Karthika Deepam 2 March 17th: జ్యోత్స్న ట్రాప్‌లో శివన్నారాయణ.. దీపని కాపాడుకునేందుకు దశరథ ఆఖరి ప్రయత్నం
Photo Courtesy: JioHotstar
తనను చూడటానికి వచ్చిన దీపని నువ్వెందుకు వచ్చావు? నీ ఆరోగ్యం ఎలా ఉంది? కడుపులో బిడ్డ బాగుందా? అని పలకరిస్తుంది సుమిత్ర. ఇంతలో జ్యోత్స్న వచ్చి దీప బిడ్డను కనాలని అనుకోవడం లేదు.. వదులుకుంటోందని చెప్పడంతో సుమిత్ర సీరియస్ అవుతుంది. కడుపులోని బిడ్డను వదులుకోవడం చాలా పాపమని, మీరిద్దరూ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని మండిపడుతుంది సుమిత్ర. జ్యోత్స్న మరింత రెచ్చగొట్టడంతో కార్తీక్ సహనం కోల్పోతాడు.. నా కడుపులోని బిడ్డను చంపుకుంటాను, ఉంచుకుంటాను అడగటానికి మీరెవరు అంటాడు. వీళ్లిద్దరూ పెద్దలకు మర్యాద ఇవ్వడం లేదని శివన్నారాయణ సైతం బాధపడతాడు.
అక్కడే ఉంటే సుమిత్ర ఇంకా టెన్షన్ పడుతుందని భయపడి అందరూ బయటకు వచ్చేస్తారు. దీప కడుపులోని బిడ్డని ఎలాగైనా కాపాడమని దశరథని అడుగుతుంది సుమిత్ర. కార్తీక్ - దీపల నిర్ణయంతో కాంచన కుమిలిపోతూ ఉంటుంది. నేను ఇక్కడ ఉండలేను, ఆ ఇంటికి రాలేనని బాధపడుతుండగా శ్రీధర్ వచ్చి ఓదారుస్తారు. వెంటనే కార్తీక్ వచ్చి పలకరించగా.. కాంచన కోప్పడుతుంది. నువ్వు నా దృష్టిలో ఆకాశం లాంటి వాడివి, నువ్వు ఈ నిర్ణయం తీసుకుని.. మాతో ఇన్ని మాటలు పడుతున్నావంటే దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని కార్తీక్‌తో అంటాడు శ్రీధర్. అదేంటే నేనే తెలుసుకుంటానని చెబుతాడు. గురువుగారిని కలిసిన దశరథ.. దీప జాతకం చూసి చెప్పమంటాడు. దీప చుట్టూ మృత్యువు పొంచి ఉందని ఈమెని కాపాడటం ఆసాధ్యమని చెబుతాడు. ఆ మాటలతో దశరథ షాక్ అవుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 17వ తేదీ 620వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సుమిత్ర అత్తకి ఆపరేషన్ జరిగేంత వరకు ఎన్ని అవమానాలు ఎదురైనా మనం భరించాల్సిందేనని దీపతో అంటాడు కార్తీక్. వీళ్లందరికీ మనం బిడ్డను వద్దు అనుకుంటున్నామని మాత్రమే తెలుసు.. కానీ ఎందుకు వద్దు అనుకుంటున్నామో ఇప్పుడు చెప్పగలమా? చెబితే వీళ్లు అర్ధం చేసుకోగలరా? అత్త ఉన్న మెంటల్ కండీషన్‌కు తను ఇన్ని సంవత్సరాలు పెంచింది తన కన్నకూతురు కాదని తెలిస్తే తట్టుకోలేదు. ఆపరేషన్ జరగకపోయినా కాదు.. జ్యోత్స్న తన కన్నకూతురు కాదని తెలిసినా చచ్చిపోతుందని అంటాడు కార్తీక్. ఆ మాటలతో దీప షాక్ అవుతుంది.
