Karthika Deepam 2 March 12th: దీప పుట్టుకపై నిజం చెప్పేసిన దశరథ... ఆస్తి కోసం దీపని కాల్చేసిన జ్యోత్స్న
Photo Courtesy: JioHotstar
తన కడుపులోని బిడ్డ గురించి దీప బాధపడుతుండగా కార్తీక్ ఓదారుస్తాడు. ఇంతలో కార్తీక్‌కి శివన్నారాయణ ఫోన్ చేసి రేపు ఉదయాన్నే కలవడానికి రమ్మని చెబుతాడు. దాంతో తాతకి ఏదో అనుమానం వచ్చిందని కార్తీక్ కంగారుపడతాడు. నువ్వు చెప్పమన్నట్లుగానే కార్తీక్‌ను రప్పిస్తున్నానని.. ఏదైనా తేడా జరిగితే నీకు, పారిజాతానికి పనిష్మెంట్ ఇస్తానని అంటాడు శివన్నారాయణ. దీప బిడ్డ గురించి కాంచన- శ్రీధర్ మాట్లాడుకుంటూ ఉండగా.. జ్యోత్స్న వచ్చి బావ దగ్గరి నుంచి నేను నిజం రాబడతాను, ఒక అవకాశం ఇవ్వమని అడుగుతుంది. దానికి శ్రీధర్, కాంచన ఒప్పుకుంటారు.
శౌర్య స్కూల్ మెట్లపై నుంచి పడిపోయిందని హాస్పిటల్‌లో జాయిన్ చేశామని ఫోన్ రావడంతో దీప కంగారుపడుతుంది. వెంటనే కార్తీక్‌కి ఫోన్ చేయగా కారులో పక్కనే ఉన్న శివన్నారాయణ ఆ ఫోన్ లిఫ్ట్ చేయొద్దని చెబుతాడు. ఇంతలో శ్రీధర్ రావడంతో శౌర్య గురించి చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లమని అడుగుతుంది దీప. ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి వెళ్లేసరికి అక్కడ కార్తీక్, శివన్నారాయణ, జ్యోత్స్న, కాంచన, పారిజాతం ఉండటంతో దీప షాక్ అవుతుంది. దీప కడుపులో బిడ్డ గురించి నువ్వు చెబుతున్న మాటలపై మాకు నమ్మకం లేదు.. అందుకే దీపకి టెస్టులు చేయించాలని అనుకుంటున్నామని కాంచన చెబుతుంది. దీనిపై కార్తీక్ సీరియస్ అవ్వగా.. ఏమాత్రం పట్టించుకోకుండా దీపని డాక్టర్ దగ్గరకి పంపుతుంది కాంచన. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 12వ తేదీ 616వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
హాస్పిటల్‌లో దీపకి డాక్టర్ టెస్టులన్నీ చేసి రిపోర్ట్స్ తర్వాత పంపిస్తానని చెబుతుంది. దీపని తీసుకెళ్తున్న కార్తీక్‌ని జ్యోత్స్న ఆపి.. రిపోర్ట్స్ వచ్చే వరకు ఎవరూ ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదని అంటుంది. శివన్నారాయణ కూడ అదే మాట అనడంతో కార్తీక్ - దీపలు షాక్ అవుతారు. దీనిని ఎలా ఆపాలో అర్ధం కావడం లేదని కార్తీక్ తలపట్టుకుంటాడు. మరోవైపు.. స్వప్నని పిలిచిన కావేరి ఈరోజు నేను మా ఆయనకి మాత్రమే వంట చేశానని చెబుతుంది. అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్లిపోమంటున్నావా? అంటూ మండిపడుతుంది స్వప్న. ఇంతలో దాస్ రావడంతో ఇద్దరూ సైలెంట్ అవుతారు.
నేను నా కోడలి కోసం వచ్చానని దాస్ చెప్పడంతో స్వప్న సీరియస్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు కోడల్ని కాదు మేనకోడల్ని మాత్రమే అంటుంది. ప్రసాదం ఇచ్చి బొట్టు పెట్టుకోమని చెప్పగానే.. నుదిటిన సింధూరం పెట్టుకుంటుంది స్వప్న. అది చూసి దాస్, కావేరిలు షాక్ అవుతారు. తర్వాత దాస్‌ని పిలిచి ప్రసాదం పెడతాడు. ఈరోజు గుడిలో మీ భార్యాభర్తలపై అర్చన చేయించానని చెబుతాడు దాస్. ఈరోజు మీ మొదటి పెళ్లిరోజని చెప్పడంతో స్వప్న, కాశీలు షాక్ అవుతారు. ఆరోజు మీరు అమర ప్రేమికులు.. ఈరోజున విడిపోయిన దంపతులు. మీలాంటి వారిని చూసినప్పుడే పెద్దవాళ్లు భయపడేది. అసలు మీ ఇద్దరిలో ఒక్కరికైనా ఈరోజు గుర్తుందా అని దాస్ అడగటంతో ఇద్దరూ షాక్ అవుతారు.
