Karthika Deepam 2 March 7th: శివన్నారాయణ దెబ్బకు జ్యోత్స్న ప్లాన్‌ అట్టర్ ఫ్లాప్.. దశరథపై పారులో అనుమానం

Photo Courtesy: JioHotstar

డాక్టర్ హారికను జ్యోత్స్న కలిసి బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎక్కడి వరకు వచ్చింది? దాని ప్రోసీజర్ ఏంటీ? అని తెలుసుకుందాని వచ్చానని చెబుతుంది. అలాగే బోన్‌మారోని నేను కూడా ఇంకా ఎవరెవరు ఇవ్వొచ్చు అని అడుగుతుంది. ఆ మాటలతో హారిక షాక్ అవుతుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్లు ఇవ్వొచ్చా? ఇస్తే ఏదైనా ప్రాబ్లమా అని జ్యోత్స్న అడగ్గా.. హారిక షాక్ అవుతుంది. జ్యోత్స్నకి ఎలాంటి సమాధానం చెప్పకుండా బయటకు వచ్చేస్తుంది. అయినా జ్యోత్స్న వెంటాడటంతో నువ్వు ప్రెగ్నెంటా? నీకెందుకు ఇలాంటి డౌట్ అని హారిక మండిపడుతుంది. తనను విసిగిస్తే దశరథ గారికి చెబుతానని బెదిరించడంతో జ్యోత్స్న వెళ్లిపోతుంది.

మరోవైపు.. తల్లి, బిడ్డల్లో ఒకరినే కాపాడుకోగలమని ఇద్దరిలో ఎవరిని కాపాడమంటావని కార్తీక్ అడగటంతో కాంచన సహా అందరూ షాక్ అవుతారు. దీని జాతకమే అంత.. కావాలని అనుకున్నది దూరమైపోతుంది. కన్నతల్లిదండ్రులు కూడా దీపకి కనిపించకూడదు.. కనిపిస్తే వాళ్లను దేవుడు తీసుకెళ్లిపోతాడని అనసూయ అనడంతో దశరథ షాక్ అవుతాడు. అందరూ దీపని అనేవాళ్లే కానీ.. తను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో తెలుసుకోరా అంటాడు. ఎంత ఖర్చయినా పర్లేదు.. దీపని, కడుపులోని బిడ్డను కాపాడమని దశరథకు చెబుతాడు శివన్నారాయణ. ఆసుపత్రికి వెళ్తుండగా.. దీపని దశరథ చేతుల్లో పెట్టి బిడ్డను ఎలాగైనా కాపాడమని బతిమలాడుతుంది. ఆ మాటలతో దశరథ ఎమోషనల్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 7వ తేదీ 612వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 612 March 7th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

ఇప్పుడు మనం చేసే పనిని అందరూ ఇష్టపడకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు అందరూ అర్ధం చేసుకుంటారు. నేను అనుకున్నది సాధించడానికి ఎన్ని బాధలు పడటానికైనా సిద్ధమేనని చెప్పడంతో కార్తీక్‌, దీపలని దశరథ హత్తుకుంటాడు. మనిషికి ఓర్పుకు మించిన ధైర్యం లేదు.. ఇప్పుడు మనం ఎంత ఓర్పుగా ఉంటే ఈ సమస్యని అంత ధైర్యంగా దాటొచ్చు.. దాటాలంటే అడుగు ముందుకు వేయాలి కదా? అని దీపని, దశరథని ఆసుపత్రికి తీసుకెళ్తాడు కార్తీక్. దీప కడుపులోని బిడ్డ గురించి కాంచన బాధపడుతుండగా.. జీవితం తెరమీద కథల్లాంటివి జరిగే దానిని చూడటం తప్ప దానిని ఆపే ప్రయత్నం చేయటానికో, మార్చే ప్రయత్నం చేయటానికో మనం సరిపోం. కేవలం ప్రేక్షకుడి మిగిలిపోవాల్సిందేనని చెబుతాడు శివన్నారాయణ.

ఎవరూ కావాలని సమస్యలు కొని తెచ్చుకోరు కదా అని కాంచనకు చెబుతాడు శ్రీధర్. అందుకు దీప విరుద్ధం.. దీపకి సమస్యలంటే చాలా ఇష్టం. అవి పొరపాటున ఇంటి ముందు నుంచి వెళ్తున్నా వాటిని ఆపి గుమ్మంలోకి రమ్మంటుంది. ఆ రోజు గురువుగారు దీపని చూసి బిడ్డ జాగ్రత్త అని చెప్పారు. అలా ఎందుకు చెప్పారో నాకు ఈరోజు అర్ధమవుతోంది.. సమస్య రాబోతోందని ఆయన అప్పుడే హెచ్చరించారు. కానీ మనమే పట్టించుకోలేదని బాధపడుతుంది కాంచన. తల్లిని కాపాడుకోవాలా? బిడ్డను కాపాడుకోవాలా? వాడే అడిగాడు. పైగా నా కొడుకుని మా అన్నయ్యే సమర్ధిస్తున్నాడు. నా కొడుకేమో నా కోడలి మాట కాదనలేడు. నా కోడలేమో నా మాట వినదని కాంచన బాధపడుతుంది.

