Karthika Deepam 2 March 25th: సుమిత్రకు కొత్త వ్యాధి.. షాక్‌లో దశరథ, జ్యోత్స్నకి కార్తీక్ ఫైనల్ వార్నింగ్

Photo Courtesy: JioHotstar

దీప బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని, నీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నానని దశరథ చెప్పడంతో అంతా సంతోషిస్తారు. ఇదంతా బయటి నుంచి వీడియో కాల్ ద్వారా జ్యోత్స్నకు చూపిస్తుంది పారిజాతం. తనకు మాదిరిగానే దీప నడుస్తుండటంతో జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. వీడియో కాల్ మాట్లాడుతున్న పారుని శివన్నారాయణ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. లోపలికి రాలేక బయటి నుంచి వాళ్ల మాటలు వింటున్నానని.. దీప బిడ్డకు ఎలాంటి ప్రమాదం లేదని పారు చెప్పడంతో శివన్నారాయణ సంతోషిస్తాడు. వీరి మాటలను విన్న కార్తీక్ వచ్చి లోపలికి రమ్మని చెబుతాడు.

సుమిత్ర ప్రాణాలతో బయటపడినట్లు, దీప బిడ్డ క్షేమంగా ఉన్నట్లు దాస్ చెప్పడంతో కావేరి, స్వప్న, కాశీలు సంతోషిస్తారు. అలాగే స్వప్నకి వేరే సంబంధం చూశామని, త్వరలోనే అబ్బాయి చూసుకోవడానికి వస్తున్నాడని దాస్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. బిడ్డను వదులుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే దీప ఎందుకు అంత నీరసంగా ఉందని పారు అనడంతో కాంచన, శ్రీధర్, శివన్నారాయణలకు కూడా అనుమానం వస్తుంది. దాంతో దీప హాస్పిటల్‌లో పడిపోయిందని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు కార్తీక్. అసలు సుమిత్ర కూతురు ఎవరో తెలుసుకోవడానికి రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది జ్యోత్స్న. ఇంటికొచ్చిన పారు.. జ్యోత్స్నపై మండిపడుతుంది. నువ్వే అసలైన కూతురివి అయినప్పుడు నన్ను ఎందుకు దీప మీద కన్నేసి ఉంచమన్నావని అడుగుతుంది పారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి మార్చి 25వ తేదీ 627వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Karthika deepam 2 Serial Today s Episode 627 March 25th 2026 Here is full story

Photo Courtesy: JioHotstar

దశరథ, సుమిత్రలను జ్యోత్స్న చంపేసినట్లు కల రావడంతో దీప ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. వెంటనే మా ఇంటికి వెళ్దామని గొడవ చేస్తుంది. మీ నాన్న నిజం చెప్పేసినట్లు నాకు కూడా కల వచ్చింది.. అలాగని నిజమై ఉంటుందా అని నిలదీస్తాడు కార్తీక్. అమ్మకి నాన్నకి ఏమైనా జరిగితే వాళ్లని సేవ్ చేయడానికి ఉన్నది మనమే కదా అంటుంది దీప. జ్యోత్స్న అసలైన వారసురాలు కాదు కాబట్టి.. మీ అమ్మనాన్నలను చంపుతుందని నీ భయం. జ్యోత్స్నే ఇప్పుడు నమ్మకం లేని జీవితంలో బతుకుతోంది. ఇక ఇలాంటి టైంలో తను ఏ తప్పు చేయదు, నువ్వు అన్నది జరగాలంటే తను సుమిత్ర కూతురు కాదన్న నిజం తెలియాలి. అయితే మనం చెప్పాలి.. లేదంటే డాక్టర్ హారిక చెప్పాలని అంటాడు కార్తీక్. ఉదయాన్నే తాత ఇంటికి అందరం వెళ్దామని చెబుతాడు.

