Karthika Deepam 2 March 18th:శౌర్యను కిడ్నాప్ చేసిన జ్యోత్స్న..కార్తీక్- దీప పరుగులు, ఆగిపోయిన సుమిత్ర ఆపరేషన్

Photo Courtesy: JioHotstar

దీపని కాపాడే అవకాశం లేదని గురువుగారు తేల్చిచెప్పడంతో దశరథ బాధపడతాడు. నాకు నా భార్య, కూతురు, మనవరాలు ముగ్గురు క్షేమంగా ఉంటే చాలని ఏదైనా మార్గం ఉంటే చెప్పమని అడుగుతాడు. దాంతో ఒక హోమం చేయాలని దశరథతో చెబుతాడు గురువుగారు. తల్లి మాటలు గుర్తొచ్చి బాధపడుతున్న దీపని కార్తీక్ ఓదారుస్తుండగా హాస్పిటల్‌కి జ్యోత్స్న, శివన్నారాయణలు వస్తారు. మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు.. చివరిసారిగా అడుగుతున్నా, బిడ్డ గురించి మరోసారి ఆలోచించమని చెబుతాడు శివన్నారాయణ. కార్తీక్ మాత్రం మా నిర్ణయం మార్చుకునేది లేదని తేల్చిచెబుతాడు.

బిడ్డను కార్తీక్, దీపలు వద్దనడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని కావేరితో చెబుతాడు శ్రీధర్. అన్నయ్య వదినలు ఏదైనా చేస్తున్నారంటే అందరి మంచి గురించి ఆలోచించే చేస్తారని అంటుంది స్వప్న. కాశీ సైతం ఇదే మాట చెప్పడంతో మీరిద్దరూ మీ విషయంలో తప్పించి అందరి విషయాల్లో ఏకాభిప్రాయంతో ఉంటారని అంటాడు శ్రీధర్. కాశీ గురించి నా అభిప్రాయం ఎప్పటికీ మారదని కోపంగా వెళ్లిపోతుంది స్వప్న. దాస్ ఫోన్ చేయడంతో బయటకు వస్తుంది జ్యోత్స్న. అయితే నాన్న అని కాకుండా దాస్ అని పేరు పెట్టి పిలవడంతో దాస్ షాక్ అవుతాడు. నేను నీ కూతురిని కాబట్టే నువ్వు తట్టుకోలేకపోతున్నావని అంటుంది జ్యోత్స్న. దీపని ఇబ్బంది పెట్టొద్దని దాస్ బతిమలాడినా జ్యోత్స్న పట్టించుకోదు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 18వ తేదీ 621వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 621 March 18th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దీపని వదిలేయ్.. నువ్వు చేస్తున్న పనులన్నీ ఇక్కడితో ఆపేయ్, లేదంటే చాలా రిస్క్‌లో పడతావని జ్యోత్స్నని హెచ్చరిస్తాడు దాస్. అయితే నేను నీ కూతురిని అని ఒప్పుకోమని చెబుతుంది జ్యోత్స్న. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నా చేతలు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరించి వెళ్లిపోతుంది. ఈ మాటలతో దాస్ భయపడతాడు. సుమిత్ర వదినకి ఆపరేషన్ జరిగే వరకే నీ ఆటలు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా నువ్వు ఊహించలేవని అనుకుంటాడు.

మరోవైపు.. సుమిత్రకు ఆపరేషన్ కావడంతో నాకు బాగా టెన్షన్‌గా ఉందని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. అంత టెన్షన్ పడొద్దు.. ఇన్నిరోజులు ఏ సమస్య వల్ల నిద్రపోలేదో అది ఈరోజుతో తీరిపోతుందని చెబుతాడు దశరథ. ఆ దేవుడి దయ వల్ల నేను అనుకున్నది జరుగుతుందని అంటాడు. ఈ ఆపరేషన్ పూర్తయితే మీరందరూ ఏదో చేయబోతున్నారని నాకు అర్ధమైంది. అది నేను జరగనివ్వనని అనుకుంటుంది జ్యోత్స్న. అమ్మ క్షేమంగా తిరిగొస్తుందని నువ్వు చెబితే వినాలని ఉందని అంటాడు దశరథ. ఇంతలో సుమిత్ర వచ్చి మళ్లీ మీ అందరినీ నేను తిరిగి చూస్తానో లేదోనని భయంగా ఉందని అంటుంది. నీ కూతురికి నీకు ఉన్న రుణానుబంధం అంత తేలికగా తీరిపోదని.. ఈ ఆపరేషన్ తర్వాతే నీ కూతురితో అసలైన బంధం మొదలవుతుందని చెబుతాడు దశరథ.

