Karthika Deepam 2 March 14th: దశరథతో బంధం తెంచుకున్న కాంచన.. జ్యోత్స్న దెబ్బకు అనాథలా కార్తీక్

Photo Courtesy: JioHotstar

దీపను జ్యోత్స్న కాల్చేసిందని ఉలిక్కిపడి నో అని గట్టిగా అరుస్తాడు దశరథ. దాంతో ఏం జరిగిందని అంతా అడుగుతారు. కడుపులో బిడ్డకు అంతా బాగున్నప్పటికీ ఎందుకు వదలుకోవాలని అనుకుంటున్నారని దీప, కార్తీక్‌లను అంతా ప్రశ్నిస్తారు. దీప సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది. దీపని ఏమి అనొద్దు.. ఏం జరిగినా నా నిర్ణయంతోనే జరిగిందని చెబుతాడు కార్తీక్. బిడ్డను వదులుకోవడం చిన్న విషయమా? మీ అత్త ప్రాణాలను కాపాడటానికి మేమంతా యుద్ధం చేస్తున్నాం.. అలాంటిది ఒక ప్రాణాన్ని ఎలా తీసేస్తారని నిలదీస్తాడు శివన్నారాయణ.

మరోవైపు.. దాస్ ఇచ్చిన సింధూరాన్ని పాపిట్లో నుంచి తీసేయమని కావేరి చెప్పడంతో స్వప్న షాక్ అవుతుంది. మనిద్దరం ఇక్కడే ఉంటే వీళ్లు కొట్టుకుంటూ ఉంటారని.. వీరిద్దరికీ ప్రైవసీ ఇద్దామని చెబుతాడు దాస్. మీ ప్రేమ నుంచి పెళ్లయ్యాక జరిగిన ప్రతి ఘటనను గుర్తుచేసుకుని కలిసిపోమని అంటాడు. ఎంతగా నిలదీస్తున్నా కార్తీక్- దీపలు నోరెత్తకపోవడంతో డాక్టర్ పెట్టిన వాయిస్ మెసేజ్‌ని వినిపిస్తుంది జ్యోత్స్న. ఈ బిడ్డను వద్దు అనుకుంటే జీవితంలో దీప బిడ్డల్ని కనలేదని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంత జరుగుతున్నా మాతో ఒక్క మాట కూడా చెప్పలేదని కాంచన మండిపడుతుంది. బిడ్డను కనడం నాకు ఇష్టం లేదు.. నేను వద్దు అనుకుంటున్నానని దీప చెప్పడంతో కాంచన కంటతడి పెడుతుంది. ఇదంతా దశరథకి ఎప్పుడో తెలుసని పారిజాతం అనడంతో కొడుకుని శివన్నారాయణ నిలదీస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 14వ తేదీ 618వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 618 March 14th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దీప బిడ్డని వదులుకుంటుంది అన్న నిజం మీ అన్నయ్యకి ముందే తెలుసు.. దశరథకు తెలిసే నిజాన్ని దాచాడని చెబుతుంది పారిజాతం. నీకు ఈ నిజం ఎప్పుడో తెలిస్తే ఇప్పుడు చెప్పేది అని మండిపడతాడు శివన్నారాయణ. ఆ రోజు కార్తీక్, దీప, దశరథలు మాట్లాడుకుంటుంటే నేను పొడిపొడిగా విన్నాను. బిడ్డ విషయంలో ఏదో సమస్య ఉందని నాకు అప్పుడు అర్దమైంది. ఆ విషయాన్ని నేను కాంచనతో కూడా చెప్పానని అంటుంది పారిజాతం. ఆ మాట అడిగితేనే బిడ్డ వల్ల దీపకి సమస్య ఉందని కార్తీక్ చెప్పాడని అంటుంది కాంచన. నీ కొడుకు, నీ కోడలే కాదు.. మీ అన్నయ్య కూడా నిన్ను మతిలేని దానిని చేశాడని కాంచనని మరింత రెచ్చగొడుతుంది పారు. ఆ మాటలతో దశరథ సీరియస్ అవ్వగా.. పిన్ని చెప్పింది నిజమే, ఇకపై నన్ను చెల్లెమ్మ అని పిలవొద్దని మండిపడుతుంది కాంచన.

