Karthika Deepam 2 March 10th: దీపకి పొంచివున్న మరణగండం.. జ్యోత్స్న మాటలతో దశరథ, దాస్ షాక్

Photo Courtesy: JioHotstar

ఇంట్లో తల్లిదండ్రులు కనిపించకపోవడంతో అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారని శౌర్య అడగ్గా.. కాంచన విసురుగా సమాధానం చెబుతుంది. దాంతో నువ్వు మారిపోయావు.. నా మీద కోప్పడుతున్నావని బాధపడుతుంది శౌర్య. చెల్లి పుట్టగానే నన్ను హాస్టల్‌లో వేసేస్తారని జో గ్రానీ చెప్పిందని అనడంతో కాంచన ఏడుస్తుంది. నీ తర్వాతే నాకు ఎవరైనా అని శౌర్యను ముద్దు చేస్తుంది కాంచన. ఇంతలో కార్తీక్ రావడంతో అమ్మ ఎక్కడ అని అడుగుతుంది శౌర్య. అమ్మమ్మకి హెల్త్ బాలేదని.. కొద్దిరోజులు అమ్మ ఇంటికి రాదని చెబుతాడు కార్తీక్. బిడ్డ క్షేమంగా ఉందా? లేదా? డాక్టర్లు ఏమన్నారని కాంచన అడగటంతో కార్తీక్ కన్నీళ్లు పెడుతూ కుప్పకూలిపోతాడు. ఇంతలో శ్రీధర్ వచ్చి నేను కొద్దిరోజులు ఇక్కడే ఉంటానని చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది.

దాస్‌ని కలిసిన జ్యోత్స్న.. నన్ను మీరంతా చాలా తెలివిగా లాక్ చేశారు, నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటున్నానని అంటుంది. మా డాడీ దీపని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.. నిజానికి అడ్మిట్ కావాల్సింది నేను. అంటే ఈ గ్యాప్‌లో బ్యోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారా అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. అవన్నీ నాకు తెలియదని దాస్ చెప్పగా.. ఎట్టి పరిస్ధితుల్లోనూ నా స్థానం దీపకి దక్కనివ్వనని ఛాలెంజ్ చేస్తుంది. సుమిత్రకు టాబ్లెట్ వేసిన దశరథ.. దీప గురించి ఆలోచిస్తుంటాడు. నాకేం కాదు కదా అని సుమిత్ర అడగ్గా.. నీ కూతురు తన ప్రాణాలు అడ్డుపెట్టయినా నిన్ను కాపాడుతుందని చెబుతాడు దశరథ. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 10వ తేదీ 614వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 614 March 10th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

కార్తీక్ ఆసుపత్రికి వచ్చేసరికి శ్రీధర్, శౌర్య ఉండటంతో టెన్షన్ పడతాడు. తండ్రి, కూతురు ఎందుకు వచ్చాడో తెలియక టెన్షన్ పడతారు. అమ్మ అమ్మమ్మ వాళ్లింట్లో ఉందని ఎందుకు అబద్ధం చెప్పావని అడుగుతుంది శౌర్య. ఆ మాటలతో కార్తీక్ షాక్ అవుతాడు. డాక్టర్ గారు చెప్పేవరకు మనం ఇక్కడే ఉండాలి.. అమ్మ ఇక్కడే ఉండాలని చెబుతాడు కార్తీక్. నీకు జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకుంటావు.. మరి బేబీకి జ్వరం వస్తే ఎలా అని అడుగుతుంది శౌర్య. అయితే బేబీని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ గారికి చెప్పమని కార్తీక్‌తో అంటుంది శౌర్య. దీపకి ఆడపిల్ల బొమ్మ ఇచ్చి నీకు బేబీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంతో కార్తీక్, దీపలు ఏడుస్తారు.