దీపే అసలైన కూతురని అందరికీ చెబుతాడా అని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ మన మీద ఉంటాయి.. అందుకే పోగొట్టుకున్నది దక్కిందని చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది. డాడీ మాటలు వింటుంటే భయంగా ఉంది.. ఏదో పెద్దగానే ప్లాన్ చేశారని పారుతో చెబుతుంది. నాకోసం ఓ సాయం చేస్తావా అని జ్యోత్స్న అడగ్గా.. సరేనని అంటుంది పారు. నువ్వు అమ్మని తీసుకుని హాస్పిటల్‌కు వెళ్లు.. నేను తర్వాత వస్తానని చెబుతాడు దశరథ. చిన్నపని ఉంది.. అది చాలా ముఖ్యమైనది, నేను వెంటనే వచ్చేస్తానని అంటాడు. ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడు.. డాడీ ఎక్కడికి వెళ్తున్నాడోనని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. నువ్వు నిన్ను కాపాడుకోవాలని ఆలోచిస్తున్నావు.. నేను చాలామందిని కాపాడాలని తాపత్రయపడుతున్నానని అనుకుంటాడు దశరథ.

దీపకి ఆసుపత్రిలో టెస్టులు చేస్తూ కంగారు పడుతుంది డాక్టర్ హారిక. దశరథ గారి కన్నకూతురు దీపేనని కొందరికే తెలుసు, ఈరోజు ఎలా డీల్ చేయాలో అర్ధం కావడం లేదని అంటుంది. మీకు ఏ ప్రాబ్లమ్ రాదని చెబుతాడు కార్తీక్. శివన్నారాయణ, పారిజాతం, జ్యోత్స్నకి తెలియకుండా ఆపరేషన్ చేయడం నా వల్ల అవుతుందా అని హారిక అడుగుతుంది. ఇక్కడ నేనుండగా మీకు ఏ ప్రాబ్లమ్ రాదని చెబుతాడు కార్తీక్. ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు మీరు ఎక్కడికి వెళ్లొద్దని చెబుతుంది హారిక. ఇలాంటి పరిస్ధితుల్లో నేనుండటం ఇదే మొదటిసారని అంటుంది. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటానని అంటాడు కార్తీక్.

ఇంతలో శ్రీధర్ ఫోన్ చేసి శౌర్య కనిపించడం లేదని చెప్పడంతో కార్తీక్ టెన్షన్ పడతాడు. శౌర్య స్కూల్ బ్యాగ్ మన గేటు పక్కన పడేసి ఉందని, చిన్నారిని ఎవరో ఎత్తుకుపోయారని అంటాడు. అంతా వెతికాం శౌర్య ఎక్కడ కనిపించలేదని చెబుతాడు శ్రీధర్. భర్త టెన్షన్ పడుతుండటంతో ఏం జరిగిందని దీప అడుగుతుంది. శౌర్య ఏడుస్తుండటంతో జాగ్రత్త అని చెబుతున్నానని అంటాడు కార్తీక్. ఒకసారి స్కూల్ దగ్గరికి వెళ్లి కనిపించి వస్తానని భార్యకు చెబుతాడు. డాక్టర్ నిన్ను ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్పింది కదా అని దీప అడగ్గా.. స్కూల్ పక్కనే కదా వెంటనే వచ్చేస్తానని అంటాడు కార్తీక్.