సుమిత్రకు అన్నం తినిపిస్తుండగా ఆమె కంటతడి పెడుతుంది. మీరొచ్చి చెప్పే వరకు నాకు టిఫిన్ గురించి కూడా గుర్తులేదు. జ్యోత్స్నకి మంచి సంబంధం కుదిరి మన గార్డెన్‌లోనే పెద్ద పందిరి వేసి పెళ్లి చేసినట్లుగా ఉందని కల వస్తోందని చెబుతుంది. జ్యోత్స్నకి త్వరగా పెళ్లి చేయకపోతే మతి పొగొట్టుకునేలా ఉందని దశరథ భయపడతాడు. మన అమ్మాయిని ఇంట్లోనే ఉంచుకుందాం.. ఇల్లరికపు అల్లుడిని తెచ్చుకుందామని చెబుతుంది సుమిత్ర. నీ ప్రవర్తనలో తేడా కనిపిస్తోంది.. అందుకే డాక్టర్‌ను ఇంటికి రమ్మని పిలిచానని అంటాడు దశరథ. ఇంతలో జ్యోత్స్న వచ్చి లోపలికి రావొచ్చా అని అడుగుతుంది. ఆ మాటలతో సుమిత్ర షాక్ అవుతుంది.

నీ దగ్గరికి వస్తుంటే డాడీ నా మీద చిరాకు పడుతున్నాడు.. అందుకే ఏం చేయాలో అర్ధం కాక బయటే నిలబడ్డానని చెబుతుంది జ్యోత్స్న. ఆ మాటలతో దశరథ సీరియస్ అవుతాడు. మీ నాన్న నిన్ను ఎంత ప్రేమగా చూసుకునేవాడో తెలుసా అని అంటుంది. నేను స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి ఇంటి రాగానే నా చేతిని నీ చేత్తో తీసుకుని ఆరోజు జరిగిన విషయాలన్నీ చెప్పించుకునేవాడు. ఆ తర్వాత అన్నం తినిపిస్తూ కబుర్లు చెప్పేవాడివి అని గుర్తుచేస్తుంది జ్యోత్స్న. మీ నాన్న ప్రేమ ఎప్పుడూ మనసులోనే ఉంటుందని చెబుతుంది సుమిత్ర. మా మీదే నీకు ప్రేమ తగ్గిపోయింది.. నా మాట విని నువ్వు పెళ్లి చేసుకోమని చెబుతుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, నేను ఇలాగే ఉంటానని తేల్చేస్తుంది జ్యోత్స్న. నా కూతురి పెళ్లి చూడలేమోనంటూ తనలో తానే మాట్లాడుకుంటుంది సుమిత్ర. భార్య వింతగా ప్రవర్తిస్తూ ఉండటంతో దశరథ కంగారుపడతాడు.

శివన్నారాయణకు కాఫీ ఇచ్చి సిగ్గుపడుతుంది పారు. దీన వెనుక నీ కుట్ర ఏంటీ?అని పెద్దాయన అడగ్గా.. నేను ఆశించేది మీ ప్రేమను మాత్రమే అంటుంది పారు. ఇంతలో శ్రీధర్ వచ్చి విజిల్స్ వేస్తాడు. ఇంతలో కాంచన, కార్తీక్, దీపలు వస్తారు. సుమిత్రమ్మ గారిని, దశరథగారిని ఎలా ఉన్నారని దీప అడగటంతో జ్యోత్స్నకు అనుమానం వస్తుంది. జ్యోత్స్న, దీపలని పక్కపక్కన పెట్టుకుని కబుర్లు చెబుతాడు శివన్నారాయణ. బిడ్డ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకున్నందుకు కంగ్రాట్స్ చెబుతుంది జ్యోత్స్న. నువ్వు కిందపడ్డావని విన్నావని.. వెంటనే మా ఇంటికి రావడం ఎందుకు? పూర్తిగా కోలుకున్నాక రావొచ్చు కదా అని అంటుంది. ఇంతలో ఇంటికి డాక్టర్ హారిక రావడంతో అంతా షాక్ అవుతారు. కోడలికి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందేమోనని శివన్నారాయణ కంగారుపడతాడు.