ఇంతో డాక్టర్ హారిక ఓ గైనకాలజిస్ట్‌తో వచ్చి దీపకి కొన్ని టెస్టులు చేయాలని చెబుతుంది. మీరు ఎన్ని టెస్టులైనా చేయండి తల్లిని, బిడ్డని కాపాడండి అని అడుగుతాడు శ్రీధర్. తల్లి వల్ల బిడ్డకు ప్రమాదం ఉందని శ్రీధర్ చెప్పగా.. బిడ్డ వద్దని నిర్ణయం తీసుకున్నారు కదా అని డాక్టర్ చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. కార్తీక్ ఏదో రకంగా కవర్ చేస్తాడు. ఆ వెంటనే శ్రీధర్‌ను, శౌర్యను ఇంటికి పంపించేస్తాడు. మా కడుపులోని బేబీని జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ హారిక దగ్గర ప్రామీస్ తీసుకోబోతుండగా ఆమె ఎమోషనల్ అవుతుంది. మీ నాన్నగారికి విషయం తెలిసేమో అనుకున్నానని అంటుంది డాక్టర్ హారిక. తప్పు నాదే.. నేను కాసేపు ఇక్కడే ఉండాల్సిందని అంటాడు కార్తీక్.

జ్యోత్స్నకి దాస్ ఫోన్ చేసి రమ్మని చెబుతాడు. రాత్రే కదా మాట్లాడుకున్నాం.. మళ్లీ ఏమైంది? మనసు మార్చుకున్నావా? నిజం చెప్పాలని అనుకుంటున్నావా? సాయం చేయాలని అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. నేను మీ నాన్నని కాదని చెప్పినా నువ్వు వినిపించుకోవడం లేదు. పోనీ నీ అనుమానాలన్నీ చెప్పమంటే చెప్పవు, దీపని ఆసుపత్రిలో ఎందుకు చేర్చావని అడుగుతావని మండిపడతాడు. అయితే నేను నీ కూతురిని కాదని చనిపోయిన నీ భార్య మీద ఒట్టేసి చెప్పమని జ్యోత్స్న అడగటంతో దాస్ షాక్ అవుతాడు. చచ్చిపోయిన వాళ్ల మీద ఎందుకు ఒట్టు వేయడం అంటాడు దాస్. నేనే నీ కూతురిని అని నీ మన:సాక్షికి తెలుసు, అందుకు నీకు ధైర్యం సరిపోవడం లేదని అంటుంది జ్యోత్స్న.

నేను నీ కూతురిని, దీప దశరథ అన్నయ్య కూతురని నువ్వే చెప్పావు. నేను దశరథ కూతురిని అని అందరూ నమ్ముతున్నారు. డాక్టర్ కూడా ఇదే కన్ఫర్మ్ చేశారు. నాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ ఇదంతా అబద్ధమై.. నాకు తెలియకుండా నా వెనుక ఏదో చేస్తున్నట్లు తెలిస్తే మాత్రం అని వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. నీకు ఈ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి చావు అంచులా వరకు వెళ్లి బతికి వచ్చావు అంటుంది జ్యోత్స్న. నన్ను ఈసారి పూర్తిగా చంపేసి.. సుమిత్ర అన్నయ్యని, దశరథ అన్నయ్యని ఏమైనా చేస్తావా అని దాస్ అడుగుతాడు. ఎవరిని ఏం చేయను.. ఇప్పటికే నిన్ను కొట్టినందుకు చాలా బాధపడుతున్నాను. కన్నతల్లిలా చూసుకున్న మా మమ్మీని, కన్నతండ్రిలా చూసుకున్న మా డాడీని నేనేం చేస్తాను కానీ ఒకటి మాత్రం జరుగుతుందని అంటుంది జ్యోత్స్న