ఈరోజు సుమిత్ర అత్తకు ఆపరేషన్ కాబట్టి.. అది జరగకుండా చేయడానికే శౌర్యను జ్యోత్స్న కిడ్నాప్ చేయించిందని అనుకుంటాడు కార్తీక్. అత్తను కాపాడుకుంటాను, నా కూతురిని కాపాడుకుంటానని అనుకుని బయల్దేరి వెళ్తుండగా హాస్పిటల్ బయట సుమిత్ర, శివన్నారాయణ, పారిజాతం, జ్యోత్స్న కనిపిస్తారు. బావకి శౌర్య మిస్సింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అందినట్లుగా ఉందని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావని సుమిత్ర ప్రశ్నిస్తుంది. ఎక్కడికని వాడిని అడగొద్దు.. ఎలా వెళితే మీకెందుకు? ఎక్కడికి వెళితే మీకెందుకు అంటాడని శివన్నారాయణ సెటైర్లు వేస్తాడు. బావ ఏదో టెన్షన్‌లో ఉన్నాడని జ్యోత్స్న చెప్పగా.. ఈ టెన్షన్ ఎందుకు పడుతున్నానో కూడా నీకు తెలుసని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. అందరి సంగతులు తొందరలోనే తెలుస్తాయని అంటాడు కార్తీక్.

బిడ్డను వదులుకోవద్దని ఎంతో చెప్పి చూశానని, కానీ వీళ్ల మనసులు మాత్రం కరగడం లేదని అంటాడు శివన్నారాయణ. తప్పులు వెంటనే సరిచేసుకోకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని జ్యోత్స్నని చూస్తూ బెదిరిస్తాడు కార్తీక్. కొంతమంది తప్పులు చేస్తున్నామని అనుకుంటూనే పాపాలు చేస్తారు.. అది వాళ్ల గెలుపు అనుకోవచ్చు, కానీ నా లాంటి వాళ్లు తెగించి రంగంలోకి దిగితే వాళ్ల పాపాలకి పాడెకట్టినట్లేనని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. హాస్పిటల్‌లో ఉండి ఉండి మైండ్ కొంచెం పోయిందని అంటాడు. నీ దారికి మేం అడ్డురాము.. నీకు ఇష్టమొచ్చినట్లు చేసుకోమని మండిపడతాడు శివన్నారాయణ. ఇది చాలా పెద్ద కథ.. నీకు ఏదో ఒకరోజు పూర్తిగా అర్ధమవుతుందని చెబుతాడు కార్తీక్. నీకు ఏ భయం లేదు.. నీ కూతురే నిన్ను కాపాడుతుందని సుమిత్రకు చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్. కార్తీక్‌కి దొరికిపోతామేమోనని జ్యోత్స్నతో చెబుతుంది పారు. మా డాడీ మనతో రాకుండా ఎక్కడికి వెళ్లాడని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది. మరోవైపు.. దశరథ గురువుగారితో కలిసి హోమం చేస్తూ సుమిత్ర, దీప, దీప కడుపులోని బిడ్డ బతకాలని భగవంతుడిని వేడుకుంటాడు.

దీప దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది పారిజాతం. ఆపరేషన్‌కి ముందు ఏవో టెస్టులు చేయాలని సుమిత్రను తీసుకెళ్లారని అంటుంది. జరిగిన దానికి నువ్వు టెన్షన్ పడుతూ ఉంటావని అనుకుంటే నువ్వు కులాసాగా ఉన్నావేంటీ? అని అడుగుతుంది పారిజాతం. శౌర్య కనిపించడం లేదని కార్తీక్ నీతో చెప్పలేదా? అని ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో దీప కంగారుపడుతుంది. కళ్ల ముందు బిడ్డ ఉంది కాబట్టి.. ఈ బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడ్డావు, ఇప్పుడు ఇది పోతుంది, అది పోతుందని పారు చెప్పడంతో దీప టెన్షన్ పడుతుంది. వెళ్లి నీ బిడ్డను వెతుక్కోమని చెబుతుంది. దాంతో దీప కంగారుగా బయటకు వెళ్తుండగా డాక్టర్ హారిక వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. సుమిత్ర గారు వచ్చేశారు.. ఆపరేషన్‌కి అన్ని రెడీ చేశాను, నువ్వు ఎక్కడికి వెళ్లకూడదని చెబుతుంది. సుమిత్రకి ఆపరేషన్ అయితే, దీప ఇక్కడ ఉండటానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తుంది పారిజాతం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X