Karthika Deepam 2 March 13th: దీప- కార్తీక్‌లని ఇరికించిన జ్యోత్స్న... దశరథ‌పై శివన్నారాయణ సీరియస్

Photo Courtesy: JioHotstar

హాస్పిటల్‌లో దీపకి టెస్టులన్నీ చేసిన డాక్టర్.. రిపోర్ట్స్ తర్వాత పంపిస్తానని చెబుతుంది. దాంతో అందరినీ శివన్నారాయణ తన ఇంటికి తీసుకెళ్తాడు. స్వప్న- కాశీల పెళ్లిరోజు కావడంతో గుడిలో పూజ చేయించి ఇంటికి వస్తాడు దాస్. ఏడాది క్రితం మీరిద్దరూ అమర ప్రేమికులు, కానీ ఇప్పుడు విడిపోయిన భార్యాభర్తలని దాస్ చెప్పడంతో కాశీ - స్వప్నలు షాక్ అవుతారు. ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో దశరథ కంగారుపడుతుండగా.. మొత్తం ఫ్యామిలీ అంతా ఒకేసారి ఇంటికి రావడంతో షాక్ అవుతాడు. దీపకి టెస్టులు చేయించడానికి వెళ్లామని శివన్నారాయణ చెబుతాడు. వీళ్లందరినీ రెచ్చగొట్టింది ఎవరు? అని దశరథ ప్రశ్నిస్తాడు. దానిని నేనే అని ఆన్సర్ ఇస్తుంది జ్యోత్స్న. ఇలాంటివన్నీ నువ్వే చేస్తావని నాకు తెలుసు అంటాడు దశరథ.

ఇంతలో డాక్టర్ ఫోన్ చేసి దీపకి, దీప కడుపులోని బిడ్డకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదని.. తల్లీబిడ్డా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. దీప బిడ్డకు ప్రాబ్లమ్ అని ఎందుకు చెప్పావు? మా అత్త ఎమోషన్స్‌తో ఎందుకు ఆడుకున్నావని కార్తీక్‌ను జ్యోత్స్న నిలదీస్తుంది. దాంతో మండిపడిన దశరథ.. కార్తీక్ చెబుతున్నా వినిపించుకోకుండా దీపే ఈ ఇంటి వారసురాలని చెప్పేస్తాడు. సుమిత్ర బతకాలని తన కడుపులోని బిడ్డను వదులుకోవడానికి దీప సిద్ధపడిందని చెబుతాడు. జ్యోత్స్న దాస్ కూతురని.. ఇకపై దీప మనింట్లో, జ్యోత్స్న దాస్ ఇంట్లో ఉంటుందని చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు. ఈ ఇంటికి వారసురాలు ఒక్కరే ఉండాలి.. అది నేనే అవ్వాలని దీపని గన్‌తో కాల్చేస్తుంది జ్యోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 13వ తేదీ 617వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 617 March 13th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

మీ మనసులోని మాటను బయటికి చెప్పించడానికే నేను ఇదంతా చేశాను. ఈ ఇంటికి ఒక్కరే వారసురాలు ఉండాలి.. అది నేనే అయ్యుండాలి. ఎందుకంటే ఈ దీప బతికి ఉండదు కాబట్టి అని గన్‌తో దీపని కాల్చేస్తుంది జ్యోత్స్న. దాంతో ఒక్కసారిగా దశరథ ఉలిక్కిపడతాడు. దీపని జ్యోత్స్న చంపుతానని చెప్పిన మాటలు గుర్తొచ్చి సైలెంట్ అయిపోతాడు. నువ్వెందుకు దీపని నిజం చెప్పనివ్వకుండా అడ్డుపడుతున్నావని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. వీళ్లెందుకు మనందరినీ మోసం చేస్తున్నారో నీకు తెలుసా? చూస్తుంటే నాకు నీ మీదే అనుమానం వస్తోందని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో దీప మండిపడుతుంది. నీ కోడలు నీతో అబద్ధం చెప్పిందని నీకు స్పష్టంగా అర్ధమైంది. నీ కోడలు చెప్పిన అబద్ధానికి నీ కొడుకు సపోర్ట్ చేస్తున్నాడని కూడా అర్ధమైంది. నీ కొడుకు నీకు అబద్ధం చెప్పడానికి నీ కోడలే కారణం కాబట్టి.. ఇప్పుడు నీకు నిజం తెలియాలంటే ఎవరినీ అడగాలని ప్రశ్నిస్తుంది పారిజాతం.