నాకు తల్లి లేదు, నాన్న ఎప్పుడూ వ్యాపారం అంటూ బయట తిరిగేవాడు. ఇంట్లో ఉండేది నువ్వు నేనే. నా కష్టమైనా, సుఖమైనా నిన్నే నమ్మేదానిని. నమ్మిన పాపానికి తొడబుట్టిన చెల్లిని కూడా మోసం చేశావని బాధపడుతుంది కాంచన. నేను నా కొడుకు, కోడలు, పుట్టబోయే బిడ్డ గురించి చెబుతుంటే విన్నట్లు నటించావని అంటుంది. నా కోడలి చేయి నీ చేతిలో పెట్టినప్పుడు కూడా ఒక్క మాటైనా చెప్పలేదని నిలదీస్తుంది కాంచన. దశరథ ఏదో చెప్పాలని ప్రయత్నించినా కాంచనా వద్దని చేయి పక్కకి విసిరేస్తుంది. డాడీ ఏదో చెప్పాలని అనుకుంటుంటే అత్త చెప్పనివ్వడం లేదని జ్యోత్స్న కంగారు పడుతుంది. డాడీ ఏదో చెప్పాలని అనుకుంటుంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? డాడీ మాట్లాడితే నిజం నీకు తెలుస్తుంది కదా అని అంటుంది జ్యోత్స్న. మావయ్య చేత నిజం చెప్పించడానికే జ్యోత్స్న ఇదంతా ప్లాన్ చేసిందని కార్తీక్‌కి అర్ధమవుతుంది. మీ మేనత్త పుట్టింటిలో , ఈ నట్టింటిలో చనిపోయినట్లేనని అంటుంది కాంచన. ఆ మాటలతో శివన్నారాయణ కంటతడి పెడతాడు.

విధిరాత నాకు కాళ్లు పొగొడితే.. మీరంతా కలిసి నాకు ప్రాణమే లేకుండా చేశారని ఏడుస్తుంది కాంచన. మీ మీదున్న నమ్మకాన్ని మీరంతా చంపేశారు.. ఒక కూతురిగా మోసపోయాను, ఒక చెల్లిగా మోసపోయాను, ఒక భార్యగా మోసపోయాను, ఒక తల్లిగా కూడా మోసపోయాను, ఒక అత్తగారిగా మోసపోయాను, ఒక మనిషిగా కూడా మోసపోయానని కంటతడి పెడుతుంది కాంచన. ఇన్ని మోసాలు భరించినా ఇంకా ఈ గుండె కొట్టుకుంటుంది అంటే ఇంకా ఎన్ని బాధలు చూడాలోనని అంటుంది. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి అంటూ స్వయంగా కాంచన ఇంట్లోంచి వెళ్లిపోతుంది. ఇంట్లో జరిగిన గొడవతో జ్యోత్స్న నవ్వుకుంటుంది, శివన్నారాయణ కుర్చీలో కూలబడిపోతాడు. సుమిత్ర హాయిగా నిద్రపోతోంది కానీ.. ఈ బిడ్డను వదులుకోవడానికి దీపకి ఏం మాయరోగం వచ్చిందో ఏంటోనని నానామాటలు అంటుంది పారు.

నీ చుట్టూ తిరిగితే నాలుగు నెలలు చూశావు అని స్వప్నకి గుర్తుచేస్తాడు కాశీ. ఆ తర్వాత నీకు ఐ లవ్ యూ అని చెప్పించడానికి వైజాగ్‌లో సగం సముద్రం ఇదినంత పనైంది అంటాడు . నువ్వు సగం సముద్రం ఈదావు.. నన్ను నడిసముద్రంలో పడేశావని అంటుంది స్వప్న. అన్ని సక్రమంగా ఉంటే జీవితం విలువ తెలియదు, మనం ప్రేమించుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి కష్టపడ్డాం. కానీ ఆ తర్వాత లైఫ్ ఈజీ అయిపోయింది. కష్టపడి సాధించుకున్న దాని విలువ తెలియకుండా పోయింది. కానీ నీ సంతోషం కోసం చేసిన పని నిన్ను బాధపెడుతుంది అనుకోలేదని అంటాడు కాశీ. అయినా లోకంలో లేచి పెళ్లి చేసుకున్న వారు, విడిపోయిన వారు చాలామంది ఉంటారు. అందులో మనం కూడా ఒకరం అంటుంది స్వప్న. కలవడానికి మూడు ముళ్లు కావాలి.. విడిపోవడానికి రెండు సంతకాలు చాలు అంటుంది. అత్తయ్య చెప్పినట్లు పాపిట్లో సింధూరాన్ని ఎందుకు చెరిపేయలేదని అడుగుతాడు కాశీ. నన్ను నీ మనసులో నుంచి తీసేయలేవు అంటాడు.

