Karthika Deepam 2 March 20th:కార్తీక్ సూపర్ స్కెచ్.. ఆపరేషన్ సక్సెస్, సుమిత్ర పక్కనే దీపని చూసిన జ్యోత్స్న
Photo Courtesy: JioHotstar
శౌర్య కనిపించకపోవడంతో దీప కంగారుగా వెళ్తుండటంతో డాక్టర్ హారిక ఎదురవుతుంది. సుమిత్రగారు వచ్చేశారు.. ఆపరేషన్‌కి అన్ని ఏర్పాట్లు చేసేశాను, నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదని చెబుతుంది. ఆ మాటలు విన్న పారిజాతం.. అసలు సుమిత్ర ఆపరేషన్‌కి, దీప ఇక్కడే ఉండటానికి సంబంధం ఏంటని ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో డాక్టర్ హారిక టెన్షన్ పడుతుంది. ఈ బీపీ తట్టుకోలేకపోతున్నానని.. కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది హారిక. బయటకు వెళ్లాడని దీప చెప్పడంతో ఆమెను లోపల పెడుతుంది హారిక.
పారు దగ్గరికి జ్యోత్స్న వచ్చి.. ప్లాన్ ప్రకారం దీప బయటకు రాకుండా చూసుకోమని కాపలాగా పెట్టి వెళ్తుంది. ఆపరేషన్ థియేటర్‌లో జ్యోత్స్నకి మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది హారిక. శౌర్యను వెతుక్కుంటూ వెళ్తున్న కార్తీక్‌కి దాస్ ఫోన్ చేసి శౌర్య ఎక్కడుందో చెబుతాడు. వెంటనే అక్కడికి వచ్చిన కార్తీక్‌కి శౌర్యని దీపే కిడ్నాప్ చేయించిందని చెబుతాడు. కోపంతో ఊగిపోయిన కార్తీక్.. అక్కడి రౌడీలను చితకబాది శౌర్యను రక్షించి ఇంటికి చేరుస్తాడు. మన కొడుకు, కోడలు పెద్ద గండంలో ఉన్నారని కాంచనతో అంటాడు శ్రీధర్. దీప రూమ్ బయట కూర్చొన్న పారిజాతానికి కార్తీక్ షాకిస్తాడు. దీపని కలిసి శౌర్య క్షేమంగా ఉందని చెబుతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 20వ తేదీ 623వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
బయట పారిజాతం గారు కాపలా కాస్తున్నారు, ఆపరేషన్ థియేటర్ దగ్గర శివన్నారాయణ గారు ఉన్నారు.. వీరందరినీ దాటుకుని దీపని ఆపరేషన్‌కి ఎలా తీసుకెళ్లాలని కార్తీక్‌ను అడుగుతుంది డాక్టర్ హారిక. మీరేం కంగారుపడొద్దు.. నేను మొత్తం ప్లాన్ చేశానని అంటాడు కార్తీక్. మా పారు అక్కడ ఉండకూడదు అంతేకదా అని చెబుతుండగా.. పారిజాతానికి దాస్ ఫోన్ చేస్తాడు. నువ్వు పొగొట్టిన అసలు మనవరాలు దొరికిందని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. ఆసుపత్రి బయటే ఉన్నాను.. నువ్వు వస్తే ఈ రహస్యం చెప్పాలని అనుకున్నాను, నువ్వు బిజీగా ఉన్నావు కదా అని అంటాడు దాస్. నా మనవరాలి కంటే నాకు ఏది ఎక్కువ కాదని, జ్యోత్స్న చెప్పిన మాటల్ని కూడా పక్కనపెట్టి బయటకు వెళ్లిపోవడానికి రెడీ అవుతుంది పారు. నా సొంత మనవరాలు దొరికిన తర్వాత నేను దాని మాటలు ఎందుకు వినాలని అనుకుంటుంది.
ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్తూ.. శౌర్య ఇచ్చిన బొమ్మను చూసుకుని బాధపడుతుంది. వెళ్లబోతున్నాను.. వీడ్కోలు చెప్పమని అంటుంది దీప. ఇది వీడ్కోలు కాదు.. అత్తకు ఆహ్వనమని అంటాడు కార్తీక్. మనవరాలిని చూసుకోవాలనే ఆనందంలో శివన్నారాయణని గుద్ధేస్తుంది పారు. అంత ఆనందం ఎందుకు అని పెద్దాయన అడగ్గా.. నా మనవరాలు దొరికిందని చెబుతుంది. ఆ మాటలతో పెద్దాయన షాక్ అవుతాడు. జ్యోత్స్న ఆపరేషన్ చేసుకునేందుకు భయపడుతుండటంతో మీ అమ్మ రుణం తీర్చుకునే అవకాశం దొరికిందని చెప్పానని కవర్ చేస్తుంది పారిజాతం. నీ మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదని శివన్నారాయణ అంటాడు. ఆపరేషన్ బాగా జరగాలని దేవుడికి దండం పెట్టుకుని వస్తానని వెళ్లిపోతుంది.