మా డాడీ ఎప్పుడూ దీప తరపునే మాట్లాడతాడని అంటుంది జ్యోత్స్న. ఇప్పటి వరకు కార్తీక్ - దీపలు చెప్పిందే నేను కూడా నమ్మాను.. కానీ వాళ్లు అబద్ధం చెబుతున్నారు, నేను నిరూపిస్తానని జ్యోత్స్న అన్నది. డాక్టర్ చెప్పిన మాటలు విన్న తర్వాత ఇప్పుడు మీ మీద నమ్మకం పోయిందని అంటాడు శివన్నారాయణ. మళ్లీ మీ మీద నమ్మకం వస్తుందా? రాదా? అనేది మీరు చెప్పే నిజాన్ని బట్టి ఉంటుందని అంటాడు పెద్దాయన. మనం ఇదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అడగ్గా.. లేదు మనం ఇప్పుడే, ఇక్కడే మాట్లాడుకోవాలి. నిజం తెలియాలని అంటుంది కాంచన. అత్తగారిగా నాకు అధికారం ఉన్నా అది నేను తీసుకోవడం లేదని చెబుతుంది. తప్పు చేసింది దీప అని నువ్వు అంటున్నావు.. అసలు ఈ తప్పు జరగానికి మూల కారణం దీప కాదు కార్తీక్ అని కాంచన అనడంతో అంతా షాక్ అవుతారు.

కడుపులో బిడ్డకు సమస్య ఉందని నీ కన్నతల్లికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటీ? అని కాంచన నిలదీస్తుంది. నిన్ను అన్ని విషయాల్లో వెనకేసుకొచ్చి తప్పంతా చేసింది వీడేనని అంటుంది. ఈ విషయంలో బావని తప్పు పట్టొద్దని చెబుతుంది దీప. మీరు చెప్పిందే నిజమైతే డాక్టర్ కూడా అదే చెప్పాలి కదా? మీకు అనుమానం ఉంటే ఏ హాస్పిటల్‌కు వెళ్లినా టెస్టులు చేయించుకోమని సవాల్ విసిరిందంటే డాక్టర్ చెప్పింది నిజమే కదా అని అంటుంది కాంచన. అంటే తప్పంతా నా కొడుకుదే. ఇక్కడ ఏ నిజం లేదు.. మమ్మల్ని హాస్పిటల్‌కు వెళ్లనివ్వండి అంటాడు కార్తీక్. నిజం చెప్పే నువ్వు ఇక్కడి నుంచి కదలాలి.. లేదంటే నన్ను చంపినంత ఒట్టేనని కాంచన అనడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు.

నువ్వంటే బయటదానివి నీకు నా బాధ అర్ధం కాకపోవచ్చు.. కానీ వీడు నా కన్నకొడుకు. వీడికి నా బాధ అర్ధమవుతుంది కదా.. వాడి మీద అరిచే హక్కు కూడా నాకుందని అంటుంది కాంచన. బిడ్డ వల్ల దీపకి సమస్య అని ఎందుకు అబద్ధం చెప్పావని ప్రశ్నిస్తుంది కాంచన. నిజం చెప్పకపోతే నా ఆశల్ని చంపేసిన కొడుకుగా నువ్వు మిగిలిపోయినట్లే అంటుంది. నీ కడుపులో ఉన్న బిడ్డతో నీకున్న సమస్య ఏంటో వాడు నాకు చెప్పాలని అంటుంది. బావ ఏం చెప్పలేడు.. ఎందుకంటే కడుపులోని బిడ్డను నేను వద్దు అనుకుంటున్నాను కాబట్టి అని దీప చెబుతుంది. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఈ బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు.. అందుకే వద్దు అనుకుంటున్నానని అంటుంది దీప.