ఇంటిలో ఎవర కనిపించకపోవడంతో దశరథ కంగారుపడతాడు. ఇంతలో దీప- కార్తీక్.. ఆ వెనుక ఫ్యామిలీ అంతా రావడంతో షాక్ అవుతాడు. మీరంతా కలిసి గుడికి వెళ్లలేదా అని దశరథ అడగ్గా.. మేం గుడికి కాదు.. ఆసుపత్రికి వెళ్లామని చెబుతుంది కాంచన. దీపను చూడటానికి వెళ్లారా? మరి దీపని ఎందుకు ఇంటికి తీసుకొచ్చారు అని ప్రశ్నిస్తాడు దశరథ. నిజాలు తేల్చడానికి అని శివన్నారాయణ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. కార్తీక్- దీపలు బిడ్డ విషయంలో అబద్ధం ఆడుతున్నారని పారు, జ్యోత్స్నలు చెప్పడంతో రగిలిపోతాడు.
భార్యకు ఆరోగ్యం బాలేదని.. పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండదని వీడు బాధపడుతుంటే మీరంతా విడిమీద ఎంక్వైరీ చేస్తున్నారా అని ఫైర్ అవుతాడు. ఇక్కడ ఏదో గూడుపుఠానీ జరుగుతోందని కొందరి అనుమానం. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నిజం ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను తెలుసుకున్న వివరాలు కొందరికీ తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉందని శివన్నారాయణ చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. అసలు దీపని కార్తీక్ ఎందుకు హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాడని శ్రీధర్ ప్రశ్నించడంతో దశరథ కంగారుపడతాడు. కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల దీపకి ప్రమాదం కాబట్టి అని ఆన్సర్ ఇస్తాడు దశరథ.
దీపని కాపాడుకోవడం కోసమే ఆమెను కార్తీక్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాడని చెబుతాడు దశరథ. ఈ విషయం నీకెలా తెలుసు, బావ ఏం చెప్పినా నమ్ముతావా అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. అది తేల్చడానికే దీపకి టెస్టులు చేయించామని, సుమిత్ర ఫ్రెండ్ గైనకాలజిస్ట్ ఉంది కదా తనే టెస్టులు చేసింది. అప్పుడు మనుషులు మాట్లాడాల్సిన పనిలేదు.. రిపోర్టులే మాట్లాడతాయని శివన్నారాయణ చెబుతాడు. కార్తీక్ చెప్పింది, డాక్టర్ చెప్పింది ఒకటే అయితే మనకి ఇంతే రాసిపెట్టుంది సరిపెట్టుకుందాం.. అది అబద్ధమని తేలితే నిజం ఏంటో మాకు ఇప్పుడే తెలియాల్సి ఉంటుందని అంటాడు శివన్నారాయణ. వీళ్లందరికీ ఈ అనుమానం ఎందుకు వచ్చింది? వీరిని ఎవరు రెచ్చగొట్టారు? అని దశరథకి జ్యోత్స్నలో అనుమానం వస్తుంది. వీళ్లందరినీ రెచ్చగొట్టింది నువ్వేనా అని అడుగుతాడు.
ఇప్పుడు నిన్ను కూడా రెచ్చగొట్టి ఆవేశంలో నీకు తెలిసిన నిజాలన్నీ బయటపెట్టేలా చేస్తానని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో డాక్టర్ గారు ఫోన్ చేయడంతో దీప పరిస్ధితి ఏంటీ? అని అడుగుతుంది జ్యోత్స్న. దీప కడుపులోని బిడ్డ వల్ల దీపకి ప్రాబ్లమ్ ఉందని చెప్పింది ఎవరు? అని ప్రశ్నిస్తుంది డాక్టర్. అదంతా అబద్ధం.. ఎవరో రాంగ్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని భయపెట్టారని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. తల్లీబిడ్డా ఇద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు.. దీపకి కానీ, తన బిడ్డకి కానీ ఏ ప్రమాదం లేదని డాక్టర్ చెబుతుంది. కార్తీక్, దీపలు దొరికిపోయారు.. ఇప్పుడు ఏం చెబుతారని అనుకుంటాడు దశరథ.
