Karthika Deepam 2 March 19th: శౌర్యని కాపాడిన కార్తీక్... షాక్‌లో పారిజాతం, జ్యోత్స్నని లాక్ చేసిన డాక్టర్
Photo Courtesy: JioHotstar
దీపని వదిలేసి.. నువ్వు చేస్తున్నవన్నీ ఇక్కడితో ఆపేయమని కూతురికి వార్నింగ్ ఇస్తాడు దాస్. అయితే నేను నీ కూతురిని అని ఒప్పుకోమని అడుగుతుంది జ్యోత్స్న. దాంతో నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా దారుణాలు చేస్తానని చెప్పి కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న. సుమిత్రను దశరథ ఆపరేషన్‌కు తీసుకెళ్తుండటంతో అందరూ కలిసి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా ఉన్నారని పారుతో చెబుతుంది జ్యోత్స్న. మరికొద్దిగంటల్లో అందరికీ పెద్ద ఉపశమనం లభించబోతోందని దశరథ అనడంతో జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. సుమిత్రకి ఆపరేషన్ జరగకూడదని భావించిన జ్యోత్స్న.. పారుతో కలిసి కొత్త పథకం వేస్తుంది.
హాస్పిటల్‌కు అందరినీ కారులో ఎక్కించని దశరథ.. తాను మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిపోవడంతో జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. గురువుగారితో కలిసి హోమంలో కూర్చొంటాడు దశరథ. ఈరోజు చాలా పెద్ద టాస్క్ భారం మొత్తం నీదే, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్లొద్దని కార్తీక్‌కు చెబుతుంది డాక్టర్ హారిక. కార్తీక్‌కు శ్రీధర్ ఫోన్ చేసి శౌర్య కనిపించడం లేదని చెప్పడంతో అతను కంగారుపడుతూ బయటకు వస్తుండగా.. శివన్నారాయణ, పారు, సుమిత్ర, జ్యోత్స్నలు ఆసుపత్రికి వస్తారు. శౌర్య కిడ్నాప్ వెనుక జ్యోత్స్న ఉందని అనుమానించిన కార్తీక్.. పరోక్షంగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఆ వెంటనే దీప దగ్గరికి వచ్చిన పారిజాతం.. శౌర్య కిడ్నాప్ అయినట్లు చెప్పడంతో ఆమె కంగారు వెళ్తుండగా డాక్టర్ హారిక ఆపుతుంది. నువ్వు వెళ్లిపోతే సుమిత్ర గారికి ఆపరేషన్ ఎలా అని అడగటంతో పారిజాతం షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 19వ తేదీ 622వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శౌర్య కనిపించడం లేదని తెలిసి దీప కంగారుగా బయటకు వెళ్తుండగా డాక్టర్ హారిక ఎదురవుతుంది. నేను అర్జెంట్‌గా బయటకు వెళ్లాలని దీప చెప్పగా.. సుమిత్రగారు వచ్చేశారు, నేను నీ కోసమే వస్తున్నాను. ఆపరేషన్‌కి అంతా రెడీ చేశాను. ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్లకూడదు అని చెబుతుంది హారిక. ఆ మాటలు విన్న పారిజాతం.. సుమిత్రను ఆపరేషన్‌కి రెడీ చేయడానికి, దీప ఇక్కడే ఉండటానికి సంబంధం ఏంటీ? అని ప్రశ్నిస్తుంది. దాంతో దీప, డాక్టర్ హారిక షాక్ అవుతారు. దాంతో ఏం చెప్పాలో తెలియక హారిక కంగారుపడుతుంది.