మరోవైపు.. మీ ఇద్దరికి పెళ్లి రోజని గుర్తుందా? లేదా? అని కాశీని, స్వప్నని అడుగుతాడు దాస్. ఇది గుర్తుంచుకునేంత గొప్ప రోజు కాదని అంటుంది స్వప్న. అయితే నీ పాపిట్లో దిద్దుకున్న సింధూరాన్ని చెరిపేయమని కావేరి అనడంతో స్వప్న షాక్ అవుతుంది. విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టడం కంటే ఇది తేలికైన పనే కదా? నీ పాపిట్లో సింధూరాన్ని చెరిపేయ్, పోనీ నేను చెరిపేయనా అని కావేరి ప్రశ్నిస్తుంది. నీకు నీ భర్తే ఎక్కువ అయిపోయినప్పుడు నుదిటి మీద సింధూరాన్ని మాత్రం ఏం మోస్తావు అనడంతో స్వప్న షాక్ అవుతుంది. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కాశీ కూడా కారణం అని స్వప్న అంటుంది. వీరిద్దరినీ కాసేపు ఒంటరిగా వదిలేద్దాం.. గడిచిపోయిన జ్ఞాపకాలు గుర్తొస్తాయేమో చూద్దామని దాస్ చెప్పడంతో కావేరి సరేనని అంటుంది.

బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు.. అందుకే బిడ్డ వల్ల నాకు సమస్య ఉందని బావతో అబద్ధం చెప్పించానని దీప అనడంతో అంతా నిలబడిపోతారు. ఆడ పుట్టుక పుట్టిన ఏ ఆడకూతురైనా బిడ్డను వద్దు అనుకుంటుందా అని పారిజాతం నానామాటలు అంటుంది. మీరు సరిగానే విన్నారు అత్తయ్య.. నేను ఈ బిడ్డను కనలేను, వదిలించుకోవడానికే ఆసుపత్రికి వెళ్లానని చెబుతుంది దీప. అలాంటప్పుడు బిడ్డు నా చేతుల్లో పెడతానని నాకు మాట ఎందుకు ఇచ్చావని కాంచన ప్రశ్నిస్తుంది. నువ్వు కడుపులో బిడ్డను మోస్తుంటే.. నేను ఆశల్ని మోసుకుంటున్నానని చెబుతుంది. అసలు బిడ్డను ఎందుకు వద్దు అనుకుంటున్నావు అని ప్రశ్నిస్తుంది కాంచన. ఇంతలో డాక్టర్ పంపిన వాయిస్ మెసేజ్‌ని వినిపిస్తుంది జ్యోత్స్న. దీప ఈ బిడ్డ వద్దు అనుకుంటే జీవితంలో మళ్లీ తల్లికాలేదని డాక్టర్ చెబుతుంది. ఆ మాటలు వినగానే అంతా షాక్ అవుతారు.

మీ ఇద్దరికీ ఈ నిజం ముందే తెలిసే మాకు అన్యాయం చేస్తున్నారా అని కాంచన ఫైర్ అవుతుంది. అసలు నిర్ణయం నాదే, దీపది కాదని తేల్చేస్తాడు కార్తీక్. ఇంట్లో జరుగుతున్నదంతా విని దశరథ కుప్పకూలిపోతాడు. ఏదో వస్తువును వదిలేసుకున్నంత తేలికగా బిడ్డను వదిలేసుకుంటారా? అది ఈ ఇంటి నాలుగో తరం అని చెబుతాడు శివన్నారాయణ. అడగాల్సింది నువ్వు కాదు .. దీపని కూతురిలా చూసుకునే డాడీ మాట్లాడాలని శివన్నారాయణని రెచ్చగొడుతుంది జ్యోత్స్న. దీప కడుపులో పెరుగుతున్నది మా అమ్మ అని చెప్పావు.. ఇప్పుడు నీ కూతురు, నీ అల్లుడు కలిసి మీ అమ్మని చంపేస్తుంటే ఎందుకు మాట్లాడవు అని శివన్నారాయణ, కాంచనలు నిలదీస్తారు. మీరిద్దరూ ఏం మాట్లాడినా ఉపయోగం లేదు.. ఎందుకంటే దీప తన బిడ్డను వదులుకుంటోంది అన్న నిజం మీ అన్నయ్యకి ముందే తెలుసని పారిజాతం చెప్పడంతో కాంచన షాక్ అవుతుంది. ఈ నిజం ఎప్పుడో తెలిస్తే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదని పారుపై శివన్నారాయణ మండిపడతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X