ఈ పారు, జ్యోత్స్నలు రెచ్చగొట్టి నిన్ను ప్రశ్నలతోనే చంపేసేవాళ్లు. అవసరమైన వాటిని మాత్రమే మోయాలి.. ముందు నీ తల్లిని కాపాడుకోవాలి, ఓ కూతురిగా నువ్వేం చేస్తావో అది చేయ్. నీ భర్తగా నేనేం చేయాలో అది చేస్తా, ఈ సమాజం మొత్తం వేలేత్తి చూపించినా సరే నీతో నేను ఉంటాను అని చెబుతాడు కార్తీక్. దాంతో భర్తను హత్తుకుంటుంది దీప. నీ రుణం తీర్చుకోవడానికి మరో జన్మ ఎత్తాల్సిందేనని అంటుంది దీప.
మరోవైపు.. గురువుగారి దగ్గర దశరథ బాధపడుతూ ఉంటాడు. నేను ఎవరినీ పొగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని చెబుతాడు. ఆపడం మీ వల్ల అవుతుందా? ఫలితం లేని ప్రయత్నం వృథా అని గురువుగారు చెబుతాడు. జరిగేదానిని నేను అడ్డుకోలేకపోతున్నాను.. అలాగే జరిగే దానిని మానసికంగా ఒప్పుకోలేకపోతున్నానని చెబుతాడు దశరథ. ఒక ప్రాణం కోసం మరో ప్రాణం పోతుందని తెలిస్తే దాని కంటే ముందు నా ప్రాణం పోయినా పర్లేదని అంటాడు. నా కూతురు బాగుండాలి, నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డ బాగుండాలి, నా భార్య బతకాలని అంటాడు దశరథ. ఈ ముగ్గురిలో ఎవరికీ ఏం కాకూడదు.. ఏదో ఒక మార్గం చెప్పమని బతిమలాడతాడు దశరథ. అయితే మీరు హోమం చేయాలి.. నిష్టగా ఎటు కదలకుండా చేయాలని చెబుతాడు గురువు గారు. మీరు హోమానికి ఏర్పాట్లు చేయండి, ఈ నిజం మనిద్దరి మధ్యే ఉండాలని అంటాడు దశరథ. నీ సంకల్పం సిద్ధించాలని ఆ భగవంతుడిని వేడుకుంటానని చెబుతాడు గురువుగారు.
దీప బిడ్డను వదిలేసుకుంటోందని తెలిసి కావేరి మండిపడుతుంది. అన్నయ్య ఒకపని చేశాడంటే అందులో మనకి అర్ధం కానీ ప్రయోజనం ఏదో ఉండే ఉంటుందని అంటుంది స్వప్న. వదినకి, అన్నయ్యకి పిల్లలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. అలాంటి వాళ్లు బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడ్డారంటే ఎవరికీ చెప్పుకోలేని చాలా పెద్ద కారణమే ఉండి ఉంటుందని చెబుతుంది స్వప్న. నిజం చెప్పకపోయినా వాళ్లిద్దరూ తప్పు చేయరు, మీరు వాళ్లిద్దరినీ అనుమానించొద్దని చెబుతాడు కాశీ. ఆ మాటలు విన్న శ్రీధర్ చప్పట్లు కొడతాడు. మీ ఇద్దరినీ చూస్తే ముచ్చటగా ఉంది.. మా మనసులు కలవడం లేదు, మావి భిన్నాభిప్రాయాలు మా ఆలోచనలు వేరని విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టిన మీరే.. కార్తీక్, దీపల విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నారని అంటాడు.