కార్తీక్ ఎక్కడ? అని హారిక అడగ్గా.. వెళ్లిపోయాడని చెబుతుంది పారు. దాంతో డాక్టర్ ఇంకా టెన్షన్ పడుతుంది. ఇప్పటికే నాకు బీపీ పెరిగిపోతోంది.. నువ్వు ఇంకా పెంచకు అని దీపపై ఫైర్ అవుతుంది డాక్టర్ హారిక. పారిజాతం మాత్రం.. దీప గురించి, ఆపరేషన్ గురించి గుచ్చిగుచ్చి అడుగుతూనే ఉంటుంది. మా టెన్షన్ ఎవరూ అర్ధం చేసుకోరు.. అందరికీ నేనే సమాధానం చెప్పుకోవాలని కంగారుపడుతూ వెళ్లిపోతుంది డాక్టర్ హారిక. ఇంతలో జ్యోత్స్న రావడంతో.. అంతా నువ్వు చెప్పినట్లే చేస్తున్నాను, దీప ఎక్కడికి వెళ్లకుండా డాక్టర్ దానిని గదిలో పెట్టిందని చెబుతుంది పారిజాతం. నువ్వు ఈ రూమ్‌కి బయటే ఉండమని చెబుతుంది జ్యోత్స్న. ఆపరేషన్ అయ్యే వరకు శౌర్య ఎవరికి కనిపించదు. ఇక్కడ దీప కనిపించని బిడ్డ కోసం ఏడుస్తూ ఉంటే, అక్కడ బావ రోడ్డు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఎంత వెతికినా శౌర్య మాత్రం బావకి దొరకదని చెబుతుంది జ్యోత్స్న.
ఇంతలో కార్తీక్‌కి దీప ఫోన్ చేసి శౌర్య కనిపించిందా? లేదా? అని అడగటంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఈ విషయం నీకెలా తెలుసు అని అడగ్గా.. పారిజాతం చెప్పిందని అంటుంది. దాంతో శౌర్యని కిడ్నాప్ చేసింది జ్యోత్స్నేనని కార్తీక్‌కి అనుమానం వస్తుంది. జ్యోత్స్న మొదటి నుంచి మనల్ని ఆపాలని చూస్తూనే ఉంది.. కానీ మనం ప్రతిసారి తప్పించుకుంటూ ఆపరేషన్ వరకు వచ్చాం, ఇప్పుడు కూడా ఆపరేషన్ ఆపాలని ట్రై చేస్తోంది. శౌర్య కనిపించకుండా పోతే మనం ఏం చేస్తామో తనకి తెలుసు, ఆపరేషన్ జరిగితే అత్తకి ఏం జరుగుతుందో మనకి తెలుసు.. జ్యోత్స్న, పారులు గట్టిగానే ప్లాన్ చేసినట్లుగా ఉన్నారని చెబుతాడు కార్తీక్.
మనల్ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు రాంగ్ స్టెప్ వేస్తే మీ అమ్మ బతకదు, వాళ్లకి కావాల్సింది కూడా అదే. ఒక కూతురిగా మీ అమ్మను నువ్వు కాపాడుకో, ఒక తండ్రిగా నా కూతురిని నేను కాపాడుకుంటానని చెబుతాడు కార్తీక్. శౌర్య దొరికిన తర్వాత నీ సంగతి చెబుతానని కోప్పడతాడు. శౌర్య గురించి తలచుకుంటూ దీప కంటతడి పెడుతుంది. ఇంతలో కార్తీక్‌కి దాస్ ఫోన్ చేసి శౌర్య ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పడంతో అక్కడికి బయల్దేరతాడు కార్తీక్. పారిజాతం తన రూమ్ బయటే నిలబడి ఉండటంతో దీప మండిపడుతుంది. శౌర్య కనిపించడం లేదని మీకెలా తెలుసు అని అడుగుతుంది. ఆ మాటలతో పారు కంగారుపడుతుంది.
దాస్‌ని కార్తీక్ కలుసుకుని శౌర్య ఉన్న అడ్రెస్ కనుక్కుంటాడు. జ్యోత్స్నకి ఎప్పటికప్పుడు వార్నింగ్‌లు ఇస్తూనే ఉన్నాను, కానీ తను నా మాట వినలేదు. జ్యోత్స్న మళ్లీ ఏం చేస్తుందోనన్న భయంతోనే నేను మీ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచాను. స్కూల్‌కి వెళ్లడానికి బయటకు వచ్చిన శౌర్యను ఇద్దరు రౌడీలు ఎత్తుకెళ్లారు. నేను వాళ్లని ఫాలో అవుతూ వచ్చాను, వాళ్లు శౌర్యని ఇక్కడే దాచారని జరిగింది చెబుతాడు దాస్. ఆ వెంటనే కార్తీక్ ఆ రౌడీలను చితకబాది శౌర్యను కాపాడతాడు. మా నాన్నకి శౌర్యని అప్పగించి మనం హాస్పిటల్‌కి వెళ్దామని దాస్‌తో చెబుతాడు కార్తీక్.
