Karthika Deepam 2 March 21st: బిడ్డ కోసం దీప కంటతడి.. దశరథ ప్రవర్తనపై శివన్నారాయణలో అనుమానం
Photo Courtesy: JioHotstar
ఆపరేషన్ థియేటర్ బయట శివన్నారాయణ, దీప గది బయట పారిజాతం ఉండటంతో డాక్టర్ హారిక టెన్షన్ పడుతుంది. మీరేం టెన్షన్ పడొద్దు.. నేను అన్నింటికి ప్లాన్ చేశానని కార్తీక్ చెబుతాడు. ఇంతలో పారుకు దాస్ ఫోన్ చేసి నీ మనవరాలు దొరికిందని చెప్పడంతో ఆమె ఆనందంతో గాల్లో తేలిపోతుంది. కొడుకు దగ్గరికి వెళ్తూ శివన్నారాయణను కూడా గుద్ధేస్తుంది. నేను నా మనవరాలి దగ్గరికి వెళ్తున్నానని పారు నోరు జారడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. ఏదో రకంగా కవర్ చేసి శివన్నారాయణ నుంచి తప్పించుకుని దాస్ దగ్గరికి వెళ్తుంది పారు. మనం చేసిన అన్యాయానికి నీ మనవరాలు రాను అని చెప్పిందని అంటాడు దాస్. ఆ వెంటనే తల్లితో మత్తు మందు కలిపిన వాటర్ తాగించడంతో పారు పడిపోతుంది.
ఆపరేషన్ కోసం దీపని తీసుకుని వస్తుంది హారిక. అప్పటికే మత్తులో ఉన్న జ్యోత్స్నకు ఎదురుగా దీప ఉన్నప్పటికీ ఏం అర్ధం కాదు. ఆ వెంటనే సక్సెస్‌ఫుల్‌గా సుమిత్రకు ఆపరేషన్ చేస్తుంది డాక్టర్ హారిక. నిద్రలేచి చూసేసరికి తాను ఆసుపత్రిలో ఉండటంతో షాక్ అవుతుంది పారిజాతం. వెంటనే దీప దగ్గరికి వెళ్లి పలకరిస్తుంది. మరోవైపు.. సుమిత్రకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత జ్యోత్స్నకు మెలకువ వస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 21వ తేదీ 624వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పుట్టకముందే మన బిడ్డతో మనకు రుణం తీరిపోయిందని దీపతో చెప్పి కార్తీక్ బాధపడతాడు. ఆపరేషన్ జరిగిన తర్వాత జ్యోత్స్న దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఎలా ఉంది? అని అడుగుతుంది పారిజాతం. బాగా నీరసంగా ఉంది, నాకు ఆపరేషన్ చేశారని జ్యోత్స్న చెప్పడంతో సుమిత్ర కూతురివి నువ్వే కాబట్టి ఆపరేషన్ నీకే చేస్తారని అంటుంది పారిజాతం. దీప ఏం చేస్తుంది? తన గదిలోనే ఉందా? నువ్వు దాని రూమ్ ముందే ఉన్నావా? అని అడుగుతుంది జ్యోత్స్న. నేను దీప రూమ్ ముందు అలాగే కూర్చొని ఉన్నానని అబద్ధం చెబుతుంది పారు. దీప ఆపరేషన్ రూమ్ వైపు వచ్చిందా అని అడగ్గా రాలేదని చెబుతుంది పారు. దీప రాకుండా ఆపరేషన్ జరిగిందంటే నేనే సుమిత్ర నిజమైన కూతురిని అని అనుకుంటుంది జ్యోత్స్న.
బావ హాస్పిటల్‌కి వచ్చేశాడా? అని జ్యోత్స్న అడగ్గా.. కార్తీక్ గాడు హాస్పిటల్‌లోనే ఉన్నాడని చెబుతుంది పారిజాతం. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. శౌర్యను సేవ్ చేశానని నాకు హింట్ ఇచ్చాడు. నీ ఫోన్ నీ దగ్గర ఉండుంటే నీ చెంచాగాళ్లు నీకు ఫోన్ చేసి విషయం చెప్పేవాళ్లు, అలాగే మీ నాన్న కూడా హాస్పిటల్‌కు వచ్చాడు. ఏదో హోమం చేయించాడట అని చెబుతుంది పారు. మనం ప్లాన్ చేసింది ఏంటీ? ఇక్కడ జరిగింది ఏంటీ? అసలు బావకి శౌర్య ఎలా దొరికిందని అడుగుతుంది శౌర్య. ఇంతలో కార్తీక్ వచ్చి ఎలా ఉంది? బాగుందా అని సెటైర్లు వేస్తాడు. పెద్ద మేడం గారు చేసిన పని అందరి ముందు బయటపెట్టాలని మీడియాను పిలవాలని చెబుతాడు.
