Karthika Deepam 2 March 16th:సుమిత్ర ముందు దీపని ఇరికించిన జ్యోత్స్న..దశరథకు షాకింగ్ న్యూస్ చెప్పిన గురువుగారు

Photo Courtesy: JioHotstar

దీప బిడ్డని వదులుకుంటున్న విషయం మీ అన్నయ్యకి తెలుసని పారిజాతం అనడంతో కాంచన షాక్ అవుతుంది. అందరికంటే ముందే తెలిస్తే ఎందుకు చెప్పి చావలేదని శివన్నారాయణ మండిపడతాడు. కార్తీక్, దీప, దశరథ మాట్లాడుతుంటే పొడిపొడిగా మాట్లాడుతుంటే విన్నానని.. ఈ విషయాన్ని కాంచనకు కూడా చెప్పానని అంటుంది పారిజాతం. అంతా తెలిసినా ఏం తెలియనట్లు నన్ను బాగా మోసం చేశావని దశరథపై సీరియస్ అవుతుంది కాంచన. దశరథ ఏదో చెప్పాలని ప్రయత్నించినా కాంచనా చేతిని విసిరి పక్కకు నెట్టేస్తుంది. దాంతో తన ప్లాన్ ఫెయిల్ అవుతుందని టెన్షన్ పడి దశరథను రెచ్చగొట్టాలని చూస్తుంది జ్యోత్స్న. దాంతో ఈ కుట్ర వెనుక ఉన్నది జ్యోత్స్నే అని.. మావయ్యని రెచ్చగొట్టి నిజం చెప్పించాలని చూస్తోందని కార్తీక్ అనుకుంటాడు.

పుట్టింటిలోనే అందరూ తనను మోసం చేశారంటూ కాంచన ఏడుస్తూ వెళ్లిపోతుంది. స్వప్న - కాశీలు ఏకాంతంగా మాట్లాడుకుంటూ తమ ప్రేమ, పెళ్లి తర్వాత రోజుల్ని గుర్తుతెచ్చుకుంటారు. కాశీ ఇచ్చిన గులాబీ పువ్వుని స్వప్న నేలకేసి కొడుతుంది. మనం ఇచ్చిన షాక్‌కి కార్తీక్ ఒంటరివాడు అయిపోయాడని జ్యోత్స్నతో అంటుంది పారు. అప్పుడే ఏమైంది.. ఇంకా ముందు చాలా ఉందని చెబుతుంది జ్యోత్స్న. దీప, కార్తీక్, దశరథలు మాట్లాడుకుంటూ ఉండగా జ్యోత్స్న వినడంతో ముగ్గురు అలర్ట్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 16వ తేదీ 619వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 619 March 16th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

తనను చూడటానికి వచ్చిన దీపతో ఎందుకు వచ్చావని మండిపడుతుంది సుమిత్ర. నువ్వు ఇక్కడి దాకా రావడం ఎందుకు? పైగా నువ్వు కడుపుతో ఉన్న మనిషివి అని అంటుంది. టెస్టులన్నీ చేయించుకున్నావా? బిడ్డ క్షేమంగా ఉందని చెప్పారా? అని సుమిత్ర అడగ్గా.. బిడ్డ క్షేమం గురించి నువ్వు ఎన్నిసార్లు అడిగినా దీప సమాధానం చెప్పలేదని అంటుంది జ్యోత్స్న. ఎందుకంటే దీప తన బిడ్డను వదిలేసుకుందని చెబుతుంది. తనకి పిల్లలు వద్దట, బిడ్డ భారంగా ఉందట అని నానామాటలు అంటుంది జ్యోత్స్న. ఆ మాటలతో కార్తీక్ సీరియస్ అవుతాడు. నా బిడ్డ, నా భార్య.. నా ఇష్టం. నేను ఏం చేసుకున్నా అడిగే అధికారం ఎవ్వరికీ లేదని చీవాట్లు పెడతాడు.

