Karthika Deepam 2 March 23rd: ఫలించిన దశరథ ప్రయత్నం.. క్షేమంగా దీప బిడ్డ.. కార్తీక్‌పై జ్యోత్స్న కొత్త అస్త్రం

Photo Courtesy: JioHotstar

ఆపరేషన్ జరిగి సుమిత్ర అత్త క్షేమంగా ఉందని, కానీ మన బిడ్డను మాత్రం పుట్టకముందే కోల్పోయామని దీపతో చెప్పి బాధపడతాడు కార్తీక్. జ్యోత్స్న దగ్గరికి వెళ్లిన పారిజాతం.. ఇప్పుడు ఎలా ఉందని అడగ్గా, నాకు ఆపరేషన్ చేశారని, లేవలేకపోతున్నానని చెబుతుంది జ్యోత్స్న. సుమిత్ర కూతురివి నువ్వే కాబట్టి నీకే ఆపరేషన్ చేస్తారని చెబుతుంది పారు. నువ్వు దీప గది ముందే కాపలా కాశావా అని జ్యోత్స్న అడగ్గా.. దాస్ కోసం బయటికి వెళ్లానని తెలిస్తే మనవరాలు ఎక్కడ కోప్పడుతుందోనని, తెల్లార్లు అక్కడే ఉన్నానని అబద్ధం చెబుతుంది పారు.

ఇంతలో కార్తీక్ వచ్చి మేడం గారు చేసిన త్యాగం గురించి అందరికీ చెబుతానని, ఇంటికి వెళ్లాక అందరి గురించి చెబుతానని ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. శౌర్య కిడ్నాప్ గురించి బయటపెడతాడేమోనని పారు కంగారు పడుతుంది. సుమిత్ర గారికి సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ జరిగిందని, ఇకపై ఆమె నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారని డాక్టర్ హారిక చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. దాంతో దశరథ నేరుగా దీప దగ్గరికి వచ్చి నీ తల్లిని కాపాడుకున్నావు.. కానీ నేనే నీ బిడ్డను కాపాడలేకపోయానని బాధపడతాడు. జ్యోత్స్న దగ్గరికి కానీ, సుమిత్ర దగ్గరికి కానీ కాకుండా దశరథ నేరుగా దీప దగ్గరికి ఎందుకు వెళ్లాడు అని శివన్నారాయణ అనుమానడతాడు. కొడుకు ప్రవర్తన గత కొన్నిరోజులుగా తేడా ఉంటోందని అనుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 23వ తేదీ 625వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 625 March 23rd 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

సుమిత్రకు ఆపరేషన్ ముగిసి ఇంటికి తీసుకొస్తారు. మళ్లీ ఇంటికి వస్తానో? రానీ అని అనుకున్నాను అని సుమిత్ర బాధపడుతుంది. ఇంజెక్షన్ అంటే భయపడే నీ కూతురు నీకోసం ఆపరేషన్ చేయించుకుంది. దశరథ హోమం చేయించాడు, మీ మామగారు బలంగా కోరుకున్నారు. అందుకే అన్నీ గండాలను దాటుకుని నువ్వు క్షేమంగా ఇంటికి చేరుకున్నావని చెబుతుంది పారిజాతం. దాంతో జ్యోత్స్న చేయి పట్టుకుని ఏడుస్తుంది సుమిత్ర. నువ్వు తల్లి రుణం తీర్చుకున్నావని సుమిత్ర చెప్పగా.. అసలు రుణం తీర్చుకున్నది నా కూతురు దీప అంటాడు. నాకు చిన్న పని ఉంది.. నేను ఇప్పుడే వచ్చేస్తానని దశరథ చెప్పగా.. సుమిత్ర కంటే పెద్ద పని ఏముంటుందని ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. ఎంత చెప్పినా వినిపించుకోకుండా దశరథ వెళ్లిపోవడంతో నేనే సుమిత్ర అసలైన కూతురిని అయినప్పుడు డాడీ నా మీద ఎందుకు ప్రేమ చూపించడం లేదు. ఏదో జరుగుతోందని జ్యోత్స్నకు అనుమానం వస్తుంది.

