Karthika Deepam 2 March 9th: ఆస్తి కోసం రక్తపాతానికి సిద్దమైన జ్యోత్స్న.. దీప- కార్తీక్‌లకు అగ్నిపరీక్ష
Photo Courtesy: JioHotstar
డాక్టర్ హారిక దగ్గరికి వెళ్లేముందు దీప, కార్తీక్, దశరథలు మాట్లాడుకుంటూ ఉంటారు. నా చెల్లికి నేను ఏమని సమాధానం చెప్పాలి.. దీప కడుపులోని బిడ్డ దూరమవుతుందని అంటే తట్టుకోలేదని బాధపడతాడు దశరథ. దాంతో కార్తీక్ ధైర్యం చెబుతాడు. బాధపెట్టడం.. దానిని క్షణాల్లో దూరం చేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య అని మేనల్లుడిని, కూతురిని హత్తుకుంటాడు దశరథ. ఆసుపత్రిలో దీపని పరీక్షించిన హారిక.. సుమిత్ర గారికి ఆపరేషన్ అయ్యే వరకు మీరు ఇక్కడే ఉండాలని చెబుతుంది. సుమిత్ర గారిని ఎప్పుడు అడ్మిట్ చేయాలో చెబుతానని, కానీ జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఉదయం జ్యోత్స్న నన్ను కలిసి ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్లు బోన్‌మారో ఇవ్వొచ్చా అని అడిగిందని డాక్టర్ హారిక చెప్పడంతో కార్తీక్, దశరథలు షాక్ అవుతారు.
బూజు దులుపుతున్న కావేరికి సాయం చేస్తానని పైకెక్కి తుడుస్తున్న స్వప్న కిందపడిపోతుండగా కాశీ వచ్చి పట్టుకుంటాడు. నీ చేతుల్లో పడటం కంటే కిందపడిపోవడమే మంచిదని స్పప్న కోప్పడంతో తనను కిందపడేస్తాడు కాశీ. ఇదంతా చూసిన కావేరి నవ్వుకుంటుంది. దశరథను రెచ్చగొట్టి ఎలాగైనా నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంటికి వచ్చిన తండ్రిని మీరెందుకు దీప కోసం ఆసుపత్రికి వెళ్లారు.. ఆవిడ ఈ ఇంటి పనిమనిషి అని అంటుంది. దీప పనిమనిషి కాదని దశరథతో వాదిస్తుండగా శివన్నారాయణ వచ్చి ఇద్దరికీ సర్దిచెబుతాడు. తన ప్లాన్ ఫెయిల్ కావడంతో జ్యోత్స్న నిరాశ పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 9వ తేదీ 613వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శౌర్యకు అన్నం తినిపిస్తుండగా.. అమ్మానాన్న ఎక్కడ? అని కాంచనని అడుగుతుంది. కాంచన కోపంగా సమాధానం చెప్పడంతో నువ్వు మారిపోయావు.. నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదని అంటుంది. అప్పుడు జో గ్రానీ కూడా చెప్పింది. నాకు చెల్లి పుడితే నన్ను హాస్టల్‌లో వేస్తారంట.. అది నిజమేనా? నన్ను ఇంట్లోంచి పంపిచేస్తారా? నాకు నువ్వంటే చాలా ఇష్టం.. నువ్వు కోప్పడితే నేను బాధపడతాను అని శౌర్య అనడంతో కాంచన కంటతడి పెడుతుంది. ఎంతమంది వచ్చినా నువ్వే నాకు ఫస్ట్ అంటుంది. నీకు చెల్లి వచ్చినా నీ తర్వాతే అని చెబుతుంది కాంచన. ఇదంతా చూసిన కార్తీక్.. ఇక ఎవరూ రారని అనుకుంటాడు.
కార్తీక్‌ను చూసిన శౌర్య.. తండ్రిని హత్తుకుంటుంది. అమ్మ ఎక్కడ అని ప్రశ్నిస్తుంది. అమ్మమ్మకి ఒంట్లో బాలేదని అమ్మ అక్కడే ఉండిపోయిందని చెబుతాడు కార్తీక్. అమ్మ ఎప్పుడు వస్తుందని శౌర్య అడగ్గా.. అమ్మమ్మకి ఆరోగ్యం బాగుండగానే వస్తుందని చెబుతాడు కార్తీక్. నన్ను అమ్మ దగ్గరికి తీసుకెళ్తావా అని శౌర్య ప్రశ్నించగా సరేనంటాడు కార్తీక్. నీకు ఏం కావాలన్నా నానమ్మని అడగమని అంటాడు. దీపని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశామని కార్తీక్ చెప్పగా.. డాక్టర్ గారితో అన్నీ మాట్లాడారా? ఏమన్నారు? అని ప్రశ్నిస్తుంది కాంచన. తల్లి మాటలకు ఏం చెప్పలేక కార్తీక్ సైలెంట్‌గా ఉండిపోతాడు.