ఈరోజు మన పెళ్లి రోజనీ నీకు గుర్తు లేదా? కానీ ఒప్పుకోవు.. ఎందుకంటే నాకు కూడా గుర్తుంది. మార్నింగ్ గుడికి వెళ్లిన సంగతి నాన్నకు కూడా తెలియదు. స్వప్నకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరి చెప్పి రోజా పువ్వు గిఫ్ట్‌గా ఇస్తాడు. దానిని స్వప్న తీసుకోవడంతో కాశీ సంతోషిస్తాడు. కానీ కాశీ వెళ్లగానే పువ్వుని స్వప్న కిందపడేస్తుంది. ఇంట్లో జరిగినదంతా తలచుకుని దీప బాధపడుతుంది. ఇక్కడ మనల్ని అన్న ప్రతి మాట వెనుక జ్యోత్స్న ఉందని దీపతో అంటాడు కార్తీక్. అసలు మీరిద్దరూ ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్లారని ప్రశ్నిస్తాడు దశరథ. మన మీద జ్యోత్స్నకి అనుమానం వచ్చింది.. డాక్టర్ హారికని ఒప్పించాలని ప్రయత్నించి ఫెయిలైంది. ఈసారి లాభం లేదని ఇక్కడ ఏం జరుగుతుందో నీ ద్వారానా బయటపెట్టాలని తెలివిగా తాతని లాక్ చేసిందని జరిగినదంతా చెబుతాడు కార్తీక్.

అందరిలోనూ నమ్మకం లేని మనిషిగా మిగిలిపోయానని కార్తీక్ బాధపడతాడు. నువ్వు నన్ను ఆపకుండా ఉండాల్సిందని అంటాడు దశరథ. నువ్వు అమ్మ గురించి ఆలోచించు అంటుంది దీప. పారిజాతం పిన్ని మన మాటలు ఎక్కడ విన్నదో కానీ, ఎక్కడ గుర్తుచేయాలో అక్కడే గుర్తుచేసి నాన్న ముందు తలదించుకునేలా చేసిందని అంటాడు. నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు, నువ్వు దీపని తీసుకుని బయల్దేరు అంటాడు దశరథ. ఒకసారి అమ్మని చూస్తానని దీప అడగ్గా.. మీ అమ్మ పడుకుంది, అయినా జ్యోత్స్నకి మన మీద చాలా అనుమానంగా ఉందని చెబుతాడు. ఈ మాటలు ఎవరో ఒకరి చెవిలో పడకముందే మీరు వెళ్లిపోండి అని అంటాడు. ఇంతలో ఇక్కడే జరిగేదంతా జ్యోత్స్న చూస్తుండటంతో ఇక్కడి నుంచి వెళ్లిపోదామని చెబుతాడు కార్తీక్.

ఇంతమంది ఉంటే ఎంతకు తెగించి సమాధానం చెప్పిందని దీపపై మండిపడుతుంది పారిజాతం. మీ తాత, మీ అత్త దీపకి గట్టిగా పనిష్మెంట్ ఇచ్చేవాళ్లు.. కానీ కార్తీక్ అడ్డుపడ్డాడని చెబుతుంది. కార్తీక్ కంటే మీ నాన్నే దీప గురించి ఎక్కువ కంగారు పడుతున్నాడని పారు చెప్పగా.. ఎంతైనా సొంత కూతురు కదా అని అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో పారు షాక్ అవుతుంది. ఆ ప్రేమ దీప మీద కాదు.. దీప బిడ్డ గురించి అంటుంది పారు. దానిని అంత తేలికగా వదిలిపెట్టకూడదు.. మనం కాంచని ఇంకాస్త రెచ్చగొడితే కోడలిని ఇంట్లోకి రానివ్వదు, అప్పుడు కార్తీక్ ఒంటరివాడైపోతాడు అంటుంది. దీప దగ్గర ఏదో మంత్రం ఉంది.. అది ఏం చేసినా ఎవ్వరూ ఏమీ అనరని చెబుతుంది. ఇకపై దీప అందరి ముందు తప్పు చేసిన మనిషి లాగే మిగిలిపోతుంది, నాకు కావాల్సిన నిజం బయటపడే వరకు వదిలిపెట్టనని అంటుంది జ్యోత్స్న. దీపకు జ్యోత్స్న మీదున్నది కోపం కాదు.. ఇంకేదో మనసులో పెట్టుకుని సాధిస్తున్నట్లుగా ఉందని పారిజాతానికి అనుమానం వస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X