వేరొకరి విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్న మీరిద్దరూ.. మీ విషయంలో మాత్రం ఎందుకు బాధపడటం లేదు. మీ తప్పుల్ని మాత్రం ఒప్పులుగా చూస్తున్నారా అని నిలదీస్తాడు శ్రీధర్. మిమ్మల్ని మీరు దూరం చేసుకోవడం దారుణం. మీ అన్నయ్య, మీ వదిన తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించిన మీరు.. మీరిద్దరూ కలిసుండాలన్న నా నిర్ణయాన్ని ఎందుకు సమర్ధించడం లేదో నాకు అర్ధం కావడం లేదని అంటాడు శ్రీధర్. దానికి, దీనికి ముడిపెట్టొద్దని చెబుతుంది స్వప్న. ఎవరికి వారు జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకోరని అంటుంది. నేను కార్తీక్ ఇంటికి వెళ్తాను.. నువ్వు ఇక్కడే పడుకోమని కాశీకి చెప్పి వెళ్తాడు శ్రీధర్. అమ్మాయి ఏదో ఒక రోజు అర్ధం చేసుకుంటుందని కాశీతో అంటుంది కావేరి.
ఆసుపత్రిలో బొమ్మను చూస్తూ బాధపడుతున్న దీప, కార్తీక్‌లకు క్లాస్ పీకుతాడు శివన్నారాయణ. మీ ముఖాలు చూడకూడదని అనుకున్నా.. జ్యోత్స్న చెప్పిన తర్వాత నా మనసు మారిందని అంటాడు శివన్నారాయణ. బంధుత్వాన్ని, పెద్దరికాన్ని అడ్డుపెట్టుకుని రాలేదు.. ఈ వయసులో నాలాంటి వాడు కోరుకునేది, తన చుట్టూ ఉన్న మనుషుల సంతోషం. మీరు బిడ్డను పోగొట్టుకోవడానికి తీసుకున్న నిర్ణయం నేను భరించలేకపోతున్నా. అంత బాధను కూడా ఓర్చుకుని వద్దు అనుకుంటున్నారో మాకు అర్ధం కాలేదని అంటాడు శివన్నారాయణ. కొన్ని వదులుకున్నా వస్తాయి.. కొన్ని మాత్రం ఒక్కసారి వదులుకుంటే మళ్లీ తిరిగిరావు. దీపకి మళ్లీ పిల్లలు పుట్టరని డాక్టర్ గారు చెప్పారు.. మీరు మాత్రం నిర్ణయం మార్చుకోవడం లేదు, ఈ తప్పుకి మీరు ఏదో ఒక రోజు బాధపడతారు, ఒక్కసారి ఆలోచించమని చెబుతాడు పెద్దాయన.
అయినప్పటికీ కార్తీక్- దీపలు బిడ్డను వదులుకోవడానికే సిద్ధం అంటారు. ఇంతలో దాస్ ఫోన్ చేయగా.. బయటికి వెళ్తుంది జ్యోత్స్న. అయితే నాన్న అని కాకుండా దాస్ అని పిలవడంతో దాస్ షాక్ అవుతాడు. నాన్న అని పిలవడానికి నువ్వు నన్ను కనలేదని అనడంతో దాస్ రగిలిపోతాడు. నీకు అలా గుచ్చుకున్నట్లుగా ఉందంటే నేనే నీ కూతురిని అంటుంది జ్యోత్స్న. నేను ఏది నమ్మాలి.. ఎవరిని నమ్మాలి, ఈ కన్‌ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చేయాలని అనుకుంటున్నానని చెబుతుంది. దీపని ఇబ్బంది పెట్టొద్దని చెబుతాడు దాస్. అవకాశం దొరికింది కదా అని నువ్వు దీపని, కార్తీక్‌ని టార్చర్ చేయడం మొదలుపెట్టావంటే ఆ పాపం వదిలిపెట్టదని వార్నింగ్ ఇస్తాడు. మీ అమ్మ నువ్వు కలిసి లెక్కలేనన్ని పాపాలు చేశారని అంటుంది జ్యోత్స్న. నేను నీలాగా సొంత వాళ్లకి అన్యాయం చేయనని చెబుతుంది జ్యోత్స్న. దీప ఎవరు? దీప ఒక అనాథ అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