సుమిత్రకి టాబ్లెట్ వేసిన దశరథకు... దీప కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తుంటాడు. దీప హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది కదా తన గురించే ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నిస్తుంది సుమిత్ర. తన గురించి ఆలోచించడానికి ఏముంది.. తన పక్కన కార్తీక్ ఉన్నాడు కదా అని అంటాడు దశరథ. ఈ టైంలో భర్త కంటే కూడా దీపకి తల్లి అవసరం ఉంది.. కడుపుపతో ఉన్న భార్యకు ఏం కావాలో భార్య చెబితేనే భర్త అర్ధం చేసుకోగలడు. అదే కన్నతల్లి ఉంటే.. కూతురికి ఏం కావాలో అర్ధం చేసుకుంటుందని చెబుతుంది సుమిత్ర.
ఈ మాట నిజమే కానీ.. కొంతమంది కూతుళ్లు కూడా కన్నతల్లికి ఏం కావాలో అడగకుండానే అర్ధం చేసుకుంటారు. కన్నతల్లి కోసం ఏదైనా ఇవ్వాలని అనుకుంటే అది ఏదైనా కావొచ్చు, ఇవ్వడానికి వెనుకాడరు అంటాడు దశరథ. జ్యోత్స్నని చూస్తే నాకు కూడా అలానే అనిపించింది.. అది నా కోసం ఆపరేషన్‌కి కూడా సిద్ధపడిందని చెబుతుంది సుమిత్ర. మన కూతురు జ్యోత్స్న కాదు.. దీప అని మనసులో అనుకుంటాడు దశరథ. మీరు అనవసరంగా జ్యోత్స్నను తిట్టొద్దని చెబుతుంది సుమిత్ర. దీప గురించి నీచంగా మాట్లాడిందో విన్నావు కదా అంటాడు దశరథ. అదే నీ కన్నకూతురైతే జ్యోత్స్న ఇలా మాట్లాడేదా? అని దశరథ అడగటంతో సుమిత్ర షాక్ అవుతుంది.
మీరు దీపని, జ్యోత్స్నని ఒకటి చేసి మాట్లాడొద్దు.. దీపని నా కన్నకూతురిని ప్రేమించినట్లు ప్రేమించలేను కదా? అలాంటప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని సుమిత్ర చెబుతుంది.
త్వరలోనే ఆసుపత్రికి వెళ్లాలని దశరథ చెప్పగా.. జ్యోత్స్న కూడా మనతోనే వస్తుందా? నాకేం కాదు కదా అని బాధపడుతుంది సుమిత్ర. నీ కన్నకూతురు నీతోనే వస్తుంది.. నీ కూతురు తన ప్రాణాలు అడ్డుపెట్టైనా తన ప్రాణాల్ని కాపాడుతుందని చెబుతుంది సుమిత్ర. మన అల్లుడు, మన కూతురు మన కోసం ఎంత పెద్ద త్యాగానికి సిద్ధపడ్డారో నీకు తెలియదు.. తెలిస్తే నువ్వు తట్టుకోలేవని అనుకుంటాడు దశరథ.
కార్తీక్ ఏం మాట్లాడకపోవడంతో నేను మొండిదానిని, అందుకే ఏం జరిగినా? ఎంత బాధపడినా గోడకి కొట్టిన బంతిలా మళ్లీ తిరిగొస్తూనే ఉంటానని చెబుతుంది కాంచన. నీకొక కూతురు పుట్టినా కూడా శౌర్య నాకు పెద్ద మనవరాలే, దానిని తక్కువగా చూడను. అది నా మనవరాలే, దానికి నేను నానమ్మనే అంటుంది కాంచన. గుండెల్ని పిండేసే మాట ఏదో ఈ కొంపలోకి తీసుకొస్తావని నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నానని అంటుంది. బిడ్డని క్షేమంగా మీ చేతుల్లో పెడతానని దీప మాటిచ్చింది.. నన్ను వెర్రిదానిని చేయడం కాకపోతే నిలబెట్టుకోలేని మాటివ్వడం ఎందుకు అని ప్రశ్నిస్తుంది కాంచన.