మీడియా ముందు ఏం చెబుతావని జ్యోత్స్న అడగ్గా.. ఒక తల్లి కోసం కన్నకూతురు చేసిన సాహసం అని హెడ్డింగ్ పెట్టి, దీని మీద నాలుగైదు పేజీల ఆర్టికల్ రాయించేస్తాను అని అంటాడు కార్తీక్. అలాగే నీ గురించి అరగంట ఉపన్యాసం కూడా ఇవ్వాలని చెబుతాడు. కానీ మీరు హెల్దీగా లేరు కదా ముందు రెస్ట్ తీసుకోండి, మీకు సన్మానం ఎప్పుడు చేయాలో? ఎక్కడ చేయాలో నేను చేస్తానని అంటాడు కార్తీక్. శౌర్య నా కూతురు.. నా కూతురిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసని అంటాడు కార్తీక్. త్వరగా కోలుకోండి.. పరిగెత్తడానికి ఓపిక ఉండాలి కదా అని సెటైర్లు వేస్తాడు.
సుమిత్ర గారు సేఫ్ అయ్యారు, ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యింది.. ఇక సుమిత్ర గారు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారని డాక్టర్ హారిక చెప్పడంతో శివన్నారాయణ, దశరథ, దాస్, కార్తీక్‌లు సంతోషిస్తారు. ఆరిపోతున్న మా ఇంటి దీపాన్ని వెలిగించావని శివన్నారాయణ చెప్పగా.. ఈ క్రెడిట్ మొత్తం మీ మనవరాలిదే, దశరథ గారి కూతురే సుమిత్రకు ప్రాణం పోసిందని చెబుతుంది హారిక. తను మీకు దేవుడిచ్చిన వరమని అంటుంది. మా అన్నయ్య కూతురు బంగారం.. తనే ఈరోజు త్యాగం చేసిందని దాస్ చెప్పబోతుండగా కార్తీక్ ఆపుతాడు.
దీప ఎక్కడుంది? మేం తనని చూడొచ్చా అని దశరథ అడగ్గా.. పారిజాతం ఫైర్ అవుతుంది. సుమిత్రని కాపాడింది జ్యోత్స్న.. నువ్వు చూడాల్సింది మొదట నీ భార్యను, లేదంటే సుమిత్రను కాపాడిన జ్యోత్స్నని అని చెబుతుంది. దీపకి కూడా చిన్న ఆపరేషన్ చేశారు.. మావయ్య ఆ ఉద్దేశంతోనే చూడాలని అంటున్నారని కవర్ చేస్తాడు కార్తీక్. కడుపులో బిడ్డను మోయలేక దించేసుకున్న ఆడది దీప.. అలాంటి దాని ముఖం కూడా చూడకూడదని పారిజాతం నానామాటలు అనడంతో దశరథ, దాస్‌లు సీరియస్ అవుతారు. మీరు వెనకేసుకొచ్చేంత ఘనకార్యం దీప ఏం చేసిందో నాకు అర్ధం కావడం లేదని అంటుంది పారు. తప్పొప్పులు గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం.. లేదంటే ఇప్పుడే తాత ముందు తేల్చుకుందామా అని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్.
దీపని చూడటానికి వెళ్తున్న దశరథను మీరేం అనడం లేదని శివన్నారాయణని నిలదీస్తుంది పారు. వదినకి ఏం కాదని అన్నయ్య నమ్మకం.. హోమం ఎప్పుడైతే పూర్తి చేశాడో అప్పుడే తనకి నమ్మకం వచ్చేసిందని అంటాడు దాస్. అందుకే వదినని కాకుండా కూతురిని చూడటానికి వెళ్లాడని చెబుతాడు. కొందరి జీవితాలు త్యాగాలతో ముడిపడి ఉంటాయి.. ఇవి చాలదు అన్నట్లు మనుషులు పెట్టే బాధల్ని ఎంతని తట్టుకోగలడు. అందుకే దీపని ఓదార్చడానికి వెళ్లాడని చెబుతాడు దాస్. శౌర్యని ఎవరో కిడ్నాప్ చేశారు, ఇప్పుడు క్షేమంగానే ఉందని దాస్ చెప్పడంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. ఈ విషయం నాకెందుకు చెప్పలేదని పెద్దాయన అడగ్గా.. కార్తీక్ ఎవరితోనూ చెప్పొద్దన్నాడని అంటాడు దాస్. ఈ మాటలు విన్న పారిజాతం షాక్ అవుతుంది. దశరథ ప్రవర్తన ఈ మధ్య తేడాగా ఉంటోంది.. నాతో ఏది చెప్పడం లేదు, కార్తీక్‌తో ఎక్కువగా ఉంటున్నాడు.. ఏదో జరుగుతోందని శివన్నారాయణ అనుమానిస్తాడు.
