Karthika Deepam 2 March 11th: జ్యోత్స్నతో చేతులు కలిపిన కాంచన, శివన్నారాయణ... కార్తీక్- దీపల చుట్టూ ఉచ్చు

Photo Courtesy: JioHotstar

కార్తీక్ హాస్పిటల్‌కి వచ్చేసరికి ఓ గైనకాలజిస్ట్.. దీపని టెస్ట్ చేయడానికి వస్తుంది. పక్కనే ఉన్న శ్రీధర్.. బిడ్డను కాపాడమని అడగటంతో, బిడ్డను వదులుకుంటానంటే మీరు కాపాడమంటారు అని మండిపడుతుంది డాక్టర్. దాంతో పక్కనే ఉన్న హారిక సైగ చేస్తుంది. కార్తీక్ ఏదో ఒక రకంగా విషయాన్ని కవర్ చేసి శ్రీధర్‌ని, శౌర్యని ఇంటికి పంపేస్తాడు. హాస్పిటల్ వద్ద జ్యోత్స్నతో దాస్ మాట్లాడతాడు. నేను నీ కూతురిని కాదని నీ భార్య మీద ఒట్టేయమని జ్యోత్స్న అడగటంతో దాస్ షాక్ అవుతాడు. మీరంతా కలిసి నా స్థానంలో దీపని కూర్చోబెడితే నేను చచ్చిపోతాను.. అంతేకాదు నేను చనిపోయే కొద్ది క్షణాలు ముందైనా దీపని చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది.

దీప బతకాలంటే నేనే శివన్నారాయణ గారి వారసురాలిగా ఉండాలని .. లేదంటే ఆమె చనిపోతుందని చెబుతుంది. ఆ మాటలతో దాస్ షాక్ అవుతాడు. ఇదంతా దొంగచాటుగా విన్న దశరథ... నీ కూతురిని వదిలిపెట్టనని తాడోపేడో తేల్చేస్తానని దాస్‌తో అంటాడు. హాస్పిటల్‌లో డాక్టర్ చెప్పిన మాటలు, కార్తీక్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్నాయని కాంచనతో అంటాడు శ్రీధర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 11వ తేదీ 615వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 615 March 11th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

బిడ్డ గురించి, కాంచన గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న దీపని కార్తీక్ నవ్విస్తాడు. ఇంతలో శివన్నారాయణ ఫోన్ చేసి రేపు ఉదయం నిన్ను ఒకసారి కలవాలి.. విషయాలన్నీ రేపు చెబుతానని అంటాడు. అర్జెంట్‌గా తాత ఎందుకు ఫోన్ చేశాడు? ఏదో బలమైన కారణమే ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు. నువ్వు చెప్పినట్లుగానే కార్తీక్‌కి ఫోన్ చేశాను.. రేపు ఏం చేయబోతున్నావని అడుగుతాడు శివన్నారాయణ. దీప- కార్తీక్‌లు మనకి తెలియకుండా ఏదో చేయబోతున్నారు. అదేంటో కనుక్కోవాలని చెబుతుంది జ్యోత్స్న. వాళ్ల బిడ్డ గురించి నిర్ణయం తీసుకునే హక్కు వాళ్లకు ఉంటుందని పెద్దాయన చెప్పగా.. వాళ్లు నీ కూతురిని మోసం చేస్తున్నారు, కాంచన అత్త ఎమోషన్స్‌తో ఆడుకుంటున్నారని చెబుతుంది జ్యోత్స్న.

ఆ మాటలతో శివన్నారాయణ సీరియస్ అవుతాడు. ఈ ఇంటి కోసం ముందుండే దీప- కార్తీక్‌లపై నింద వేస్తున్నావు.. నిరూపించుకోలేకపోతే నేను ఇచ్చే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుందని జ్యోత్స్న, పారిజాతంలను హెచ్చరిస్తాడు. ఇంతకీ ఏం చేయబోతున్నావని పారు అడగ్గా.. కొన్ని చెప్పకూడదు చేసి చూపిస్తా. నెల రోజులు నేను యాక్టీవ్‌గా లేకపోవడంతో ఎవరెవరో గేమ్ ఆడుతున్నారు.. వాటికి నేను చెక్ పెడతానని అంటుంది జ్యోత్స్న. ఉదయాన్నే కాంచన దగ్గరికి వస్తాడు శ్రీధర్. మీరు అనుమానించిన విషయాన్ని కనుక్కున్నారా? లేదా అని కాంచన అడుగుతుండగా జ్యోత్స్న వస్తుంది. మనసు నిండా విషం నింపుకున్న మనుషులకు నేను దూరంగా ఉంటానని అంటుంది కాంచన.

సొంత వాళ్లు అంటే ఎవరికి నచ్చడం లేదు. అదే నేను పనిమనిషిని అయ్యుంటే నీ కొడుకు తాళి కట్టేవాడు, నువ్వు నాకు గుడి కట్టేదానివి అనేది జ్యోత్స్న. నాకు పనిమనిషిగా పుట్టే అదృష్టం లేక నీ ఇంటి కోడల్ని కాలేకపోయాను అంటుంది. వచ్చే జన్మలో అయినా పనిమనిషిగా పుట్టి నీకు కోడలిగా పుడతానని అంటుంది. నీ ఇంటికి కోడలిగా అవ్వాలంటే కొన్ని అర్హతలు ఉండాలి.. దీపలా ఐదో తరగతి మధ్యలోనే వదిలేయాలి, పనిమనిషిగా బతకాలని మండిపడుతుంది. నిన్ను బయటికి పొమ్మంటే పోవేంటి అని జ్యోత్స్నపై సీరియస్ అవుతుంది కాంచన.