అత్తని కూడా ఇలాగే నోరు మూయించాడు.. పాపం అత్త ఏడుస్తూ వెళ్లిపోయిందని చెబుతుంది జ్యోత్స్న. ఈ దీప ఎలాంటిదో ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. మీరే సరిగా అర్ధం చేసుకోవడం లేదు, ఈ దీప ఎప్పుడూ ఎవరో ఒకరి చావు కోరుకుంటూనే ఉంది. ఒకప్పుడు మా డాడీని చంపాలనుకుంది, అయినాసరే మా వాళ్లకి సిగ్గు లేకుండా ఇంట్లోకి రానిచ్చారని అంటుంది జ్యోత్స్న. అలా అయితే సిగ్గు లేనిది నీకు.. అగ్రిమెంట్ పేరుతో ఇంట్లో ఉండే పర్మిషన్ ఇచ్చింది నువ్వేనని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. నేను మీలాగా మనుషుల్ని చంపే రకం కాదని అంటుంది జ్యోత్స్న. కారుతో గుద్దేయడం, లారీతో గుద్దేయడం మాకే అలవాటు అనడంతో పారిజాతం వణికిపోతుంది. దీపలా నేను ఎవరినీ నమ్మించి మోసం చేయలేదని అంటుంది జ్యోత్స్న. మీరంతా పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంటే ఈవిడ గారికి మాత్రం అడ్డమైపోయిందని అంటుంది.

బిడ్డల్ని మోయలేనంత బాధ నీకెందుకు వచ్చింది అని దీపని సుమిత్ర నిలదీస్తుంది. ఇది నాకు, నా భార్యకు సంబంధించిన విషయం, ఇది పూర్తిగా మా వ్యక్తిగతం. దీని గురించి ఎవ్వరూ మాట్లాడొద్దని అంటాడు కార్తీక్. నీ భార్య వద్దు అంటోందా? లేక నువ్వే వద్దు అనుకుంటున్నావా? అని అడుగుతుంది సుమిత్ర. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావని దీపని అడుగుతుంది. ఇంతలో శివన్నారాయణ వచ్చి.. వీళ్లు మనకి ఏం చెప్పరు. వీళ్లకి ఇప్పుడు మన అవసరం లేదు. పెద్దవాళ్లమని తప్పక గౌరవిస్తున్నారని మండిపడతాడు. కాంచన అత్తకి ఉన్న ఒక్క సంతోషాన్ని దీప దూరం చేస్తోంది. ఇలాంటి పనిచేయొద్దని నువ్వయినా చెప్పు, పైగా తనకి మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదని చెబుతుంది జ్యోత్స్న.

వినడానికే ఇంత ఇబ్బందిగా ఉంటే నువ్వు ఈ పని ఎలా చేయగలుగుతున్నావని ప్రశ్నిస్తుంది సుమిత్ర. జ్యోత్స్న నా కూతురు, జ్యోత్స్న అంటే నాకు ప్రాణం. దీనిని ఎవరైనా దూరం చేస్తే నేను బ్రతుకుతానా? ఎవరి కోసమైనా నేను దీనిని వదులుకుంటానా? ఒకవేళ ఎవరైనా నా కూతురిని నాకు దూరం చేసే ప్రయత్నం చేసినా నా ప్రాణాలు పోయినట్లే. నేను నా బిడ్డను ఇన్నేళ్లుగా ప్రాణంగా ప్రేమిస్తుంటే.. ఇంత తేలికగా వదిలేసుకుంటున్నావు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావని అంటుంది సుమిత్ర. దాంతో దశరథ అందరినీ బయటకు వెళ్లమని చెబుతాడు.

దీప కడుపులో బిడ్డ బతకాలి.. అది ఈ లోకం చూడాలని దశరథతో చెబుతుంది సుమిత్ర. అది ఈలోకం చూడాలంటే.. నువ్వు ఈ లోకంలో ఉండవు, నీ కోసమే నీ కూతురు త్యాగం చేస్తోందని అనుకుంటాడు దశరథ. బిడ్డ బతకాలన్నది నీ కోరిక మాత్రమే కాదు.. నా కోరిక కూడా, నా ప్రయత్నం నేను చేస్తానని చెబుతాడు. దీప తన బిడ్డను వద్దు అనుకోవడం ఏంటీ అని తనతో తాను కుమిలిపోతుంది. జరిగిన దానికి అమ్మ ఎంతలా బాధపడుతుందో? అక్కడ అత్త కూడా అంతే బాధపడుతుందని ముందు ఆమెతో మాట్లాడమని కార్తీక్‌తో చెబుతుంది దీప.

