Karthika Deepam 2 March 24th: స్వప్నకి మళ్లీ పెళ్లి.. దీప గుట్టు పట్టేసిన పారు, రిపోర్ట్స్‌తో జ్యోత్స్న గేమ్
Photo Courtesy: JioHotstar
ఆపరేషన్ పూర్తి కావడంతో జ్యోత్స్న, సుమిత్రలను ఇంటికి తీసుకొస్తారు. మళ్లీ ఈ ఇంటికి తిరిగి వస్తానని అనుకోలేదని సుమిత్ర ఎమోషనల్ అవుతుంది. నీ కూతురే నిన్ను కాపాడింది.. ఇంజెక్షన్ అంటే భయపడే జ్యోత్స్న నీకోసం ఆపరేషన్ చేయించుకుందని చెబుతుంది పారిజాతం. దాంతో సుమిత్ర వెళ్లి జ్యోత్స్న చేయి పట్టుకుని ఏడుస్తుంది. తనకు చిన్నపని ఉందని హడావుడిగా బయటకు వెళ్తాడు దశరథ. నేనే అసలు కూతురిని అయినా డాడీ నా మీద ఇదివరకటిలా ప్రేమ చూపించడం లేదని .. ఏదో జరుగుతుందని జ్యోత్స్నకి అనుమానం వస్తుంది.
ఇంటికి వెళ్లి కాంచనతో ఏం చెప్పాలో అర్ధంకాక దీప - కార్తీక్‌లు ఏడుస్తుంటారు. ఇంతలో డాక్టర్ హారిక వచ్చి.. దీప కడుపులోని బిడ్డ క్షేమంగా ఉందని చెప్పడంతో కార్తీక్- దీపలు సంతోషిస్తారు. ఇంటికి వెళ్లేసరికి కాంచన లగేజీ సర్దుకుని వెళ్లిపోవడానికి రెడీగా ఉంటుంది. కార్తీక్- దీపలకు కాంచన, అనసూయ, శ్రీధర్ క్లాస్ పీకుతుండగా... దశరథ వచ్చి నీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నానని చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 24వ తేదీ 626వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అమ్మానాన్న ఇంటికి రావడంతో శౌర్య వచ్చి బేబీ ఎలా ఉందని తల్లిని హత్తుకుని సంతోషిస్తుంది. మీ చెల్లి నీకోసమే ఎదురుచూస్తోందని చెబుతాడు కార్తీక్. మనందరీ ఆశలు బలంగా ఉన్నాయి కాబట్టే భగవంతుడు కరుణించాడని అంటాడు శ్రీధర్. తర్వాత అందరూ కలిసి స్వీట్స్ పంచుకుని హ్యాపీగా ఉంటారు. అమ్మమ్మ ఎలా ఉందని శౌర్య అడగ్గా.. అమ్మ క్షేమంగా ఉంది కాబట్టి, అమ్మమ్మ కూడా క్షేమంగా ఉంటుందని చెబుతాడు శ్రీధర్. దీపని లోపలికి వెళ్లి ఆడుకుందామని శౌర్యకి లాక్కెళ్తుండగా దీపకి పెయిన్ వస్తుంది. బిడ్డ క్షేమంగా ఉంటే దీపెందుకు నీరసంగా ఉంది.. ఎందుకలా నొప్పితో బాధపడిపోతోందని అడుగుతాడు శ్రీధర్. అందరికీ ఇదే అనుమానం వస్తుంది. ఇక్కడ జరుగుతున్నదంతా వీడియో కాల్ చేసి జ్యోత్స్నకి చూపిస్తుంది పారు. దీప ఎందుకు నాలాగా నడుస్తోంది.. మా మమ్మీకి డోనర్ ఎవరు అని జ్యోత్స్నికి అనుమానం వస్తుంది.
సుమిత్ర వదిన క్షేమంగా బయటపడిందని, దీప కూడా తన బిడ్డని వదులుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని దాస్ చెప్పడంతో కావేరి, కాశీ, స్వప్నలు సంతోషిస్తారు. నీకు మరో గుడ్‌న్యూస్ కూడా ఉందన్న దాస్.. స్వప్నకి మళ్లీ పెళ్లి చేయబోతున్నామని సంబంధం కూడా చూసేశామని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారికి వీటి గురించి తెలియదు, ఎంతకాలం మనం కలల్లో బతుకుతాం, విడాకుల కోసం కోర్టుకు అప్లయ్ చేశారు ఆలోపు మంచి సంబంధం చూసుకుంటే స్వప్నకి వెంటనే పెళ్లి చేయొచ్చని చెబుతాడు దాస్. బావ నాతో చెప్పిందే నేను మీతో చెబుతున్నాను, దీనిలో ఏ మార్పు లేదు, రేపే పెళ్లి కొడుకు స్వప్నని చూడటానికి వస్తున్నాడని చెబుతాడు దాస్. ఆ మాటలతో స్వప్న బాధపడుతుంది.
వీడియో కాల్ తీసి జ్యోత్స్నకి చూపిస్తున్న పారిజాతాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు శివన్నారాయణ. కాంచనను ఎలా ఓదార్చాలో అర్ధంకాక ఇక్కడే ఆగిపోయానని చెబుతాడు. కానీ తల్లీబిడ్డా క్షేమంగా ఉందని తెలిసి సంతోషంతో ఇక్కడే ఉండిపోయానని పారు చెప్పడంతో శివన్నారాయణ సంతోషిస్తాడు. తల్లీబిడ్డా ఎంత క్షేమంగా ఉన్నా.. ఇక్కడ ఏదో రహస్యం ఉందని అంటుంది పారిజాతం. దీపని బలవంతంగా లాగబోతుండగా ఆమె నొప్పితో విలవిలలాడిపోతుంది. చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నట్లుంది, నీకు అనుమానం రావడం లేదా? ఏ ఆపరేషన్ జరగకుండా దీప ఎందుకు నీరసంగా ఉందని పారు అడగటంతో అంతా షాక్ అవుతారు. సైలెంట్‌గా నువ్వు బిడ్డను వదిలించేసుకుని, నీ పెళ్లాన్ని మీ అమ్మ ఇంట్లో ఉండనివ్వదని మీ అమ్మకి అబద్ధాలు చెబుతావా అంటూ మండిపడుతుంది పారు.