మీరంతా కలిసి నాటకం ఆడి.. చివరికి నా స్థానం దీపది అని ప్రూవ్ చేశారంటే నేను చచ్చిపోతాను అని చెబుతుంది జ్యోత్స్న. కానీ నేను చచ్చే ఒక్క క్షణం ముందైనా దీపని చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలతో దాస్ షాక్ అవుతాడు. నేను చచ్చిన తర్వాతైనా దీపని బతకనివ్వను.. దీప అసలైన వారసురాలని నువ్వు చెబితే.. నేను చస్తాను, దీపని చంపుతాను. అంతేకాదు.. ఒకవేళ నేను ముందు చచ్చినా దీపని చంపే ఏర్పాట్లన్నీ చేశానని అంటుంది జ్యోత్స్న. ఎక్కడ? ఎప్పుడు? ఎలా చస్తుందో కూడా నువ్వు ఊహించలేవని అంటుంది. దీప బతికుండాలంటే నేను బతికుండాలి.. నాకు ఏ ప్రమాదం జరిగినా దీపే అసలైన కూతురని మీరు చెప్పినా దీపని చంపినట్లేనని అంటుంది జ్యోత్స్న. మీరు నన్ను చంపితే దీపని చంపినట్లే, దీప క్షేమంగా ఉండాలి అంటే శివన్నారాయణ గారి మనవరాలి స్థానంలో నేనే ఉండాలని చెప్పి వెళ్లిపోతుంది జ్యోత్స్న. ఆ మాటలన్నీ దొంగచాటుగా విన్న దశరథ షాక్ అవుతాడు.

ఆసుపత్రిలో డాక్టర్ ఏం చెప్పిందో కాంచనతో అంటాడు శ్రీధర్. ఇదంతా చూస్తుంటే కార్తీక్ మన దగ్గర ఏదో దాస్తున్నాడని చెబుతాడు శ్రీధర్. ఏదైనా సరే.. నువ్వు తప్పుచేశావని భార్య మీద కోప్పడతాడు శ్రీధర్. కొన్ని విషయాలు అనుమానించాలి.. పిల్లలెప్పుడు పెద్దవాళ్లకంటే తెలివైన వాళ్లు అనుకుంటారు. నిజాలు బయటపడిన తర్వాతే అసలు విషయాలు తెలియవు. కార్తీక్- దీపలు శివన్నారాయణ గారింట్లో ఎందుకు పనిచేస్తున్నారో ఇప్పటికీ తెలియదు అంటాడు శ్రీధర్. బిడ్డను వద్దు అనుకుంటున్నాడంటే ఏదో జరుగుతుందని అనుమానిస్తాడు. మనకి తెలియకుండా ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలని మనసులో అనుకుంటాడు శ్రీధర్.

శివన్నారాయణ గారి మనవరాలిగా ఉండాలన్న స్వార్ధం జ్యోత్స్నకి అవసరంగా మారిపోయింది. నువ్వు నిజం చెప్పకుండా మేమంతా ఎందుకు ఆపుతున్నామో ఇప్పటికైనా అర్ధమైందా అని దశరథను ప్రశ్నిస్తాడు దాస్. తండ్రినే చంపాలనుకున్న మనిషి.. దీపని ఎందుకు వదిలేస్తుంది, నీ ఇంట్లోనే నీ మీద హత్యాయత్నం జరిగింది. నువ్వు ఆపగలిగావా? అని అడుగుతాడు దాస్. ఇప్పుడే వెళ్లి అందరికీ నిజం చెప్పేస్తానని దశరథ చెబుతుండగా.. దాస్ నచ్చచెప్పాలని చూస్తాడు. అలాంటి కూతురిని కని నేను తప్పు చేశానని అంటాడు దాస్. మనం ఏమాత్రం తొందరపడినా దీపని పొగొట్టుకున్న వాళ్లం అవుతామని చెబుతాడు దశరథ. ఇప్పుడు నువ్వేం చేసినా దీపకి, వదినకి ప్రమాదమని హెచ్చరిస్తాడు దాస్. జ్యోత్స్న ఏదో చేసేదాకా నేను చూస్తుండలేనని దాస్ ఎంత ఆపుతున్నా వినిపించుకోకుండా కోపంగా ఇంటికి వెళ్తాడు దశరథ.

శౌర్య అన్న మాటలు గుర్తొచ్చి దీప కంటతడి పెడుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి భార్యను చూసి తను కూడా బాధపడతాడు. శౌర్య గురించి ఆలోచిస్తున్నావా? ఇంటికి వెళ్దామా? అని అడుగుతాడు కార్తీక్. శౌర్య, అత్తయ్యలకు ఇచ్చిన మాటలు గుర్తొస్తున్నాయని బాధపడుతుంది దీప. మావయ్య గారికి ఆల్రెడీ డౌట్ వచ్చేసింది.. ఈపాటికే అత్తయ్యకి చెప్పేసి ఉంటాడని అంటుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X