డాక్టర్ ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ పనిచేస్తుండటంతో జ్యోత్స్నకు నిద్ర వస్తుంది. ఈ డాక్టర్ ఏ ఇంజెక్షన్ ఇచ్చిందో ఏంటీ నిద్ర వచ్చేస్తుంది? బావకి శౌర్య దొరికిందా లేదా? ఈ దీప ఏం చేస్తోంది? కాపలా పెట్టిన గ్రానీ జాగ్రత్తగా ఉందో లేదో? నేను ఉండగా మీరు అనుకున్నది ఏది జరగదని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో దీపని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకొస్తుంది డాక్టర్ హారిక. దీపని చూసిన హారిక ఆ వెంటనే నిద్రపోతుంది. జ్యోత్స్న నిన్ను చూసినా ఏం కాదు, గుర్తుపట్టలేదని చెబుతుంది డాక్టర్ హారిక.
దాస్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన పారిజాతం.. నా మనవరాలిని దూరం చేసుకుని చాలా కాలం అయింది. జ్యోత్స్న ఎప్పుడైతే నా మనవరాలు కాదని తెలిసిందో, అప్పటి నుంచి చేసిన పాపానికి పశ్చాత్తాపపడుతూనే ఉన్నాను. నా మనవరాలి తీసుకురాకుండా ఎందుకు వచ్చావని ప్రశ్నిస్తుంది పారు. తనే నా కూతురని తెలిసింది, ఎందుకు నన్ను దూరం చేసుకున్నావని నిలదీసింది. చిన్నప్పుడు జరిగిన కథంతా చెప్పాను.. మీలాంటి దుర్మార్గుల దగ్గరికి నేను రాను అని చెప్పిందని అంటాడు దాస్. ఇదంతా మా అమ్మ చేసిన పాపం, ఏదో మీ మంచి కోసం చేసిందని చెప్పలేదా? అని అడుగుతుంది పారు. నా మనవరాలి దగ్గరికి నన్ను తీసుకెళ్తే నేను బతిమలాడుకుంటానని చెబుతుంది. పారుతో మత్తు మందు కలిపిన నీళ్లు తాగించడంతో ఆమె పడిపోతుంది.
ఆపరేషన్ థియేటర్ దగ్గర శివన్నారాయణ ఉండటంతో కార్తీక్ షాక్ అవుతాడు. మరోవైపు.. హోమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తాడు దశరథ. మానవ ప్రయత్నం జరిగింది.. ఇక అంతా దేవుడి దయ అని చెప్పి హాస్పిటల్‌కు బయల్దేరతాడు. ఆపరేషన్ పూర్తయి దీప బెడ్‌పై పడుకుని ఉండటంతో బిడ్డను తలచుకుని బాధపడతాడు కార్తీక్. మత్తు వదలడంతో ఆపరేషన్ థియేటర్‌లోకి దీప వచ్చిన విషయం గుర్తుచేసుకుని ఉలిక్కిపడుతుంది జ్యోత్స్న. ఇంతలో డాక్టర్ వచ్చి మరో ఇంజెక్షన్ ఇస్తుంది. నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చాను? మా మమ్మీ ఎక్కడ ఉంది? దీప ఎక్కడ అని అడుగుతుంది జ్యోత్స్న. నేను దీపని ఆపరేషన్ థియేటర్‌లో చూసినట్లే అనిపించిందని చెబుతుంది. ఆ మాటలతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది.
దీపకి కూడా ఈరోజు ఆపరేషన్ జరిగింది.. ఆ డాక్టర్ వేరే, ఆ ఆపరేషన్ థియేటర్ వేరే అని హారిక చెబుతుంది. అయితే మా మమ్మీని చూస్తానని జ్యోత్స్న లేచి వెళ్లబోతుండగా లేవలేకపోతుంది. మీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. మీ నుంచి బోన్‌మారో తీయడం జరిగిందని చెబుతుంది హారిక. మత్తు వదలడంతో పారిజాతం లేచిచూసే సరికి శివన్నారాయణ, కార్తీక్, దాస్ ఉంటారు. నువ్వు కళ్లు తిరిగి పడిపోతే ఈ బెడ్ మీద వేశామని చెబుతాడు శివన్నారాయణ. నేను నా మనవరాలి కోసం పరిగెత్తానని పారు నోరు జారడంతో నీకు మతి భ్రమించిందని అంటాడు పెద్దాయన. ఊహించుకున్నదంతా జరిగినట్లే అనిపిస్తుందని చెబుతాడు. ఇంతలో దశరథ వచ్చి ప్రసాదం ఇస్తాడు.
సుమిత్రకు ఆపరేషన్ అయిపోయిందా అని పారు అడగ్గా.. అయిపోయిందని చెబుతాడు కార్తీక్. దాంతో జ్యోత్స్న చెప్పిన మాటలు గుర్తొచ్చి కంగారుగా అక్కడికి వెళ్తుంది పారు. చేసిన పాపాలు, దారుణాలు ఎక్కడ బయటపడతాయోనని కొందరు గజగజ వణికిపోతున్నారని అంటాడు కార్తీక్. వీలైనంత త్వరగా పెట్టే బేడా సర్దేయండి.. లేదంటే నేనే దగ్గరుండి ఎక్కిస్తాను అని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. ఆ దెబ్బతో బయటకు వెళ్లిపోతుంది పారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