మేం హాస్పిటల్‌లో సుమిత్ర ఆపరేషన్ హడావుడిలో ఉన్నాం.. మీరేం చేశారో నాకు తెలియదని అంటుంది. పిన్ని చెబుతున్నది వాస్తవమే.. బిడ్డను ఉంచుకోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే దీపెందుకు ఆపరేషన్ జరిగిన మనిషిలా అలా నీరసంగా ఉందని నిలదీస్తుంది కాంచన. మనిషిని చూస్తే అర్ధమవుతుంది ఏదో జరిగిందని అంటాడు శ్రీధర్. ఏం జరగలేదని కార్తీక్ ఎంత నచ్చజెబుతున్నా ఎవరూ వినిపించుకోరు. నీకు అబద్థాలు చెప్పడం అలవాటైపోయిందని అంటుంది కాంచన. ఎంతసేపు కార్తీక్ బాబునే నిలదీస్తున్నావు.. దీపనే అసలు విషయం చెప్పమని అడుగుతుంది అనసూయ.
ఇన్నిరోజులు ఆసుపత్రిలో ఎందుకు ఉంది? ఎందుకు తిరిగొచ్చింది? అని పారు నిలదీయడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. బిడ్డని వదిలేస్తే దీపని జీవితంలో క్షమించనని మీ అమ్మ చెప్పింది.. అలా జరుగుతుందని భయపడి అబద్ధం చెబుతున్నారా అని ప్రశ్నిస్తాడు శ్రీధర్. దీప నీరసంగా ఎందుకు ఉందో మాకు తెలియాలని శివన్నారాయణ చెబుతాడు. ఒక మంచి విషయం జరిగినప్పుడు ఆనందించాలి కానీ వివరాలు ఎందుకు అని ప్రశ్నిస్తాడు దశరథ. దీప ఎందుకు నీరసంగా ఉందో నేను తెలుసుకోవాలని అందరూ గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో దీప కాలుజారి కిందపడిందని అబద్ధం చెబుతాడు. అదృష్టం బాగుండి వెనక్కి పడింది, అప్పుడే మేం రియలైజ్ అయ్యాం, బిడ్డే మనల్ని కోరుకుంటోంది, ఇది మీ అందరి ఆశీస్సులు.. మేమైతే నిర్ణయం వెనక్కి తీసుకున్నామని చెబుతాడు కార్తీక్.
కార్తీక్ మాటల్ని వింటుంటే ఏదో నిజం దాస్తున్నట్లుగా ఉందని శివన్నారాయణకి, పారుకి అనుమానం వస్తుంది. ఈ పారు మా ఇంటికి ఎందుకు వచ్చింది? అనుమానంతో జ్యోత్స్నే పారుని పంపలేదు కదా అని కార్తీక్‌కి అనుమానం వస్తుంది. మరోవైపు.. దీపే సుమిత్ర కూతురై తనే బోన్‌మారో ఇస్తే నాకు అనుమానం రాకుండా ఏమైనా చేశారా అని అనుమానిస్తుంది జ్యోత్స్న. ఒకరికి ఫోన్ చేసి రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి? అని అడుగుతుంది త్వరలోనే వచ్చేస్తాయని జ్యోత్స్నకి అవతలి వ్యక్తి చెబుతాడు. రిపోర్ట్స్ వచ్చే వరకు నేనే సుమిత్ర కూతురిని, ఆ తర్వాతే అసలు విషయం తెలుస్తుందని అనుకుంటుంది జ్యోత్స్న. నన్ను ఆ దీప ఇంటికి ఎందుకు పంపించావు? అని పారు ప్రశ్నిస్తుంది. నువ్వు సరిగా కాపలా కాయలేదు కదా? నీ కొడుకు మీద ఒట్టేసి చెప్పమని జ్యోత్స్న నిలదీయగా.. ఒక 5 నిమిషాలు మాత్రం లేనని అంటుంది పారు.
అయినా సుమిత్ర కూతురివి నువ్వే అని తెలిసినప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావని ప్రశ్నిస్తుంది పారు. దీప నాలాగే ఎందుకు నడుస్తుందో ఒకసారి ఆలోచించమని చెబుతుంది జ్యోత్స్న. నా టైం బాగుండి కొద్దిలో మీ తాతకి దొరికిపోయేదానిని అంటుంది పారు. నేను దేనిని వదిలిపెట్టను, అన్నీ తొందరలోనే తెలుస్తాయని అనుకుంటుంది జ్యోత్స్న. మనవాళ్లంతా సంతోషంగానే ఉన్నారు.. కానీ జ్యోత్స్న గురించి తలచుకుంటే భయంగా ఉందని బాధపడుతుంది దీప. జ్యోత్స్నకి ఆల్రెడీ అనుమానం వచ్చే ఉంటుందని.. ఏదో ఒకటి చేస్తుందని కార్తీక్‌తో చెబుతుంది దీప. జ్యోత్స్న ఏం చేస్తుందనేది నువ్వు మరిచిపోమ్మని అంటాడు కార్తీక్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