దానికి మనం తప్ప ఎవరున్నారని అనసూయ చెబుతుండగా.. అందుకే అది మనల్ని ఇలా బాధపెడుతోంది. వెళ్తుంటే కిందపడి దెబ్బ తగిలింది అనుకుంటే కర్మ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం అనుకోవాలి. అనవసరమైన ఆశలు పెట్టుకున్నాను కాబట్టి ఇది నా కర్మ అనుకోవాలని కాంచన బాధపడుతుంది. దీప నెలతప్పిందని తెలియగానే మా అమ్మ నా కళ్ల ముందుకు రాబోతోంది అనుకున్నాను. నా కోడలు మరోసారి మా అమ్మను చంపేసేలా ఉందని బాధపడుతుంది కాంచన. పుట్టే బిడ్డ గురించే నేను అంతలా ఆలోచిస్తుంటే ఆ బిడ్డను మోసే దీప గురించి ఎంతలా ఆలోచిస్తాను అని ప్రశ్నిస్తుంది. ఆ దేవుడి దయ వల్ల అంతా క్షేమంగానే ఉంటారని కూతురిని ఓదారుస్తాడు శివన్నారాయణ. డాక్టర్ గారు ఏం చెబుతారోనని భయంగా ఉంది.. తల్లి, బిడ్డా క్షేమంగా ఉంటే చాలని అంటుంది కాంచన.

కావేరి ఇంట్లో బూజు దులుపుతుండగా స్వప్న వచ్చి నేను చేస్తాను నువ్వు తప్పుకోమని చెబుతుంది. ఇవన్నీ నీకు తెలియదు కదా? అసలు నువ్వు ఎప్పుడు చేశావని అడుగుతుంది కావేరి. మా ఆయనతో ఆ ఇంట్లో ఉన్నప్పుడు అని స్వప్న చెబుతుండగా చెప్పమని అంటుంది కావేరి. తల్లిని పంపేసి బూజు దులుపుతుండగా స్వప్న కింద పడిపోతుండగా కాశీ వచ్చి పట్టుకుంటాడు. నువ్వు నన్ను పట్టుకుంటావా? అని స్వప్న సీరియస్ అవ్వగా.. కిందపడేస్తాడు కాశీ. ఇంతలో కావేరి రావడంతో పైకి లేపమని అడుగుతుంది స్వప్న. ఇప్పుడే మిరపకాయలు కోశాను.. పట్టుకుంటే మండుతుంది. ఇంకెవరి సాయమైనా తీసుకోమని చెబుతుంది కావేరి. కాశీ చేయి అందిస్తుండగా.. నేనే లేస్తానని అంటుంది స్వప్న. నీ చేతుల్లో పడటం కంటే నేల మీద నడుం విరగ్గొట్టుకోవడమే నయమని చెబుతుంది స్వప్న. గతం అనే సీతాకొకచిలుకలు నీతోనే ఉన్నాయి.. నిన్ను సరికొత్తగా నీకే పరిచయం చేస్తాయని చెబుతాడు కాశీ. ఇలాంటి మాటలు చెప్పి మళ్లీ దగ్గరవుదామని అనుకుంటున్నావా? అని కాశీపై మండిపడుతుంది స్వప్న.

దీపని టెస్ట్ చేసిన హారిక.. బీపీ నార్మల్‌గానే ఉంది. మీరేం టెన్షన్ పడొద్దు.. ట్రీట్‌మెంట్‌కి కావాల్సిన ప్రోసీజర్ స్టార్ట్ అయ్యింది, ఈరోజు నుంచి ఇక్కడే ఉంటారని చెబుతుంది హారిక. సుమిత్ర గారిని ఎప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ చేయాలో నేను మీకు చెబుతాను, కానీ జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండండి అని దశరథని హెచ్చరిస్తుంది డాక్టర్. తను ఈరోజు నన్ను కలిసింది. కడుపుతో ఉన్నవాళ్లు బోన్‌మారోని డొనేట్ చేయొచ్చా అని అడిగింది. తను ఈ ప్రశ్న అడిగింది అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తను ఊహించగలదు. నేను సమాధానం చెప్పలేదు.. కానీ తను సైలెంట్‌గా ఉండదు. ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది అంటే నేను ఫేస్ చేయలేను అని చెబుతుంది డాక్టర్ హారిక. నేను ఇక్కడే ఉంటాను.. మీ దాకా ప్రాబ్లమ్ రానివ్వనని అంటాడు కార్తీక్. తను మామూలు పేషెంట్ అయితే ఇంతగా జాగ్రత్తలు తీసుకునే దానిని కాదు.. కానీ తను ప్రెగ్నెంట్ కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే తల్లికి కూడా ప్రాబ్లమ్ అని హెచ్చరిస్తుంది హారిక.