బిడ్డకి ప్రమాదం లేదని తెలిసినప్పుడు దీపని హాస్పిటల్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ చేయాల్సిన అవసరం ఏంటీ? అని కార్తీక్‌ని నిలదీస్తాడు శివన్నారాయణ. మళ్లీ మా ఇంట్లో మా అమ్మ పుడుతుందని, మీ అమ్మ మీ మావయ్యలు సంబరపడుతుంటే అబద్ధాలతో అందరినీ బాధపెడుతున్నారని మండిపడతాడు శ్రీధర్. కడుపులో ఉన్న బిడ్డ వల్ల దీపకి ప్రమాదమని తెలియగానే కాంచన ఎంత బాధపడిందో నాకు తెలుసు అంటాడు శ్రీధర్. నిజం చెప్పకుండా లేని సమస్యని కొని తెచ్చుకుని అందరినీ బాధపెడుతున్నారని పారిజాతం ఫైర్ అవుతుంది. ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో నువ్వు ఈరోజు అందిరికీ సమాధానం చెప్పాల్సిందేనని అంటుంది జ్యోత్స్న. నీకు డాక్టర్ మీద నమ్మకం లేదంటే నేను మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానని చెబుతుంది.
వాడి వ్యక్తిగత జీవితం మీద నీ అధికారం ఏంటీ అని దశరథ ఫైర్ అవుతాడు. దీప స్థానంలో నీ కూతురే ఉంటే.. నీ కూతురే ఇలాంటి పనిచేసుంటే అప్పుడు తెలిసేదని శివన్నారాయణ ఫైర్ అవుతాడు. నా కూతురికి మనవళ్లు పుట్టబోతున్నారంటే ఈ ఇంట్లో నాలుగో జనరేషన్ మొదలవబోతున్నట్లే మరి మీరు చెబుతున్నది అబ్ధమని అంటాడు. ఈరోజు నిజం తెలియాల్సిందేనని శ్రీధర్ సీరియస్ అవుతాడు. మనమంతా ఒకే ఫ్యామిలీ కాబట్టి నిన్ను అడిగే హక్కు నాకుంది.. ఎందుకు మీరు అబద్ధం చెప్పారని జ్యోత్స్న నిలదీస్తుంది. నిజాలు చెప్పమంటూ అందరూ గొడవ చేయడంతో నేను చెబుతానని శ్రీధర్ అనడంతో అంతా షాక్ అవుతారు.
వీళ్లు అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పారని దశరథ మాట్లాడుతుండగా కార్తీక్ ఆపాలని ప్రయత్నిస్తాడు. నేను అందరికీ ఈరోజు నిజం చెప్పే తీరుతాను.. నువ్వు అడ్డుపడ్డావంటే నా మీద ఒట్టేనని అనడంతో కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. దీప కడుపులోని బిడ్డకు ప్రమాదం ఉందన్నది నిజం.. అది నా భార్య వల్లేనని దశరథ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. మీ వదిన ప్రాణాలతో ఉండాలంటే దీప కడుపులోని బిడ్డను త్యాగం చేయాలని కాంచనకు చెబుతాడు దశరథ. దీప ఎవరో కాదు.. సుమిత్ర కన్నకూతురు అని దశరథ నిజం చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నాకు, సుమిత్రకు పుట్టిన కూతురు ఈ దీపేనని అంటాడు. జ్యోత్స్న దాస్ కూతురు.. పుట్టగానే ఆసుపత్రిలో బిడ్డల్ని మార్చేశారు, ఈ పని చేసింది పిన్నేనని చెప్పడంతో పారిజాతం వణికిపోతుంది.
మనింటి వారసురాలిని అనాథని చేసింది.. ఈ ఇంటి వారసురాలిగా తన మనవరాలిని చేసిందని చెబుతాడు దశరథ. ఇదంతా పిన్ని నీ మీద పగతో చేసింది.. ఇప్పుడు సుమిత్రను కాపాడబోయేది నా కన్నకూతురు దీపే. తను డోనర్‌గా ఉంటే కడుపులోని బిడ్డను బతికించడం కష్టం అన్నారు.. అయినాసరే కన్నతల్లి కోసం బిడ్డను వదులుకోవడానికి దీప సిద్ధమైంది. ఈ నిజాలు ఎవరికీ చెప్పలేక నిందలు మోసిందే కానీ తనే అసలైన ఈ ఇంటి బిడ్డ అని ఎవరికీ చెప్పలేదు. అందుకే నేనే చెబుతున్నాను.. దీపే ఈ ఇంటి వారసురాలు, జ్యోత్స్న దాస్ కూతురు. జ్యోత్స్న ఈ క్షణమే తన తండ్రి దగ్గరికి వెళ్లిపోతుందని చెబుతాడు దశరథ. ఈ ఇంటికి ఒక్కరే వారసురాలు ఉండాలి.. అది నేనే అయ్యుండాలని అంటుంది జ్యోత్స్న. ఎందుకంటే దీప బతికుండదు కాబట్టి అని దీపని కాల్చేస్తుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