దీప రూమ్ బయట కాపలా కాస్తున్న పారిజాతాన్ని శివన్నారాయణ చూసి ఇక్కడ ఎందుకు కూర్చొన్నావని అడుగుతాడు. కళ్లు తిరుగుతున్నాయని కూర్చొన్నాని చెబుతుంది పారు. సుమిత్రను డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్లారు. ఏం జరుగుతుందోనని టెన్షన్‌గా ఉందని, అందుకే బయటకు వెళ్తున్నానని చెబుతాడు శివన్నారాయణ. ఆపరేషన్ థియేటర్‌లో సుమిత్ర పక్కనే పడుకుని ఉంటుంది జ్యోత్స్న. మీకు ఇంజెక్షన్ చేయాలని హారిక చెప్పగా.. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది.
శౌర్యను కిడ్నాప్ చేశారు, టైంకి కార్తీక్ కాపాడాడని కాంచనతో అంటాడు శ్రీధర్. హాస్పిటల్‌లో సుమిత్రకు ఆపరేషన్ జరుగుతోంది.. మన కొడుకు, కోడలు ప్రమాదంలో ఉన్నారని చెబుతాడు. జ్యోత్స్న ఏమైనా చేయించిందా అని కాంచనకు అనుమానం వస్తుంది. జ్యోత్స్న హాస్పిటల్‌లోనే ఉంది, డోనరే తనే కాబట్టి ఆసుపత్రి దాటి వెళ్లకూడదు.. ఈ కిడ్నాప్ వెనుక ఇంకెవరో ఉన్నారని అంటాడు శ్రీధర్. దీపకి ఎవరో బలమైన శత్రువులు ఉన్నారు.. దీప చావలేదని మరోసారి చంపటానికి ఇంటికి వచ్చారు, ఇప్పుడు శౌర్యని ఎత్తుకెళ్లిపోయారు. కనిపించని ఆ శత్రువు ఎవరో? ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారో మనకి తెలియదు కానీ దీపకి మాత్రం ప్రమాదం పొంచి ఉందని అంటుంది కాంచన. వాళ్లు ఎవరైనా సరే నా కొడుకు వదిలిపెట్టడని చెబుతాడు శ్రీధర్. దీప కడుపులోని బిడ్డకు కూడా ఆపరేషన్ ఈరోజేనని అంటాడు.
నువ్వు ఎంత ఎదురుచూసినా నీ మొగుడు రాడుని దీపని చూస్తూ పారిజాతం అనుకుంటూ ఉండగా.. కార్తీక్ వచ్చి ఇక్కడ ఎందుకు కాపలా కాస్తున్నావని అడుగుతాడు. ఆ మాటలతో షాకైనా పారు.. ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్లావు కదా అని అడుగుతుంది. వెళ్లిన పని పూర్తి చేసేశానని చెబుతాడు కార్తీక్. ఏం జరిగిందో తర్వాత చెబుతానని అంటాడు. శౌర్యని జ్యోత్స్న కిడ్నాప్ చేయించిందని చెప్పడంతో దీప రగిలిపోతుంది. కోపాన్ని ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలని చెబుతాడు. ఇంతలో డాక్టర్ హారిక వచ్చి.. కార్తీక్ మీద సీరియస్ అవుతుంది. రూమ్ బయట పారిజాతం గారు, ఆపరేషన్ థియేటర్ బయట శివన్నారాయణ గారు ఉన్నారు. వీళ్లని దాటుకుని నేను దీపని ఎలా ఆపరేషన్ రూమ్ వరకు తీసుకెళ్లగలను అని అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