దీప- కార్తీక్‌లు ఆడుతున్న నాటకం గురించి మీలాగే నాకు, తాతకి కూడా అనుమానంగా ఉందని చెబుతుంది జ్యోత్స్న. మీరు సరేనంటే నిజం ఏంటో నేను తెలియజేస్తానని అంటుంది. నిన్ను నేను అస్సలు నమ్మనని చెబుతుంది. నువ్వు ఏదో ఒకటి చేసి మళ్లీ నా కొడుకుని ఇబ్బంది పెడతావని అంటాడు శ్రీధర్. దీప కడుపులోని బిడ్డ గురించి నిజం తెలిస్తే ఓకే.. లేదంటే మీరు ఏమన్నా సరే నేను పడతానని అంటుంది జ్యోత్స్న. అంత మాటలు పడి నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటీ? అని ప్రశ్నిస్తుంది కాంచన. ఇదంతా మా డాడీ కోసం చేస్తున్నాను.. దీప కడుపులోని బిడ్డ గురించి మా డాడీ కూడా ఆశలు పెట్టుకున్నాడు.. నాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతుంది జ్యోత్స్న. దాంతో సరేనని చెబుతుంది కాంచన. నువ్వు చేసే పని వల్ల నా కొడుకు- కోడలు ఏదైనా ఇబ్బంది పడితే మాత్రం అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది.

ఉదయాన్నే మీ పాప మెట్ల మీద పడిందని దీపకి ఫోన్ వస్తుంది.. దాంతో కార్తీక్‌కి ఫోన్ చేయగా.. పక్కనే ఉన్న శివన్నారాయణ లిఫ్ట్ చేయనివ్వడు. నువ్వేం కంగారు పడొద్దని అన్ని జరగాల్సిన టైంలో అవే జరుగుతాయని చెబుతాడు. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుగా తానే బయల్దేరుతుండగా శ్రీధర్ ఎదురురావడంతో కోడల్ని తీసుకుని హాస్పిటల్‌కు బయల్దేరతాడు. దీప వచ్చేసరికి కార్తీక్ ఆసుపత్రిలో ఎదురవుతాడు. అప్పటికే శివన్నారాయణ, జ్యోత్స్న, కాంచన, పారిజాతం అందరూ అక్కడే ఉండటంతో కార్తీక్‌కి కోపం వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? మా ఇద్దరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని మండిపడతాడు.

ఆ వెంటనే జ్యోత్స్న ఒక డాక్టర్‌ని పిలిచి.. దీపకి టెస్ట్ చేయమని చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ జరుగుతున్న మనిషిని తీసుకొచ్చి టెస్టులు చేయిస్తారా అని సీరియస్ అవుతాడు కార్తీక్. మీ అందరికీ అసలు ఏమైంది.. అని అడుగుతాడు. నా కోడలి కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏదో సమస్య ఉందట. ఆ బిడ్డ వల్ల తల్లికి కూడా ప్రమాదం ఉందట. ఇద్దరిలో ఎవరో ఒకరినే కాపాడాల్సిన పరిస్ధితి.. నాకు నా కోడలు, నా మనవరాలు ఇద్దరూ బతకాలి. కానీ నా కొడుకు అలా కుదరదు అంటున్నాడు.. మీరు ఒకసారి టెస్ట్ చేసి నిజం చెప్పమని డాక్టర్‌తో అంటుంది కాంచన.

తమ ప్లాన్ వర్కవుట్ కావడంతో పారిజాతం, జ్యోత్స్నలు పండగ చేసుకుంటారు. దీపకి టెస్టులు చేయించమని శివన్నారాయణ చెప్పడంతో దానికి కార్తీక్ ఒప్పుకోడు. నా భార్య విషయంలో మీరంతా సెకండ్ ఓపీనియన్ ఎందుకు తీసుకుంటున్నారని మండిపడతాడు. నువ్వు నీ బిడ్డ గురించి ఆశలు వదిలేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లావు.. కానీ మేం అలా కాదని కాంచన చెబుతుంది. బావ కంగారు చూస్తుంటే ఏదో నిజం బయటపడేలా ఉందని అంటుంది జ్యోత్స్న. ఇంట్లో కుదురుగా ఉండక గొడవలు పెట్టాలని చూస్తున్నావా అని మండిపడతాడు. ఈ టెస్ట్‌లకి ఒప్పుకుంటావా? లేదా? అని కాంచన సీరియస్ అవుతుంది. బిడ్డ వల్ల తల్లికి ప్రమాదం ఉందని అబద్ధం అని ఒప్పుకో చెబుతుంది. బావ మీద నాకు నమ్మకం ఉంది.. ఎన్నిసార్లు టెస్టులు చేసినా ఒకటే రిపోర్ట్ వస్తుందని సెటైర్లు వేస్తుంది జ్యోత్స్న. టెస్టులు చేయమని డాక్టర్‌కి చెప్పి దీపని లోపలికి పంపడంతో కార్తీక్‌కి ముచ్చెమటలు పడతాయి. శౌర్య మెట్ల మీద పడిపోయిందని అబద్ధం ఎవరు చెప్పించారు? ఎందుకు అలా చేశారంటూ కార్తీక్ మండిపడతాడు. మా జీవితాలకే ఏం జరిగినా నష్టం మాకేనని అంటాడు. మీరంతా కలిసిపోయారని తల్లిదండ్రులపైనా సీరియస్ అవుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X