దీపని చూసి కంటతడిపెడతాడు దశరథ. మీ అమ్మను నువ్వు కాపాడుకున్నావు.. కానీ నేనే నీ బిడ్డను కాపాడలేకపోయానని బాధపడతాడు. సుమిత్ర ఈ గండం నుంచి బయటపడిందని నాన్న ఆనంద పడుతున్నాడు.. కానీ ఎవరు ఏం పొగొట్టుకుంటే సుమిత్ర బతికిందో వాళ్లకు తెలియదని అంటాడు. సుమిత్ర ఉంది అంటే ఈ కూతురి వల్లే.. నా భార్య ప్రాణాలు కాపాడిన నా కూతురికి నేను ఏం న్యాయం చేశాను? ఇప్పుడు కూడా తను పొగొట్టుకున్న దాని గురించి కాకుండా పొందిన దాని గురించే సంతోషిస్తుందని చెబుతుంది దశరథ. నువ్వు హోమం ఎందుకు చేయించావని అడుగుతాడు కార్తీక్. నా భార్య కోసం, నా కూతురి కోసం, పుట్టబోయే బిడ్డ కోసం చేయించానని చెబుతాడు దశరథ.
ఏం ఇవ్వాలో ఎంత ఇవ్వాలో ఆ దేవుడికి తెలుసునని కార్తీక్ చెబుతాడు. అమ్మను చూడొచ్చా అని దీప అడగ్గా.. అత్త ఇంకా స్పృహలోకి రాలేదు, నువ్వు ఉన్న పొజిషన్‌లో కదలడమే కష్టమని అంటాడు కార్తీక్. ఎవరు ఎన్ని చెప్పినా నేను ఆశలు పొగొట్టుకోను.. దాంట్లోనే నన్ను ఉండనివ్వండి, లేదంటే తప్పు చేసిన మనిషిలా కుమిలిపోవాలని అంటాడు దశరథ. ఇంతలో అక్కడికి వచ్చిన శివన్నారాయణ నువ్వేం తప్పు చేశావని అడుగుతాడు. మనం ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చాం.. వీళ్లు ప్రాణం వదిలేసుకోవడానికి వచ్చారని మండిపడతాడు శివన్నారాయణ. కొన్ని త్యాగాలు గుర్తింపుకు నోచుకోవని అంటాడు దశరథ. బిడ్డను వదులుకోవడం అంత తేలికకాదు.. నీ చేతిలో బిడ్డ ఉంటే ముద్దాడతావా? చంపేస్తావా? అని దశరథ నిలదీయడంతో పారుకు చెమటలు పడతాయి.
ఇంతలో సుమిత్ర కళ్లు తెరిచిందని డాక్టర్ చెప్పడంతో అందరూ అక్కడికి వెళ్తారు. మావయ్యని చూస్తుంటే నువ్వే కూతురివని చెప్పేలా ఉన్నాడని ఆయనని ఆపాలని దీపతో చెప్పి వెళ్తాడు కార్తీక్. నేను బతికేశాను... నా కూతురు నన్ను కాపాడింది, నా కూతురు ఎలా ఉందో చూశారా అని అడుగుతుంది సుమిత్ర. ఇప్పుడే చూశానని దశరథ అనడంతో పారు షాక్ అవుతుంది. నువ్వు జ్యోత్స్నని ఎప్పుడు చూశావని నిలదీస్తుంది పారు. మావయ్య దీప గురించి అంటున్నాడని కార్తీక్ చెప్పడంతో శివన్నారాయణ, పారు షాక్ అవుతారు. నీ కూతురే నిన్ను కాపాడుతుందని నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను.. ఈరోజు అదే నిజమైందని అంటాడు కార్తీక్.
అన్నయ్య నీ కోసం హోమం చేశాడని, ఆ దైవం మనకి అండగా నిలబడ్డాడని చెబుతాడు దాస్. దీపకి ఆపరేషన్ జరిగిందా? బిడ్డ ఎలా ఉంది? అని అడుగుతుంది సుమిత్ర. అవన్నీ వదిలేయ్.. నువ్వు క్షేమంగా ఉంటే చాలని అంటాడు కార్తీక్. మాకు ఇది సరిపోతుందేమో, మీ అమ్మకి ఇది సరిపోదని బాధపడతాడు శివన్నారాయణ. మీరు బాగా రెస్ట్ తీసుకోవాలి.. అప్పుడే మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తానని చెబుతుంది హారిక, జ్యోత్న్న ప్రస్తుతం ఎటూ కదల్లేదు, మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి జ్యోత్స్న దగ్గరికి వెళ్తారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