ఆపరేషన్ పూర్తి కావడంతో దీప- కార్తీక్‌లు బిడ్డ బొమ్మ చూసుకుంటూ బాధపడతారు. అత్తయ్యకి ఏం చెబుతావని దీప ప్రశ్నించగా.. అమ్మ ఎవరి మాటా వినిపించుకోదు, ఏం చెప్పినా వినదు. తప్పు చేశాడని మా నాన్ననే వదులుకుంది. ఇప్పుడు నిన్ను కూడా వదులుకుంటుంది. అప్పుడు మా నాన్నని వదులుకుని నేను మా అమ్మవైపే నిలబడ్డాను. ఇప్పుడు ఏ తప్పు చేయని నిన్ను వదులుకోలేను. దీనికి పరిష్కారం అమ్మకి నిజం చెప్పడం ఒక్కటేనని అంటాడు కార్తీక్. ఇంతలో డాక్టర్ హారిక వచ్చి దీపకి ఎలా ఉంది అని అడుగుతుంది. ఒక తల్లి ప్రాణాన్ని కాపాడుకోవానికి బిడ్డను వదులుకోవడానికి దీప సిద్ధపడింది. కానీ తల్లిని వదులుకోవడానికి బిడ్డ సిద్ధపడలేదని చెబుతుంది డాక్టర్. నీ బిడ్డ నీతోనే ఉందని చెప్పడంతో దీప- కార్తీక్‌లు సంతోషిస్తారు.

నాకు ధైర్యం చెప్పడానికి నా బిడ్డే వచ్చిందని.. మీరు రెండు కాదు, చాలా ప్రాణాల్ని కాపాడారని డాక్టర్ హారికకు థ్యాంక్స్ చెబుతాడు కార్తీక్. నేను ఈ విషయం మీకంటే ముందు దశరథ గారికి చెప్పేశానని అంటుంది డాక్టర్ హారిక. మీకు జీవితాంతం రుణపడి ఉంటానని, మీరు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారని ఎమోషనల్ అవుతాడు కార్తీక్. మీ బిడ్డతో మీకు బంధం రాసిపెట్టుంది.. హ్యాపీగా వెళ్లమని చెబుతుంది. మరోవైపు.. జ్యోత్స్నకి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది పారు. మనుషులు మారిపోయారు, పిలుపులు మారిపోయాయని మండిపడుతుంది జ్యోత్స్న. అవసరంతో పిలిచేదానికి, ప్రేమతో పిలిచే దానికి చాలా తేడా ఉంటుందని అంటుంది జ్యోత్స్న.

ఇన్నాళ్లు నువ్వు దాస్ కూతురివి అనుకున్నాను.. ఆ నిజం ఏదో ఒక రోజు బయటపడితే నీకు సాయంగా నిలబడటానికి నీకు నేను తప్ప ఎవ్వరూ లేరు. నువ్వు నా కొడుకు కూతురివి, నిన్ను ఈ స్థానంలో నిలబెట్టింది నేనే కాబట్టి నాకు నీ మీద ప్రేమ, అభిమానం ఉండేవి. ఎప్పుడైతే నువ్వు దశరథ - సుమిత్రల కూతురువి అని తెలిసిందో మొదట నీకు భయం పోయింది. నీకు భయం పోయినప్పుడు నాతో నీకు అవసరం ఏంటీ? నాకు చెప్పకుండానే చాలా పనులు చేస్తున్నావని అంటుంది. దీప గది ముందు నన్నెందుకు కాపలా పెట్టావు? నీకు, దీపకు కార్తీక్ విషయంలో కాకుండా ఏదో విషయంలో కథ నడుస్తోంది. నాకు ఈ విషయాలు చెప్పలేదని మండిపడుతుంది పారు. సుమిత్ర ప్రాణాల్ని కాపాడి నువ్వు ప్రాణదాతవి అయ్యావు.. ఈ ఆస్తి మొత్తం నీదేనన్న కాన్ఫిడెన్స్ వచ్చిందని అంటుంది. మా డాడీ ఎక్కడికి వెళ్లాడో నాకు తెలుసు... వాళ్ల చెల్లెలి ఇంటికి వెళ్లి ఉంటాడని గెస్ చేస్తుంది జ్యోత్స్న. నీకు ఒక పని చెబుతాను చేస్తావా? నా అనుమానం తీరాలంటే నువ్వు ఇప్పుడే చేయాలని అంటుంది జ్యోత్స్న. దానికి సరేనని చెబుతుంది పారిజాతం.

ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కాంచన లగేజ్ మొత్తం రెడీ చేసుకుంటుంది. శ్రీధర్, అనసూయ ఎంత చెప్పినా వినిపించుకోదు. లోపలికి వస్తుండగా అక్కడే ఆగమని కార్తీక్- దీపలను అక్కడే ఆగమని అంటుంది. వాళ్లు హాస్పిటల్ నుంచి వస్తున్నారు కదా దిష్టి తీసి లోపలికి తీసుకురమ్మని అనసూయకి చెబుతుంది. నా కోడలు ఈ గడపలోకి అడుగుపెట్టడం, నేను గడప దాటి వెళ్లిపోవడం ఒకేసారి జరగాలని అంటుంది. మాట ఇచ్చిన పెద్ద మనిషి, మీ మావయ్య మాత్రం పత్తా లేకుండా పోయారని మండిపడుతుంది కాంచన. దీప ఇబ్బందిగా నడుస్తుండటంతో ఎందుకలా నడుస్తున్నావని అడుగుతాడు శ్రీధర్. కడుపు తీయించుకుంటే అలాగే నడుస్తారని నానామాటలు అంటుంది కాంచన.

చెల్లెమ్మ ఈ ఇంట్లో ఉండదట, తన మాట నెగ్గని చోట ఉండనని మీ అమ్మ చెప్పింది, చెల్లెమ్మతో పాటు నేను కూడా వెళ్లిపోతానని చెబుతుంది అనసూయ. మీ దగ్గర కంటే చెల్లెమ్మ దగ్గరే ఉంటాను, ఏ టిఫిన్ బండో, కూరగాయల బండో పెట్టుకుంటామని అంటుంది అనసూయ. సరే అందరూ వెళ్లిపోండి, మీ అందరికీ ఆవేదనలు, బాధలు ఉన్నాయని.. కానీ మా మాట మాత్రం వినిపించుకోరా అని కార్తీక్ మండిపడతాడు. ఇంతలో దశరథ వచ్చి.. నీ కోడలి క్షేమం అత్తగారిగా నీకంటే ఎవరు కోరుకుంటారు? అని అడుగుతాడు. నీ మాట మీద కూడా నాకు నమ్మకం లేదు.. నలుగురు వెళ్లారు, ముగ్గురు వచ్చారు.. అందుకే వెళ్లిపోతున్నానని అంటుంది కాంచన.

నీకిచ్చిన మాట ఈ అన్నయ్య ఏనాడూ తప్పలేదు.. ఇప్పుడు కూడా తప్పడు, ఆరోజు హాస్పిటల్‌కి నలుగురం వెళ్లాం... ఇప్పుడు కూడా నలుగురం వచ్చామని చెబుతాడు దశరథ. దీప కడుపులోని బిడ్డ క్షేమంగానే ఉందని అనడంతో కాంచన, శ్రీధర్, అనసూయలు సంతోషిస్తారు. నువ్వు నా కోడలిని నా కూతురిగా అనుకోమని తన బాధ్యతలు నాకు అప్పగించావు కదా? మళ్లీ నా కూతురిని నీ చేతికి అప్పగిస్తున్నానని చెబుతాడు శ్రీధర్. మీ కోడలుగానీ, మీ కొడుకు గానీ మీకిచ్చిన మాట తప్పలేదని చెబుతుంది దీప. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X