బిడ్డ గురించి తలచుకుంటూ కాంచన ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్లాలో అర్ధం కావడం లేదు.. ఇక్కడ ఉండలేను, ఇంకెక్కడికి వెళ్లలేను అని శ్రీధర్‌తో చెబుతూ బాధపడుతుంది. మా ఇంటికి వెళ్దామని శ్రీధర్ చెప్పగా.. ఉన్న బాధలు చాలవా? అని ప్రశ్నిస్తుంది కాంచన. నా కొడుకు చేసిన పనికి నేను కోలుకోవడానికి చాలా టైం పడుతుందని అంటుంది. ఇంతలో కార్తీక్ రాగా.. వాడిని నాతో మాట్లాడొద్దని చెప్పమని అంటుంది. కార్తీక్ అంటే ఆకాశం.. నిన్ను అలా తలెత్తి చూసేవాడిని, కానీ నేల మీదకి దిగిపోయావని బాధపడతాడు శ్రీధర్. నువ్వు నీ బిడ్డను వద్దు అనుకున్నావు కానీ.. నేను నా బిడ్డను వద్దు అనుకోలేదు కదా? నీలాగా నేను వదిలేసుకునే తండ్రిని కాదు.. కొడుకే వద్దు అనుకున్నా వెంటపడి దక్కించుకున్న తండ్రిని అంటాడు. నా కొడుకు ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడని, ఇప్పుడు ఆ నమ్మకం పోయిందని బాధపడతాడు శ్రీధర్. నువ్వు చెబుతున్న దాని వెనుక చెప్పలేని ఏదో బలమైన కారణం ఉందని అనిపిస్తోందని అంటాడు శ్రీధర్.

నువ్వు బయటికి చెప్పుకోలేక మోస్తున్న ఆ భారం ఏంటీ? బిడ్డను వదిలేసుకుంటున్నావు అంటే ఏదో ఉంది.. నీ భార్య ఎలాగూ చెప్పదు, నువ్వే చెప్పాలని అంటాడు శ్రీధర్. అదేదో నువ్వే తెలుసుకోమని చెబుతాడు కార్తీక్. నిజం చెప్పలేక బిడ్డను వదిలేసుకుంటున్నావంటే చాలా పెద్ద కారణమై ఉంటుంది.. అదేంటో నేనే తెలుసుకుంటానని అంటాడు శ్రీధర్. నీ భార్యకు మళ్లీ బిడ్డలు పుట్టరని తెలిసినా నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావంటే దాని వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది, అదేంటో నేను తప్పకుండా తెలుసుకుంటాను. కానీ మీ అమ్మ మాత్రం ఈ విషయంలో నిన్ను ఎప్పటికీ క్షమించదని చెబుతాడు శ్రీధర్.

ఇంట్లో పరిస్ధితులు చూసి గురువుగారిని కలుస్తాడు దశరథ. దీప జాతకం చూపించి ఎలా ఉందో చెప్పమని అడుగుతాడు. ఈ జాతకం గల వ్యక్తి చావు ముంగిట్లో ఉంది, తన ఉనికే తన శత్రువు. తన ఉనికే తనకు ప్రమాదం. ప్రస్తుతం నడుస్తున్న రోజులన్నీ ముళ్ల మీద నడక లాంటివని గురువుగారు చెప్పడంతో దశరథ షాక్ అవుతాడు. ఈ గండాన్ని దాటే అవకాశం లేదా అని దశరథ అడగ్గా... అనుభవించాల్సిందేనని చెబుతాడు గురువుగారు. రాబోయే ప్రమాదం నుంచి ఈ మనిషి తప్పించుకోలేదు.. ఒకరి అసూయ, ద్వేషాలే ఇంకొకరికి గండంగా మారొచ్చు. ఈ జాతకం గల మనిషికి ఒక గండం నీడలా తిరుగుతుంటే.. మరో గండం తనతోనే ఉంది. ఇప్పుడు మీరు ఊహించిన స్థాయి కంటే ప్రమాదస్థాయి చాలా పెద్దది, ప్రమాదం తప్పదని చెబుతాడు గురువుగారు. కాంచన- శ్రీధర్‌ల మాటలతో కార్తీక్ బాధపడుతుండగా దీప ఓదారుస్తుంది. అవసరం నాది.. కానీ నిందలు పడేది నువ్వు .. నేను నీకు చాలా పెద్ద అన్యాయం చేస్తున్నానని అంటుంది దీప. వాళ్లకు పూర్తిగా నిజం తెలియదు కాబట్టి అపార్ధం చేసుకుంటున్నారు.. మనం తీసుకున్న నిర్ణయం మీద నిలబడాల్సిందే. మోసం చేశాడని భర్తనే వదిలేసిన మనిషి.. కొడుకుని వదిలేయడం ఒక లెక్క అంటుంది దీప. ఆపరేషన్ జరిగే వరకు ఎన్ని అవమానాలు ఎదురైనా భరించాలని చెబుతాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X