నేను చచ్చిపోయేలోపు.. నీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డను నేను చూడాలని చెబుతుంది. దాంతో డాక్టర్ హారిక చెప్పిన మాటలు గుర్తొచ్చి కార్తీక్ తల్లి కాళ్ల దగ్గర కుప్పకూలిపోయి ఏడుస్తాడు. అత్త కోసం నీకు అన్యాయం చేస్తున్నానని బాధపడతాడు. ఆ బిడ్డ మీద ఆశలు పెట్టుకోనా వద్దా? అని కాంచన అడగ్గా.. ఇంతలో శ్రీధర్ వచ్చి ఎవరి కోసమో మన ఆశల్ని చంపుకోవాల్సిన అవసరం లేదు, మన సంకల్పం బలంగా ఉంటే అది నిజమవుతుందని అంటాడు. మీరెందుకు వచ్చారో చెప్పామని కాంచన అడగ్గా.. నా కర్తవ్యం నన్ను కదిలించి, ఇక్కడి దాకా తీసుకొచ్చిందని చెబుతాడు శ్రీధర్.
నన్ను మీరంతా చాలా తెలివిగా లాక్ చేశారని దాస్‌తో అంటుంది జ్యోత్స్న. నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటున్నా.. కానీ నువ్వు నాకు తెలియకుండా చేస్తున్నదంతా ఒప్పేసుకోమని అడుగుతుంది. మా డాడీ దీపని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాడని జ్యోత్స్న చెప్పగా.. తను ప్రెగ్నెంట్ కదా అందుకే అడ్మిట్ చేశాడనిన చెబుతుంది దాస్. మమ్మీకి ఆపరేషన్ చేయాల్సిన హాస్పిటల్‌లోనే దీపని జాయిన్ చేయాల్సిన అవసరం ఏంటీ? నిజానికి నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలి.. అలాంటిది నన్ను ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమని చెబుతున్నారు. అంటే ఈ గ్యాప్‌లో బ్యోన్‌మారో ట్రీట్‌మెంట్‌కి కావాల్సిన టెన్సిల్స్ దీప నుంచి తీసి స్టోర్ చేసే అవకాశం ఉందని చెబుతుంది జ్యోత్స్న.
అయితే మనిద్దరం శివన్నారాయణ గారి దగ్గరికి వెళ్లి.. మీ మనవరాలికి తాను ఈ ఇంటి బిడ్డను కానని అనుమానంగా ఉందట, ఒకసారి డీఎన్ఏ టెస్ట్ చేయిద్దామని అంటాడు దాస్. బయటపెట్టడానికి ఏం లేదు.. అసలైన నిజాలు ఎప్పుడో బయటపెడ్డాయని చెబుతాడు దాస్. మా డాడీకి అన్ని చెప్పేశావా? అని అడుగుతుంది జ్యోత్స్న. ఇక్కడ జరిగేదంతా ఎవరో కావాలని జరిపిస్తున్నట్లుగా ఉంది.. కానీ నేను ఏది అంత తేలికగా వదిలిపెట్టాను. పుట్టిన దగ్గరి నుంచి పెంచుకున్న ఆశలు.. మీరంతా కలిసి నన్ను ఇంట్లో నుంచి గెంటేసి దీపని యువరాణిని చేయాలనుకుంటే అది జరగదని అంటుంది జ్యోత్స్న. శివన్నారాయణ గారి ఆస్తికి ఏకైక వారసురాలిని నేనే.. ఒకరాజు సింహాసనం ఎక్కేటప్పుడు రక్తపాతం జరుగుతుంది. అయినాసరే వదిలిపెట్టను అంటుంది జ్యోత్స్న. నీకు రాసిపెట్టున్నది మాత్రమే నీకు దక్కుతుందని దాస్ వెళ్లిపోతాడు. ఏం జరుగుతుందో నేనే తెలుసుకోవాలని అనుకుంటుంది జ్యోత్స్న.
ఈరోజు నుంచి నేను మీతో పాటే మీ ఇంట్లోనే ఉంటానని కాంచనతో చెబుతాడు శ్రీధర్. ఈ ఇంట్లో మీకు చోటు లేదని కాంచన చెప్పగా.. మీ నుంచి ఇలాంటి మాటలు ఆశించేవారు చాలా మంది ఉన్నారని అంటుంది కాంచన. నీ కొడుకు హాస్పిటల్‌కి వెళ్తూనే ఉంటాడు.. దీపకి పూర్తిగా నయమై ఇంటికి తిరిగొచ్చే వరకు కార్తీక్ తన భార్య దగ్గరే ఉంటాడు. హాస్పిటల్‌లో ఉన్న దీపకి ఎలా అయితే ఓ తోడు అవసరం అయ్యిందో, ఇక్కడ ఈ ఇంటికి కూడా ఓ తోడు కావాలని చెబుతాడు శ్రీధర్. కార్తీక్ వచ్చే వరకు నేను ప్రతిరోజు రాత్రి ఇక్కడే పడుకుంటానని అంటాడు. ఈ ఇంటి సంగతి సరే.. మరి కావేరి, స్వప్నల పరిస్థితి ఏంటీ అని అడుగుతుంది కాంచన. అక్కడ అల్లుడిని కాపలా పెట్టి వచ్చానని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