నాకు నా కూతురు, నా కడుపులోని బిడ్డ ఇద్దరూ బతకాలి. అందుకు నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతాడు దశరథ. ఛాన్స్ ఉంటే నేను వదిలేస్తానా? నేను కూడా ఒక ఆడదానినే కదా? బిడ్డపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్ధం చేసుకోగలను. మీరైతే ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దని తేల్చేస్తుంది డాక్టర్ హారిక. నా చెల్లి కోసమైనా బిడ్డ బతకాలని అనుకున్నాను. ఇక్కడ నా ఆశల్ని బతికించే వాళ్లే కాదు. నమ్మకాల్ని బతికించే వాళ్లు కూడా లేరని దశరథ బాధపడతాడు. ఇంటికెళ్లి క్యారియర్ తీసుకుని వస్తానని దీపకి చెబుతాడు కార్తీక్. అత్తయ్యకి, శౌర్యకి ఏం చెబుతావని దీప అడగటంతో కార్తీక్ బాధపడతాడు. బిడ్డ గురించి డాక్టర్ గారితో ఏమైనా మాట్లాడావా? అని దీప అడగ్గా దశరథ సైలెంట్ అయిపోతాడు. అమ్మ జాగ్రత్త అని దశరథతో అంటుంది దీప.

దశరథని రెచ్చగొట్టి నిజాలు బయటకు రప్పించాలని ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న. ఇంతలో దశరథ అక్కడికి వచ్చి సుమిత్ర టాబ్లెట్ వేసుకుందా అని అడుగుతాడు. మీ మమ్మీ టాబ్లెట్ వేసుకుందా? అని అడిగేవాడివి, ఇప్పుడేంటీ కొత్తగా అడుగుతున్నావని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నువ్వు ఎక్కడికి వెళ్లావని జ్యోత్స్న అడగ్గా.. చిన్న పని ఉండి వెళ్లానని అంటాడు దశరథ. రెస్టారెంట్‌కి ఫోన్ చేస్తే నువ్వు రాలేదు అని చెప్పారు.. మరి నువ్వు ఎక్కడికి వెళ్లావో ఒక కూతురిగా అడిగే హక్కు నాకు లేదా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను ఆసుపత్రికి వెళ్లాను.. దీపని అడ్మిట్ చేయడానికి అని చెబుతాడు దశరథ. దీపకి ఏమైంది అని అడగ్గా.. నీకు అనవసరమని మండిపడతాడు దశరథ.

దీప గురించి ఆలోచించడానికి ఆవిడ భర్త, అత్తగారు, మావయ్య, మేనత్త ఉంది. కానీ మా మమ్మీ గురించి ఆలోచించడానికి నువ్వు, నేను మాత్రమే ఉన్నాం. నువ్వు మమ్మీ గురించి ఆలోచించకుండా ఎవరినో ఆసుపత్రి చుట్టూ తిప్పాల్సిన పనేంటీ అని సీరియస్ అవుతుంది జ్యోత్స్న. దీప నీ అన్న కూతురా? తమ్ముడి కూతురా? ఈ ఇంటి పనిమనిషి అని అనడంతో జ్యోత్స్నపై దశరథ సీరియస్ అవుతాడు. దీప పనిమనిషి కాదని చెబుతాడు. దశరథని అలాగే రెచ్చగొడుతుండగా శివన్నారాయణ వచ్చి అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావని మండిపడతాడు. దాంతో తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు నిరాశ పడుతుంది జ్యోత్స్న. దీప గురించి కార్తీక్ చూసుకుంటాడు. దీప కడుపులోని బిడ్డకు చిన్న సమస్య ఉంది కాబట్టి నువ్వు తోడుగా వెళ్లావని అంటాడు శివన్నారాయణ.

దీనిపై సుమిత్ర అడుగుతుండగా.. చిన్న ప్రాబ్లమ్ అని అబద్ధం చెబుతాడు దశరథ. నా గురించి కూడా దీప కంగారుపడుతుంది.. నేను బాగానే ఉన్నానని దీపకి చెప్పమని అంటుంది సుమిత్ర. దీప పిల్లలతో నేను ఆడుకుంటానని చెబుతుంది. నీ మాటలన్నీ నిజం కావాలని ఆ పరమశివుడిని కోరుకుంటున్నానని అంటాడు దశరథ. కడుపులో బిడ్డకు ఏం కాదని దీపకి నా మాటగా చెప్పండి అంటుంది సుమిత్ర. దీప గురించి సుమిత్రతో ఏం చెప్పొద్దని శివన్నారాయణలో అంటాడు దశరథ. ఏ ప్రాబ్లమ్ లేనప్పుడు మమ్మీ దగ్గర నిజం ఎందుకు దాయాలని అడుగుతుంది జ్యోత్స్న. మీ అమ్మ ఆపరేషన్ గురించి డాక్టర్ గారు ఫోన్ చేసి చెబుతానని అన్నారని చెబుతాడు దశరథ. డాడీకి నా గురించి తెలిసిపోయినట్లే ఉంది.. ఒకసారి దాస్‌ని కలవాలని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X