నేను బ్రతకుతానని అనుకోలేదు.. మీరే నన్ను కాపాడారని సుమిత్ర చెప్పగా.. మీరు నాకు హాస్పిటల్‌లోనే థ్యాంక్స్ చెప్పారని హారిక అంటుంది. నాకు ఏమి గుర్తులేదని సుమిత్ర అనడంతో కార్తీక్, దశరథ, శివన్నారాయణలు షాక్ అవుతారు. నాకు నా కూతురు జ్యోత్స్న విషయాలు తప్పించి ఏం గుర్తులేదని అంటుంది సుమిత్ర. అది కూతురు కాదు మా అమ్మ.. మా అమ్మే నాకు ప్రాణం పోసిందని ఎమోషనల్ అవుతుంది. రేపు మీ కూతురికి పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోయిందంటే తట్టుకోగలరా అని హారిక అడగ్గా.. మా అమ్మాయికి పెళ్లి చేసినా మాతోనే ఉంటుందని అంటుంది సుమిత్ర.

సుమిత్ర ఇంటికొచ్చినప్పటి నుంచి ఏదో తేడా కనిపిస్తోందని డాక్టర్‌ను రమ్మన్నానని చెబుతాడు దశరథ. సుమిత్రగారు చచ్చిపోతానేమో అనే స్టేజ్‌లోకి వెళ్లిపోయింది. సుమిత్రగారికి జ్యోత్స్న అంటే చాలా ఇష్టం. తన కూతురి పెళ్లి చూడకుండా చచ్చిపోతానేమోనన్న భయం తన మనసులో బలంగా నాటుకుపోయింది. సడెన్‌గా తాను ప్రాణాలతో బయటపడేసరికి నమ్మలేకపోతున్నారు. తన మెంటల్ కండీషన్ ఏమాత్రం బాలేదు.. ఆవిడ తట్టుకోలేని విషయాలేవీ చెప్పొద్దు, జ్యోత్స్నకి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది డాక్టర్ హారిక. ఇంతలో జ్యోత్స్న వచ్చి కూతురిగా నాకు సంబంధం లేదా? నన్నెందుకు వేరు చేస్తున్నారని మండిపడుతుంది.

నువ్వు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోతే.. మా అత్త నీతోపాటు రాదు కదా? అప్పుడు చూసుకోవాల్సింది నేనే. కొన్ని విషయాలు పెద్దవాళ్లుగా మేం చూసుకుంటాం.. నువ్వు చిన్నపిల్లవి అంటాడు శివన్నారాయణ. డాక్టర్ వెళ్లిపోగానే.. జ్యోత్స్నతో పర్సనల్‌గా మాట్లాడతాడు కార్తీక్. నీ మీద నా అనుమానం ఏంటీ? పారుని మా ఇంటికి ఎందుకు పంపించావు? హాస్పిటల్‌లో దీప రూమ్ ముందు పారుని ఎందుకు కాపలా పెట్టించావు? సరిగ్గా ఆపరేషన్ టైంకి శౌర్య మిస్ అయినట్లు ఫోన్ వచ్చింది.. తను హాస్పిటల్‌లో లేకపోతే ఎవరికి మంచి జరుగుతుంది. శౌర్యను కిడ్నాప్ చేయించింది నువ్వేనని నాకు తెలుసని అంటాడు కార్తీక్. ఈ మాటలతో జ్యోత్స్నకు చెమటలు పడతాయి.

ఆ రౌడీలలో ఎవరైనా దొరికి ఉంటే నీ కథ వేరేలా ఉండేదని చెబుతాడు. నీకు ఏదైనా అనుమానం ఉంటే ఓపెన్‌గా అడిగేయ్ అని చెబుతుంది. దీపని, నన్ను అనుమానంగా చూస్తున్నావని నిలదీస్తాడు. ఎవరి స్థానం పర్మినెంట్ కాదు.. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కిందపడాలి. అవతలి వాడికి ఓ రోజు వస్తే మన కాళ్ల కింద భూమి కదులుతుందని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. హాస్పిటల్‌లో దీప జాయిన్ అయిన దగ్గరి నుంచి నేను చేయాల్సిందంతా చేస్తున్నాను.. నేను అనుకున్నది జరగకపోతే దీప కథ వేరేలా ఉంటుందని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X