప్రాణాలు ఎదురుచూస్తున్నాయని చెబుతుంది కాంచన. తర్వాత దీపని తీసుకుని ఆసుపత్రికి వెళ్తారు కార్తీక్, దశరథ. నలుగురు వెళ్తున్నారు ఎంతమంది తిరిగొస్తారో తెలియదని కాంచన కంటతడి పెడుతుంది.
కాంచన చెప్పిన మాటలు గుర్తొచ్చి దశరథ ఏడుస్తుంటాడు. నేను నీ మెడలో తాళికట్టినప్పుడు బాధపడిన మావయ్య ఈరోజు దేవుడు ఉన్నాడు రా.. కలపాల్సిన వాళ్లని కలిపాడు అంటున్నాడు. మన బిడ్డ విషయంలోనూ రేపు జరగబోయేది ఇదే. అమ్మా, నాన్న, తాత, అనసూయ పెద్దమ్మలకు జరగబోయేది తెలియదు కాబట్టి బాధపడుతున్నారు. రేపు నిజం తెలిస్తే తిడతారు.. తర్వాత నువ్వు సుమిత్ర అత్త కూతురు అని తెలియగానే ఇది దేవుడు రాసిన రాత అని సరిపెట్టుకుంటారు. కొన్నాళ్లు మరిచిపోతారు.. అంతా కలిసిపోతారు, తర్వాత ఎప్పుడో జనాభా లెక్కలవాళ్లు వచ్చినప్పుడు మాత్రం మా అమ్మ బాధపడుతుందని కార్తీక్ చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











